02.08.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


యదార్ధ విధి ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి.

సిద్ది స్వరూపంగా తయారుచేసేవారు, జ్ఞాన సాగరులు, శక్తిశాలి మరియు ప్రేమ సాగరులుగా తయారుచేసే సర్వశక్తివంతుడైన బాబా మాట్లాడుతున్నారు -

విధి ద్వారా సిద్ధిని స్వయంలో ప్రాప్తింపచేసుకుంటున్నారా? ఎందుకంటే ఏదైతే పురుషార్ధం చేస్తున్నారో దాని యొక్క లక్ష్యమే - సిద్ధిని పొందటం. ప్రపంచం వారి దగ్గర ఈ రోజుల్లో మంత్రతంత్రాలు చాలా ఉన్నాయి. అది మంత్రతంత్రం - ఇది విధి ద్వారా సిద్ది. విధి మరియు సిద్ధి - ఇదే యదార్ధం. దీనినే మరో రూపంలో తీసుకున్న కారణంగా మంత్రతంత్రాలలోకి వెళ్ళిపోయారు, మరయితే స్వయాన్ని సిద్ధి స్వరూపంగా భావిస్తున్నారా? ఏ సంకల్పం చేసినా యదార్ధ విధిపూర్వకంగా ఉంటే సిద్ది తప్పక లభిస్తుంది. విధి సరిగ్గా లేకపోతే సిద్ధి కూడా రాదు. అందువలనే భక్తిలో కూడా ఏ కార్యం చేస్తున్నా లేదా చేయిస్తున్నా ఆ కార్యానికి విలువ విధి ఆధారంగానే ఉంటుంది. విధిపూర్వకంగా ఉంటే సిద్ధిని అనుభవం చేసుకుంటారు. అన్నీ ఇక్కడి నుండే ప్రారంభం అయ్యాయి కదా! కనుకనే స్వయాన్ని సిద్ది స్వరూపంగా భావిస్తున్నారా అని అడిగాను. లేక ఇప్పుడు ఆవిధంగా తయారవ్వాలా? సమయానుసారం రెండు క్షేత్రాలలో పరిణామం స్వరూపం ఇప్పటి వరకు 95% ఉండాలి. సమయం యొక్క వేగాన్ని చూస్తున్నారు, శపధం లేదా సవాలు కూడా చేస్తున్నారు. కానీ అది ఎప్పుడు పూర్తవుతుందంటే మీ యొక్క స్థితి సంపన్నంగా ఉన్నప్పుడు. ఏదైతే మీరు సవాలు చేస్తున్నారో అటువంటి పరివర్తన దేని ఆధారంగా అవుతుంది. దానికి పునాది రాయి ఎవరు? దానికి మీరే పునాది రాయి కదా? ఒకవేళ పునాది రాయియే గట్టిగా లేకపోతే తర్వాత పనులు ఎలా జరుగుతాయి? ఎప్పుడైతే పునాది రాయి తయారైపోతుందో ఆ తర్వాత నెంబరువారీగా రాజధాని అంతా తయారవుతుంది. ఎవరైతే రాజ్యం చేయడానికి అధికారిగా అవ్వాలో వారు తమ అధికారాన్ని తీసుకోకపోతే ఇక ఇతరులు నెంబరువారీగా తమ తమ అధికారాలు ఎలా తీసుకోగలరు? రెండు సంవత్సరాలు అని మీరు ఏదైతే సవాలు చేస్తున్నారో ఆ లెక్క ప్రకారంగా విశ్వపరివర్తనా కార్యం జరగాలి కదా! మీ స్థితి అనే విధి తయారవ్వకపోతే సిద్ధి ప్రాప్తించదు. విశ్వకళ్యాణమనే కార్యంలో కూడా సిద్ధి ఎలా ప్రాప్తిస్తుంది? మొదట స్వయం సిద్ధి పొందాలి. ఇంత పెద్ద కార్యాన్ని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయాలంటే ఎంత వేగంగా పని చేయాలి? 