14.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వమానం మరియు ఆజ్ఞ.

సదా ఆజ్ఞపై నడిచే అజ్ఞాకారులు, సదా స్వమానంలో ఉండేటువంటి, సదా భాగ్యాన్ని స్మరణ చేసుకుంటూ హర్షితంగా ఉండేటువంటి పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు -

సదా భాగ్యవిధాత బాబా ద్వారా లభించిన భాగ్యాన్ని స్మరణ చేసుకుంటూ సదా హర్షితంగా ఉంటున్నారా? ఎందుకంటే కల్పమంతటిలో సర్వ శ్రేష్టభాగ్యం ఈ సమయంలోనే పొందుతున్నారు. ఈ సమయంలోనే బాగ్యశాలి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా! భవిష్య క్రొత్త ప్రపంచంలో కూడా ఈ విధమైన భాగ్యం లభించదు. ఎంతగా బాబా పిల్లలను శ్రేష్ట భాగ్యశాలిగా భావిస్తున్నారో అంతగా ప్రతి ఒక్కరు స్వయాన్ని ఆవిధంగా భావిస్తూ నడుస్తున్నారా? దీనినే స్వమానంలో స్థితులవ్వటం అని అంటారు. మనసా, వాచా, కర్మణా మూడింటిలో ధ్యాస పెట్టుకోండి. ఒకటి సదా స్వమానంలో ఉండాలి మరియు రెండు సదా ప్రతి అడుగు బాబా ఆజ్ఞపై నడవాలి. స్వమానం మరియు ఆజ్ఞ. ఈ రెండు విషయాలపై ధ్యాస ఉంచుకోవాలి. వెనువెంట సర్వుల సంపర్కంలోకి రావటంలో అందరికి సన్మానం ఇవ్వాలి.

స్వమానంలో స్థితులవ్వటం ద్వారా విఘ్నవినాశక స్థితిలో ఉంటారు. స్వమానం అంటే ఏమిటి దానిని మంచిగా తెలుసుకుంటున్నారా? బాబా యొక్క మహిమయే మీ స్వమానం. కేవలం ఒక మహిమను స్మృతి ఉంచుకున్నా స్వతహాగా స్వమానంలో స్థితులు కాగలరు. స్వమానంలో స్థితులవ్వటం ద్వారా ఏవిధమైన అభిమానం, దేహం యొక్క అభిమానం లేదా బుద్ధి యొక్క అభిమానం లేదా పేరు యొక్క అభిమానం, సేవ యొక్క అభిమానం లేదా విశేష గుణం యొక్క అభిమానం స్వతహాగా సమాప్తి అయిపోతాయి అందువలన సదా విఘ్నవినాశకులుగా ఉంటారు. ఇలా స్వమానంలో స్థితులై ఉండేవారు సదా నిర్మాణంగా ఉంటారు. అభిమానం కాదు కానీ నిర్మాణత ఉంటుంది. దీని ద్వారా స్వతహాగా సదా సర్వుల ద్వారా గౌరవం లభిస్తుంది. గౌరవం కావాలి అనే కోరిక నుండి అతీతంగా ఉన్న కారణంగా సర్వుల ద్వారా శ్రేష్ట గౌరవాన్ని పొందే పాత్రులుగా అవుతారు, ఇది అనాది నియమం. సర్వుల ద్వారా గౌరవమనేది అడగటం ద్వారా లభించదు. కానీ గౌరవాన్ని ఇవ్వటం ద్వారా, స్వమానంలో స్థితులవ్వటం ద్వారా, ప్రకృతి దాసీ అయ్యి స్వమానం యొక్క అధికారంగా గౌరవం లభిస్తుంది. గౌరవాన్ని త్యాగం చేయటంలో సర్వులకు గౌరవనీయంగా అయ్యే భాగ్యం లభిస్తుంది. స్వమానంలో ఉండేవారికి కేవలం ఈ జన్మలోనే గౌరవం లభించటం కాదు, కల్పమంతటిలో అర్థకల్పం మీ ఉన్నత కుటుంబీకుల ద్వారా మరియు ప్రజల ద్వారా గౌరవం లభిస్తుంది మరియు అర్థకల్పం భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది. అంతిమ జన్మలో చైతన్య రూపంలో మీరు పొందిన గౌరవానికి ప్రాలబ్దం మీరు స్వయమే చూస్తున్నారు. చైతన్యంగా మీ జడచిత్రాలను చూస్తున్నారు కదా! కల్పమంతటిలో లభించే గౌరవానికి ఆధారం ఏమయ్యింది? అల్పకాలిక వినాశి గౌరవం యొక్క త్యాగం అంటే స్వమానంలో స్థితులై, నిర్మాణంగా అయ్యి సన్మానం ఇవ్వాలి. ఈ ఇవ్వటమే తీసుకోవటం అవుతుంది. సన్మానం ఇవ్వటం అంటే ఆ ఆత్మను ఉత్సాహ, ఉల్లాసాలలోకి తీసుకువచ్చి ముందు పెట్టాలి. అల్పకాలిక పుణ్యం, అల్పకాలిక వస్తువు ఇవ్వటం ద్వారా వస్తుంది లేదా అల్పకాలిక సహయోగం ఇవ్వటం ద్వారా వస్తుంది. కానీ వారు సదాకాలిక ఉత్సాహ, ఉల్లాసాలను అంటే సంతోషం యొక్క ఖజనా లేదా స్వయం యొక్క సహయోగం, ఆత్మను సదాకాలికంగా పుణ్యాత్మగా చేస్తుంది. అందువలనే ఇది చాలా ఉన్నతోన్నతమైన పుణ్యం. ఒక జన్మలో చేసిన ఈ పుణ్యానికి ఫలం కల్పమంతా లభిస్తుంది. అందువలనే సన్మానం ఇవ్వటమే తీసుకోవటం అని చెప్పాను. లౌకికంలో కూడా ఎవరైనా పుణ్యకర్మ చేస్తే వారు అందరి ముందు గౌరవనీయులుగా అవుతారు. కానీ ఈ శ్రేష్ట పుణ్యానికి ఫలం - పూజ్యనీయంగా మరియు గౌరవనీయంగా కూడా అవుతారు. కనుక ఇటువంటి పుణ్యాత్మగా అయ్యి సదా పుణ్య కార్యం చేస్తున్నానా? అని స్వయాన్ని అడగండి. సన్మానం ఇవ్వండి కానీ సన్మానం కావాలి, నాకు ఎందుకు గౌరవం ఇవ్వటం లేదు, వీరికి ఎందుకు ఇస్తున్నారు ఇలా అంటున్నారు అంటే ఇచ్చేవారా లేదా తీసుకునేవారా? ఇలా తీసుకునే భావన కూడా రాయల్ బికారీ స్థితి. స్వమానం మరియు సన్మానం. స్వమానంలో ఉండాలి మరియు సన్మానాన్ని ఇవ్వాలి.

