తండ్రి మరియు పిల్లలు.
రాజులకు రాజుగా తయారు చేసేవారు, జీవితాన్ని శ్రేష్టంగా
తయారు చేసేవారు, రాజయోగాన్ని నేర్పించేవారు, నిరంతర యోగి, సహజ యోగి మరియు
కర్మయోగిగా తయారుచేసే సర్వులకు ప్రియమైన శివబాబా మాట్లాడుతున్నారు -
ఈ సంఘటన ఏ సంఘటన? ఈ ఆత్మిక ప్రశ్నకి జవాబు తెలుసా?
తెలిసిందా లేక తెలుసుకుంటున్నారా? తెలుసుకున్నారు. మంచిదే. ఏదైతే తెలుసుకున్నారో
దానిని అంగీకరించి ఆవిధంగా నడుస్తున్నారా? మొదటి స్థితి - తెలుసుకోవటం, రెండవ
స్థితి - అంగీకరించటం, మూడవ స్థితి - నడవటం. మీరు ఏ స్థితి వరకు చేరుకున్నారు?
చివరిస్థితి వరకు చేరుకున్నారా! చేరుకున్నాము అని ఎవరైతే అన్నారో వారికి ప్రశ్న
ఏమిటంటే మూడవ స్థితి అనగా ఈ అంతిమ స్థితి సదా ఉంటుందా? మూడవ స్థితికి చేరుకోవటం
సహజం మరియు చేరుకున్నారు కూడా. కానీ ఈ అంతిమ స్థితిపై ధ్యాస పెట్టి సదా ఆ
స్థితిని తయారుచేసుకోండి. నేనెవరు? ఈ అమూల్య జీవితం అనగా శ్రేష్ట జీవితం యొక్క
మీ భిన్న భిన్న నామరూపాల గురించి తెలుసుకున్నారా? ముఖ్య స్వరూపము మరియు ముఖ్య
నామము ఏది? బాబా యొక్క అనేక నామాలను అనేక కర్తవ్యాల ఆధారంగా ఎలాగైతే మహిమ చేస్తూ
ఉంటారు. అయినా కానీ ముఖ్యమైన నామము ఒకటి చెప్తారు కదా! అదేవిధంగా
శ్రేష్టాత్మలైన మీకు కూడా అనేక కర్తవ్యాల ఆధారంగా, గుణాల ఆధారంగా అనేక నామాలు
బాబా ద్వారా ఇవ్వబడ్డాయి. కానీ వాటిలో ముఖ్య నామం ఏది? బ్రహ్మ ముఖం ద్వారా
జన్మించారు. అప్పుడు బాబా ఏ పేరుతో పిలిచారు? బ్రాహ్మణులుగా కానంత వరకు ఏ
కర్తవ్యానికి నిమిత్తులు కాలేరు. మొదట మీరు బ్రహ్మ ముఖ వంశావళి, బ్రహ్మ ఆధారంగా
జన్మ తీసుకుని బ్రాహ్మణులుగా అయ్యారు అంటే బ్రహ్మాకుమారీ కుమారులు అయ్యారు. మీ
ఇంటి పేరు ఇదే వ్రాస్తారు కదా! మీ పరిచయాన్ని ఏ పేరుతో ఇస్తున్నారు మరియు ప్రజలు
ఏ పేరుతో మిమ్మల్ని గుర్తిస్తున్నారు? బ్రహ్మాకుమారీలు లేదా బ్రహ్మకుమారులు.
మరజీవ జీవితం యొక్క మొట్టమొదటి ముద్ర ఇదే - బ్రహ్మకుమారుడు లేదా బ్రహ్మకుమారి.
