సంగమయుగానికి ఎక్కేకళ ద్వారా సర్వుల ఉద్ధరణ
యొక్క విశేష వరదానం ఉంది.
స్వయాన్ని మాయ యొక్క అనేక రకాలైన రాయల్ రూపాల నుండి
రక్షించుకునే యుక్తులు చెప్తూ బాప్ దాదా మాట్లాడుతున్నారు -
అందరు సమయానుసారం స్వయాన్ని ప్రతి సమయం ఎక్కేకళలో
ప్రతి సెకను లేదా సంకల్పంలో అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఈ చిన్న సంగమయుగం
ఎక్కేకళ యొక్క సమయం అని అందరికీ తెలుసు. ఈ యుగానికి లేదా సమయానికి డ్రామానుసారం
ఎక్కేకళ ద్వారా సర్వుల ఉద్ధరణ జరిగే విశేష వరదానం లభించింది. ఇక ఇతర ఏయుగానికి
ఈవిధమైన వరదానం లభించదు.
సంగమయుగానికి ధర్మయుగం యొక్క విశేషత కూడా ఉంది అంటే
యదార్థ ధర్మం మరియు యదార్థ కర్మ చేసే శ్రేష్ఠాత్మలు ఈ ధర్మయుగంలోనే పాత్ర
అభినయిస్తారు. ధర్మశక్తి, రాజ్య శక్తి, వైజ్ఞానిక శక్తి అన్ని శక్తులు ఈ
యుగంలోనే తమ విశేష పాత్రను చూపిస్తాయి అంటే ఈ సమయంలోనే ఈ మూడు శక్తులు ఆత్మలకు
లభిస్తాయి. ఇటువంటి శ్రేష్ఠ సమయం యొక్క విశేష పాత్రధారులు ఎవరు? స్వయాన్ని
ఇటువంటి సమయం యొక్క శ్రేష్ఠ పాత్రధారిగా భావిస్తున్నారా?
ఎక్కేకళ అనేది విశేషాత్మలైన మీపై ఆధారపడి ఉంది. మీ
ఎక్కేకళ ద్వారానే సర్వాత్మల ఉద్దరణ అంటే కళ్యాణం జరుగుతుంది. సర్వాత్మలకు చాలా
సమయం నుండి ముక్తి పొందాలని ఆశ ఉంది. ఈ ఆశ మీ ఎక్కేకళ ఆధారంగానే పూర్తి
అవుతుంది.సర్వాత్మల ముక్తి యొక్క ప్రాప్తికి ఆధారం, మీ జీవన్ముక్తి యొక్క
ప్రాప్తి. ఇలా స్వయాన్ని ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా? ఇచ్చేటువంటి దాత
బాబా కానీ ఎవరిని నిమిత్తంగా చేసారు? వారసత్వం అనేది బాబా ద్వారా
ప్రాప్తిస్తుంది కానీ బాబా కూడా పిల్లలనే నిమిత్తంగా చేస్తున్నారు. ప్రతి
అడుగులో మీపై మీకు ఇంత ధ్యాస ఉంటుందా? విశేషాత్మలైన మా ఆధారంగానే సర్వుల ఉద్దరణ
ఉంది అని. ఈ స్మృతి ఉంచుకోవటం ద్వారా సోమరితనం మరియు నిర్లక్ష్యం సమాప్తి
అయిపోతాయి. ఇవి వర్తమాన సమయంలో చాలా మందిలో ఏదోక రూపంలో కనిపిస్తున్నాయి. దీని
కారణంగా ఎక్కేకళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు. ఈ ఆగిపోయే కళలో కూడా
చాలా తెలివైనవారు అయిపోయారు. తెలివైనవారు అయ్యి ఏమి చేస్తున్నారు? విన్నటువంటి
జ్ఞానం యొక్క విషయాలను లేదా సమయానుసారం బాబా ద్వారా ఏ యుక్తులు లభిస్తున్నాయో ఆ
యుక్తులను లేదా విషయాలను యదార్థంగా ఉపయోగించటంలేదు, దురుపయోగం చేస్తున్నారు.
భావాన్ని మార్చేసి విషయాన్ని పట్టుకుంటున్నారు. తమ పాత స్వభావానికి వశమై యదార్థ
భావాన్ని మార్చేస్తున్నారు.
