సమయం యొక్క పిలుపు.
అమరభవ యొక్క వరదాత, అస్వచ్ఛం నుండి స్వచ్ఛంగా
తయారుచేసేవారు,సర్వశక్తివంతులుగా తయారుచేసేవారు మరియు అలసిపోని సేవాధారిగా
తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు --
మీరందరు ఎక్కడ కూర్చున్నారు? అందరు మేళాలో
కూర్చున్నారా? ఇది ప్రత్యక్ష మేళా.ఆ మేళా అనేది స్మృతిచిహ్న మేళా. ఇప్పటి ఈ
మధుర మిలనం యొక్క మేళా కారణంగానే అనేక స్థానాలలో అనేక పేర్లతో మేళాలు
జరుపుకుంటున్నారు. మేళాలో విశేషంగా మిలనం అనేది ఉంటుంది. మేళా అనగానే మిలనం.
మిలనం అనగా మేళా అంటే ఏమిటి? ఈ సమయంలో ముఖ్యమైన మేళా - ఆత్మ రూపంలో పరమాత్మ
తండ్రితో కలుసుకోవటం. దీనినే ఆత్మ పరమాత్మల మేళా అని అంటారు. కేవలం ఒక్క
సంబంధంతోనే కాదు, సర్వ సంబంధాలతో, బాబాతో సర్వసంబంధాల యొక్క మేళా ఇది.
సర్వప్రాప్తుల యొక్క మేళా ఇది. సర్వస్వం అయిన బాబాతో ఒక్క సెకండులో
సర్వసంబంధాలతో మిలనం జరుపుకోవటం ద్వారా ప్రాప్తి స్వతహాగానే లభిస్తుంది. ఇతర
మేళాల్లో అయితే ఖర్చు అవుతుంది. కానీ ఈ మేళాలో అంతా ప్రాప్తియే. ఇతర మేళాల్లో
కూడా ఏదైనా కొంచెం ప్రాప్తి మీకు లభించిందంటే అది కూడా మీరు కొంత ఇవ్వటం
ద్వారానే లభిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఏమి ఇస్తున్నారు? ఏదైతే మీరు
సంభాళించలేకపోతున్నారో దానిని మీరు బాబాకి ఇస్తున్నారు. అసలు ఏదైనా మంచి వస్తువు
ఇస్తున్నారా మీరు? వేటినైతే మీరు సంభాళించలేకపోతున్నారో అవే కదా మీరు బాబాకి
ఇచ్చేది. దీని ప్రకారంగా చూస్తే మీరు బాబాని ఏవిధంగా చేసేశారు, మీ సేవాధారిగా
చేసేశారు కదా! ఎలా అంటే మీ వస్తువులను సంభాళించడానికి ఒక సేవాధారిని
పెట్టుకుంటారు కదా! అలాగే బాబాకి ఏమి ఇస్తున్నారంటే మీరు అదుపు చేయలేనివి
ఇస్తున్నారు. అవి కాకుండా ఇంకా ఏమైనా ఇచ్చారా మీరు బాబాకి? చెత్త ఇచ్చి
కోటానుకోట్ల ప్రాప్తిని పొందుతుంటే దానిని ఇవ్వటం అంటారా లేక పొందటం అంటారా?
పొందటం అనే అంటారు కదా! ఆ విధంగా ఇతర మేళాలు అన్నింటిలో మీరు ఇవ్వవలసి ఉంటుంది.