37 సంవత్సరాల స్థాపనా కార్యంలో 50% వరకే చేరుకున్నారంటే ఇప్పుడు రెండు సంవత్సరాలలో 100% వరకు తీసుకురావాలంటే ఏమి చేయాల్సి ఉంటుంది? వేగంగా ఎలా పూర్తి చేయాలో అనగా సిద్ధి స్వరూపంగా ఎలా అవ్వాలో ఏదైనా ప్లాన్ తయారు చేశారా? సంకల్పం చేయగానే సిద్ధి పొందాలి. 100% సిద్ధి స్వరూపులకు గుర్తు ఏమిటంటే కర్మ చేశారు మరియు సిద్ది పొందారు. సాధారణ జ్ఞానం ఆధారంగా మంత్రతంత్రాల సిద్ధిని పొందగలుగుతున్నప్పుడు విధి ద్వారా సిద్ధిని పొందలేరా? సిద్ధి సంపూర్ణంగా లభించకపోవడానికి ఏ విధిలో లోపం ఉందో పరిశీలించుకోవాలి. విధిని పరిశీలించుకోవటం ద్వారా సిద్ది స్వతహాగానే పొందగలరు. దాంట్లో కూడా సిద్ధి పొందకపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఒకే సమయంలో మూడు రకాలైన సేవ చేయటం లేదు. జ్ఞాన సాగరులు, శక్తివంతులు మరియు ప్రేమ సాగరులు, దీంట్లో ప్రేమ మరియు నియమం రెండూ వెనువెంట వచ్చేస్తాయి. ఈ మూడు రూపాలతో సేవ చేయాలి మరియు మూడు రూపాలతో కూడా చేయాలి. ఎప్పుడైతే వాచా ద్వారా సేవ చేస్తున్నారో అప్పుడు మనస్సు కూడా శక్తివంతంగా ఉండాలి. శక్తిశాలి స్థితి ద్వారా వారి మనస్సుని కూడా పరివర్తన చేయగలరు. మరియు వాచా ద్వారా వారిని జ్ఞానవంతులుగా చేయగలరు. ఆ తర్వాత కర్మణా ద్వారా అంటే ఎవరైతే సంప్రదింపుల్లోకి వస్తారో ఆ సంప్రదింపులు ప్రేమపూర్వకంగా ఉండాలి. దాని ద్వారా వారు స్వతహాగానే మేము ఈశ్వరీయ పరివారంలోకి వచ్చి చేరుకున్నాము అని అనుభవం చేసుకోవాలి. మీ నడవడిక ఎలా ఉండాలంటే వాస్తవానికి ఇదే నా అసలైన పరివారం అని వారికి అనిపించాలి. ఇలా మూడు రకాలుగా వారి మనస్సుని అదుపు చేసి, వాచా ద్వారా జ్ఞాన ప్రకాశాన్ని, శక్తిని ఇస్తే అలాంటి విధి పూర్వక సేవకి సిద్ధి లభించదా? కారణం ఏమిటంటే మీరు ఒకే సమయంలో మూడు రూపాల ద్వారా మూడు రకాలుగా సేవ చేయటం లేదు. వాచాలోకి వస్తున్నప్పుడు మనస్సు ఏదైతే శక్తిశాలి స్థితిలో ఉండాలో, అది ఉండటం లేదు. లేదా తక్కువగా ఉంటున్నారు. మరియు రమణీయ నడవడిక ద్వారా ఎవరైనా సంప్రదింపుల్లోకి తీసుకువస్తున్నట్లయితే ఆ సమయంలో కూడా మనస్సు ఏదైతే శక్తిశాలి స్థితిలో ఉండాలో అలా ఉండటం లేదు. ఒకే సమయంలో ఈ మూడూ కలిసి ఉన్నట్లయితే సిద్ది తప్పక లభిస్తుంది. ఇప్పుడు ఈ రకంగా సేవ చేసే అభ్యాసం మరియు ధ్యాస అవసరం. మీరు వారి యొక్క సంబంధంలోకి రావటం లేదు - అంటే లోతుగా సంప్రదింపులు పెట్టుకోవటం లేదు. కేవలం పైపై సంప్రదింపుల్లోకి మాత్రమే వస్తున్నారు. కానీ ఆ పైపై సంప్రదింపులు అల్పకాలికంగానే ఉంటాయి. ప్రేమలోకి తీసుకువస్తున్నారు కానీ ప్రేమతో పాటు