"భక్తులకు సర్వప్రాప్తులను కలిగించే ఆధారం -
ఇచ్చామాత్రం అవిద్య
(కోరిక యొక్క జ్ఞానము కూడా లేని స్థితి )"
మీరు స్వయాన్ని ఉన్నతోన్నతమైన అథారిటీగా
భావిస్తున్నారా! మీ పవిత్రత యొక్క పర్సనాలిటీని గూర్చి మీకు తెలుసా! మీ అవినాశి
ఆస్తిని బాబా ద్వారా పొంది సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ పురాతన
ప్రపంచంలో అల్పకాలికమైన హద్దులోని చదువు మరియు హద్దులోని పొజిషన్ ను అథారిటీగా
భావిస్తారు. వారి ముందు అందరి యొక్క ఆల్ మైటీ అథారిటీ అనంతమైనది మరియు అవినాశి
అయినది. ఇటువంటి అథారిటీలో సదా స్థితులై ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నారా? బాప్
దాదా పిల్లలందరిని అనంతమైన యజమానులుగా తయారుచేస్తారు. అనంతమైన అధికారంలో
అనంతమైన సంతోషముంటుంది. మీ సంతోషము యొక్క ఖజానాలను గూర్చి మీకు తెల్సుకదా! బాబా
పిల్లల యొక్క భాగ్యరేఖలను చూస్తూ, శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేసుకునేవారు
కోట్లాదిమందిలో ఏ ఒక్కరో ఉన్నారు, ఆ కొద్దిమందిలోను చాల తక్కువ ఆత్మలున్నారు అని
ఎంతో హర్షిస్తున్నారు.
బాబా పిల్లలను చూసి ఎక్కువగా హర్షిస్తున్నారా! లేక
పిల్లలు తమ భాగ్యాన్ని చూసి ఎక్కువగా హర్షిస్తున్నారా! ఎవరు ఎక్కువగా
హర్షితమవుతున్నారు? మీరు ఎటువంటి శ్రేష్ఠ ఆత్మలంటే మీ ప్రతి కర్మ చరిత్ర రూపంలో
గణం చేయబడుతుంది. చరిత్రకు ఇప్పటివరకు కూడా పూజ జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు
భక్తులు దర్శనీయ ముర్తులైన మీ యొక్క క్షణపు దర్శనము కొరకు తపిస్తున్నారు.
ఇటువంటి భక్తుల యొక్క తపనను అనుభవం చేసుకుంటున్నారా? భక్తులను ప్రసన్నం
చేసుకునేందుకు హృదయంలో దయ మరియు కళ్యాణం యొక్క శుభభావన ఉత్పన్నమవుతుందా?
భక్తులను ప్రసన్నం చేసే సాధనం ఏంటో మీకు తెలుసా? భక్తులకు దేవతలైన మీ ద్వారా ఏమి
పొందాలనే కోరిక ఉందొ మీకు తెలుసు కదా! భక్తులు సర్వప్రాప్తులను పొందేందుకు ఆధారం
భక్తి యొక్క భావనయే. అలాగే భక్తులకు సర్వప్రాప్తులను కలిగించే ఆధారం -
ఇచ్చామాత్రం అవిద్య (కోరిక యొక్క జ్ఞానము కూడా లేని స్థితి).. ఎప్పుడు స్వయం ఆ
స్థితిలో ఉంటారో అప్పుడు ఇతర ఆత్మల యొక్క కోరికలన్నిటిని పూర్తి చేయగలుగుతారు.
ఇచ్చామాత్రం అవిద్య అనగా సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి. ఇప్పటివరకైతే మాస్టర్
బీజరుపులుగా అవ్వరో అప్పటివరకు బీజము లేకుండా ఆకులకు ఏ ప్రాప్తి లభింపజాలదు.