కానీ ఇక్కడ మీరు ఇచ్చిన దాని కంటే కూడా పొందుతున్నారు; మరి ఇవ్వటం ఏమైనా గొప్ప
విషయమా? కనుక ఇది సర్వ ప్రాప్తులు ఇచ్చే మేళా. ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే
అంత ప్రాప్తింపు చేసుకోవచ్చు. ఇలాంటి సర్వ ప్రాప్తులను ఇచ్చేటటువంటి మేళాని మీరు
ఎక్కడైనా చూశారా? అలాంటి మేళాకి మీరు వచ్చారు. మేళాలో ఒకటి మిలనం ఉంటుంది, ఆ
మేళాలో అయితే మురికిగా అయిపోతారు. ఇక్కడ ఎలా అవుతున్నారు? స్వచ్చంగా. స్వచ్చంగా
అయిపోయారు కదా! లేక ఇప్పటి వరకు స్వచ్చంగా అవుతూ ఉన్నారా? స్వచ్చంగా అయిపోయిన
తర్వాత ఏమి ఉంటుంది? అలంకరించుకోవటం మరియు తిలకాన్ని ధరించటం. మరయితే ఇప్పుడు
సదా స్మృతి అనే తిలకాన్ని స్వయానికి పెట్టుకుంటున్నారా? మరియు దివ్యగుణాలు అనే
నగలతో స్వయాన్నిఅలంకరించుకుంటున్నారా? కనుక మేళాలో కలయిక కూడా జరిగింది మరియు
జరుపుకోవటం కూడా అయ్యింది. దాంతో పాటు మేళాలో ఆటపాటలతో ఉంటారు. మేళా మరియు ఆట
రెండూ ఉంటాయి. మేళా మరియు ఆట రెండింటినీ సదా గుర్తు పెట్టుకుంటే మీ స్థితి ఎలా
ఉంటుంది?ఎప్పుడైనా కానీ మీ స్థితి అలజడి అవుతుంది అంటే దానికి కారణం మేళా అనగా
బాబాని కలుసుకోవటం నుండి బుద్ధిని వేరు చేసేశారు. అంటే మేళా నుండి బయటకు
వచేస్తారు. మరియు పరిస్థితిని ఆటగా భావించటం లేదు. కనుక 1. మేళా 2. ఆట ఈ
రెండింటినీ గుర్తు పెట్టుకోండి. మేళాలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ఇంతకు ముందు
కూడా చెప్పాను కదా! మిలనం అనేది ఏయే విషయాల్లో ఉండాలో చెప్పాను కదా! మేళా అనే
మాట గుర్తు రావటం ద్వారా సంస్కారాల కలయిక, తండ్రి మరియు పిల్లల కలయిక మరియు
సర్వ సంబంధాలతో సదా ప్రీతిగా కలుసుకోవటం. ఇవన్నీ కూడా మేళా అనే మాటలో
వచ్చేస్తాయి. అంతేకాదు ఈ సృష్టి అంతా ఒక ఆట.ఇది ముఖ్య విషయం మరియు మాయ యొక్క
భిన్న భిన్న పరీక్షలు, పరిస్థితులు ఏవైతే వస్తున్నాయో అవి కూడా ఒక ఆట.
పరిస్థితులను ఆటగా భావిస్తే ఆటలో ఎప్పుడూ అలజడి అవ్వరు, నవ్వుకుంటూ ఉంటారు.
కనుక పరీక్షలు కూడా ఒక ఆట. మూడవ విషయం - ఆటగా భావించటం ద్వారా రకరకాల వెరైటీ
సంస్కారాల పాత్ర మీరు ఏదైతే చూస్తున్నారో ఆ పాత్రధారులకి ఈ బేహద్ ఆటలో ఆ పాత్ర
అనగా ఆ ఆట నిర్ణయించబడి ఉంది. ఈ స్మృతిలో ఉండటం ద్వారా మీ స్థితి ఎప్పుడూ అలజడి
అవ్వదు. సదా మీ స్థితి ఏకరసంగా ఉంటుంది. వెరైటి పాత్రలు, డ్రామా అనగా ఇది ఒక ఆట,
ఈ ఆటయే వెరైటీ. వెరైటీ ఆటలో వెరైటీ పాత్రలు లేకుండా ఎలా ఉంటుంది? దీని పేరే
వెరైటీ డ్రామా. హద్దులోని సినిమాలో కూడా భిన్న భిన్న పేర్లతో భిన్న భిన్న
పాత్రలు ఉంటాయి. అలాగే ఆ సినిమాలో భయంకరమైన లేదా బాధాకరమైన లేదా హత్యలకు
సంబంధించిన ఏ దృశ్యాలు ఉన్నా, కానీ అది ఒక ఆట అనుకుంటారు, కానీ విచలితం అవుతారా?
ముందు నుండే ఆటగా భావించి చూస్తారు. ఆ ఆటలో యుద్ధాలు ఉన్నా,పోట్లాట్లలు ఉన్నా,
కోపాలు ఉన్నా.... ఎలా ఉన్నా కానీ చూసి నవ్వుకుంటారా లేక ఏడుస్తారా? నవ్వుకుంటారు
కదా! ఎందుకని? అది ఒక ఆట అని మీకు తెలుసు. అదేవిధంగా ఈ బేహద్ డ్రామా యొక్క పేరే
వెరైటీ డ్రామా లేదా ఆట. కనుక దీంట్లో కూడా వెరైటీ సంస్కారాలు, వెరైటీ స్వభావాలు,
వెరైటీ పరిస్థితులను చూసి ఎప్పుడైనా విచలితం అవుతారా మీరు? వాటిని కూడా సాక్షి
అయ్యి ఏకరస స్థితిలో చూస్తారా? ఇది వెరైటీ ఆట అని గుర్తుంచుకోండి. అప్పుడు
పురుషార్థం చేయటంలో ఏదైతే శ్రమ ఉంది అని మీరు అనుకుంటున్నారో అది సహజం అవ్వదా?