అంటే శ్రేష్ట బ్రాహణత్వం. మొదట జన్మించారు అనగా బ్రాహ్మణులుగా అయ్యారు. ఆ
బ్రాహణత్వం యొక్క మొదటి పేరు బ్రహ్మాకుమారులు, ఇది మొదటిది కానీ చివరి స్థితి
సదా ఉంటుందా? అంటే ప్రతీ మాట, కర్మ, సంబంధం, సంప్రదింపులు మరియు సేవ అన్నింటిలో
కూడా బ్రాహ్మణ స్థితి అనుసారంగా ప్రత్యక్ష జీవితంలో నడుస్తున్నారా? సంకల్పంలో
లేదా మాటలో కూడా శూద్రత్వం అనేది అంశమాత్రంగా కూడా కనిపించకూడదు. బ్రాహ్మణుల
యొక్క సంకల్పం, మాట, సంస్కారం, స్వభావం మరియు కర్మ ఎలా ఉంటాయో ఇంతకు ముందు కూడా
చెప్పాను. దాని అనుసారంగా అలాంటి స్థితి సదా ఉంటుందా? బ్రాహ్మణులైన మీ యొక్క
ప్రతీ కర్మ లేదా ప్రతీ సంకల్పం బ్రహ్మాబాబా సమానంగా ఉంటుందా? తండ్రి ఎలాంటి వారో
అలాంటి పిల్లలు. స్వభావం, సంస్కారం, సంకల్పాలు తండ్రివి ఎలా ఉంటాయో పిల్లలవి
కూడా అవే కదా! మరయితే బాబాకి వ్యర్థ సంకల్పాలు నడుస్తాయా లేదా బలహీన సంకల్పాలు
ఉత్పన్నమవుతాయా? బాబాకి అలాంటి సంకల్పాలు రానప్పుడు బ్రాహ్మణులకి ఎందుకు
వస్తున్నాయి? బాబా అచంచల స్థిరమైన స్థితిలో సదా స్థితి అయ్యి ఉంటారు. మరయితే
బ్రాహ్మణుల యొక్క లేదా పిల్లల యొక్క స్థితి ఏమిటి? తండ్రి యొక్క యోగ్యమైన
పిల్లల కర్తవ్యం ఏమిటి? తండ్రిని అనుసరించటం. తండ్రిని అనుసరించటం అంటే కేవలం
ఈశ్వరీయ సేవాధారిగా అవ్వటమే కాదు, తండ్రిని అనుసరించటం అనగా ప్రతీ అడుగులో లేదా
ప్రతీ సంకల్పంలో తండ్రిని అనుసరించటం. ఈ రకంగా తండ్రిని అనుసరిస్తున్నారా?
ఏవిధంగా అయితే బాబాకి ఈశ్వరీయ సంస్కారాలు, దివ్య స్వభావం, దివ్య వృత్తి, దివ్య
దృష్టి సదా ఉంటాయో అదేవిధంగా మీ యొక్క వృత్తి దృష్టి స్వభావ సంస్కారాలు కూడా
ఆవిధంగా తయారయ్యాయా? ఈశ్వరీయ ముఖకవళికలతో కూడిన ముఖం ఉందా? ఆ ముఖకవళికల ద్వారా
బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యం యొక్క రూపురేఖలు కనిపించాలి. అలాంటి వారినే
తండ్రిని అనుసరించేవారు అని అంటారు. ఎలాగైతే బాబా యొక్క గుణగానం చేస్తారో లేదా
బాబా యొక్క చరిత్రని వర్ణిస్తారో అలాగే మీలో ఆ సర్వ గుణాలను ధారణ చేశారా? మీ
యొక్క ప్రతీ కర్మను కూడా బాబా చరిత్ర సమానంగా తయారు చేసుకున్నారా? ప్రతి కర్మ
స్పృతిలో ఉండి చేస్తున్నారా? స్మృతిలో ఉండి చేసే కర్మకి స్మృతిచిహ్నం
తయారవుతుంది. అలాంటి స్మృతిచిహ్న మూర్తులుగా అనగా కర్మయోగిగా అయ్యారా? కర్మయోగి
అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా, శక్తియుక్తంగా ఉండాలి. అలాంటి
కర్మయోగిగా అయ్యారా లేక కేవలం కూర్చుని యోగం చేసే యోగిగా అయ్యారా? ఎలాగైతే
విశేష రూపంలో యోగంలో కూర్చుంటారో అలాగే యోగి జీవితం అనగా ప్రతీ సమయం యోగయుక్తంగా
ఉంటున్నారా? కర్మయోగి, నిరంతర యోగి మరియు సహజ యోగి అని ఏదైతే వర్ణిస్తారో అది
