సదా అలంకారి స్వరూపంలో స్థితులై ఉండేవారే
స్వయం ద్వారా బాబా యొక్క సాక్షాత్కారమును చేయించగలుగుతారు.
బాప్ దాదా స్నేహి పిల్లల యొక్క ఆత్మిక స్నేహముతో
కూడుకున్న సభలోకి వచ్చారు. ఇటువంటి ఆత్మిక స్నేహము యొక్క సభ కల్పంలో ఇప్పుడు ఈ
సంగమ సమయములోనే జరుగుతుంది. ఇంకే యుగములోను ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లల
యొక్క స్నేహముతో కూడుకున్న సభ జరుగజాలదు. ఈ సభలో స్వయాన్ని పదమా పదమ
భాగ్యశాలులుగా భావిస్తున్నారా! మీదెంత శ్రేష్ఠ భాగ్యమంటే స్వయం అల్మైటీ అథారిటీ
అయిన తండ్రి పిల్లల యొక్క ఈ భాగ్యమును వర్ణన చేస్తారు. ఇటువంటి భాగ్యశాలురైన
పిల్లలను స్వయం తండ్రి చూసి హర్షితమవుతారు. మరి ఆ భాగ్యము ఎటువంటిదో ఆలోచించండి.
భాగ్యమును స్మరించడంతోనే బాబా యొక్క మాలలోని మణులుగా అవ్వగలుగుతారు. ఇంత
ఉన్నతమైన భాగ్యమును నేటికీ,కలియుగాంతములో కూడా స్మరించే భక్తులు తమను
భాగ్యశాలులుగా భావిస్తారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము యొక్క అనుభవము యొక్క అంచలి
కొరకు కూడా అందరు తపిస్తారు. మీరు ఎంతటి భాగ్యశాలులంటే మీ నామమాత్రంతో వారు తమ
జీవితమును సఫలంగా భావిస్తారు. కావున మరి అది ఎంత పెద్ద భాగ్యమో ఆలోచించండి.
ఎల్లపుడు స్వయాన్ని ఇంతటి భాగ్యశాలి ఆత్మగా భావిస్తున్నారా! అది ఎంత గొప్ప
భాగ్యమో ఆలోచించండి.
అన్నింటికన్నా పెద్ద కులము బ్రాహ్మణ కులము. ఇటువంటి బ్రాహ్మణ కులానికి కూడా మీరు
దీపములవంటివారు. కులదీపము అనగా ఎల్లపుడు తమ స్మృతి యొక్క జ్యోతితో బ్రాహ్మణ
కులము యొక్క పేరును ప్రసిద్ధము చేస్తూ ఉండాలి. ఆరిపోవడం లేదు కదా! అఖండ జ్యోతి
అనగా ఎప్పుడూ ఆరిపోయేది కాదు. మీ జడచిత్రాల ముందు కూడా అఖండ జ్యోతిని
వెలిగిస్తారు. అది చైతన్య అఖండ జ్యోతికి స్మృతి చిహ్నము. మరి చైతన్య దీపాలు
ఆరిపోగలవా? ఆరిపోయిన జ్యోతి ఎక్కడైనా నచ్చుతుందా? కావున స్మృతి యొక్క జ్యోతి
ఆరిపోతే ఎలా ఉంటుందో స్వయాన్ని పరిశీలించుకోండి. ఆరిపోతే అది అఖండ జ్యోతి
అవుతుందా? సదా స్మృతి స్వరూపము మరియు సమర్థ స్వరూపముగా ఉండడమే జ్యోతి యొక్క
గుర్తు. స్మృతి మరియూ సమర్థతకు సంబంధముంది. "నేను బాబా యొక్క సంతానమును" అన్న
స్మృతి ఉంది కానీ సమర్థత లేదు అని ఎవరైనా అంటే అది యదార్థము కాదు. ఎందుకంటే నేను
మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న స్మృతి ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ అనగా
సమర్థ స్వరూపము. సమర్థత అనగా శక్తి. మరి అది ఎందుకు మాయమవుతుంది? మాయమవటానికి
కారణమేమిటి? ఒక్క శబ్దంలోపొరపాటుచేస్తారు. ఆ తప్పు ఏమిటి? సాకారములో అలంకారిగా
అవ్వండి అని బాబా అంటారు. కానీ ఏమవుతారు?అలంకారికి బదులు దేహ అలంకారిగా
అయిపోతారు. బుద్ధి యొక్క అహంకారిగా పేరు ప్రతిష్టల యొక్క అహంకారిగా అయిపోతారు.