ఈ రెండు మాటలను మర్చిపోతున్నారు. మేళా అని కూడా మర్చిపోతున్నారు మరియు ఆట అని
కూడా మర్చిపోతున్నారు. అలా మర్చిపోతున్న కారణంగానే స్వయం అలజడి అయిపోతున్నారు.
ఎందుకంటే స్మృతి అనగా సాక్షి స్థితి అనే ఆసనాన్ని వదిలేస్తున్నారు. మీ స్థితి
అనే ఆసనాన్ని వదిలేసి ఏదైనా డ్రామాని చూసినట్లయితే ఏమి పరిస్థితి ఉంటుంది? కనుక
మీ స్థితిలో స్థితులై వెరైటీ డ్రామా అని స్మృతిలో ఉంచుకుంటూ ప్రతీ ఒక్క
పాత్రధారి యొక్క ప్రతి పాత్రను చూడండి, అప్పుడు మీరు సదా హర్షితంగా ఉంటారు.
నోటితో ఓహో ఓహో అనే మాటయే వస్తుంది. ఓహో మధురమైన డ్రామా అని అంటారు. అయ్యో!
ఏమయిపోయింది?ఎందుకు ఇలా జరిగింది?ఈ మాటలు రావు. ఓహో ఓహో అనే మాటలు మాత్రమే నోటి
నుండి వస్తాయి. అనగా సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు.సదా స్వయాన్ని మాస్టర్
సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకుంటారు. మరయితే స్వయాన్ని ప్రత్యక్షంలో ఇలా
అనుభవం చేసుకుంటూ ఉంటున్నారు. మేళా నుండి బయటకి వచ్చేస్తున్నారు, అందుకే అలజడి
అయిపోతున్నారు. ఎప్పుడైతే బాబా చేయి వదిలేసారో అప్పుడు కూడా అలజడి అయిపోతారు.
బాబా చేయి వదిలేయటం అంటే అర్థం ఏమిటో తెలుసా? బాబాకి స్థూలమైన చేయి అయితే లేదు
కదా! శ్రీమతమే బాబా చేయి, బుద్ధియోగమే బాబా తోడు. మేళాలో ఎప్పుడైతే చేయి మరియు
తోడు రెండింటినీ వదిలేస్తారో అనగా బాబా నుండి దూరమైపోతారో అప్పుడే అలజడి అవుతారు.
చేయి మరియు తోడు వదలకండి. అప్పుడు సదా సంతోషంలో ఉంటారు. అందువలన ఇప్పుడు సదా
మేళా మరియు ఆటగా భావించి మీ పాత్రని మరియు ఇతరుల పాత్రని చూడండి. ఇది సహజ విషయము
మరియు సాధారణమైన అనగా పాత విషయము. ఈ పాత విషయాన్ని నిరంతరం గుర్తు
పెట్టుకుంటున్నారా లేక అప్పుడప్పుడు మర్చిపోతున్నారా? లేక అప్పుడప్పుడు సమయానికి
గుర్తు చేసుకుంటున్నారా? బాబా ఇది ఎందుకు చెప్తారంటే ఒకవేళ మీరు ఈ రెండు మాటలను
నిరంతరం గుర్తు పెట్టుకున్నట్లయితే నిరంతరం సంతోషంలో మరియు నిరంతరం శక్తి
స్వరూపంలో ఉండగలరు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలలో లేదా సాధారణ సంకల్పాల యొక్క
విఘ్నాలలో సమయాన్ని పోగొట్టే సమయం కాదు.ఇప్పుడు మీరు మాస్టర్ రచయిత అయ్యి మీ
భవిష్య ప్రజలను మరియు భక్తులను ఇద్దరినీ మీకు ప్రాప్తించిన శక్తుల ద్వారా వరదానం
ఇచ్చే సమయం వచ్చేసింది. ఇది ఇచ్చే సమయం, అంతే కానీ స్వయం కోసం తీసుకునే సమయం
కాదు. ఒకవేళ ఇచ్చే సమయంలో కూడా తీసుకుంటూనే ఉన్నట్లయితే ఇక ఎప్పుడు ఇస్తారు?
