ఎటువంటి లక్ష్యమో అటువంటి లక్షణాలు.
సదా జన్మ సిద్ద అధికారం యొక్క నషాలో ఉండేటటువంటి,
ఈశ్వరీయ నషాలో నిమగ్నమై ఉండేటటువంటి, లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా
చేసుకునేటువంటి, సర్వులను అన్ని అలజడుల నుండి తొలగించేటువంటి పిల్లలతో బాప్ దాదా
మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క మస్తకం మరియు నయనాల ద్వారా విశేషంగా ఒక విషయం
చూస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష్యం మరియు లక్షణాలకు ఎంత సమీపంగా ఉన్నారు అని.
లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా ప్రత్యక్ష రూపంతో ఎంత వరకు కనిపిస్తున్నాయి అని.
లక్ష్యం అందరికి చాలా ఉన్నతంగానే ఉంది. కానీ లక్షణాలు ధారణ చేయటంలో మూడు రకాలైన
పురుషార్థీలు ఉన్నారు. వారు ఎవరు?
1. వీరికి వినటం మంచిగా అనిపిస్తుంది.
చేయాలనుకుంటున్నారు కానీ వినటం వస్తుంది, చేయటం రావటం లేదు.
2. వీరు ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు కూడా,
చేస్తున్నారు కూడా కానీ శక్తి స్వరూపంగా లేని కారణంగా రెండు పాత్రలు
అభినయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులుగా, తీవ్రపురుషార్థులుగా మరలా
ఇప్పుడిప్పుడే ధైర్యహీనులుగా అయిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? పంచవికారాలు
మరియు ప్రకృతి యొక్క తత్వాలు రెండింటిలో ఏదో ఒక దానికి వశీభూతమైపోతున్నారు.
అందువలన లక్ష్యం మరియు లక్షణాలలో తేడా వచ్చేస్తుంది. కోరిక ఉంది కానీ కోరిక అంటే
ఏమిటో తెలియని వారిగా అయ్యే శక్తి లేదు. అందువలన తమ లక్ష్యం అనే కోరిక వరకు
చేరుకోలేకపోతున్నారు.
3. వీరు వినటం, ఆలోచించటం, చేయటం మూడూ సమానంగా చేస్తూ నడుస్తున్నారు. ఇటువంటి
ఆత్మలలో లక్ష్యం, లక్షణాలు 99 శాతం సమానంగా కనిపిస్తున్నాయి. ఇలా మూడు రకాలైన
పురుషార్థీ పిల్లలను చూస్తున్నారు.
వర్తమాన సమయంలో ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మల యొక్క
సంకల్పం మరియు మాట లక్ష్యానికి నిదర్శనంగా ఉందా? అని పరిశీలించుకోండి. లక్ష్యం
ప్రమాణంగా సంకల్పం మరియు మాట ఉందా? అని. లక్ష్యం - ఫరిస్తా నుండి దేవతగా అవ్వటం.
ఎలాగైతే లౌకిక కుటుంబం మరియు వృత్తిని అనుసరించి నా సంకల్పం, మాట, కర్మ ఆవిధంగా
ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటారో అలాగే బ్రాహ్మణాత్మలైన మీరు కూడా మీ
ఉన్నతోన్నతమైన కుటుంబాన్ని మరియు వృత్తిని ఎదురుగా ఉంచుకుని నడుస్తున్నారా?
వర్తమానం యొక్క మరజీవ బ్రాహ్మణ జన్మ సహజంగా స్మృతిలో ఉంటుందా లేక భూతకాలం యొక్క
శూద్ర లక్షణాలు సహజంగా పాత్ర అభినయిస్తున్నాయా? ఎటువంటి జన్మ ఉంటే అటువంటి కర్మ
ఉంటుంది. శ్రేష్ట జన్మ యొక్క కర్మ కూడా స్వతహాగానే శ్రేష్టంగానే ఉండాలి. ఒకవేళ
కష్టం అనిపిస్తుంది అంటే బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతి తక్కువగా ఉన్నట్లే.
వాస్తవానికి శ్రేష్ట కర్మ, శ్రేష్ట లక్ష్యం అనేది మీ శ్రేష్ట జన్మ యొక్క
జన్మసిద్ధ అధికారం. ఎలాగైతే లౌకిక జన్మలో స్థూల ధనం జన్మ సిద్ధాధికారంగా
లభిస్తుందో అలాగే బ్రాహ్మణ జన్మ యొక్క దివ్యగుణాల రూపి సంపద, ఈశ్వరీయ సుఖం,
శక్తి మీకు జన్మ సిద్ద అధికారం. జన్మ సిద్దాధికారం యొక్క నషా స్వతహాగానే ఉంటుంది.
శ్రమ చేయవలసిన అవసరమే లేదు. ఒకవేళ శ్రమ అనిపిస్తుంది అంటే మీ సంబంధంలో ఎక్కడో
లోపం ఉంది. అందువలన మిమ్మల్ని మీరు అడగండి జన్మ సిద్ధాధికారం యొక్క నషా ఉంటుందా?
