27.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


శక్తిశాలి స్థితిఅంటే బాబా సమానమైన బీజరూప స్థితి.

సదా సమర్థులు, సదా జ్ఞాన ఖజానాతో సంపన్నులు, బాబా సమానమైన గుణమూర్తులు మరియు శక్తిమూర్తులు, జ్ఞానీ ఆత్మలు, ఇలా విదేశీ నుండి స్వదేశీ పిల్లలతో బాప్ దాదా ఉచ్చరించిన మహావాక్యాలు -

ఈరోజు బాప్ దాదా ఎదురుగా ఏ సభ కూర్చుని ఉన్నారు? తెలుసా? ఈ రోజు రెండు రకాలైన సభ ఉంది. ఒకటి ఎదురుగా కూర్చున్న భారతవాసీయుల సభ, రెండు విదేశీ పిల్లల సభ. విదేశీ పిల్లలందరు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో మరియు సంలగ్నతతో బాబాని ప్రత్యక్షం చేసే పద్ధతులను తయారుచేస్తూ, మాటి మాటికి బాబా యొక్క గుణాలను పాడుతూ, సంతోషంలో నాట్యం చేస్తున్నారు. వారి సంతోషం యొక్క మనస్సు యొక్క పాట బాప్ దాదాకి వినిపిస్తుంది. అన్ని వైపుల విశేషంగా బాబా యొక్క స్నేహం మరియు సేవ యొక్క వాతావరణం ఆకర్షితం చేసేదిగా ఉంది. బాప్ దాదాకి కూడా పిల్లలను చూసి, పిల్లల ఉత్సాహాన్ని చూసి సంతోషంగా ఉంది. వెనువెంట పిల్లలలో కలయిక యొక్క ఉత్సాహం చూసి సంతోషిస్తున్నారు.

ఈరోజు అమృతవేళ బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల దగ్గరకు చక్రం తిరగటానికి వెళ్ళారు. మధువన వరదాన భూమిలో, సంతోషంతో వచ్చిన పిల్లలు ఈ కలయిక యొక్క ఆనందంలో అన్ని విషయాలు మర్చిపోయారు. ప్రతి ఒక్కరు నెంబర్‌వారీ పురుషార్థాన్ని అనుసరించి వరదానం పొందే ఉత్సాహ, ఉల్లాసాలలో ఉన్నారు. ఇలా అన్ని వైపుల చక్రం తిరుగుతూ ఏమి చూసారు? చాలా మంది శరీరంతో తమ, తమ స్థానాలలో ఉన్నారు. కానీ మనస్సు యొక్క సంలగ్నత మధువనం వైపు ఉంది. అవ్యక్తరూపంతో యోగయుక్త పిల్లలు స్వయాన్ని మధువనంలోనే అనుభవం చేసుకుంటున్నారు. నలువైపుల ఛాత్రక సమానమైన స్వరూపం కనిపిస్తుంది. స్మృతియాత్ర యొక్క చార్టులో ఏమి కనిపించింది? స్వయం యొక్క స్థితి మరియు వ్యతిరేక స్థితి రెండింటి ఆటను చూసారు. ప్రతి ఒక్కరు శక్తినననుసరించి తమ స్థితిలో స్థితులయ్యేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాయ యొక్క వ్యతిరేకత ఏకరస స్థితిలో స్థితులవ్వటంలో విఘ్నరూపంగా అవుతుంది. దీనికి కారణం ఏమిటి? 1. రోజంతటి దినచర్యపై మాటి మాటికి ధ్యాస యొక్క లోపం 2. శుద్ధసంకల్పాల ఖజానా జమ కాని కారణంగా వ్యర్దసంకల్పాలలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మననశక్తి చాలా తక్కువగా ఉంది. 3. ఏ రకమైన చిన్న, చిన్న పరిస్థితులు అంటే అవి ఏమీ కాదు కానీ బలహీనత కారణంగా ఆ చిన్న విషయాలను పెద్దవిగా భావించి, వాటిని తొలగించుకోవటంలో చాలా సమయం వ్యర్ధం చేస్తున్నారు. కారణం ఏమిటి? సమయానుసారం అనేక రకాలైన పరిస్థితులను దాటే యుక్తులు ఏవైతే చెప్తున్నారో అవి ఆ సమయంలో భయపడిపోతున్న కారణంగా స్మృతి రావటం లేదు. 4. స్వయం యొక్క స్వభావ, సంస్కారాలు ఇవి ఉండకూడదు అని కూడా అనుకుంటున్నారు కానీ మాటి మాటికి ఆ స్వభావ, సంస్కారాలకు వశీభూతమైపోతున్న కారణంగా మోసపోయారు కూడా. కానీ రచయితగా ఉంటూ కూడా వశీభూతమైపోతున్నారు. స్వయం యొక్క ఆది, అనాది సంస్కారాలు మాటి మాటికి స్మృతిలోకి తీసుకురావటం లేదు. దీని కారణంగా స్వభావ, సంస్కారాలను తొలగించుకునే శక్తి రావటంలేదు. ఇలా నాలుగు రకాలైన యుద్ధవీరులను చూసారు. వీరుడు అనే మాట విని నవ్వు వస్తుంది కదా! ఏ సమయంలో ప్రత్యక్ష కర్మలోకి వస్తున్నారో అప్పుడు నవ్వు వస్తుందా? బాప్ దాదా ఇటువంటి ఆటను చూసి పిల్లలపై దయ మరియు కళ్యాణం యొక్క సంకల్పం వస్తుంది. ఇప్పటి వరకు చాలా మంది వ్యర్దసంకల్పాల యొక్క ఫిర్యాదు చాలా చేస్తున్నారు. వ్యర్దసంకల్పాల కారణంగా తనువు మరియు మనస్సు రెండు బలహీనం అయిపోతున్నాయి. వ్యర్ధసంకల్పాలకు కారణం ఏమిటి? చెప్పాను కదా! మీ దినచర్యను సెట్ చేసుకోవటం రావటంలేదు.

