పురుషార్థాన్ని తీవ్రం చేసుకునే యుక్తి - ఇప్పుడు
లేకున్నా మరెప్పుడూ లేదు.
ఆత్మిక సేవాధారి టీచర్స్ తో మధుర సంభాషణ చేస్తూ
చెప్పిన అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు.
టీచర్స్ ఏవిధంగా అయితే విశేష సేవార్టం నిమిత్తం అయిన
విశేష ఆత్మలో అదేవిధంగా పురుషార్థం కూడా ఉంటుందా లేక విద్యార్థుల పురుషార్థం వలె
మీ పురుషార్థం కూడా ఉంటుందా? పాత్రను అనుసరించి విశేష పురుషార్థం ఏమి
చేస్తున్నారు? సంపూర్ణంగా అవ్వాలి, సతో ప్రధానంగా అవ్వాలి - ఇది అయితే అందరి
లక్ష్యం, ఇది అయితే సాధారణం. కానీ టీచర్స్ యొక్క విశేష పురుషార్థం ఏమిటి? ఈ
రోజుల్లో చేయాల్సిన విశేష పురుషార్థం ఏమిటంటే - ప్రతి సంకల్పం శక్తిశాలిగా
ఉండాలి, సాధారణంగా ఉండకూడదు, సమర్థంగా ఉండాలి, వ్యర్ధంగా ఉండకూడదు, సేవ లేకుండా
ఉండకూడదు. టీచర్ అంటే అర్థం ఏమిటి? సేవాధారి. ఒక సెకండు కూడా సేవ లేకుండా
ఉండకూడదు. మురళి చదవటం, పరిశీలించుకోవటం, ఇది మామూలు విషయం. ఏవిధంగా అయితే సమయం
సమీపంగా వస్తూ ఉందో ఆవిధంగా నిమిత్తమైన విశేష ఆత్మలు కూడా చేయాల్సిన పురుషార్థం
ఏమిటంటే సమయం కంటే వేగంగా పరిగెత్తాలి. సమయం ఇంకా చాలా ఉంది, చేరుకోవచ్చులే
అనుకోకూడదు. కానీ "ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు” అనేది బుద్ధిలో
పెట్టుకోవాలి. ప్రతి సంకల్పం, ప్రతీ సెకను ఇదే సూక్తి (స్లోగన్) గుర్తుంచుకోవాలి.
ఎప్పుడైతే ఇప్పుడే అనే సంస్కారం వస్తుందో అంటే ఇప్పుడు అనేవారే సత్యయుగం ఆదిలోకి
వస్తారు. ఎప్పుడో అనేవారు మద్యలో వస్తారు. ఎప్పుడో అనే వారు సమయం కోసం ఎదురు
చూస్తారు. అందువలన పదవి కోసం కూడా ఎదురు చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి సెకను,
ప్రతి సంకల్పంలో ఇదే సూక్తి స్మృతిలో ఉంచుకోవాలి. ఈ పాఠం పక్కాగా అవ్వకపోతే సదా
బలహీన సంస్కారమే ఉండిపోతుంది. మహావీరుల సంస్కారం - ఇప్పుడు లేకున్నా మరెప్పుడు
లేదు. మా కన్నా ముందు నుండి వీరు ఉన్నారు. వీరు చేస్తే మేం చేస్తాం అనేది
నిర్లక్ష్యం యొక్క సంస్కారం. ఏ సంకల్పం వస్తుందో దానిని ఇప్పుడే చేయాలి. రేపు
కాదు, ఈ రోజు, ఈరోజు కాదు ఇప్పుడే చేయాలి.
అందరూ విశేష ఆత్మలే కదా? మిమ్మల్ని చిన్నవారిగా
భావించటం లేదు కదా? పురుషార్థంలో ప్రతీ ఒక్కరు పెద్దవారే. కార్యవ్యవహారాల్లో
చిన్నవారు, పెద్దవారు ఉంటారు. కానీ పురుషార్థంలో చిన్నా పెద్దా ఉండదు.
పురుషార్థంలో అయితే చిన్నవారైనా ముందుకు వెళ్ళవచ్చు. కార్యవ్యవహారంలో అయితే
మర్యాద యొక్క విషయం ఉంటుంది. పురుషార్థంలో మర్యాద అనే విషయం లేదు, పురుషార్థంలో
ఎవరు చేస్తే వారు పొందుతారు. ఇప్పుడు పరిశీలించుకోండి. ఇటువంటి పురుషార్థం ఉందా
లేక అందరు ఎలా నడుస్తున్నారో అలాగే సాధారణంగా నడుస్తున్నారా? టీచర్ సదా
హర్షితులే కదా? టీచరుకు అనేకుల ఆశీర్వాదాలు అనే సహాయం(లిఫ్ట్) కూడా లభిస్తుంది.
మరియు ఎవరైనా బలహీనం అవ్వటానికి నిమిత్తమైతే పాపం కూడా వస్తుంది. అర్థమైందా! ఆ
పాపభారం వలన ఏది చేయాలనుకుంటారో అది చేయలేరు. భారం ఉన్నవారు పైకి లేవలేరు.
అందువలన కావాలనుకుంటున్నా మారలేకపోతున్నారంటే తప్పకుండా భారం ఉన్నట్లే. ఆ
భారాన్ని భస్మం చేస్కోండి - విశేష యోగంతో, మర్యాదలతో మరియు సంలగ్నతతో. లేకపోతే
ఆ భారంతోనే సమయం గడిచిపోతుంది, ముందుకి వెళ్ళలేరు. అమృతవేళ లేచి మీ స్థితిని
తయారుచేసుకోండి. ఏ స్థితి ఉంటే దాని ప్రమాణంగా స్థితులవ్వగలుగుతున్నారా? ఇది
పరిశీలించుకోండి. మీ స్థితిని సరి చేసుకోండి. ఒకవేళ సరిగా లేకపోతే
పరిశీలించుకోవటం ద్వారా సరి అయిపోతుంది. మంచిది.
ఈ మురళీ యొక్క సారం -
1. ఈరోజుల్లో ఇదే విశేష పురుషార్థం ఉండాలి. ప్రతీ
సంకల్పం శక్తిశాలిగా ఉండాలి. సాధారణంగా ఉండకూడదు. సమర్థంగా ఉండాలి. వ్యర్ధంగా
కాదు. ఏ సంకల్పం వస్తే అది అప్పుడే చేయాలి. రేపు కాదు, ఈరోజే. ఈరోజు కాదు,
ఇప్పుడే అంటే ఇప్పుడే చేయాలి.