16.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మాయాయుద్ధాన్ని ఎదుర్కొనేటందుకు రెండు శక్తులు అవసరం.

మాస్టర్ జ్ఞానసాగరులు, సదా విజయీలు, సదా హర్షితంగా తయారుచేసేటువంటి బాప్ దాదా, గమ్యానికి సమీపంగా చేరుకునే ఆత్మలతో మాట్లాడుతున్నారు -

బాప్ దాదా పిల్లలందరి పురుషార్ధం యొక్క వేగాన్ని చూస్తున్నారు. క్రొత్తవారు మరియు పాతవారు ఇద్దరి పురుషార్ధం యొక్క వేగాన్ని చూస్తూ బాప్ దాదాకి పిల్లలపై చాలా స్నేహం కూడా వచ్చింది మరియు వెనువెంట దయ కూడా వచ్చింది. చిన్నవారు, పెద్దవారు పరిచయం లభిస్తూనే పరిచయంతో పాటు శక్తిననుసరించి తమకు లభించిన ప్రాప్తి ఆధారంగా వెనుకటి జీవితం మరియు వర్తమాన బ్రాహ్మణజన్మ రెండింటి మహాన్ తేడాను అనుభవం చేసుకుంటూ భ్రమించేవారికి తోడుని చూపిస్తూ, నిశ్చయబుద్దిగా అయ్యి, ఒకరొకొకరి సహయోగంతో, ఒకరికొకరి అనుభవం యొక్క ఆధారంతో గమ్యం వైపు నడుస్తున్నారు. సంతోషం, శక్తి, శాంతి, సుఖం యొక్క అనుభూతిలో ఏ లోక మర్యాదలను లెక్క చేయకుండా అలౌకిక జీవితం యొక్క అనుభవం అడుగుని ముందుకి వేయిస్తుంది. ప్రాప్తితో కొన్ని వదిలేస్తున్నారు లేదా త్యాగం చేస్తున్నారు. ఏ తెలివి ఉండటం లేదు. బాబా లభించారు అంటే అన్నీ లభించినట్లే అనే ఈ సంతోషం లేదా నషాలో త్యాగం కూడా త్యాగంగా అనిపించటం లేదు. స్మృతి మరియు సేవలో తనువు, మనస్సు, ధనంతో నిమగ్నమై ఉన్నారు. మొదటి నషా, మొదటి సంతోషం, మొదటి ఉత్సాహ, ఉల్లాసాలు, అతీతంగా మరియు అతి ప్రియంగా అనుభవం చేసుకున్నారు. ఈ త్యాగం మరియు ఆది సమయం యొక్క నషా త్రికాలదర్శి, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క మొదటి ఆవేశం దీనిలో ఏ తెలివి లేదు. పాత ప్రపంచంలో అన్ని నీచంగా అనుభవం అయ్యాయి. ఇలా ప్రతి ఒక్కరి మొదటి స్థితిని చూస్తూ చాలా స్నేహం వచ్చింది, ప్రతి ఒక్కరు బాబా కోసం ఎంతో త్యాగం మరియు సంలగ్నతతో ముందుకు వెళ్ళే పురుషార్ధం చేసారు అని. ఇటువంటి త్యాగమూర్తి, జ్ఞానమూర్తి, విశాలబుద్ధి పిల్లలపై బాప్ దాదా కూడా తన సర్వ సంపత్తి సహితంగా బలి అయ్యారు. పిల్లలు ఎలా అయితే బాబా మేము నీ వారము అని సంకల్పం చేసారో అలాగే బాబా కూడా బదులుగా బాబాది అంతా మీదే అంటున్నారు. అధికారిగా కూడా అయ్యారు. కానీ తర్వాత ఏమౌతుంది? నడుస్తూ, నడుస్తూ మహావీరులు అంటే ఆత్మిక వీరులుగా అయ్యి మాయకు విజయీగా అయ్యే ప్రతిజ్ఞ చేస్తున్నారు. అధికారిగా కూడా భావిస్తున్నారు. కానీ మాయ యొక్క అనేక రకాలైన యుద్దాన్ని ఎదుర్కునేటందుకు రెండు విషయాలలో లోపం వస్తుంది. ఆ రెండు విషయాలు ఏమిటి? ఒకటి ఎదుర్కునేశక్తి యొక్క లోపం, రెండవది పరిశీలించే మరియు నిర్ణయశక్తి యొక్క లోపం, ఈ లోపాల కారణంగా మాయ యొక్క అనేక రకాలైన యుద్ధంలో అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు గెలుపు ద్వారా అప్పుడప్పుడు ఆవేశంలోకి, అప్పుడప్పుడు తెలివిలోకి వస్తున్నారు. ఎదుర్కునే శక్తి లేకపోవడానికి కారణం ఏమిటి? బాబాని సదా తోడుగా చేసుకోవటం రావటం లేదు. తోడు తీసుకునే పద్ధతి రావటం లేదు. సహజమైన పద్దతి ఏమిటంటే అధికారి స్థితి. అందువలనే బలహీనతను చూసి మాయ యుద్ధం చేస్తుంది.

