కమల పుష్పసమాన స్థితియే బ్రాహ్మణ జీవితం యొక్క
శ్రేష్ట ఆసనం.
సర్వప్రాప్తులకు ఆధారమైన బంధనముక్త, యోగయుక్త ఆత్మలతో
బాప్ దాదా ఈ మహావాక్యాలను ఉచ్చరించారు -
సదా బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ట ఆసనమైన కమలపుష్ప
సమాన స్థితిలో స్థితులై ఉంటున్నారా? బ్రాహ్మణుల ఆసనం సదా వెంట ఉంటుందా?
బ్రాహ్మణులైన మీరు సదా ఆసనంపై విరాజమానమై ఉంటున్నారా? కమలపుష్ప సమాన స్థితి అంటే
సదా ప్రతి కర్మేంద్రియం ద్వారా కర్మ చేస్తూ కూడా ఇంద్రియాల ఆకర్షణకు అతీతులు
మరియు ప్రియమైనవారు. కేవలం స్మృతిలో అతీతంగా, ప్రియంగా అవ్వటం కాదు. ప్రతి సెకను,
ప్రతి కర్మ అతీతం మరియు ప్రియమైన స్థితిలో ఉంటుందా! దీనికి స్మృతిచిహ్నంగా మీ
అందరి మహిమలో ఇప్పటి వరకు భక్తులు ప్రతి కర్మేంద్రియం యొక్క మహిమలో నయనాలు కమలం,
నోరు కమలం, హస్తాలు కమలం అంటూ మహిమ చేస్తున్నారు. కనుక ఇది ఏ సమయం యొక్క స్థితి
యొక్క ఆసనం? ఈ బ్రాహ్మణ జీవితానిది. స్వయాన్ని అడగండి - ప్రతి కర్మేంద్రియం కమలం
సమానంగా అయ్యిందా? నయనాలు కమలంగా అయ్యాయా? హస్తాలు కమలంగా అయ్యాయా? కమలం అంటే
కర్మ చేస్తూ కూడా వికారీ బంధనాల నుండి ముక్తులు. దేహం కూడా కనిపిస్తుంది, కానీ
చూస్తూ కూడా నయనాలు కమలంగా చేసుకున్నవారు దేహ ఆకర్షణ యొక్క బంధనలోకి రారు. ఎలా
అయితే కమలం నీటిలో ఉంటూ నీటికి అతీతంగా అంటే నీటి యొక్క ఆకర్షణ యొక్క బంధనకి
అతీతంగా ఉంటుందో, అలాగే అనేక రకాలైన సంబంధాలకు అతీతంగా ఉంటున్నారా? కమలానికి
చాలా సంబంధాలు ఉంటాయి, ఒంటరిగా ఉండదు. ప్రవృతి మార్గానికి గుర్తు కమలం.
బ్రాహ్మణులు అంటే కమలపుష్ప సమానంగా అయ్యే ఆత్మలు. ప్రవృత్తిలో ఉంటూ, లౌకికం
అయినా లేదా అలౌకికమైన అంటే మురికిలో ఉంటూ అంటే తమోప్రధాన వాతావరణంలో ఉంటూ కూడా
అతీతంగా ఉంటారు. ఏ గుణం రచనలో ఉందో, మాస్టర్ రచయితలో ఆ గుణం ఉండాలి. సదా ఈ
ఆసనంపై స్థితులవుతున్నారా లేదా అప్పుడప్పుడు స్థితులవుతున్నారా? సదా మీ యొక్క ఈ
ఆసనాన్ని ధారణ చేసేవారే సర్వ బంధనముక్త్, మరియు సదా యోగయుక్తంగా అవుతారు.
స్వయాన్ని చూసుకోండి - పంచవికారాలు, పంచ ప్రకృతి యొక్క తత్వాల బంధనాల నుండి ఎంత
శాతంలో ముక్తి అయ్యాను? అని. లిప్త ఆత్మలా లేక ముక్త ఆత్మలా?
మీరందరు బాప్ దాదాతో ప్రతిజ్ఞ చేసారు కదా - అన్నింటిని
వదిలి మీవారిగా అవుతాము, ఏది చెప్తే, ఎలా చేయిస్తే, ఎలా నడిపిస్తే అలా నడుస్తాను
అని. మరి ఈ ప్రతిజ్ఞను నిలుపుకుంటున్నారా? రోజంతటిలో ఎంత సమయం ప్రతిజ్ఞను
నిలుపుకుంటున్నారు మరియు ఎంత సమయం ప్రతిజ్ఞను మర్చిపోతున్నారు? నాకు ఒక్క
శివబాబా తప్ప మరెవ్వరు లేరు అనే పాట రోజు పాడుతున్నారు కదా! ఇటువంటి స్థితి ఉందా?
ఇక ఇతర సంబంధం, స్నేహం, సహయోగం లేదా ప్రాప్తి, వ్యక్తి లేదా వైభవం బాబా నుండి
వేరు చేసేవారిగా ఉన్నాయా? ఉన్నారా? ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు బంధనముక్త
ఆత్మను తమ ఆకర్షణ యొక్క బంధనలో బంధిస్తున్నాయా? ఎప్పుడైతే ఇతరులు ఎవరు లేరో
నిరంతర బంధనముక్తులుగా, యోగయుక్త ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఇతరులు ఎవరు
లేరు అని అంటున్నారు కదా! ఎవరైనా ఉన్నారా? లేక అన్నీ సమాప్తి అయిపోయాయా? ఒకవేళ
ఉంటే ఆ పాట ఎందుకు పాడుతున్నారు? బాప్ దాదాని సంతోషం చేసేటందుకు పాడుతున్నారా?