శక్తిశాలిగా ఏదైతే ఉండాలో ఆ ఆత్మల్లో కూడా ఏదైతే శక్తిని నింపాలో, ఆ శక్తి ద్వారా వారు సమస్యలను, వాయుమండలాన్ని, తరంగాలను ఎదుర్కుని సదాకాలిక సంబంధంలో ఉండాలి, అలా చేయటం లేదు. వారు జ్ఞానానికి అయినా ఆకర్షితం అవుతున్నారు లేదా ప్రేమ ఆధారంగానైనా ఆకర్షితం అవుతున్నారు. ఎక్కువమంది ప్రేమకి ఆకర్షితం అవుతున్నారు. ఇక రెండవ నెంబరులో జ్ఞానంపై ఆకర్షితం అవుతున్నారు. కానీ ఎలాంటి శక్తిశాలి స్థితి ఉండాలంటే ఏ విషయం ఎదురుగా వచ్చినా కానీ వారు కదలకూడదు, ఇప్పుడు కేవలం ఇదే లోపంగా ఉంది. నిమిత్త సేవాధారులలో కూడా జ్ఞానం చాలా ఉంది మరియు ప్రేమ కూడా ఉంది. కానీ శక్తి తక్కువగా ఉంది. శక్తిశాలికి స్తితికి గుర్తు ఏమిటి? ఏ వాయుమండలాన్ని అయినా, వాతావరణాన్ని అయినా, మాయ యొక్క ఏ సమస్యను అయినా ఒక్క సెకండులో సమాప్తం చేసేస్తారు. వారు ఎప్పుడూ ఓడిపోరు. ఏ ఆత్మలైతే సమస్యా రూపంగా అయ్యి వారి ఎదురుగా వస్తారో వారు వీరికి బలిహారం అయిపోతారు. దీనినే మరోమాటలో ప్రకృతి దాసి అని అంటారు. పంచతత్వాలు దాసిలుగా కాగలుగుతున్నప్పుడు మనుష్యాత్మలు బలిహారం అవ్వలేరా? కనుక శక్తిశాలి స్థితి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఇదే. అందువలనే చెప్పాను - ఒకే సమయంలో మూడు రూపాలతో సేవ చేసే రూపురేఖ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ప్రతీ కర్తవ్యంలో సిద్ధి కనిపిస్తుంది. అంటే విధి ఆధారంగానే సిద్ది లభించింది కదా! విధిలో లోపం కారణంగా సిద్ధిలో లోపం వస్తుంది. ఇప్పుడు సిద్ధి స్వరూపంగా అయ్యేటందుకు మొదట ఈ విధిని సరి చేసుకోండి. భక్తిమార్గంలో సాధన చేస్తారు, ఇక్కడ ఇది సాధనం. ఏ సాధనం? బాప్ దాదా యొక్క ప్రతీ విశేషతను స్వయంలో ధారణ చేస్తూ చేస్తూ విశేషాత్మగా అయిపోతారు. పరీక్ష యొక్క రోజులు దగ్గర పడేకొలదీ ఏదైతే చదివారో థియరీ లేదా ప్రాక్టికల్ రెండింటినీ రివైజ్ చేసుకుని ఏ సబ్జక్టులో ఏది మిగిలిపోయింది అని పరిశీలించుకుంటారు కదా! అదేవిధంగా ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది. కనుక ప్రతీ సబ్జెక్టులో ఏది మరియు ఎంత శాతం లోపం ఉందో మిమ్మల్ని మీరు చూసుకోండి. థియరీ మరియు ప్రాక్టికల్ రెండింటిలో పరిశీలించుకోండి. ప్రతీ ఒక్క సబ్జెక్టులో ఏది లోపంగా ఉందో చూసుకుని మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తయారుచేసుకోండి. సంపూర్ణంగా ఎప్పుడు అవుతారంటే మొదట అన్ని సబ్జెక్టులను రివైజ్ చేసుకుని మీ లోపమేమిటో తెలుసుకున్నప్పుడు. సబ్జెక్టులు ఏమిటో తెలుసు కదా! ఆ సబ్జెక్టులను బుద్ధిలో ధారణ చేశారో లేదో దాని యొక్క పరిశీలన ఎలా? సిద్ది యొక్క శాతం పెరిగే కొలదీ సమయం ఎక్కువ వ్యర్ధం అవ్వదు. కొంచెం సమయంలోనే ఎక్కువ సఫలత కనిపిస్తుంది. దీనినే సిద్ది అని అంటారు. ఎక్కువ సమయం పట్టింది, శ్రమ కూడా ఎక్కువ పట్టింది. ఆ తర్వాత సఫలత లభించిందంటే అది కూడా తక్కువ శాతం అనే అంటారు. అన్ని రకాలుగా తక్కువ అవ్వాలి. తనువు తక్కువగా, మనస్సు యొక్క సంకల్పాలు కూడా తక్కువగా ఉపయోగించాలి. లేకపోతే ఎన్ని సంకల్పాలు చేస్తారు? ప్లాన్ తయారు చేస్తూ చేస్తూ నెలన్నర సమయం అయిపోతుంది. కనుక సమయం లేదా సంకల్పాలు లేదా మీ యొక్క సర్వశక్తులు, ఏవైతే ఉన్నాయో ఆ సర్వశక్తుల ఖజానాను కూడా ఎక్కువగా ఉపయోగించకూడదు. అంటే తక్కువ ఖర్చు ఎక్కువ పేరు. అంటే సిద్ధించే సంకల్పాలే ఉత్పన్నమవుతాయి. సఫలత లభించి తీరవలసిన సమయమే అక్కడ నిశ్చితం అవుతుంది. దానినే సిద్ది స్వరూపం అని అంటారు. అన్ని సబ్జెక్టులలో ఎంత వరకు పాస్ అయ్యామో దాని పరిశీలన ఏమిటి? ఎవరు ఎన్ని సబ్జెక్టులలో పాస్ అవుతారో అంతగానే ఆ సబ్జెక్టుల ఆధారంగా లక్ష్యం లేదా గౌరవం లభిస్తుంది. 1. ప్రాప్తి యొక్క అనుభవం కూడా అవుతుంది అనగా జ్ఞానం అనే సబ్జెక్టు ఆధారంగా ఏదైతే లక్ష్యం ప్రాప్తిస్తుందో అదేమిటంటే ప్రకాశం మరియు శక్తి. ఈ రెండూ ప్రాప్తించినట్లు అనుభవం అవుతుంది. ఆ జ్ఞానం యొక్క సబ్జెక్టు ఆధారంగా గౌరవం కూడా అంతగానే లభిస్తుంది. దైవీ పరివారం నుండి అయినా లేదా ఇతరాత్మల నుండి అయినా. ఈనాటి మాహాత్ములకి ఎంత గౌరవం లభిస్తుంది? ఎందుకు? ఏదైతే సాధన చేశారో మరియు ఏ సబ్జెక్టుని అయితే అధ్యయనం చేశారో దాని యొక్క లక్ష్యం మరియు గౌరవం వారికి లభిస్తుంది మరియు ప్రకృతి కూడా దాసి అవుతుంది. ఇలా జ్ఞానం అనే విషయం గురించి తెలిసింది. అదేవిధంగా యోగం యొక్క సబ్జెక్టు కూడా, దాని యొక్క లక్ష్యం ఏమిటి? యోగం అనగా స్మృతిశక్తి ద్వారా ఏ లక్ష్యం ప్రాప్తిస్తుంది, వారు ఏదైతే సంకల్పం చేస్తారో అది సిద్ధిస్తుంది. ఏదైనా సమస్య రాబోతున్నప్పుడు ముందుగానే యోగశక్తి ద్వారా అనుభవం అయిపోతుంది ఇది జరగనున్నదని. ముందుగానే తెలిసిన కారణంగా వారు ఎప్పుడూ ఓడిపోరు. అదేవిధంగా యోగశక్తి ద్వారా తమలోని పాత స్వభావ సంస్కారాల భారాన్ని సమాప్తి చేసుకుంటారు. తద్వారా ఏ సంస్కారం వారి పురుషార్ధంలో విఘ్న రూపంగా అవ్వదు. స్వభావం అని ఏదైతే అంటారో అది కూడా పురుషార్థంలో విఘ్నరూపంగా అవ్వదు. ఇలా ఏ సబ్జెక్టు ద్వారా ఏ లక్ష్యం పొందాలో అవన్నీ అనుభవం అవ్వాలి. లక్ష్యానికి చేరుకుంటే