ప్రత్యక్షంలో ఉందా అనగా ఆ స్థితి సదా ఉంటుందా? కర్మయోగి అయిన వారిని కర్మ
ఆకర్షితం చేస్తుందా? యోగి అయిన వారు తమ యోగశక్తి ఆధారంగా కర్మేంద్రియాల ద్వారా
కర్మ చేయిస్తారు. ఒకవేళ కర్మయోగిని కర్మ అనేది తనవైపుకి ఆకర్షిస్తుంది అంటే
అలాంటి వారిని యోగి అని అంటారా? కర్మకి వశమై నడిచేవారిని ఏమంటారు? కర్మభోగి అని
అంటారు కదా! కర్మ యొక్క భోగానికి వశమైపోతున్నారు. కర్మ యొక్క భోగాన్ని
భోగించటంలో మంచికి లేదా చెడులో కర్మకి వశీభూతం అయిపోతున్నారు. శ్రేష్టాత్మలు
అయిన మీరు కర్మాతీతులు అనగా కర్మకి ఆధీనులు కాదు. కర్మకి వశమయ్యే పరతంత్రులు
కాదు, స్వతంత్రులై కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేవారే కదా! ఎవరైనా కానీ
మిమ్మల్ని అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు? లేదా ఏమి నేర్చుకోవడానికి
మీరు వెళ్తున్నారు అని అడిగితే ఏమి జవాబు చెప్తారు? సహజ జ్ఞానం మరియు రాజయోగం
వెళ్తున్నాము అని అంటారు. ఇదయితే పక్కాయే కదా! అవే నేర్చుకుంటున్నారు కదా!
ఏమంటున్నారు? సహజ జ్ఞానము అని అంటున్నారు, మరి సహజమైన దానిని ధారణ చేయటం సహజమే
కదా! అందుకే కదా సహజ జ్ఞానం అని అంటున్నారు. మరయితే సదా జ్ఞాన స్వరూపంగా అయ్యారా?
జ్ఞానం సహజమైనది అయినప్పుడు సదా జ్ఞాన స్వరూపంగా అవ్వటంలో కష్టం ఏముంటుంది? సదా
జ్ఞాన స్వరూపంగా ఉండటమే బ్రాహ్మణుల వ్యాపారం. మీ ధర్మంలో మీరు స్థితులవ్వటం
ఎప్పుడూ సహజంగానే ఉంటుంది కదా! అలాగే రాజయోగం అంటే అర్థం ఏమి చెప్తారు? రాజయోగం
సర్వశ్రేష్టమైనది అనగా అన్ని యోగాలకు రాజు వంటిది మరియు దీని ద్వారానే రాజరికం
ప్రాప్తిస్తుంది. రాజులకే రాజుగా తయారుచేసే యోగము అని చెప్తారు కదా! మరయితే
మీరందరు రాజయోగులే కదా! లేక రాజయోగం అనేది భవిష్యత్తులో ప్రాప్తిస్తుందా?
ఇప్పుడు అనగా సంగమయుగంలో కూడా రాజులే లేదా కేవలం భవిష్యత్తులోనే రాజుగా
అయ్యేవారా? సంగమయుగంలో రాజరికం పొందలేనివారు భవిష్యత్తులో ఏవిధంగా రాజ్యం
పొందుతారు? యోగం అనేది సర్వశ్రేష్టమైనది అయినప్పుడు సర్వ శ్రేష్ఠ యోగి జీవితం
కూడా ఉండాలి కదా! మరయితే మొదట మీ కర్మేంద్రియాలపై రాజుగా అయ్యారా? ఎవరైతే
స్వయానికి రాజుగా అవ్వరో వారు విశ్వానికి రాజుగా ఎలా అవుతారు? స్థూల
కర్మేంద్రియాలు మరియు ఆత్మ యొక్క శ్రేష్ట శక్తులైన మనస్సు, బుద్ధి , సంస్కారాలు
మీ అదుపులో ఉన్నాయా? అనగా వాటి పై రాజు అయ్యి రాజ్యం చేస్తున్నారా? రాజయోగి అనగా
రాజ్యాన్ని నడిపించేవారిగా అవ్వటం. రాజ్యం చేసే సంస్కారం లేదా శక్తి ఇప్పటి
నుండే ధారణ చేయాలి. భవిష్య 21 జన్మల కొరకు రాజ్యం చేసే ధారణ ప్రత్యక్ష రూపంలో
ఇప్పుడే వస్తుంది. సహజ జ్ఞానము మరియు రాజయోగము వీటిలో మూడవ స్థితి వరకు వచ్చారా?
ఆగుము అని అనగానే మీ సంకల్పాలను ఆపగలుగుతున్నారా? శుద్ద సంకల్పాలలో లేదా
అవ్యక్త స్థితిలో లేదా బీజరూప స్థితిలో స్థితులవ్వండి అని బుద్ధికి ఆజ్ఞ ఇస్తే
ఆవిధంగా స్థితులు కాగలుగుతున్నారా? ఇలాంటి రాజుగా అయ్యారా? అలాంటి రాజయోగులనే
తండ్రిని అనుసరించేవారు అని అంటారు. ఎలాగైతే రాజు దగ్గర అనేకమంది సహయోగులు
ఉంటారో వారి ద్వారా ఏ సమయంలో ఏ పని చేయించాలంటే ఆ పనిని ఎలాగైతే చేయించగలరో,
అదేవిధంగా ఈ సంగమయుగి విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో అవే మీ సహయోగులు. రాజు ఏ
సహయోగికైనా ఆజ్ఞ ఇవ్వగలడు - ఈ పని ఇంత సమయంలో పూర్తి చేయాలని. అదేవిధంగా మీ
సర్వశక్తుల ద్వారా ప్రతీ కార్యాన్ని సహజంగా సంపన్నం చేస్తున్నారా? లేదా ఆజ్ఞ
మాత్రమే చేయగలుగుతున్నారా? ఎదుర్కోగలుగుతున్నారా? ఆ శక్తి వచ్చిందా? లేక దూరం
పెట్టేస్తున్నారా? సహజయోగి అనగా సర్వశక్తులు మీకు సంపూర్ణ రూపంతో సహయోగి అయ్యాయా?
ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ శక్తి ద్వారా ఏ పని చేయించాలంటే ఆ పనిని
చేయించేటటువంటి రాజులేనా? పురాతన రాజ్య సభలో 8 లేదా 9 రత్నాలు చాలా
ప్రసిద్ధమైనవి. అంటే వారు సదా సహయోగిగా ఉండేవారు.అదేవిధంగా మీ అష్టశక్తులు ఏవైతే
ఉన్నాయో అవి మీకు సహయోగిగా ఉంటున్నాయా? దీని ద్వారానే మీ భవిష్య ప్రాలబ్దాన్ని
తెలుసుకోగలరు. మీ ముఖం మరియు ముఖకవళికల ద్వారా తెలుసుకోవచ్చు. 6 నెలల సమయం ఏదైతే
ఇచ్చానో అది వినాశనం యొక్క సమయం కాదు. ప్రతీ ఒక్క సంగమయుగి రాజు తన రాజ్య
కార్యవ్యవహారాలను అనగా తన సహయోగి శక్తులను సంసిద్ధంగా తయారుచేసుకుని తయారుగా
ఉండాలి. దాని కొరకు సమయం ఇవ్వబడింది. ఎందుకంటే ఇప్పటి నుండి రాజ్య వ్యవహారాన్ని
సంభాళించే సంస్కారం నింపుకోకపోతే భవిష్యత్తులో కూడా చాలా సమయం కొరకు రాజుగా
అయ్యి రాజ్యం చేయలేరు. 6 నెలలు యొక్క అర్థం అరమైందా! మీ యొక్క ప్రతీ సహయోగిని
ఎదురుగా తెచ్చుకుని చూడండి, మీ సంకల్పాలను నియంత్రించి చూడండి, మీ బుద్ధిని మీ
ఆజ్ఞానుసారం నడిపించి చూడండి. ఇలా మీ రాజ్యాన్ని మీరు పరిశీలించి చూసుకోవటానికే
6 నెలల సమయం ఇవ్వబడింది. అర్థమైందా! మంచిది.
సదా సహజ జ్ఞాన స్వరూపులకి, సదా రాజయోగి, నిరంతర యోగి,
సహజ యోగి సర్వశక్తులను తమ సహయోగులుగా తయారు చేసుకునేవారికి, బాబా సమానంగా
సంకల్పం సంస్కారం మరియు కర్మ చేసే వారికి, సంగమయుగి రాజులందరికీ బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.