ఈ నషాలో ఉండటం ద్వారానే లక్ష్యం మరియు లక్షణాలు సమానం అవుతాయి. మనం శ్రమ నుండి
ముక్తిని పొందాలంటే సహజమైన యుక్తి ఏమిటి? స్వయాన్ని ఎవరు, ఎలాంటి వారు? ఏ
శ్రేష్ట తండ్రి మరియు ఏ కుటుంబంలోని వారము అనేది తెలుసుకుంటున్నారు. కానీ ప్రతి
సమయం అంగీకరించటం లేదు. మీ అదృష్టం యొక్క చిత్రాన్ని చూసుకోవటం లేదు. ఒకవేళ సదా
మీ అదృష్టం యొక్క చిత్రాన్ని చూసుకుంటూ ఉంటే ఎలాగైతే సాకార శరీరాన్ని చూస్తూ
ఉంటే దేహ స్మృతి స్వతహాగానే ఉంటుందో అలాగే స్వతహాగానే అదృష్టం యొక్క చిత్రం
స్మృతి ఉంటుంది. నడుస్తూ, తిరుగుతూ ఓహో బాబా! ఓహో నా అదృష్టం యొక్క చిత్రం! ఇలా
మనస్సులో ఈ మాట యొక్క జపం చేస్తూ ఉండాలి. ఎలా అయితే భక్తులు అనంతమైన మాట
వినడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా! మీ స్థితి యొక్క మహిమే భక్తిలో అలా
నడుస్తూ వస్తుంది. మీరు కల్పపూర్వం సదా సంతోషంతో నాట్యం చేసిన చిత్రాన్నే
రాసలీల యొక్క చిత్రం అని అంటారు. ప్రతి గోపిక, గోపికుడు గోపీ వల్లభునితో నాట్యం
చేస్తున్నట్లు చూపిస్తారు. అంటే మీరు సంతోషంతో నాట్యం చేస్తున్న దానికి
స్మృతిచిహ్నం. మీ ప్రత్యక్ష చరిత్రకు చిత్రం తయారయ్యింది. ఇలా మీ ప్రత్యక్ష
స్వరూపం యొక్క చిత్రం సదా కనిపిస్తుందా? ఇది నా చిత్రమే అని అనుభవం
చేసుకుంటున్నారా?దీనినే అదృష్టం యొక్క చిత్రం అని అంటారు. రోజూ మీ అదృష్టం
యొక్క చిత్రాన్ని చూసుకుంటూ ప్రతి కర్మ చేస్తే శ్రమ నుండి ముక్తి అయ్యి, జన్మ
సిద్ధాధికారం యొక్క సంతోషాన్ని అనుభవం చేసుకోగలరు.
ఇప్పుడు ఇక శ్రమ చేసే సమయం కాదు, స్మృతి స్వరూపంగా
అవ్వాలి. తెలుసుకోవలసింది తెలుసుకున్నాము, పొందవలసింది అంతా పొందాము అని ఇలా
అనుభవం చేసుకుంటున్నారా? బాప్ దాదా ప్రతి ఒక్కరి అదృష్ట చిత్రాన్ని చూసి
హర్షిస్తున్నారు. అలాగే తతత్వం బాప్ దాదాకు విశేషంగా ఒక విషయం చూసి ఆశ్చర్యం
కలుగుతుంది. మాస్టర్ సర్వశక్తివంతులు, శ్రేష్ట అదృష్టవంతులు చిన్న చిన్న
అలజడులలో ఎలా అలజడి అయిపోతున్నారు అని. పులి చీమతో భయపడినట్లుగా. చీమను ఏం చేయను,
ఎలా చంపాలి అని. పులి అంటే అది సంభవ విషయంగా అనిపిస్తుందా లేక అసంభవం
అనిపిస్తుందా? అదేవిధంగా మాస్టర్ సర్వశక్తివంతులు చిన్న అలజడులలో అలజడి అయిపోతే
బాబాకి సంభవ విషయంగా అనిపిస్తుందా లేక ఆశ్చర్యం అనిపిస్తుందా? అందువలన ఇప్పుడు
చిన్న చిన్న అలజడులకు భయపడే సమయం కాదు. ఇప్పుడు అలజడులలో ఉన్న వారిని బయటకి తీసే
సమయం. ఇవి చిన్నతనం యొక్క విషయాలు. మాస్టర్ రచయితలకు ఈ చిన్నతనం యొక్క విషయాలు
శోభించవు. అందువలనే సదా ఉత్సాహ ఉల్లాసాలలో నాట్యం చేస్తూ ఉండండి అని చెప్పారు.
సదా ఓహో నా భాగ్యం! ఓహో భాగ్య విధాత! అనే సూక్ష్మ మనస్సు యొక్క మాట వింటూ ఉండండి.
నాట్యం చేయటానికి పాట కావాలి కదా! ఈ అనాది మనస్సు యొక్క మాట వింటూ ఉండండి,
సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి.
ఈవిధంగా సదా జన్మ సిద్ద అధికారం యొక్క నషాలో
ఉండేవారికి, సదా ఈశ్వరీయ సంలగ్నతలో ఉండేవారికి, శ్రమ నుండి ముక్తి అయ్యేవారికి,
లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉంచుకునేవారికి, సర్వులను అలజడుల నుండి బయటకి
తీసేవారికి, అటువంటి శ్రేష్ట అదృష్టవంతులకు, పదమాపదమ్ భాగ్యశాలి పిల్లలకు
ప్రియస్మృతులు మరియు నమస్తే.