దాని పరిణామంగా గౌరవం తప్పక లభిస్తుంది. మీ నోటి ద్వారా ఏ మాటలు మాట్లాడినా, ఏ ప్లాన్ తయారు చేసినా అది సమర్థంగా ఉంటుంది. కనుక దానిని అందరు గౌరవిస్తారు. అనగా పరస్పరంలో ఏదైతే సలహా ఇస్తారో ఆ సలహాకి అందరు గౌరవం ఇస్తారు. ఎందుకంటే అది సమర్ధంగా ఉంటుంది. ఈ రకంగా ప్రతి సబ్జెక్టుని చూడండి. దివ్యగుణాలు లేదా సేవ యొక్క సబ్జెక్టు ఏదైతే ఉందో వాటి యొక్క ప్రాప్తి ఏమిటంటే సమీప సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. సమీప సంబంధ సంప్రదింపుల్లోకి రావటం ద్వారా గౌరవం స్వతహాగానే లభిస్తుంది. ఈ విధంగా ప్రతీ సబ్జెక్టు యొక్క లక్ష్యాన్ని పరిశీలించుకోండి. లక్ష్యానికి ఎంత చేరుకున్నారో తెలుసుకునేటందుకు సాధనం - గౌరవం. నేను ఎవరికైతే జ్ఞానం ఇస్తున్నానో వారు జ్ఞానానికి అంత గౌరవం ఇస్తున్నారా? జ్ఞానానికి గౌరవం ఇవ్వటమే జ్ఞానసాగరులకి గౌరవం ఇవ్వటం. యోగం యొక్క సబ్జెక్టులో లక్ష్యం ఏమిటంటే ఎవరి యొక్క సంకల్పాలను అయినా పరివర్తనలోకి తీసుకువచ్చి వారిని సమర్థులుగా తయారు చేయగలగాలి. అప్పుడు వారు మీకు తప్పక గౌరవం ఇస్తారు. ఈ రకంగా ప్రతీ సబ్జెక్టుని పరిశీలించుకోండి. ప్రతీ సబ్జెక్టులో లేదా సంకల్పంలో లక్ష్యం మరియు గౌరవం ఈ రెండింటి ప్రాప్తి యొక్క అనుభవం ఎవరైతే చేసుకుంటారో వారే పరిపక్వత సాధించిన వారు. పరిపక్వత సాధించినవారు అన్ని ప్రభావాలకు అతీతంగా ఉంటారు, శరీరం యొక్క, సంకల్పాల యొక్క సంప్రదింపుల్లోకి వచ్చేవారి తరంగాల యొక్క లేదా వాయుమండలం యొక్క అన్ని రకాల ప్రభావాల నుండి అతీతంగా ఉన్నట్లయితే అప్పుడు ప్రతీ సబ్జెక్టులో పాస్ అయినట్లు లేదా పరిపక్వం అయినట్లు. ఇలా తయారవుతున్నారు కదా! లక్ష్యం అయితే ఇదే కదా! ఇప్పుడు మీ గురించి మీరు ఎక్కువ పరిశీలన చేసుకోవాలి. ఇతరులకి చెప్తున్నారు కదా! సమయంతో పాటు స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోండని. అదేవిధంగా సదా స్వయం కూడా ఇది స్మృతిలో ఉంచుకోండి - సమయంతో పాటు నన్ను నేను కూడా పరివర్తన చేసుకోవాలని. స్వయంలో పరివర్తన తీసుకువస్తూ, తీసుకువస్తూ ఉంటే సృష్టి కూడా పరివర్తన అయిపోతుంది. ఎందుకంటే మీ పరివర్తన ఆధారంగానే సృష్టిలో పరివర్తన తీసుకువచ్చే కార్యం చేయగలరు. ఇక్కడ ఉన్న శ్రేష్టత ఇదే, అది ఇతరులలో లేదు. వారు కేవలం ఇతరులని పరివర్తన చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇక్కడ స్వయం ఆధారంగా సృష్టిని మీరు పరివర్తన చేస్తున్నారు. కనుక ఏదైతే ఆధారమో దానిపై ఇంత ధ్యాస పెట్టాలి. ఇప్పుడు సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి - నా యొక్క ప్రతీ సంకల్పానికి విశ్వకళ్యాణంతో సంబంధం ఉందని. ఎవరైతే ఆధారమూర్తులు ఉన్నారో వారి యొక్క సంకల్పం సమర్ధంగా లేకపోయినట్లయితే సమయం యొక్క పరివర్తనలో కూడా బలహీనత వచ్చేస్తుంది. అందువలన స్వయం ఎంతెంత సమర్ధంగా అవుతూ ఉంటారో అంతగానే సృష్టిని పరివర్తన చేసే సమయాన్ని కూడా సమీపంగా తీసుకురాగలరు. డ్రామానుసారం సమయం నిశ్చితమై ఉంది. కానీ డ్రామా కూడా ఎవరి ఆధారంగా తయారయ్యింది. ఆఖరుకి ఆధారం అయితే ఉంటుంది కదా! ఆ ఆధారమూర్తులు మీరే. ఇప్పుడు అయితే మీరందరు అందరి దృష్టిలో ఉన్నారు. రెండు సంవత్సరాలలో వినాశనం అనే శపధం చేశారు కదా! ఇవన్నీ వింటున్నప్పుడు ఒకవేళ నిజంగా వినాశనం అవ్వకపోతే...? అని కొద్దిగా సంకల్పాలు నడుస్తున్నాయా? రెండు సంవత్సరాలలో జరగదేమో! జరగకపోవచ్చు కూడా.... ఇలా సంకల్పరూపంలో కూడా సంకల్పాలు నడవటం లేదా? ఎదుర్కుంటాం, అది వేరే విషయం. దీని అర్థం ఏమిటి, సంకల్పంలో ఎంతో కొంత ఉంటేనే కదా ఆ మాట వచ్చింది. రెండు సంవత్సరాలలో వినాశనం అవుతుంది అని మీకు పూర్తిగా నిశ్చయం ఉందా? వినాశనం అవ్వకపోతే ఏమవుతుంది. అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమి చేస్తారు? ఏమి సమాధానం చెప్తారు? అర్థం చేయించే సమయంలో వారికి స్పష్టంగా వివరించాలి - రెండు సంవత్సరాలలో పూర్తి వినాశనం అవ్వదు. కానీ రెండు సంవత్సరాలలో ఎలాంటి దృశ్యాలు కనబడతాయంటే ప్రజలు అనుకుంటారు ఇక వినాశనం జరుగుతుంది, వినాశనం ప్రారంభం అయ్యిందని. ఒక విషయం సహజంగా అనిపిస్తే ఇంకో విషయం కూడా సహజంగా అనిపిస్తుంది కదా! వినాశనానికి సమయం అయితే పడుతుంది కదా! స్వయం సంపూర్ణం అయినప్పుడు కార్యం కూడా సంపూర్ణం అవుతుందా లేక కేవలం స్వయమే సంపూర్ణం అవుతారా? ఎడ్వాన్స్ పార్టీ వారి యొక్క కార్యం ఏమి నడుస్తుంది? మీకోసం వారందరు భూమిని తయారుచేస్తున్నారు. వారి పరివారంలోకి మీరు వచ్చినా రాకపోయినా కానీ ఏదైతే స్థాపనా కార్యం జరగాలో దానికి వారు నిమిత్తం అవుతారు. కొందరు శక్తిశాలి స్థితి ద్వారా నిమిత్తం అవుతారు. ఎంత శక్తి అంటే దాని ద్వారా స్థాపనాకార్యంలో సహాయకారి అవుతారు. ఈ రోజుల్లో చూడండి మీరు - కొత్త రక్తానికి (యువత) గౌరవం ఎక్కువ ఉంటుంది. ఎంతగా ముందుకి వెళ్తుంటారో అంతగా చిన్నవారి బుద్ధి బాగా పనిచేస్తుంది పెద్దవారికంటే. పెద్ద వయస్సు వారితో పోలిస్తే చిన్నవారిలోనే సతో ప్రధానత ఉంటుంది. ఎంతోకొంత పవిత్రతా శక్తి ఉంటుంది. కనుక వారి బుద్ది పనిచేసినట్లు పెద్దవారిది పనిచేయదు. ఈ మార్పు ఉంటుంది. పెద్దవారు కూడా పిల్లల సలహాకి విలువనిస్తారు. పాతవారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు అనుకుంటున్నారు - మేము పాతకాలం వాళ్ళం అని. కానీ ఈనాటి పిల్లలకి గౌరవం ఇవ్వకపోతే మరియు వారిని పెద్దవారిగా భావించి నడవకపోతే పని జరగదు. మొదట పిల్లలను గర్వంతో పెంచేవారు, ఇప్పుడు అలా కాదు. పిల్లలనే యజమానిగా భావించి పెంచుతున్నారు. కనుక ఇది కూడా డ్రామాలో పాత్ర. చిన్నవారే అద్భుతం చేసిచూపగలరు. అడ్వాన్సు పార్టీ వారు తమ కార్యం తాము చేస్తున్నారు. కానీ వారు కూడా మీ స్థితి ఉన్నతం అయ్యే వరకు వేచి ఉన్నారు. వారి కార్యం కూడా మీ ఆధారంగానే జరుగుతుంది. ఇలా సర్వ కార్యాలకు ఆధారం విశేషాత్మలైన మీపై ఉంది. నడుస్తూ నడుస్తూ చల్లగా అయిపోతున్నారు. అగ్ని అంటుకుంటుంది మరలా చల్లారిపోతుంది. కానీ చల్లారిపోకూడదు కదా! బాహ్య రూపం ఏదైతే ఉందో అదే మనుష్యులు చూస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, ఏముంది అనుకుంటారు. పరంపరగా ఆట నడుస్తూ వస్తుంది అనుకుంటారు. కానీ నడుస్తూ నడుస్తూ ఎందుకు శీతలం అయిపోతుంది? కారణం ఏమిటి? శాతం చాలా తక్కువగా ఉంది, ఉపన్యాసాలు అయితే చెప్తున్నారు కానీ దాంతోపాటు ముఖకవళికలు ఆకర్షించాలి. అప్పుడు ఆ ఉపన్యాసం యొక్క ప్రభావం పడుతుంది. ప్రతీ సబ్జెక్టులో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ రోజుల్లో ఉపన్యాసంలో పోటీ పోడితే దీంట్లో ఇతరులలో ఎవరొకరు కూడా గెలవవచ్చు. కానీ ప్రత్యక్ష ధారణలో మీతో అందరూ ఓడిపోతారు. ప్రత్యక్షంగా చేసిన ఏ విషయాన్ని అయినా మీరు చెప్తే ఒక్కసారిగా శాంతి అయిపోతారు. కనుక ఉపన్యాసం ద్వారా ప్రత్యక్ష విషయాన్ని చెప్పాలి. అప్పుడు మీ ఉపన్యాసం అందరి కంటే అతీతంగా ఉంటుంది. ఏ మాటలు అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ స్థితి నయనాలలో కనిపించాలి. వీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజం అనిపించాలి. వీరు అనుభవీ మూర్తి అనిపించాలి, అప్పుడు ప్రభావం పడుతుంది. ఇక వినటం అయితే అందరూ వినివినీ అలసిపోయారు. చాలా విన్నారు. వినిపించేవారు కూడా అనేకమంది ఉన్నారు. కనుక వినివినీ అందరు అలసిపోయారు. చాలా విన్నాము అని కూడా అంటున్నారు. ఇప్పుడు అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు మరియు ఇప్పుడు ఏదైనా ప్రాప్తిని కలిగించమని అంటున్నారు. ఉపన్యాసంలో ఎంత శక్తి ఉండాలంటే ఆ ఒకొక్క మాట అనుభవం చేయించేదిగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, శరీరం