01.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మాయాజీత్ మరియు ప్రకృతిజీత్ శక్తుల యొక్క గుర్తులు.

తెలివిలో లేని ఆత్మలను తెలివిలోకి తీసుకువచ్చే, మాయా మరియు ప్రకృతిపై విజయం పొందేటువంటి, ఆసురీ వృత్తులను సంహరం చేసే శివబాబా మాట్లాడుతున్నారు --

శక్తులు తమ శక్తి స్వరూపం, సదా శస్త్రధారి, సదా నిర్భయులు, సర్వ ఆసురీ సంస్కారాలను సంహరం చేసేవారు, ప్రకృతి మరియు మాయాజీత్ అయ్యేవారు ఇలా మీ స్వభావంలో సదా స్థితులై ఉంటున్నారా? శక్తుల స్మృతిచిహ్నం, మాయాజీత్ కు గుర్తు - శస్త్రాలు మరియు లైట్ కిరీటం, ప్రకృతిజీత్ కు గుర్తు - సింహంపై సవారి. ఈ పశు పక్ష్యాదులు ప్రకృతికి గుర్తు. ప్రకృతి యొక్క తత్వాలు కూడా శక్తి స్వరూపులను భయభీతం చేయలేవు. ప్రకృతిపై కూడా సవారీ అంటే అధికారి. ప్రకృతి కూడా వారికి దాసీ అయిపోతుంది అంటే వారిని సత్కరిస్తుంది. ఇలా సదా విజయీగా అయ్యారా? సదా సౌభాగ్యవంతుల గుర్తులు ఏవైతే మహిమ చేయబడుతున్నాయో సదా బాబా యొక్క తోడు మరియు వారికి సదా మస్తకంపై విజయీ తిలకం పెట్టబడి ఉంటుంది. స్మృతిలో ఉండటం అంటే తిలకం పెట్టుకోవటం. సదా నేను కల్ప,కల్పం విజయీ ఆత్మను ఇప్పుడే కాదు అనే ఈ స్మృతి సదా ఉండాలి. మొదట తెలివిలో ఉండేవారము కాదు. తెలివితక్కువ వారు అంటే స్వయం యొక్క తెలివి లేనివారు. నేనెవరు అనేది తెలియదు అంటే తెలివి తక్కువ వారమే కదా? ఇప్పుడు తెలివైనవారిగా అయ్యారు. తెలివైనవారు ఎప్పుడు బాబాని మర్చిపోరు. నేను సదా విజయీను ఇదే సదా స్మృతి ఉంచుకోండి.