సత్యయుగంలోనా? అక్కడ ఇవి అవసరం ఉంటాయా? కనుక ఇప్పుడే మీకు రచనని నిండుగా చేసే
సమయం. ఇప్పుడు మీ కోసం సమయం ఉపయోగించటం లేదా మీ కోసం సర్వశక్తులను ప్రయోగించటం
దాంట్లోనే సర్వశక్తులను సమాప్తం చేసుకోవటం అనగా ఏదైతే సంపాదించారో అది తినేసే
సమయం కాదిది. సంపాదించుకోవటం మరియు తినటం అనేది ఇంతకుముందు సమయం. కానీ ఇప్పుడు
ఇది ఎలాంటి సమయం? మీరు జమ చేసుకున్నది సర్వాత్మలకు ఇచ్చే సమయం లేకపోతే మీ ప్రజలు
మరియు భక్తులు ఈ ప్రాప్తి నుండి వంచితులు అయిపోతారు మరియు ఆ బికారులు
బికారులుగానే మిగిలిపోతారు. మరయితే దాత విధాత యొక్క పిల్లలైన మీరు వరదాత లేదా
దాతగా అవ్వరా? ఏ సమయంలో అయితే సర్వాత్మలు బికారి అయ్యి మీ నుండి తీసుకునేటందుకు
మీ ఎదురుగా వస్తారో అప్పుడు దయాహృదయులైన తండ్రి యొక్క పిల్లలు సర్వాత్మల పట్ల
దయ చూపించరా? ఆ సమయంలో వారిపై మీకు దయ రాదా? దప్పికతో ఉన్న వారిని చూస్తూ
ఉండగలరా? లౌకికంలో కూడా హద్దులోని రచయిత తన రచన యొక్క దు:ఖాన్ని లేదా
భాదపడాడాన్ని చూడలేరు. కానీ మీరు మాస్టర్ రచయితలు కదా! లేక కేవలం ఇది కేవలం బాబా
పనియేనా? మీది కూడానా? మీరు కూడా మాస్టర్ రచయితలు కదా! మాస్టర్ రచయితలు అయిన
మీరు మీ రచన యొక్క దు:ఖ విలాపాలను, బాధను చూడగలరా? సమయంలో వారికి ఎంతో కొంత
ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి నుండే స్టాకు జమ చేసుకోకపోతే మరియు
సంపాదించుకున్నది అంతా తినేస్తూ సమప్తం చేసుకున్నట్లయితే వారికి ఏమి ఇస్తారు?
ఇప్పుడు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. ఇప్పటి సమయప్రమాణంగా మాస్టర్ రచయితలు ఏమి
లెక్కాచారాన్ని చూసుకోవాలి? నేను ఏమైనా పొరపాట్లు చేశానా? ఇది బాల్యం యొక్క
లెక్కాచారం కానీ మీరు మాస్టర్ రచయితలు, మీరు మీ యొక్క ఏ చార్టు చెక్ చేసుకోవాలి?
మీ యొక్క ప్రతీ శక్తిని ఎదురుగా ఉంచుకుని ఈ రోజు ఈ సర్వశక్తులలో ఏ శక్తిని ఎంత
శాతం జమ చేసుకున్నాను అనే లెక్కాచారాన్ని చూసుకోవాలి. జమాఖాతా యొక్క
లెక్కాచారాన్నిచూసుకోవాలి. ఖర్చుకి బిందువు పెట్టాలి. ఇప్పటి వరకు కూడా మీ కోసమే
ఖర్చు చేసుకుంటూ ఉన్నారా? ఇతరులకి ఇవ్వటం అనేది ఖర్చు కాదు. ఒకటి ఇవ్వటం అంటే
లక్ష పొందటం. కనుక అది ఖర్చు అనే ఖాతాలోకి రాదు. అది జమాఖాతాలో ఉంటుంది. మీ
విఘ్నాల కోసం శక్తులను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే అది ఖర్చు. ఎప్పుడైనా ఏదైనా