కాదు మీరు అని చెప్తారు కదా! ఈ మాట చెప్పటంలో కూడా ఎంత శక్తి ఉండాలంటే మీ మాటల యొక్క శక్తితో వారు అనుభవం చేసుకోవాలి. ఒక్క సెకండు అయినా వారికి అనుభవం అయితే అనుభవం అయిన విషయాన్ని వారు ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆకర్షితం అయిపోయి మీ దగ్గరకి వచ్చేస్తారు. మీరు ఉపన్యాసం చెప్తున్నప్పుడు మధ్యమధ్యలో శాంతి అయిపోయి వారికి అనుభవం చేయిస్తారు కదా! ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. దానిని అనుభవంలోకి తీసుకువస్తూ వెళ్ళండి. ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం కలిగించాలనుకుంటే ఉపన్యాసంలో ఏవైతే పాయింట్స్ చెప్తూ ఉంటారో వాటిని చెప్తూ అనుభవంలోకి తీసుకురండి. నిజంగానే ఈ సృష్టి వినాశనం అయిపోనున్నది, దీనితో మనస్సు పెట్టడం వ్యర్ధం అని వారికి అనిపించాలి. అప్పుడు వారు తప్పక ధారణ చేస్తారు. పండితులు మొదలైనవారు మాట్లాడటంలో శక్తి ఉంటుంది. ఒక్క సెకండులో సంతోషం చేసేస్తారు మరియు ఒక్క సెకండులో ఏడిపిస్తారు. సభ అంతటినీ నవ్విస్తారు మరియు అందరినీ స్మశాన వైరాగ్యంలోకి కూడా తీసుకువెళ్ళిపోతారు. వారి ఉపన్యాసంలోనే అంటి శక్తి ఉందంటే మీ ఉపన్యాసంలో అంత శక్తి ఉండదా? అశరీరిగా తయారుచేయాలనుకుంటే ఆ అల వ్యాపించాలి... సభ అంతటిలో బాబా యొక్క స్నేహం కమ్ముకోవాలి. ప్రత్యక్షంగా అనుభవం చేయించటం అని దీనినే అంటారు. ఇప్పుడు ఇలాంటి ఉపన్యాసం చెప్పాలి, అప్పుడు కొంత పరివర్తన వస్తుంది. వీరి ఉపన్యాసం ప్రపంచానికి అతీతమైనది అని వారికి అనిపించాలి. వారు తమ ఉపన్యాసంలో సభ అంతటినీ నవ్విస్తారు. అంతేకానీ అశరీరి స్థితిని అనుభవం చేయించలేరు, తండ్రితో స్నేహాన్ని ఉత్పన్నం చేయించలేరు. వారికి తెలియనే తెలియదు. కనుక అతీత విషయం ఉండాలి. గీతాభగవంతుడి గురించి పాయింట్స్ చెప్తున్నారు. కానీ ఎంతవరకు వారికి తండ్రి ఎవరు, మేము ఆత్మలం మరియు ఆయన పరమాత్మ అని అనుభవం చేయించనంతవరకు ఈ విషయం ఎలా రుజువు అవుతుంది? ఇలాంటి ఉపన్యాసం చెప్పేవారు ఒకరు ఉండాలి, వారికి అనుభవం చేయించాలి - ఆత్మ మరియు పరమాత్మలో రాత్రిపగలుకి ఉన్నంత తేడా ఉందని. ఎప్పుడైతే ఆ తేడాని అనుభవం చేసుకుంటారో అప్పుడు గీతాభగవంతుడు ఎవరో రుజువు అవుతారు. కేవలం పాయింట్స్ చెప్పటం ద్వారా వారి బుద్ధిలో కూర్చోదు. వాటితో మరిన్ని అలలు (సంశయాలు) ఉత్పన్నం అవ్వటం మొదలవుతాయి. కానీ అనుభవం చేయిస్తూ వెళ్ళండి. ఆ అనుభవం ముందు ఏ విషయం గెలవలేదు. ఉపన్యాసంలో ఇప్పుడు ఈ పద్ధతిని పరివర్తన చేయండి. మంచిది.