పరిశీలించే శక్తి లేకపోవడానికి కారణం ఏమిటి? బుద్ధి యొక్క ఏకాగ్రత లేదు. వ్యర్ధ సంకల్పాలు మరియు అశుద్ధ సంకల్పాల యొక్క అలజడి ఉంది. ఒకని ద్వారా సర్వ రసాలు తీసుకునే ఏకరసస్థితి లేదు. అనేక రసాలలో బుద్ధి మరియు స్థితి అలజడి అవుతుంది. అందువలనే పరిశీలించే శక్తి తక్కువ అయిపోతుంది. పరిశీలన లేని కారణంగా మాయ తన గ్రాహకులుగా చేసుకుంటుంది. ఇది మాయ అనేది కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ఇది తప్పు అనేది కూడా తెలుసుకోవటం లేదు. మాయా గ్రాహకులుగా, మాయకు సహయోగులుగా అయ్యి బాబాకి మరియు నిమిత్త ఆత్మలకు కూడా ఇదైతే జరుగుతూనే ఉంటుంది, సంపూర్ణం అయ్యేంత వరకు ఈ విషయాలు ఉంటాయి అని స్వయం యొక్క తెలివితో చెప్తారు. ఇలా అనేక రకాలైన విచిత్ర పాయింట్స్ మాయ వైపు నుండి న్యాయవాదులుగా అయ్యి బాబా ముందు మరియు నిమిత్తమైనవారి ముందు పెడతారు. ఎందుకంటే మాయకు సహయోగి అయిన కారణంగా విరుద్ధమైన పార్టీగా అయిపోతారు. మాయాజీత్ గా అయ్యే స్థితిని వదిలేస్తారు. దీనికి కారణం ఏమిటంటే పరిశీలించే శక్తి యొక్క లోపం.