వాడిపోయిన అనేక భక్త ఆత్మల రూపీ ఆకులకు మల్లి మీ క్యూ నిల్చుంటుంది. అలాగే మీకు
చైతన్యంలో మీకు మీ భక్తుల యొక్క క్యూ అనుభవం అవుతుందా? ఇప్పటి వరకు ఇంకా భక్తుల
యొక్క పిలుపులను వినడం మీకు నచ్చుతుందా? బాప్ దాదా విశ్వము యొక్క విహారం
చేసినపుడు భక్తులు భ్రమించడం, పిలవడం చూసినప్పుడు, వినినప్పుడు ఎంతో దయ
కలుగుతుంది. మరి బాప్ దాదాయే సాక్షాత్కారం చేయించి భక్తుల యొక్క కోరికను పూర్ణం
చేయవచ్చు కదా అని మీరంటారు. ఇలా భావిస్తున్నారా? కానీ డ్రామాలో పేరు పిల్లలది
ఉంది, పని తండ్రివి ఉంది. కావున పిల్లలు నిమిత్తం అవ్వవలిసిందే. విశ్వాధిపతులుగా
పిల్లలు అవుతారా లేదా లేదా బాబా అవుతారా?ప్రజలు మీకు తయారవుతారా లేదా బాబాకు
తయారవుతారా? కావున ఎవరైతే పూజ్యులు ఉంటారో వారికే ప్రజలు తయారవుతారు. వారికే
మళ్ళీ తర్వాత భక్తులు తయారవుతారు .కావున మీ ప్రజలకు లేక మీ భక్తులకు ఇప్పుడు
కూడా నిమిత్తంగా శాంతి లేక శక్తుల యొక్క వరదానాలను ఇవ్వండి. ఏ విధంగా బాబా
పిల్లల ముందు ప్రత్యక్షమయ్యారో అలాగే ఇప్పుడు ఇష్టదేవత లైన మీరు కూడా మీ భక్తుల
ముందు ప్రత్యక్షమవ్వండి. దేవత లేదా దేవి అనగా ఇచ్చేవారు.కావున విధాత యొక్క
పిల్లలైన మీరు విధాతలుగా అవ్వండి. మీ ప్రకాశ కిరీటము కనిపిస్తోందా? రత్నజడిత
కిరీటము ఈ ప్రకాశ కిరీటము ముందు పెద్ద విషయమేమీ కాదు. ఎంతగా సంకల్పం మరియు
కర్మలలో పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో అంతంతగా ఈ ప్రకాష కిరీటము స్పష్టమవుతూ
ఉంటుంది. బాప్ దాదా కూడా పిల్లలందరి యొక్క నెంబర్వారిగా ఉన్నకిరీటాన్ని చూస్తారు.
భవిష్యత్తులో రాజ్యకిరీటాలు ఏ విధంగా నంబర్ వారీగా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా
నెంబరు వారీగా ఉన్నాయి. మరి మీ నెంబరును గూర్చి మీకు తెలుసా? అది చిన్న కిరీటమా
లేక పెద్ద కిరీటమా? కిరీటం ఐతే అందరిపైనా ఉంది. ఎప్పుడైతే బాబా పిల్లలుగా
అయ్యారో, పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేపట్టారో అప్పుడు దానికి ప్రతిఫలంగా కిరీటము
ప్రాప్తమయ్యే ఉంటుంది. ఆల్మైటీ అథారిటీ యొక్క పిల్లలుగా అవ్వడము ద్వారా అనగా
అలౌకిక జన్మ తీసుకోవడంతోనే కిరీటము, సింహాసనం, తిలకము జన్మసిద్ధ అధికార రూపంలో
ప్రాప్తమవుతుంది. ఇటువంటి మీ భాగ్యము యొక్క ప్రకాశిస్తున్న సితారను చూసుకున్నారా!
సదా మీ భాగ్యమును మరియు భాగ్యవిధాత యొక్క గుణములను గానం చేస్తూ ఉంటే గుణ
సంపన్నులుగా స్వతహాగా అయ్యి తీరుతారు. మీ బలహీనతల యొక్క గుణాలను గానం చేయకండి.
భాగ్యము యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి. ప్రశ్నల నుండి అతీతంగా
ప్రసన్నచిత్తులుగా ఉండండి. ఇప్పటివరకైతే స్వయం కొరకు ఏదో ఒక ప్రశ్న ఎలా చేయాలి?
ఏం చేయాలి? అనేది ఉంటాయో అప్పటి వరకు ఇతరులను ప్రసన్నం చేయలేరు. అర్థమైందా!
