సంగమయుగీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేష గుణం మరియు
కర్తవ్యం.
మాస్టర్ జ్ఞానసాగరులు, విశ్వసేవాధారి, భగవంతుని
సేవాధారులు, సర్వుల పట్ల కళ్యాణం మరియు దయా భావన పెట్టుకునే ఆత్మలతో ఉచ్చరించిన
మహావాక్యాలు -
మీ వర్తమాన సంగమయుగీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతను
తెలుసుకుంటున్నారా? మీ యొక్క విశేషమైన గుణం మరియు కర్తవ్యాన్ని
తెలుసుకుంటున్నారా? ఏ గుణం మరియు కర్తవ్యం ఇక ఏ యుగంలో ఉండదో ఆ విశేషమైన గుణం
ఏమిటి? జ్ఞానస్వరూపులు, మాస్టర్ జ్ఞానసాగరులు మరియు కర్తవ్యం - విశ్వసేవాధారులు
అంటే భగవంతుని సేవాధారులు. రెండు విశేషతలను నిరంతరం స్మృతి ఉంచుకుంటున్నారా?
మీరు మేము విశ్వసేవాధారులం అని చెప్తారు కదా! మరి విశ్వసేవాధారుల పరిభాష
ఏమిటి?విశ్వ సేవాధారి అని ఎవరిని అంటారు? వారి లక్షణాలు ఏమి ఉంటాయి? లక్ష్యం ఏమి
ఉంటుంది మరియు ప్రాప్తి ఏమి ఉంటుంది? విశ్వసేవాధారి అంటే సేవాధారుల లక్షణం సదా
ఇదే ఉంటుంది - విశ్వాన్ని తమ సేవ ద్వారా సంపన్నంగా మరియు సుఖీగా చేయాలి అని.
దేని ద్వారా? అప్రాప్తి వస్తువు ఏదైతే ఉందో ఈశ్వరీయ సుఖం, శాంతి, మరియు జ్ఞానం,
సర్వశక్తులతో సర్వాత్మలను బికారీ నుండి అధికారిగా చేయాలి. ఎందుకంటే
విశ్వసేవాధారి అందరిని సదా కళ్యాణ మరియు దయాదృష్టితో చూస్తారు. అందువలన సదా
విశ్వపరివర్తన చేయాల్సిందే అనే లక్ష్యం ఉంటుంది. రాత్రి, పగలు ఇదే సంలగ్నత
ఉంటుంది.
సేవాధారి లక్షణాలు ఏమి కనిపిస్తాయి? సేవాధారి తమ ప్రతి
సెకను, సంకల్పం, మరియు కర్మ, సంబంధ, సంపర్కాలు సేవలోనే ఉపయోగిస్తారు. సేవాధారులు
సేవ చేయటానికి 4గంటలు, 6గంటలు అని సమాయాన్ని నిశ్చితం చేసుకోరు. ప్రతి అడుగులో
అలసిపోని సేవ చేస్తూ ఉంటారు. వారు చూడటంలో, నడవటంలో, తినటం, త్రాగటంలో,
అన్నింటిలో సేవ నిండి ఉంటుంది. సేవకు ముఖ్య సాధనం - స్మృతి, వృత్తి, దృష్టి
మరియు కృతి. ఇలా అన్ని రకాలుగా సేవలో తత్పరులై ఉంటారు. 1. స్మృతి ద్వారా
సర్వాత్మలను సమర్ధ స్వరూపంగా తయారుచేస్తారు 2.వృత్తి ద్వారా వాయుమండలాన్ని
పావనంగా మరియు శక్తిశాలిగా తయారుచేస్తారు 3. దృష్టి ద్వారా ఆత్మలకు స్వయం మరియు
బాబా యొక్క సాక్షాత్కారం చేయిస్తారు 4. కృతి ద్వారా స్వయం శ్రేష్టకర్మ చేయటానికి
నిమిత్తంగా అయ్యి ధైర్యం యొక్క ప్రేరణను ఇస్తారు.