సదా మీ ముందు అలంకారి స్వరూపము యొక్క చిహ్నమును ఉంచుకుని కూడా మీ అలంకారాలను
ధారణ చేసుకోలేకపోతారు. హద్దులోని రాజకుమారి కుమారులు కూడా సదా అలంకరింపబడి
రాయల్టీలో ఉంటారు. అలాగే బ్రాహ్మణ కులము యొక్క శ్రేష్ఠఆత్మలు సదా అలంకారాలతో
అలంకరింపబడి ఉంటారు. ఈ అలంకారాలు బ్రాహ్మణ జీవితము యొక్క సింగారమే కానీ దేవతల
యొక్క సింగారం కాదు. కావున మీ అలంకారము యొక్క సింగారములను సదా మీ వద్ద ఉంచుకోండి.
కానీ ఏమి చేస్తున్నారు?ఒక్క అలంకారాన్ని పట్టుకుంటే ఇంకొక అలంకారాన్ని
వదిలేస్తున్నారు. కొందరు మూడు పట్టుకోగలిగితే కొందరు నాలుగు
పట్టుకోగలుగుతున్నారు. బాప్ దాదా కూడా పిల్లల యొక్క ఆటను చూస్తూ ఉంటారు. భుజాలు
అనగా శక్తి. ఆ శక్తి యొక్క ఆధారంగానే అలంకారిగా అవ్వగలుగుతారు. ఆ శక్తులారూపి
భుజాలు కదులుతూ ఉంటాయి. భుజాలు కదులుతూ ఉన్నపుడు మరి సదా అలంకారిగా ఎలా
అవ్వగలుగుతారు. కావున అలంకారిగా అయ్యేoదుకు ఎంత ప్రయత్నించినా కానీ ఆలా
అవ్వలేకపోతారు. కావున ఏ శబ్దమును గుర్తుంచుకోవాలి? ఏ విధమైన 'అహంకారము' ఉండకూడదు
మరియు 'అలంకారిగా ' అవ్వాలి. సదా అలంకారి స్థితిలో స్థితులవ్వని కారణంగా స్వయం
యొక్క మరియు బాబా యొక్క సాక్షాత్కారమును కలిగించలేరు. కావున మీ శక్తి రూపీ
భుజాలను దృఢముగా చేసుకోండి లేకపోతె అలంకారాలను ధారణ చేయలేరు. అలంకారాలను గూర్చి
మీకు తెలుసు కదా! మీకు వాటి గూర్చి తెలుసు మరియు వర్ణన కూడా చేస్తారు. అయినా
ధారణ చేయలేకపోతారు, ఎందుకు?బాప్ దాదా పిల్లల యొక్క బలహీనతల లీలలను ఎన్ని చూస్తూ
ఉంటారు. ప్రభువు యొక్క లీల ఏవిధంగా అపారంగా ఉంటుందో అలాగే పిల్లల యొక్క ఈ లీల
కూడా అపారమైందే. ప్రతిరోజూ ఓ క్రొత్త నాటకము ఉంటుంది. మాయ యొక్క ఆ క్రొత్త
క్రొత్త స్థితులలో ప్రభావితులవుతారు. స్వదర్శన చక్రానికి బదులుగా వ్యర్థదర్శన
చక్రం తిరుగుతూ ఉంటుంది. ద్వాపరం నుండి వ్యర్థ కథనాలను చాల రుచిగా వినడం మరియు
వినిపించడము యొక్క అలవాటు ఏదైతే ఉందొ ఆ సంస్కారము ఇపుడు కూడా అంశరూపంలో
వచ్చేస్తుంది. కావుననే కమలపుష్ప సమానంగా అనగా కమలపుష్పము యొక్క అలంకధారిగా
అవ్వలేరు. కమలానికి బదులుగా బలహీనులుగా అయిపోతారు. మయాజీతులుగా అయ్యేందుకు
ఇతరులకు సందేశమును ఇస్తారు కానీ స్వయం మయాజీతులుగా అయ్యామా లేదా అన్నదే
ఆలోచించరు. కావుననే అలంకారిగా అవ్వలేకపోతారు. అలంకారులుగా అవ్వండి కానీ
అహంకారులుగా కాదు.