ఇప్పుడు మీ గురించి ఆలోచించకండి. భక్తులను గూర్చి ఎక్కువగా ఆలోచించండి. ఇప్పుడు
తీసుకోవడం గురించి ఆలోచించక, ఇవ్వడం గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇప్పుడు ఏ
కోరికలను మీ గూర్చి ఉంచుకోకండి, ఆత్మలందరి యొక్క కోరికలను పూర్ణం చేసేందుకు
ఆలోచించండి. అప్పుడు స్వయం స్వతహాగానే సంపన్నమైపోతారు. అచ్ఛా! ఇటువంటి బాబా
సమానమైన సదా సాక్షాత్కారమూర్తులకు సర్వాత్మల యొక్క కామనలను సంపన్నం చేసే, సదా
అథారిటీ యొక్క స్థితిలో పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండేవారికి, సదా మీ భాగ్యము
యొక్క గుణగానము చేసేవారికి, దాత సమానంగా సదా దానమిచ్చే మహాదానులకు,
సర్వవరదానాలతో సంపన్నమైన వరదాతలకు, ఇటువంటి మహాన్ ఆత్మలకు బాప్ దాదాల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో అవ్యక్త బాప్ దాదా
టీచర్లను చూసి బాప్ దాదాకు విశేషమైన సంతోషము కలుగుతుంది. ఎందుకో మీకు తెలుసా?
బాబా సమానంగా వారు శిక్షకులు కదా! ఏ విధంగా బాబా విశ్వం యొక్క శిక్షకులో,
సేవకులో అలాగే టీచర్లు కూడా శిక్షకులు మరియు సేవకులు. కావున సమానమైన వారిని చూసి
సంతోషం కలుగుతుంది కదా! శిక్షకుని స్థితిలో సమానంగా ఉన్నారు, సేవ తప్ప ఇంకే
విషయము ఆకర్షించ కూడదు. రాత్రింబవళ్లు సేవలోనే నిమగ్నమై ఉండండి. సేవ నుండి ఫ్రీ
గా ఉన్నట్లయితే ఇతర విషయాలు కూడా వచ్చేస్తాయి. ఖాళీ ఇంట్లోనే తేళ్లు,జెర్రులు
వస్తాయి. ఖాళీ ఇంట్లో అయినా లేక పాత ఇంట్లో అయినా అవి వస్తాయి. ఇక్కడ కూడా అలాగే
జరుగుతుంది. బుద్ధి ఖాళీగా అయినా ఉంటుంది లేక పురాతన సంస్కారాలను కలిగి అయినా
ఉంటుంది. అప్పుడు వ్యర్థ సంకల్పం రూపీ తేళ్లు,జెర్రులు జన్మిస్తాయి.
1) టీచర్ అనగా సదా బిజీగా ఉండేవారు, ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. సంకల్పము,
వాక్కు మరియు కర్మలలో కూడా ఫ్రీ గా ఉండేవారు కాదు.
2) టీచర్ యొక్క అర్థమే బాబా సమానంగా లేక బాబాకు సమీపంగా విజయమాలలో మణులుగా
ఉండేవారు. విజయమాలలోని మణిగా అవ్వడమే టీచర్ యొక్క లక్షణం కదా.
3) టీచర్ అనగా కాసేపు ఓటమి కాసేపు గెలుపులలోకి వచ్చేవారు కాదు. సదా విజయులుగా
ఉండేవారు.
4) టీచర్ అనగా సదా తిలకధారులు,సదా సౌభాగ్యవతులు,సుమంగళులు .తిలకము సుమంగళికి
గుర్తు కదా! కావున సదా సుమంగళులు అనగా బాబాను సదా తోడుగా చేసుకొనేవారు.
సౌభాగ్యవతి అనగా తిలకము కలవారు.
టీచరు యొక్క స్థానము హృదయ సింహాసనము. స్థానాన్ని
వదిలితే ఇతరులు తీసేసుకుంటారు. టీచరు యొక్క స్థానము బాబా యొక్క హృదయ సింహాసనము.
ఆసనాన్ని వదిలిస్తే త్యాగము,తపస్సు సమాప్తమైపోతాయి. కావున ఈ ఆసనాన్ని ఎప్పుడు
వదలకూడదు.