ఈవిధమైన అద్భుతమైన మరియు రమణీయకమైన కేసులు బాప్ దాదా ఎదురుగా చాలా వస్తాయి. పాయింట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి, క్రొత్త, క్రొత్త ఆవిష్కరణలు కూడా చాలా చేస్తున్నారు. ఎందుకంటే వారి వెన్నెముక మాయ. పిల్లల ఈ స్థితిని చూసి బాబాకి దయ వస్తుంది. బాబా నేర్పిస్తున్నారు కానీ పిల్లలు చిన్న పొరపాటు కారణంగా ఏమి చేస్తున్నారు? చిన్న పొరపాటు ఏమిటంటే శ్రీమతంలో మన్మతం కలపటం. దానికి ఆధారం ఏమిటి? సోమరితనం మరియు నిర్లక్ష్యం. అనేక రకాలైన మాయా ఆకర్షణలకు ఆకర్షితం అవ్వటం వలన మొదట ఉత్సాహ, ఉల్లాసాలను అనుభవం చేసుకుంటున్నారు. తర్వాత నడుస్తూ, నడుస్తూ మాయాజీత్ గా అయ్యే సంపూర్ణశక్తి లేని కారణంగా కొంతమంది పురుషార్థ హీనులుగా అయిపోతున్నారు. ఏం చేయము, ఎప్పటి వరకు చేయము, ఇది తెలియటం లేదు. ఇలా వ్వర్థసంకల్పాల యొక్క చక్రంలోకి వచ్చేస్తున్నారు. కానీ ఈ అన్ని విషయాలు సైడ్ సీన్స్ అంటే మార్గమధ్య దృశ్యాలు. గమ్యం కాదు. వీటిని దాటాలి కానీ వాటినే గమ్యంగా భావించి అక్కడే ఆగిపోకూడదు. కానీ కొంతమంది పిల్లలు వాటినే గమ్యంగా అంటే నా పాత్రే ఇంత, నా అదృష్టమే ఇంత, ఇలా మార్గమధ్య దృశ్యాలనే గమ్యంగా భావించి వాస్తవిక గమ్యం నుండి దూరం అయిపోతున్నారు. కానీ ఉన్నత గమ్యానికి చేరుకునే ముందు తుఫానులు చాలా వస్తాయి, నావను తీరం చేర్చడానికి భవ సాగరంలో వీటిని దాటాల్సిందే. అందువలన తొందరగా భయపడకండి, అలసిపోకండి, ఆగిపోకండి. భగవంతుడిని తోడుగా చేసుకుంటే ప్రతి కష్టం సహజం అయిపోతుంది. ధైర్యవంతులుగా అయితే సహాయం తప్పకుండా లభిస్తుంది. తండ్రిని చూడటం, తండ్రిని అనుసరించటం చేస్తే జీవితంలో సదా సహజంగా ఉత్సాహ, ఉల్లాసాలను అనుభవం చేసుకుంటారు. మార్గంలో నడుస్తూ ఏ వ్యక్తి, వైభవాన్ని ఆధారంగా చేసుకోకండి. ఆధారమే స్వయం వినాశి అయినప్పుడు వారు అవినాశి ప్రాప్తిని ఎలా పొందుతారు? ఒకే బలం మరియు ఒకే నమ్మకం ఈ పాఠాన్ని సదా పక్కా చేసుకోండి. భవ సాగరంలో చిక్కుకున్న దాని నుండి సహజంగా విడిపించుకోగలుగుతారు మరియు గమ్యాన్ని సదా సమీపంగా అనుభవం చేసుకుంటారు.

విన్నారు కదా! ఇది పురుషార్థీల ఫలితం. చాలా మంది భవ సాగరంలో అలజడి అవుతున్నారు. కానీ బాబా చెప్తున్నారు ఈ అన్ని విషయాలు మీ గమ్యంలో ముందుకు వెళ్ళడానికి శుభచిహ్నంగా భావించండి. ఎలా అయితే వినాశనాన్ని శుభచిహ్నంగా, కళ్యాణకారిగా భావిస్తారో అలాగే ఈ పరీక్షలు కూడా పరిపక్వంగా చేసేటందుకు ఆధారం. ఈ గుర్తులన్నీ మార్గాన్ని దాటి ముందుకు వెళ్తున్నట్లు. కనుక ఈ అన్ని విషయాలను చూస్తూ భయపడకండి. సదా గమ్యానికి చేరుకునే తీరతాను అనే ఒకే సంకల్పం పెట్టుకోండి. అర్ధమైందా! ఎలా అయితే కరెంట్ అలజడి చేస్తుంటే ఇష్టంగా అనిపించదు కదా! ఏకరస స్థితి ఇష్టంగా అనిపిస్తుంది, అలాగే బాబాకి కూడా పిల్లల ఏకరస స్థితియే ఇష్టంగా అనిపిస్తుంది. ప్రకృతి ఆట అడిస్తుంది కానీ ఆ ఆట ఆడకూడదు, సదా అచంచలంగా, అటలంగా, అడోల్ గా ఉండాలి.

ఇలా మాస్టర్ జ్ఞానసాగరులకు, సదా విజయీలకు, సదా సంతోషంగా ఉండేవారికి, మాయ యొక్క సర్వ ఆకర్షణలకు అతీతంగా ఉండేవారికి, గమ్యానికి సమీపంగా చేరుకునే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.