విఘ్నం వస్తుంది, దానిని సమాప్తి చేసుకోవటంలో ఎంత సమయాన్ని ఖర్చు చేస్తున్నారో
లేదా ఎంత జ్ఞానాన్ని ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చులన్నింటినీ ఇప్పటి నుండి పొదుపు
చేయాలి. ఈనాటి ప్రభుత్వం పొదుపు యొక్క స్కీమ్ తయారుచేస్తుంది కదా! ఇది
సర్వశక్తివంతుని ప్రభుత్వం. ఇప్పుడు పిల్లలందరికీ బాబా ఆర్డర్ వేస్తున్నారు -
ఇప్పుడు పొదుపు యొక్క స్కీమ్ తయారుచేయండి. ఖర్చుకి బిందువు పెట్టండి.ఇస్తూ
ఉండండి, తీస్కోవలసింది ఏమైనా ఉందా ఇప్పుడు, ఇంకా తీసుకోవలసింది ఉంది అంటే ఇప్పటి
వరకు బాబా నుండి మీరు పూర్తి వారసత్వం తీసుకోలేదని రుజువు అవుతుంది. కానీ బాబా
తన దగ్గర ఏమైనా పెట్టుకున్నారా? బాబా అయితే ఒక్క సెకనులో వారసత్వం అంతా
ఇచ్చేశారు. ఇక తీసుకోవలసినది ఏమీ లేదు. పొదుపు చేయటం వచ్చిందా లేక ఖర్చు
చేసేయటంతో అలవాటు అయిపోయిందా? చాలామంది ఎలా ఉంటారంటే జమ చేసుకోవటం రాదు వారికి,
జమ చేసుకోలేరు వారు. ఖర్చు చేసి చేసి అప్పు చేసే అలవాటు అయిపోతుంది. అదేవిధంగా
ఇక్కడ కూడా మీ శక్తిని ఎప్పుడైతే ఖర్చు చేసేస్తారో అప్పుడు దాదీ లేదా దీదీ లేదా
బాప్ దాదా! మాకు కొంచెం ఇవ్వండి అని వారి నుండి అప్పు తీసుకుంటారు. అసలు మొదట
ఆలోచించండి - మీరు ఎవరి పిల్లలు? తరగని ఖజానాకి యజమాని యొక్క పిల్లలు, మరి ఆ నషా
ఉందా మీకు? తరగని ఖజానాకి యజమాని యొక్క పిల్లలు ఇతరుల నుండి శక్తిని అప్పుగా
అడుగుతున్నారు. అలాంటి వారిని ఏమంటారు? చాలా తెలివైనవారు అని అంటారు. ఇలాంటి అతి
తెలివైనవారిగా అవ్వటం లేదు కదా! పొదుపు యొక్క స్కీమ్ మరియు పొదుపుకి యుక్తులు
తెలుసు కదా! పొదుపు చేయటానికి అన్నింటికంటే సహజమైన మరియు శ్రేష్టమైన పద్ధతి ఏది?
దాని ద్వారా సర్వశక్తులను పొదుపు చేయగలగాలి. బడ్జెట్ ఎలా తయారుచేస్తారు? మొదట
తయారుచేయిస్తారు. తర్వాత పరిశీలిస్తారు. ఎలా తయారుచేయాలంటే దాని ద్వారా
స్వతహాగానే మీకు జమ అయిపోతూ ఉండాలి. పొదుపు చేయటం అంటే మీ బుద్ధి యొక్క, మాట
యొక్క, మరియు కర్మ యొక్క మీ యొక్క అన్ని విషయాలకు కార్యక్రమం నిర్ణయం అయ్యి
ఉండాలి. బడ్జెట్ తయారు చేస్తారు ఆ తర్వాత నిర్ణయిస్తారు. దీని గురించి ఇంత ఖర్చు
పెడతామని. అలా నిర్ణయించిన తర్వాత ఆ బడ్జెట్ ప్రకారం కార్యం చేస్తారు. అలా మీరు
బడ్జెట్ తయారుచేసుకోవటం అనగా అమృతవేళలో లేచి మీ బుద్ధి కోసం ప్లాన్ చేసుకోండి.