బాప్ దాదా డ్రామా రహస్యాల యొక్క మాస్టర్
త్రికాలదర్శులుగా చేసేటందుకు పిల్లల ముందు సర్వ రహస్యాలను స్పష్టం చేస్తున్నారు.
బాబా డ్రామా యొక్క రహస్యం అనుసరించి పురుషార్థీల నెంబర్ లేదా రాజధాని యొక్క
రహస్యాన్ని చెప్తున్నారు - డ్రామాలో రాజధానిలో అన్ని రకాల పదవులు పొందేవారు
ఉంటారు, మాల నెంబర్ వారీగా తయారవుతుంది. కనుక అందరు మహారథీలుగా అవ్వరు లేదా
అందరు విజయీ మాలలోకి రారు, అందరు మహారాజులుగా అవ్వరు. అందువలన మా పాత్ర ఇలానే
ఉంటుంది. ఇలా బాబా అటువంటి పాయింట్స్ ముందుకి వెళ్ళేటందుకు చెప్తుంటే, పిల్లలు
ముందుకి వెళ్ళడానికి బదులు వాటి వ్యతిరేక లాభాన్ని తీసుకుంటున్నారు అంటే స్వయం
యొక్క సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని తొలగించుకోవటం లేదు. కానీ బాబా చెప్పే
విషయం యొక్క భావాన్ని మార్చేసి ఆ విషయాన్నే ఆధారంగా తీసుకుంటున్నారు మరియు మరలా
బాబాకే మీరే ఇలా చెప్పారు కదా అని చెప్తున్నారు. ఈ రకంగా స్వయం యొక్క రకరకాలైన
స్వభావాలకు వశమై,యదార్థ విషయాల యొక్క భావాలను మార్చేసి, ఆగిపోయే కళ యొక్క ఆట
మంచిగా చూపిస్తున్నారు. మాయాజీత్ గా అయ్యే యుక్తులను సమయానుసారం కార్యంలో
ఉపయోగించే ధ్యాస స్వయం తక్కువగా పెట్టుకుంటున్నారు. కానీ స్వయానికి స్వయం
రక్షించుకునే సాధనం - బాబా మాటలను ఉపయోగించుకుంటున్నారు. మాయ చాలా బలమైనది,
బ్రహ్మాబాబాను కూడా వదలదు, మహారథీలపై కూడా మాయ యుద్ధం చేస్తుంది అని మీరే
చెప్పారు కదా అంటున్నారు. ఎప్పుడైతే బ్రహ్మాబాబాని కూడా వదలదో, మహారథీలను కూడా
వదలదో మా దగ్గరకు వస్తే మేము ఓడిపోవటం ఏమైనా గొప్ప విషమయా! ఇది జరగవలసిందే,
అంతిమం వరకు ఇది నడుస్తూనే ఉంటుంది ఇలా పురుషార్థంలో ఆగిపోయే మాటలను స్వయానికి
ఆధారంగా చేసుకుని ఎక్కేకళలోకి వెళ్ళడానికి బదులు వంచితం అయిపోతున్నారు. మాయ
వస్తుంది అని బాబా చెప్పారు. కానీ మాయాజీత్, జగత్ జీత్ అనే మహిమ ఎవరిది? ఒకవేళ
మాయయే రాకపోతే, శత్రువు యుద్ధం చేయకుండా ఎవరైనా విజయీ అనబడతారా? మాయ వస్తుంది
కానీ ఓడిపోండి అని బాబా చెప్పటం లేదు. మాయపై యుద్ధం చేయాలి కానీ ఓడిపోకూడదు.
కల్ప, కల్పం యొక్క విజయీరత్నాలు మరియు విజయీగా అయ్యే చూపిస్తాను అనే ఈ సమర్థ
మాట మర్చిపోతున్నారు. కానీ స్వయం యొక్క బలహీనత కారణంగా బాబా యొక్క మాటను కూడా
బలహీనంగా చేసేస్తున్నారు. ఎలా అయితే బ్రహ్మాబాబా మాయాజీత్ గా అయ్యి జగజీత్
యొక్క పదవిని పొందారు. ఈ కల్ప కల్పం యొక్క పాత్ర స్మృతిచిహ్న రూపంలో కూడా ఉంది.
ఎలా అయితే బ్రహ్మబాబా మాయ ప్రబలంగా ఉన్నప్పటికి కూడా స్వయాన్ని బలవాన్ గా
చేసుకున్నారు, భయపడలేదు. ఇలా తండ్రిని అనుసరించండి.