అమృతవేళ రోజంతటి దినచర్య, తనువు మరియు మనస్సు యొక్క దినచర్యను సెట్ చేసుకోండి. ఎలా అయితే రోజంతటిలో ఈ కర్మ చేయాలి అని తనువు యొక్క దినచర్య సెట్ చేసుకుంటారో, అలాగే మీ స్థూలకార్యం యొక్క లెక్కతో మనస్సు యొక్క స్థితిని కూడా సెట్ చేసుకోండి. ఎలా అయితే అమృతవేళ స్మృతియాత్ర కొరకు సమయం నిశ్చితమై ఉందో అటువంటి స్వర్ణిమ సమయంలో సమయం యొక్క సహయోగం , సతోప్రధ్రాన బుద్ధి యొక్క సహయోగం ఉంటుంది. కనుక ఆ సమయంలో మనస్సు యొక్క స్థితి కూడా చాలా శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్థితి అంటే బాబా సమానమైన బీజరూపస్థితి. ఎలా అయితే అమృతవేళ సమయం శ్రేష్టమైనదో అలాగే స్థితి కూడా శ్రేష్టంగా ఉండాలి. సాధారణ స్థితిలో అయితే కర్మ చేస్తూ కూడా ఉంటారు. కానీ ఇది విశేషంగా వరదాని సమయం. ఈ సమయాన్ని యదార్ధంగా ఉపయోగించటం లేని కారణంగా రోజంతటి స్మృతి యొక్క స్థితిపై ప్రభావం పడుతుంది. కనుక మొదట అమృతవేళ శక్తిశాలి స్థితిని సెట్ చేసుకోవటంలో ధ్యాస పెట్టుకోండి.

రెండవ విషయం - జ్ఞానం యొక్క గుహ్య విషయాలు వింటున్నారు అంటే నియమపూర్వకంగా చదువు చదువుకుంటున్నారు. ఆ సమయంలో ఏవైతే పాయింట్స్ వింటున్నారో ఆ ప్రతి పాయింటుని వింటూ, అనుభవీ మూర్తి అయ్యి వినటంలేదు. జ్ఞానీ ఆత్మ ప్రతి విషయం యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకుంటుంది. వినటం అంటే ఆ స్వరూపం యొక్క అనుభవీ అయ్యి వినటం, కానీ అనుభవీమూర్తిగా అవ్వటం తక్కువగా వస్తుంది. వినటం మంచిగా అనిపిస్తుంది, గుహ్యంగా కూడా అనిపిస్తుంది. సంతోషం కూడా ఉంటుంది. చాలా మంచి ఖజానా లభిస్తుంది కాని దానిని ఇముడ్చుకోవటం అంటే స్వరూపంగా అయ్యే అభ్యాసిగా ఉండాలి. నేను ఆత్మ నిరాకారిని, ఇది మాటి మాటికి వింటున్నారు కానీ నిరాకారి స్థితి యొక్క అనుభవి అయ్యి వినండి. ఎటువంటి పాయింటుయో ఆవిధమైన అనుభవం ఉండాలి. పరంధామం యొక్క విషయాలు వింటున్నప్పుడు పరంధామ నివాసి అయ్యి పరంధామ విషయాలు వినండి, స్వర్గవాసి దేవతాస్థితి యొక్క అనుభవీ అయ్యి స్వర్గం యొక్క విషయాలు వినండి. దీనినే వినటం అంటే ఇముడ్చుకోవటం అని అంటారు. ఇముడ్చుకోవటం అంటే స్వరూపంగా అవ్వటం. ఈవిధంగా మురళి వింటే శుద్ధసంకల్పాల ఖజానా జమ అయిపోతుంది. మరియు ఈ ఖజానా యొక్క అనుభవాన్ని మాటిమాటికి స్మరణ చేస్తూ ఉంటే మొత్తం సమయం బుద్ది దీనిలోనే బిజీగా ఉంటుంది. వ్యర్దసంకల్పాలతో సహజంగా తొలగించబడతారు. అనుభవిగా అయ్యి వినకపోతే బాబా ఖజానా మీ ఖజానాగా అవ్వదు. అందువలనే ఖాళీగా ఉంటున్నారు అంటే వ్యర్దసంకల్పాలకు స్వయమే స్థానం ఇస్తున్నారు మరియు ఇక ముందు మొత్తం దినచర్యలో ఏమేమి పొరపాటు చేస్తున్నారు అనేది అది మరో రోజు చెప్తాను. మొదట ఈ రెండు విషయాలను మంచిగా చేసుకోండి. ఎక్కువ మోతాదు మందు ఇవ్వటం లేదు. మంచిది.

సదా సమర్థులకు, సదా జ్ఞాన ఖజానాతో సంపన్నులకు, స్మృతియాత్ర ద్వారా సర్వశక్తుల అనుభవీమూర్తులకు, సదా ప్రతి పరిస్థితిని స్వ స్థితి ద్వారా సెకనులో మరియు సహజంగా దాటేవారికి, ఇలా బాబా సమానంగా గుణమూర్తి మరియు శక్తిమూర్తి, జ్ఞానీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.