వాణి ద్వారా ఏమి చేయాలి? కర్మ ద్వారా ఏమి చేయాలి? వాటన్నింటినీ నిర్ణయించుకోండి
అనగా రోజూ మూడు రకాలుగా డెయిరీ పెట్టుకోండి. రోజూ డెయిరీ పెట్టుకోవటం ద్వారా,
బుద్ధి కోసం మీరు ఏ కర్తవ్యం అయితే నిర్ణయించుకున్నారో దానిని చేశారో లేదో
పరిశీలించుకోవాలి. నేను ఏదైతే బడ్జెట్ తయారుచేశానో దాని అనుసారంగానే ఆ కార్యం
చేశానా? లేక బడ్జెట్ ఒకటి, ప్లాన్ మరొకటి అయ్యిందా? మీ సర్వశక్తులను జమ చేసుకునే
సహజ యుక్తి ఏమిటంటే రోజూ మనసా, వాచా, కర్మణా కోసం మీ ప్లాన్ మీరు
తయారుచేస్కోండి.రోజంతటిలో బుద్ధిని ఏ కర్తవ్యంలో బిజీగా ఉంచాలి అనేది అమృతవేళ
నిర్ణయించుకోండి. అప్పుడు వ్యర్ధం అంతా సమాప్తి అయిపోతుంది. వ్యర్ధాన్ని సమాప్తం
చేస్తే మీరు సమర్ధంగా అయిపోతారు. ఈ కనుక వ్యర్థాన్ని సమాప్తి చేసుకునేటందుకు
ప్లానింగ్ బుద్ధి గలవారిగా అవ్వండి. ప్లానింగ్ బుద్ధి గలవారిగా అవ్వటం ద్వారానే
మీ యొక్క సర్వశక్తులను జమ చేసుకోగలరు. ఎందుకంటే ఏవైతే ఖర్చులు మీరు చేస్తున్నారో
అవన్నీ వ్యర్థ ఖర్చులు. వ్యర్థ ఖాతాయే సమాప్తి అయిపోతే పొదుపు స్వతహాగానే
అయిపోతుంది. కనుక వ్యర్థాన్ని సమాప్తి చేసుకునేటందుకు డెయిరీ పెట్టుకోండి. మీ
సమయాన్ని మీరు నిర్ణయించుకోండి. ఈ రోజు బుద్ధికి ఏ విశేష సంకల్పం ఇవ్వాలి. ఈ
రోజు వాణి ద్వారా ఏమి కర్తవ్యం చేయాలి? ఇలా మీరు నిర్ణయించుకోవటం ద్వారా సాధారణ
లేదా వ్యర్థ మాటలు మాట్లాడరు. ఇవి మీ శక్తిని వ్యర్థం చేసేస్తాయి. అవన్నీ పొదుపు
అవుతాయి. ఎవరైతే వేస్ట్ చేయరో వారు బెస్ట్ అవుతారు. వేస్ట్ చేసేవారు ఎప్పటికీ
బెస్ట్ కాలేరు. అలాగే అన్ని విషయాలలో చూడండి. అన్ని విషయాలలో మీ పొదుపు యొక్క
స్కీమ్ పెంచుకోండి. అప్పుడే మాస్టర్ రచయితగా కాగలరు. ఇప్పటికీ మాస్టర్ రచయితల
రచనను పాలన చేసే సామర్థ్యం రాలేదు. మాస్టర్ రచయితగా అవ్వకపోతే ఎలా అవ్వవలసి
ఉంటుంది? ఎవరికైనా సంభాళించుకోవటం రాకపోతే వారిని ఒకరు సంభాళించవలసి ఉంటుంది.
అలాగే మీరు కూడా మాస్టర్ రచయిత అవ్వటానికి బదులు రచనగా అవ్వవలసి వస్తుంది.
వాస్తవానికి అవ్వాల్సింది మాస్టర్ రచయితగా కదా! కనుక ఏవైతే రెండు మాటలు మీరు
విన్నారో మేళా మరియు ఆట వీటిని సదా స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు కూడా పొదుపు
యొక్క స్కీమ్ అవుతుంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్ధ సమయము, వ్యర్ధ శక్తి ఏదైతే
ఖర్చు చేస్తున్నారో అది పొదుపు అవుతుంది. దీని కొరకు కేవలం మీ నియమాన్ని గట్టిగా
ఉంచుకోండి.ఇలా చేయాలి అని అనుకుంటున్నారే కానీ నియమిత రూపంతో దానిని ఒక నియమంగా
చేసుకోవటం లేదు. ఒక నెల నషాలో ఉంటున్నారు, ఆ తర్వాత మాయ రావటం మొదలవుతుంది. అంటే
మీరు సృహ తప్పిపోయేలా మాయ తన పని చేయటం మొదలు పెడుతుంది. అందువలన ఏమి చేయాలి?
ఎవరైతే తెలివిలోకి రారో, వారికి వెనువెంటనే ఇంజక్షన్ చేస్తూ ఉంటారు. అలాగే
ఆపరేషన్ చేసేటప్పుడు కూడా బాధ తెలియకుండా ఉండడానికి ఇంజక్షన్ చేస్తారు.
అదేవిధంగా ఎప్పుడైతే నషా నుండి సృహ లేని వారిగా అయిపోయే స్థితిలోకి వెళ్తూ
ఉంటారో అంటే మాయ యొక్క నషా మొదలు అవుతున్నప్పుడు ఏమి ఇంజక్షన్ చేసుకోవాలి?