ఈవిధంగా సదా అలంకారి, నిరహంకారి, నిరాకరి స్థితిలో స్థితులై ఉండేవారికి,
సదాకాలిక విజయులకు,సదా మేల్కొని ఉండే దీపాలకు, విశ్వాన్ని ప్రకాశం చేసే దీపాలకు
బాప్ దాదా యొక్క నయనాలలోని దీపాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దీదీజీతో బాప్ దాదా
క్రొత్త ప్రపంచాన్ని తయారుచేసేవారు తమ జీవితమును క్రొత్తగా తయారుచేసుకునే వేగం
ఎలా నడుస్తోంది. మొదట తమ జీవితంలో క్రొత్తదనాన్ని తీసుకువచ్చినపుడే ప్రపంచంలో
కూడా క్రొత్తదనం వస్తుంది. కావున ఎంతగా తమ జీవితం అనే బిల్డింగును సుందరంగా
మరియు సంపన్నంగా తయారుచేసుకుంటారో అంతగానే క్రొత్త ప్రపంచంలో కూడా సుందరమైన
మరియు సంపన్నమైన రాజ్యభాగ్యము లభిస్తుంది. కర్మ ద్వారా మీ భాగ్యము యొక్క రేఖను
దిద్దుకుంటున్నారు. అవి హద్దులోని హస్తరేఖలు. ఇవి కర్మ యొక్క రేఖలు. కర్మలు ఎంత
శ్రేష్ఠంగా మరియు స్పష్టంగా ఉంటాయో అంతగా భాగ్యము యొక్క రేఖలు కూడా అంత
శ్రేష్ఠంగా, స్పష్టంగా ఉంటాయి. కావున కర్మల యొక్క రేఖల ద్వారా మీ భవిష్యత్తును
మీరే చుస్కోగలరు. యమునా తీరంలో ఎవరుండగలరు? ఎవరైతే సదా కాలము కొరకు ప్రపంచాన్ని
వదిలేసారో మరియు బాబాను ఎవరైతే సదా తమ తోడుగా చేసుకున్నారో వారే యమునా తీరంలో
తోడుగా మహాలులో ఉండేవారిగా అవుతారు. శ్రీకృష్ణునితో పాటు ఎవరు చదువుకుంటారు?
చదువుకునేవారు మరియు చదివించేవారు తోడుగా ఉంటారు కదా! ఎవరికైతే చదువును
చదివించడంలో మరియు చదువుకోవడంలో విశేషమైన పాత్ర ఉందొ వారే అక్కడ కూడా విశేషంగా
చదువులో తోడుగా ఉంటారు. రాసలీలను చేసేవారిగా ఎవరౌతారు? ఎవరైతే సంగమ యుగంలో
బాబాతో సమానంగా సంస్కారాలను కలుపుకునే రాశిని కలుపుకున్నారో వారు అక్కడ రాసలీల
చేస్తారు. కావున ఇక్కడ ఎవరికైతే బాబా సమానంగా సంస్కారాల యొక్క రాసి కలుస్తుందో
వారు అక్కడ రాసలీల చేస్తారు. రాజ్య కుటుంబంలో ఎవరొస్తారు?ఎవరైతే సదా తమ పవిత్రత
యొక్క రాయల్టీలో ఉంటారో, ఎవరి కనులైతే ఎక్కడ, ఏ హద్దులోని ఆకర్షణలోనూ చిక్కుకోవో,
ఎవరైతే సదా అలంకారాలతో అలంకరింపబడిన మూర్తిగా ఉంటారో అటువంటి రాయల్టీ కలవారు
రాయల్ ఫ్యామిలిలోకి వస్తారు. వారసులుగా ఎవరవుతారు? వారసులు అనగా అధికారులు.
కావున ఎవరైతే సదా అధికారి స్థితిలో ఉంటారో, ఎప్పుడూ మాయకు ఆధీనులుగా అవ్వరో,
అధికారి స్థితి యొక్క శుద్ధ నషాలో ఎవరైతే ఉంటారో అటువంటి అధికారి స్థితి కలవారు
అక్కడ కూడా అధికారిగా అవుతారు. కావున నేను ఎవరిని అని ఇప్పుడు ప్రతి ఒక్కరు తమను
తాము పరిశీలించుకోవల్సి ఉంది. ఇది ఒక చిక్కు ప్రశ్న. కొందరికి జీవితాంతం తోడుగా
ఉండే పాత్ర ఉంటుంది. తోడుగా చదువుకుంటారు. తోడుగా రాసలీల చేస్తారు. తోడుగా
మహాలులో ఉంటారు. రాజ్యకుటుంబంలో కూడా తోడుగా ఉంటారు. ఇటువంటి పాత్ర ఉంటుంది.
కొందరు ఆత్మలకు సర్వ అధికారాలు కూడా ఉన్నాయి. ఇవి క్రొత్త ప్రపంచం యొక్క
రూపురేఖలు.