విజయీగా అయ్యే భావాన్ని తీసుకోండి. పురుషార్థహీనులుగా
అయ్యే భావం, మీ అల్పబుద్ధి ప్రమాణంగా అర్థం చేసుకుంటూ స్వయాన్ని మోసం చేసుకోకండి.
బాబా యొక్క ప్రతి మాటలో ప్రతి ఆత్మ యొక్క మూడు కాలాల కళ్యాణం నిండి ఉంది.
అప్పుడే విశ్వకళ్యాణి అనే మహిమ చేయబడుతుంది. కళ్యాణ విషయాలను స్వయం యొక్క
అకళ్యాణార్ధం కార్యంలో ఉపయోగించకండి. ఈరోజుల్లో చాలామంది ఈ రకమైన జ్ఞానసాగరులుగా
ఉన్నారు. ఈ రకమైన జ్ఞానసాగరులు స్వయాన్ని చాలా తెలివైనవారిగా భావిస్తారు. కానీ
వ్యర్థ మరియు వ్యతిరేకమైన పనులు చేస్తారు. దీనిని రాయల్ రూపం యొక్క వికర్మ అని
అంటారు. కానీ స్వయాన్ని తెలివైనవారిగా సిద్ధి చేసుకునే పద్ధతి చాలా మంచిగా
వస్తుంది. వ్యర్థకర్మ లేదా రాయల్ రూపం యొక్క వికర్మ పైకి ఏమీ కనిపించదు కానీ
స్వయానికి మరియు ఇతరులకు చాలా నష్టం తీసుకువచ్చేది. దాని పరిశీలన ఏమిటంటే -
అటువంటి కార్యం చేయటం ద్వారా స్వయంలో సంతుష్టత ఉండదు, సంతోషం, శక్తి యొక్క
అనుభవం చేసుకోలేరు. స్వయాన్ని గుణాలు, శక్తుల యొక్క ఖజానాతో ఖాళీగా అనుభవం
చేసుకుంటారు. కానీ బయటికి దేహ అహంకారం కారణంగా తెలివి యొక్క అహంకారం కారణంగా తమ
తెలివిని స్పష్టం చేస్తూ ఉంటారు. వారి ప్రతి మాట లోపల ఖాళీగా ఉంటుంది. కానీ
బయటికి స్వయాన్ని దాచుకునే రూపం ఉంటుంది. ఖాళీ వస్తువు చాలా శబ్దం చేస్తుంది అని
అంటారు కదా! చాలా మంచిగా కనిపిస్తుంది, బయటికి చాలా మంచిగా కనిపిస్తుంది కానీ
లోపల మోసం చేసేదిగా ఉంటుంది. వెనువెంట అటువంటి కర్మలకు పరిణామం అనేక
బ్రాహ్మణాత్మలకు మరియు ప్రపంచం యొక్క అజ్ఞానీ ఆత్మలకు డిస్ సర్వీస్ చేయడానికి
నిమిత్తం అవుతుంది. అటువంటి వికర్మలతో మరియు వ్యర్థకర్మలతో స్వయంతో అసంతుష్టం
అయిపోతారు మరియు ఇతరులకు డిస్ సర్వీస్ అయిన కారణంగా ఎక్కేకళకు బదులు ఆగిపోయే
కథలోకి వచ్చేస్తారు. ..
నడుస్తూ, నడుస్తూ సంతోషం ఎందుకు తక్కువ అయిపోతుంది?