అటెంక్షన్ మరియు చెకింగ్ (ధ్యాసం మరియు పరిశీలన) ఇవే ఇంజక్షన్. కానీ వాటితో పాటు
అమృతవేళ పవర్‌హౌస్ (సర్వశక్తివంతుడు)అయిన బాబా నుండి ఫుల్ పవర్ తీసుకునే నియమం
ఏదైతే ఉందో దానిని తరచుగా పరిశీలించుకోండి. ఇదే పెద్ద ఇంజక్షన్, అమృతవేళ బాబాతో
సంబంధం జోడించారంటే రోజంతటిలో మాయ మిమ్మల్ని సృహ కోల్పోయేలా చేయటం నుండి మీరు
రక్షించబడతారు. ఈ ఇంజక్షన్ ను తీసుకోవటం లేదు. బాబాతో సంబంధాన్ని సరి చేస్కోండి.
కేవలం లేచి కూర్చోవటం కాదు. లేచారు మరియు కూర్చున్నారు. అంటే ఇది నియమాన్ని
పాలన చేసినట్లు. కానీ బాబాతో సంబంధం సరిగ్గా ఉందా? అంటే ప్రాప్తులు అనుభవం
అవుతున్నాయా? ఇంజక్షన్ చేశారు కానీ శక్తి రావటం లేదు అంటే ఇంజక్షన్ పూర్తిగా
పనిచేయలేదు. అదేవిధంగా అమృతవేళ బాబాతో సంబంధం జోడించటం అనగా సర్వ శక్తులను మరియు
సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకోవటం. ఇదే పెద్ద ఇంజక్షన్. కనుక మొదట
పరిశీలించుకోండి - ఆది కాలం అనగా అమృతవేళ సరిగ్గా ఉందా? ఆదికాలం సరిగ్గా లేకపోతే
మధ్య మరియు అంతిమం కూడా సరిగ్గా ఉండదు. ఆదికాలంలో అనుభవం చేసుకునే అభ్యాసం
సరిగ్గా లేకపోతే సృష్టి యొక్క ఆది లేదా ఆదికాలంలో సర్వ సుఖాలను అనుభవం
చేసుకోలేరు. ఎలాగైతే అమృతవేళ రోజంతటికీ ఆదికాలమో ఆ ఆదికాలాన్ని వదిలేసి కొంచెం
సమయం తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత మేల్కొని కూర్చుని బాబాతో సంబంధాన్ని
జోడిస్తుంటే మీరు ఇక్కడ ఎంత ఆలస్యమో అక్కడ అంత ఆలస్యం. ఎందుకంటే బాప్ దాదా
పిల్లలను కలుసుకునేటందుకు, పిల్లలకు అపాయింట్మెంట్ ఇచ్చిన సమయం లేదా మొదటి
అవకాశం పిల్లలకి, ఆ తర్వాత భక్తుల కోసం సమయం ఇచ్చారు. ఒకవేళ భక్తుల కోసం
కేటాయించిన సమయంలో మీరు బాబాతో సంబంధాన్ని జోడిస్తే పిల్లలకు ఇచ్చే
వరదానాన్నిమీరు పొందలేరు. అందువలన ఈ కాలానికి ఆ కాలంతో సంబంధం ఉంది. కనుక
అన్నింటికంటే పెద్ద బడ్జెట్ మొట్టమొదట సెట్ చేసుకోవలసింది ఇది, అమృతవేళ అనగా
ఆదికాలం. ఆ సమయంలో స్వయాన్ని పరిశీలించుకోండి. మేము ఆదికాలంలో వచ్చేవారిమా? లేక
కొన్ని జన్మల్లో మాత్రమే వచ్చేవారిమా? ఇక్కడ ఒక గంట - అక్కడ ఒక జన్మ. ఎన్ని
గంటలు ఇక్కడ తక్కువో అన్ని జన్మలు అక్కడ తక్కువ అవుతాయి. బలహీనత ఇక్కడ ఉంది.