స్థానాన్ని తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. నేను
టీచర్ కన్నా ముందు వెళ్ళాలి అనే ఉల్లాస ఉత్సాహాలు అందరికి ఉన్నాయి. టీచర్లు
వారికన్నా ముందుకు వెళ్ళాలి. అప్పుడే హృదయ సింహాసనఅధికారులుగా అవుతారు. టీచర్లకు
చిన్న ప్రపంచమే ఉన్నది కదా!టీచర్ కి ఒక్క బాబాయే ప్రపంచము. మాత-పిత,బంధు-సఖ అంతా
వారే. ప్రపంచంలో ఏముంటాయి? సర్వ సంబంధాలు మరియు వైభవాలు ఉంటాయి. ఇక్కడ సర్వ
సంబంధాల యొక్క ప్రాప్తులు ఒక్క బాబా నుండే లభిస్తాయి. నిజానికిది చిన్నని
ప్రపంచమే కానీ ఇది సంపన్నమైంది మరియు సర్వ శక్తివంతమైనది. ఈ చిన్నని ప్రపంచంలో
ఆప్రాప్తి అనే వస్తువే లేదు. సర్వ సంబంధాలు బాబాతోనే ఉన్నాయి. తండ్రి యొక్క
సంబంధముండి తల్లిది లేకుండా, తల్లి సంబంధముండి బంధువుల సంబంధము లేకుండా ఇక్కడ
ఉండదు. బాబాతో ఒక్క సంబంధము యొక్క ప్రాప్తి ఉండకపోయినా బుడ్డి ఇతరవైపులకు
తప్పకుండ వెళుతుంది. బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభవము కలగాలి. లేకపోతె ఇతర
సంబంధాలు తమ వైపుకు లాక్కుంటాయి. మొత్తం ప్రపంచమే ఒక్క బాబా అయినపుడు మరి
అన్నిరూపాలుగాను ఉన్నట్లే కదా! అటువంటివారిని నంబర్ వన్ టీచర్, యోగ్య టీచర్,
ప్రసిద్ధమైన టీచర్ అని అంటారు. బాబా సదా ఉన్నతమైన దృష్టితో చూస్తారు. బాబా
లోపాలను చూసినట్లయితే ఆ లోపానికి సదా కాలము కొరకు అండర్ లైన్ పడుతుంది. బాబా
భాగ్యవిధాత కదా! కావున వారు సదా శ్రేష్టమైన దృష్టితోనే చూస్తారు. శ్రేష్ఠత ముందు
బలహీనత తనకు తానే మనస్సును తింటుంది. శ్రేష్టమైన విషయాలను వినడం ద్వారా బలహీనతలు
స్పష్టమైపోతాయి. కావున బాబా ఎల్లప్పుడూ శ్రేష్ఠత యొక్క వర్ణన చేస్తారు. దాని
ద్వారా బలహీనతలు స్వతహాగానే కనిపిస్తాయి. బలహీనతలను చూసినట్లయితే అవి చాల
పెద్దవిగా వేదశాస్త్రాల యొక్క గనులుగా అయిపోతాయి. టీచర్లందరూ విశేషంగా ఒక
విషయంపై ధ్యానముంచాలి. ఎప్పుడూ,ఎవరిపైనా రాయల్ రూపంలో మోహము ఉండకూడదు. ఏ ఆత్మ
యొక్క గుణము వైపైనా, సేవ, సహయోగము వైపైనా, బుద్దీ వైపైనా, ప్లానింగ్ వైపైనా
మోహము(ఆకర్షణ) ఉండకూడదు. వారినే మీ ఆధారంగా చేసుకోవడం వాళ్ళ అటువైపుకు వంగవల్సి
వస్తుంది. ఎప్పుడైనా ఏ ఆత్మ యొక్క ఆధారమైనా ఏర్పడినపుడు బాబా యొక్క ఆధారము
స్వతహాగానే తొలగిపోతుంది మరియు ముందు, ముందు ఎప్పుడైతే ఆ అల్పకాలిక ఆధారము
కదిలిపోతుందో అపుడు భ్రమిస్తారు. కావున ఏ ఆత్మ యొక్క విశేష ప్రభావము యొక్క
కారణంగా ప్రభావితులవ్వడం ఒక మహా పొరపాటు. అది కేవలం పొరపాటు కాదు,చాల పెద్ద
పొరపాటు. సేవ వృద్దినొండుతుంది అని సంతోషపడిపోకండి, అది అల్పకాలికమైన ఆవేశం
వంటిది. పునాది కదిలిందంటే సేవ కూడా కదులుతుంది. కావున ఎప్పుడూ ఏ ఆత్మను ఆధారంగా