ఇలా సేవాధారులు స్వయం యొక్క రాత్రి, పగలును కూడా
త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవం చేసుకుంటారు. సేవాధారుల సంపర్కంలో
ఉండేవారు లేదా సంబంధంలోకి వచ్చే ఆత్మలు వారి సమీపత మరియు తోడు ద్వారా శీతలత,
శక్తి, శాంతి యొక్క సెలయేరు దగ్గర కూర్చున్నాము అని అనుభవం చేసుకుంటారు లేదా
ఏదోక తొడు లేదా ఒడ్డు యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. ఇలా సేవాధారుల
సంకల్పం లేదా శుభభావనలు, శుభకామనలు సూర్యుని కిరణాల వలె నలువైపుల వ్యాపిస్తాయి.
ఎలా అయితే సేవాధారుల జడచిత్రాలు అల్పకాలికంగా అల్పకాలిక కామనలు పూర్తి చేస్తాయో,
అలాగే చైతన్య చరిత్రవంతులైన సేవాధారులు సదాకాలికంగా సర్వుల కామనలు పూర్తి
చేస్తారు. అందువలనే కామధేనువుకి మహిమ ఉంది. ఎవరైనా ఖజానాతో సంపన్నంగా ఉంటే ఎంతగా
కావాలంటే అంత సంపన్నంగా ఉండవచ్చు మరియు హద్దు యొక్క ఖజానాతో విశేషత కూడా ఉంటుంది.
హద్దు యొక్క ఖజానా ద్వారా ఒక వస్తువే లభిస్తుంది. కానీ ఇది విచిత్రమైన ఖజానా
దీని ద్వారా ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది. ఇలా సేవాధారులు తపించే ఆత్మలకు
సహజంగా గమ్యాన్ని అనుభవం చేయిస్తారు. సదా హర్షితం మరియు సదా సంతుష్టం ఈ ప్రాప్తి
యొక్క వరదానం సేవాధారులకు స్వతహాగా లభిస్తుంది. ఎందుకంటే వారు ప్రతి ఆత్మ యొక్క
పాత్ర భిన్నమైనది అని తెలుసుకుంటారు. పాత్రధారి యొక్క ఏ పాత్రను చూసి అసంతుష్టం
అవ్వకూడదు. ఇలా సేవాధారులు హర్షితంగా, సంతుష్టంగా ఉండటం వలన మనస్సుతో ఏ పాట
వస్తుంది? ఓహో బాబా! ఓహో నా పాత్ర! మరియు ఓహో మధురమైన డ్రామా! అని. ఎప్పుడైతే
స్వయం ఈ మనస్సు యొక్క పాట పాడతారో అప్పుడే సర్వాత్మలు కూడా, ఇప్పుడు కూడా మరియు
కల్పమంతా వారికి ఓహో ఓహో అంటారు.
ఇటువంటి సేవాధారులు సదా విజయీ మాలధారులుగా ఉంటారు.
సఫలత అనేది స్వతహా అధికారం ఈ నిశ్చయం మరియు నషాలో ఉంటారు. సదా సంపన్నంగా మరియు
బాబాకి సమీపంగా అనుభవం చేసుకుంటారు. ఇది సేవాధారులకు ప్రాప్తి. ఇలా లక్ష్యం
మరియు లక్షణాలు మరియు ప్రాప్తిని అనుభవం చేసుకుంటున్నారా? బ్రాహ్మణ జీవితం
యొక్క విశేష కర్తవ్యమే ఇది. మరి మీ కర్తవ్యాన్ని యదార్ధంగా నిలుపుకుంటున్నారా?
ఒకటి బాబాపై ప్రేమ యొక్క రీతిని నిలుపుకోవటం, రెండు కర్తవ్యం నిలుపుకోవటం. రెండు
నిలుపుకునేవారే కదా? కేవలం చెప్పేవారా? కేవలం చెప్పేవారు మాత్రమే కాదు కదా?
చెప్పేవారిగా కాదు, చేసేవారిగా అవ్వండి. సేవాధారుల గొప్పతనం ఏమిటో అర్థమైందా?
మంచిది.
ఇలా సదా రాత్రి, పగలు సేవలో తత్పరులై ఉండేవారికి,
సంపన్నంగా అయ్యి సర్వులను సంపన్నం చేసేవారికి, సర్వ స్వరూపాలతో ఆల్ రౌండర్ సేవ
చేసేవారికి, సదా సర్వుల పట్ల కళ్యాణం మరియు దయా భావన పెట్టుకునేవారికి, ఇలా
విశేషమైన సేవాధారులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.