యోగంలో కూర్చోవటం అయితే అందరు కూర్చుంటున్నారు. ఆ సమయంలో దృశ్యం చూస్తే చాలా మజా
వస్తుంది. ఆ సమయంలో దృశ్యం ఎలా ఉంటుందంటే జైపూర్ హఠయోగుల మ్యూజియం ఒకటి ఉంది. ఆ
మ్యూజియంలో రకరకాల హఠయోగులను చూపించారు. అలాగే అమృతవేళ కూడా అలాంటి దృశ్యమే
ఉంటుంది. కొందరు హఠంతో నిద్రని అదుపు చేసుకుంటున్నారు. కొందరు బలవంతంగా సమయాన్ని
గడుపుతున్నారు, మరికొందరు కునికిపాట్లు పడుతున్నారు అంటే వారు ఏ పని మీద
కూర్చున్నారో ఆ పని వారితో అవ్వటం లేదు. ఎలాగైతే అక్కడ వారు హఠయోగులను
చూపిస్తారు - కొందరు ఒంటికాలిపై నిల్చుని ఉన్నట్లు, కొందరు శీర్షాసనం వేసి,
మరికొందరు ఇంకో రకంగా ఉన్నట్లు చూపిస్తారు. ఇక్కడ కూడా ఆ సమయంలో దృశ్యం అలాగే
ఉంటుంది. కొందరు ఒక్క సెకను మంచిగా గడుపుతున్నారు, మరో సెకను చూస్తే ఒక కాలిని
పైకి పెట్టి నిలబడడానికి ప్రయత్నిస్తుంటే ఈలోపు ఆ కాలు పడిపోతుంది. అలాగే ఇక్కడ
కూడా ఈ రోజు కొంచెం జమ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ అవ్వటం లేదు, ఈ దృశ్యం
చూడడానికి బావుంటుంది. కొందరు నిద్రపోతూ నిద్రపోతూ కూడా యోగం చేస్తున్నారు.
శేషశయ్యపై ఉంటున్నారు. ఆ సమయంలో భంగిమ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే
చెప్పాను - అమృతవేళ యొక్క గొప్పతనాన్నితెలుసుకుని దానిని జీవితంలోకి తీసుకువస్తే
గొప్పవారిగా కాగలరు. ఒకవేళ అమృతవేళ మీ కోసం ప్లాన్ చేసుకోకపోతే దానిని అమలులోకి
ఎలా తీసుకువస్తారు? లౌకిక కార్యం అయినా కానీ ప్లాన్ చేసుకున్నప్పుడే అది సఫలం
అవుతుంది అలాగే ఇక్కడ మీరు ప్లాన్ తయారు చేసుకోకపోతే సఫలత రాదు. అమృతవేళ మీ
ప్లాన్ నిర్ణయించుకోవటం లేదు అందువలనే మనసా వాచా కర్మణా ద్వారా ఏదైతే సఫలత
రావాలో అది రావటం లేదు. అందువలన ఇప్పుడు ఈ గొప్పతనాన్ని తెలుసుకుని గొప్పవారిగా
అవ్వండి. ఇప్పుడు ఇక ఏ పురుషార్ధం మిగిలి ఉందో స్పష్టంగా చెప్పాను. అమృతవేళను
సరి చేసుకుంటే అన్నీ సరి అయిపోతాయి. ఎలాగైతే అమృతం త్రాగటం ద్వారా అమరులు
అయిపోతారో అలాగే అమృతవేళని సఫలం చేసుకోవటం ద్వారా అమర భవ అనే వరదానం లభిస్తుంది.
అప్పుడు రోజంతటి విఘ్నాలలో మీరు వాడిపోరు. సదా హర్షితంగా ఉండటంలో మరియు సదా
శక్తిశాలిగా ఉండటంలో అమరంగా ఉంటారు. అమృతవేళ అమరభవ అనే వరదానం ఏదైతే లభిస్తుందో
దానిని తీసుకోకపోతే పురుషార్థంలో చాలా శ్రమ చేయవలసి వస్తుంది. శ్రమ మరియు ఖర్చు
రెండూ చేస్తున్నారు. కానీ అమరభవ అనే వరదానంతో రెండింటి నుండి ముక్తులు అయిపోతారు.
మంచిది.
ఈవిధంగా సదా బాబాతో పాటు ఉండేవారికి, సదా ప్రతీ
సంకల్పంలో బాబాని కలుసుకునేవారికి, ఒక్క సంకల్పం లేదా ఒక్క సెకను అయినా కానీ
బాబా కలయిక నుండి వేరవ్వని వారికి, సదా సాక్షి మరియు స్మృతి అనే సీట్ పై సెట్
అయ్యి ప్రతీ దృశ్యాన్ని చూసే తీవ్ర పురుషార్థీలకు, ఒక్క సెకనులో సంకల్పం మరియు
స్వరూపం రెండింటినీ తయారుచేసుకునేవారికి, సంకల్పం చేయగానే స్వరూపంగా
అయిపోయేవారికి, ఇటువంటి తీవ్రపురుషార్థీ అమరభవ యొక్క వరదాని పిల్లలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.