చేసుకోకండి. దానివల్ల సేవ వృద్దినొందదు. అది స్వచ్ఛమైన ఆత్మను నల్లగా
చేసేస్తుంది. ఇది అతి పెద్ద మచ్చ. ఏ ఆత్మనైనా ఆధారముగా చేసుకోవడం అన్నింటికన్నా
పెద్ద మచ్చ. దానివల్ల మచ్చలేని వారీగా అవ్వలేరు. అయినా ఎంతగానో కష్టపడుతున్నారు,
ఆ శ్రమకు బాప్ దాదా అభినందనలు అందజేస్తున్నారు. శాస్త్రాల యొక్క కథలు కూడా ఎన్నో
ఉంటాయి కానీ వాటికీ పునాది ఏది ఉండదని బాబా వినిపించారు కదా! కావున మొదటే
వినిపించారు, టీచర్ అనగా సేవలో సదా బిజీగా ఉండేవారు. సంకల్పములో కూడా బాబాతో
పాటు బిజీగా ఉన్నట్లయితే ఏ ఇతర ఆత్మలోను బిజీ అవ్వరు. ఎవరైతే బిజీగా ఉంటారో వారు
దేనికి వశమవ్వరు. ఫ్రీ అయినా తర్వాతనే మనోరంజన్ యొక్క సాధనాల వైపుకు,
స్నేహము,సహయోగము వైపుకు ఆకర్షణ కలుగుతుంది. ఎవరైతే బిజీగా ఉంటారో వారికీ ఈ
విషయాల కొరకు ఖాళీయే ఉండదు. బాప్ దాదా టీచర్లను చూసి చాలా సంతోషిస్తారు. ధైర్యము,
ఉల్లాస ఉత్సాహాలైతే చాల బాగున్నాయి. అడుగులు ముందుకు వేస్తున్నారు కానీ మీ
కార్యాల యొక్క కథలను శాస్త్రాలుగా చేయకండి. కర్మల యొక్క రేఖల ద్వారా శ్రేష్ఠమైన
భాగ్యాన్ని తయారుచేసుకోండి. జన్మ మరియు కథ కూడా తలక్రిందులుగా ఉండే కథలను
తయారుచేయకండి. స్టూడెంట్లను చదివించండి మరియు అలాగే స్వయమును చదువించుకోండి.
టీచర్లతో ఆత్మిక సంభాషణ చేయడం బాబాకు ఏంటో నచుతుంది.
ఫాలో చేసే వారితో మరియు సమానంగా అయ్యేవారితో చాల స్నేహముంటుంది కదా! ఎవరిపైనైతే
స్నేహముంటుందో వారి చిన్న బలహీనత కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కావున బాబా
అప్రమత్తం చేస్తున్నారు. మేము ఎంత సమీపముగా ఉన్నాము అన్నది చూసుకోవాలనుకుంటే
అమృతవేళ దర్పణము చాలా స్పష్టముగా ఉంటుంది. టీచర్లు సమాధానమిచ్చేవారిగా అయ్యారు
కదా! తీసుకునేవారిగా అయితే లేరు కదా! మీరు సంతోషంగా, రాజీగా ఉన్నారా? అని
టీచర్లను అడగవలసిన అవసరమేలేదు. సదా సంతోషంగా ఉండండి మరియు సేవలో వృద్ధినొందుతూ
ఉండండి. భుజాలు పైకి,
క్రిందకూ ఉపుతున్నపుడు ఆ దృశ్యం ఏంతో చక్కగా ఉంటుంది.
ఒక అలంకారాన్ని ఎత్తితే ఇంకొక అలంకారము చేజారుతూ ఉంటుంది. కాసేపు
స్వదర్శనచక్రాన్ని సరిచేసుకుంటే శంఖము చేజారిపోతుంది. శంఖాన్ని పట్టుకుంటే కమలం
చేజారిపోతుంది. ఇపుడు టీచర్లు శాస్త్రాల యొక్క కథను ఆపు చేయాలి. ప్రతి సంకల్పంలో,
ప్రతి క్షణములో భాగ్యాన్ని తయారుచేసుకోండి. కొందరు కథలను వినేవారు ఉంటారు,
కొందరు వినిపించేవారుంటారు. కొందరు తయారుచేసేవారు కూడా ఉంటారు. వ్యాసుడు ఏవిధంగా
అద్భుతం చేసాడో అలాగే ఇక్కడ కూడా అద్భుతం చేస్తారు. జన్మనిస్తారు, పాలనా
చేస్తారు. కానీ వినాశనం చేయలేకపోతారు. కావున మళ్లీ పశ్చాత్తాపపడతారు. సహాయం
చేయమని అడుగుతారు. అచ్చా !