సంతుష్ట ఆత్మయే అనేకాత్మలకు ఇష్టంగా అవుతుంది.
సర్వ శక్తులతో సంపన్నంగా, శ్రేష్ట కర్మ చేయటం
నేర్పించే వారు, దృష్టి ద్వారా అద్భుతం చేసే శివబాబా మాట్లాడుతున్నారు -
వరదాత బాబా ద్వారా సర్వ వరదానాలను పొంది బాబా సమానంగా
వరదాన మూర్తిగా అయ్యారా? 1. జ్ఞాన రత్నాల మహాదానం 2. బలహీన ఆత్మలకు మీ శుభ
సంకల్పం లేదా శుభభావన ద్వారా సర్వశక్తివంతుని ద్వారా లభించిన శక్తుల యొక్క
వరదానం. జ్ఞానధనాన్ని దానం చేయటం ద్వారా ఆత్మ స్వయం కూడా జ్ఞాన స్వరూపంగా
అవుతుంది కానీ ఎవరైతే బలహీన ఆత్మలు జ్ఞానాన్ని ధారణ చేయలేరో, జ్ఞానీ ఆత్మలుగా
అవ్వలేరో, స్వ పురుషార్థం ద్వారా శ్రేష్ట ప్రాలబ్ధం తయారుచేసుకోలేరో ఇలా కేవలం
స్నేహం, సహయోగం, సంపర్కం, భావనలో ఉండె ఆత్మలు వరదానీమూర్తులైన మీ ద్వారా వరదాన
రూపంలో ఏదో ఒక విశేష శక్తిని పొంది ఆ కొద్ది ప్రాప్తిలోనే స్వయాన్ని భాగ్యశాలిగా
అనుభవం చేసుకుంటారు. వీరిని ప్రజా పదవి పొంగే ఆత్మలు అని అంటారు. ఇటువంటి ఆత్మలు
డైరెక్ట్ యోగం ద్వారా లేదా స్వయం యొక్క ధారణల ద్వారా బాప్ దాదా ద్వారా
సర్వశక్తుల యొక్క ప్రాప్తిని పొందలేరు కానీ ప్రాప్తించుకున్న ఆత్మల ద్వారా, ఆ
ఆత్మల సహయోగం ద్వారా ఎంతో కొంత వరదానం పొందుతారు.
శక్తులను విశేషంగా వరదాని రూపంలో పిలుస్తారు. కనుక
ఇప్పుడు అంతిమ సమయంలో మహాదాని రూపం కంటే ఎక్కువగా వరదాని రూపంలో సేవ జరుగుతుంది.
ఆ సమయంలో స్వయం యొక్క అంతిమ స్థితి శక్తివంతంగా ఉన్న కారణంగా, సంపన్నంగా ఉన్న
కారణంగా ప్రజా ఆత్మలు తక్కువ సమయంలో తక్కువ ప్రాప్తిలోనే చాలా సంతోషం అయిపోతారు.
స్వయం సంతుష్ట స్థితిలో ఉన్న కారణంగా ఆ ఆత్మలు కూడా త్వరగా సంతుష్టం అయిపోతారు
మరియు సంతోషంతో మాటిమాటికి ఆ మహాన్ ఆత్మల గుణగానం చేస్తూ ఉంటారు. అద్భుతం అనే
మాట నలువైపుల నుండి అనేకాత్మల నోటి నుండి వస్తుంది. బాబాకి ధన్యవాదాలు మరియు
నిమిత్తమైన ఆత్మలకి కూడా ధన్యవాదాలు అంటూ ఇదే పాటల రూపంలో నలువైపుల
ప్రతిధ్వనిస్తుంది. మీ ద్వారా ప్రాప్తి పొందిన కారణంగా ప్రతి ఒక ఆత్మ తన
మనస్సుతో మహిమ అనే పూల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి వరదాని మూర్తిగా
అయ్యేటందుకు విశేషంగా ఒక విషయంపై ధ్యాస పెట్టాలి. సదా స్వయంతో మరియు సర్వులతో
సంతుష్టంగా ఉన్న ఆత్మయే అనేక ఆత్మలకి ఇష్టంగా అవుతుంది మరియు అష్టదేవతగా
అవుతుంది. అన్నింటికంటే ఉన్నతోన్నతమైన గుణం, దానం, వరదానం, శ్రేష్టత ఏదైనా కానీ
అది సంతుష్టతయే. సంతుష్ట ఆత్మయే ప్రభు ప్రియంగా, లోకానికి ప్రియంగా, స్వయానికి
ప్రియంగా అవుతుంది. సంతుష్ట ఆత్మని ఈ మూడు విషయాల ద్వారా పరిశీలించగలము. అటువంటి
సంతుష్ట ఆత్మయే వరదాని రూపంలో ప్రసిద్ధి అవుతుంది. అందువలన స్వయాన్ని
పరిశీలించుకోండి - ఎంత వరకు సంతుష్ట ఆత్మ నుండి వరదాని ఆత్మగా అయ్యాను? అని.
అర్ధమైందా? మంచిది.
ఈవిధంగా విశ్వకళ్యాణకారి, మహావరదాని, ఒక సెకనులో
సంకల్పం ద్వారా అనుభవం చేయించేవారికి, తపించే ఆత్మలకు సర్వశక్తుల యొక్క
ప్రసాదాన్ని ఇచ్చి ప్రసన్నం చేసేవారికి, సాక్షాత్కారమూర్తులకు, దర్శనీయమూర్తులకు,
సంపన్నం మరియు సమానమూర్తులకు, సర్వుల శ్రేష్టభావనలు, శ్రేష్టకామనలు పూర్తి చేసే
ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.