అని స్వయాన్ని పరిశీలించుకోండి. తీవ్రపురుషార్థం యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు ఎందుకు
తక్కువ అయిపోతున్నాయి? లేదా యోగయుక్త స్థితికి బదులు వ్యర్థ సంకల్పాల వైపు
ఎందుకు భ్రమిస్తున్నారు? లేదా స్వయం యొక్క స్వభావ సంస్కారాల బంధన ఎందుకు సమాప్తి
అవ్వటంలేదు? కారణం ఏమిటి? విశేషమైన కారణం ఏమిటంటే - ఆదిలో బాబా నుండి లభించిన
పురుషార్థం యొక్క యుక్తులతో చాలా శ్రమ చేసేవారు, అలసట లేదా మాయా విఘ్నాల యొక్క
ఏ చింత ఉండేది కాదు. బాబా లభించారు, వారసత్వం పొందాలి, అధికారిగా అవ్వాలి - అనే
ఈ నషాలో చాలా తీవ్రంగా అడుగు వేస్తూ ముందుకి నడిచేవారు. కానీ ఇప్పుడేమి
చేస్తున్నారు? ఈ రోజుల్లో ప్రపంచంలో శ్రమ చేయటం కష్టంగా అనిపిస్తుంది కానీ ఫలం
కావాలి కానీ శ్రమ పడకూడదు. అలాగే బ్రాహ్మణాత్మలు కూడా శ్రమతో సోమరితనంగా,
నిర్లక్ష్యంగా అయిపోతున్నారు. అందరు మహారథీలుగా, మహావీరులుగా
అవ్వాలనుకుంటున్నారు. కానీ శ్రమ కాల్బలం వారు చేసే శ్రమ కూడా చేయటం లేదు.
తయారైన స్థితి కావాలనుకుంటున్నారు కానీ శ్రమతో స్థితిని తయారు చేసుకోవాలని
అనుకోవటం లేదు. మేము దేనిలో తక్కువ అవ్వకూడదు. మా పేరు మహారథీల లిస్టులో ఉండాలి.
కానీ మహాథి యొక్క వాస్తవిక అర్థం, మహారథి యొక్క మహానత దానిలో స్థితులవ్వటంలో
కష్టంగా అనుభవం చేసుకుంటారు. సహయోగి అనే పేరు యొక్క లాభాన్ని మంచిగా
తీసుకుంటున్నారు, దీని కారణంగా అడుగు అడుగులో వేసి చేయవలసిన శ్రమ మరియు ఏదైతే
ధ్యాస కావాలో, పురుషార్థీ జీవితం యొక్క స్మృతి, బాబా తోడు యొక్క సమర్థత
ప్రత్యక్షంలో ఉండటం లేదు. శ్రమ చేయాలనుకోవటం లేదు కానీ బాబా సహాయంతో
దాటాలనుకుంటున్నారు. బాబా పని ఎక్కువగా స్మృతి ఉంచుకుంటున్నారు కానీ స్వయం
యొక్క పని మర్చిపోతున్నారు. దీని కారణంగా ఏవైతే యుక్తులు చెప్పారో వాటిని
కార్యంలో ఉపయోగించటం లేదు. సమయానికి ఉపయోగించటం రావటం లేదు. కానీ మాటి మాటికి
బాబాని యోగం ఎందుకు కుదరటం లేదు? ఏం చేయము? బంధన ఎందుకు తెగటం లేదు? ఏం చేయము?
అని అడుగుతున్నారు, రివైజ్ కోర్స్ జరుగుతుంది, రీలైజేషన్ (అనుభూతి) కోర్స్
జరుగుతుంది. ఈ కోర్సులలో బాప్ దాదా ఇది చెప్పలేదా? చెప్పేది ఏదైనా కొద్దిగా
ఉండిపోయిందా? ఇది మొదటి, రెండవ తరగతి పాఠం కనుక విన్నదానిని మననం చేయండి. మననం
చేయటం లేని కారణంగా శక్తిశాలిగా అవ్వకుండా బలహీనంగా అయిపోతున్నారు మరియు
బలహీనంగా అయిపోయిన కారణంగా మాటి మాటికి ఆగిపోతున్నారు. ఎక్కేకళ యొక్క అనుభవం
చేసుకోవటం లేదు. అందువలన సదా నిమిత్తంగా అయిన ఆత్మల ఎక్కేకళయే సర్వులకు ఆధారం
అనే స్మృతి ఉంచుకోండి.
బాబాని మరియు బాబా యొక్క ప్రతి మాటను యదార్థ రూపంతో
అర్ధం చేసుకునేవారికి, సదా స్వయం యొక్క శ్రమతో స్వయాన్ని మహాన్‌గా చేసుకుని
సర్వులను మహాన్‌గా చేసేవారికి, ప్రతి అడుగులో ఎక్కేకళ యొక్క లక్ష్యం మరియు
లక్షణాలను అనుభవం చేసుకునేవారికి, సదా స్వయాన్ని అనేక రకాలైన మాయా రూపాల నుండి
రక్షించుకునేవారికి, ఇలా మాయాజీత్, కల్ప,కల్పం యొక్క విజయీ రత్నాలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.