ఇక ఏమి చేయాలి? ప్రతి అడుగు ఆజ్ఞపై నడవాలి. ప్రతి అడుగు ఆజ్ఞపై నడిచేవారి ముందు మొత్తం విశ్వం బలి అయిపోతుంది. వెనువెంట మాయ కూడా తన వంశ సహితంగా బలి అయిపోతుంది అంటే సమర్పణ అయిపోతుంది. మాయ మాటి మాటికి యుద్ధం చేస్తుంది అంటే ప్రతి అడుగు ఆజ్ఞపై నడవటం లేదు అని సిద్ధి అవుతుంది. సదా ఆజ్ఞపై నడవని కారణంగా మాయ కూడా ఒక్క దెబ్బతో బలి అవ్వటం లేదు. అందువలనే మాట మాటికి యుద్ధం చేస్తుంది మరియు మాటి మాటికి ప్రజలు అరవడానికి నిమిత్తం అవుతుంది. మాయ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయము, ఈ రోజు ఈ రూపంలో వచ్చింది అంటున్నారు అంటే ఇది అరవటమే కదా! మాయను అంటే విఘ్నాలను ఏవిధంగా తొలగించుకుంటారు? ఒక్క దెబ్బతో బలి అవ్వని కారణంగా మాయ కూడా అరుస్తుంది మరియు మీరు కూడా అరుస్తున్నారు. అందువలన ఆజ్ఞపై నడిస్తే అది బలి అయిపోతుంది. ఆజ్ఞపై నడవటం ఎంత సహజ సాధనం? స్వమానం మరియు ఆజ్ఞ సహజం కదా! దీని ద్వారా జన్మజన్మాంతరాల కష్టం నుండి విడిపించబడతారు. ఇప్పుడు సహజయోగులు మరియు భవిష్యత్తులో కూడా సహజ జీవితం ఉంటుంది. ఇలా సహజ జీవితాన్ని తయారు చేసుకోండి. అర్ధమైందా!

సదా ఆజ్ఞపై నడిచే ఆజ్ఞాకారులకు, సదా స్వమానంలో ఉండేవారికి, అల్పకాలిక వినాశి గౌరవాన్ని త్యాగం చేసేవారికి, సదా గౌరవనీయ మరియు సదా పూజ్యనీయ పాత్ర పొందేవారికి, ఇలా సదా బాబాపై బలి అయ్యే ఆత్మలకు, సదా సర్వులకు సన్మానాన్ని ఇచ్చి, స్నేహం తీసుకునే స్నేహి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.