లేదా మీ స్థితిని తయారుచేసుకునేటందుకు పాడుతున్నారా? బ్రాహ్మణజీవితం యొక్క
విశేషతను తెలుసుకుంటున్నారా? బ్రాహ్మణులు అంటే ఆలోచించటం, మాట్లాడటం, చేయటం
అన్నీ ఒకేలా ఉండాలి, తేడా ఉండకూడదు. మరి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఎప్పుడు
ధారణ చేస్తారు? ఇప్పుడా లేక అంతిమంలోనా? కొంతమంది పిల్లలు స్వయం పురుషార్ధం
చేయడానికి బదులు సమయంపై వదిలేస్తున్నారు. ఇలా కూడా ఉన్నారు. సమయం వచ్చేసరికి
ఆత్మలు స్వయం బలహీనంగా ఉన్న కారణంగా సమయంపై పెట్టేస్తున్నారు. మీ దగ్గర కూడా
మ్యూజియం లేదా ప్రదర్శిని చూడడానికి వస్తే ఏమంటారు? సమయం లభిస్తే వస్తాము అని
అంటారు. ఇప్పుడు మాకు సమయం లేదు అని అంటారు, ఇది అజ్ఞానుల మాట. ఎందుకంటే సమయం
యొక్క జ్ఞానంతో అజ్ఞానులు, కానీ మీకైతే ఇప్పుడు ఏ సమయం నడుస్తుంది అనే జ్ఞానం
అయితే ఉంది. ఈ వర్తమాన సమయాన్ని ఏ సమయం అని అంటారు? కళ్యాణకారి యుగం లేదా సమయం
అని అంటారు కదా! కల్పమంతటి సంపాదన యొక్క సమయం అని అంటారు. శ్రేష్ట కర్మ రూపి
బీజం నాటే సమయం అని అంటారు. 5000 సంవత్సరాల సంస్కారాలను నింపుకునే సమయం అని
అంటారు. విశ్వకళ్యాణం, విశ్వపరివర్తన యొక్క సమయం అని అంటారు. సమయం యొక్క జ్ఞానం
ఉన్నవారు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటూ, వచ్చే సమయంపై వదిలేస్తూ ఉంటే
వారిని ఏమంటారు? సమయం కూడా మీ యొక్క రచన. రచన ఆధారంగా రచయిత యొక్క పురుషార్ధం
ఉంటే, అంటే సమయం ఆధారంగా స్వయం యొక్క పురుషార్ధం ఉంటే వారిని రచయిత అని అంటారా?
బాప్ దాదా మొదట కూడా చెప్పారు - శ్రేష్టాత్మలైన మీరు
సృష్టికి ఆధారమూర్తులు, ఆధారమూర్తులైన మీరు సమయానికి, ఏదైనా ఆధారానికి ఆధారపడితే
ఆధీనులు అంటారా లేదా ఆధారమూర్తులు అని అంటారా? కనుక స్వయాన్ని పరిశీలించుకోండి
- సృష్టికి ఆధారమూర్తులైన ఆత్మలు ఏ ఆధారంగా నడవటం లేదు కదా? ఒక్క బాబా యొక్క
ఆధారంపై నడిచేవారు, కానీ హద్దు యొక్క ఏ ఆధారంతో నడిచేవారు కాదు. ప్రతిజ్ఞ అయితే
ఇదే చేసారు కదా! నాకు ఒక్క బాబాయే తోడు అని. కానీ ప్రత్యక్షంలో ఏమి చేస్తున్నారు?
ఒక బాబాని తోడుగా చేసుకుంటే ఏమి అనుభవం అవుతుంది? సదా ఒకే అవినాశి తోడుని
తీసుకుంటే ఈ కలియుగీ పతిత ప్రపంచం నుండి అతీతంగా అనుభవం చేసుకుంటారు. అటువంటి
ఆత్మల యొక్క జీవననౌక కలియుగీ ప్రపంచం యొక్క ఒడ్డుని దాటిపోయింది. సదా స్వయాన్ని
కలియుగీ పతిత వికారీ ఆకర్షణలకు అతీతంగా అనుభవం చేసుకుంటారు. ఏ కలియుగీ ఆకర్షణ
వారిని ఆకర్షించలేదు. ఎలా అయితే విజ్ఞానం ద్వారా భూమి యొక్క ఆకర్షణకు అతీతంగా
అంతరిక్షంలోకి వెళ్తున్నారు కదా, అంటే దూరంగా వెళ్తున్నారు. ఏ రకమైన ఆకర్షణ అంటే
దేహం యొక్క, సంబంధం యొక్క, దేహ పదార్థాల యొక్క ఆకర్షణ వస్తుంది అంటే దీని ద్వారా
ఋజువు అవుతుంది ఏమిటంటే ఏదోక తోడు యొక్క ప్రత్యక్ష ప్రమాణంగా వినాశి, అల్పకాలిక
తోడు తీసుకున్న కారణంగా ప్రాప్తి కూడా అల్పకాలికంగా లభిస్తుంది. అంటే వినాశి,
కొద్ది సమయానికే ఉంటుంది. కొంతమంది అంటున్నారు - కొద్దిగా అనుభవం అవుతుంది,
స్మృతి ఉంటుంది, శక్తి లభిస్తుంది, శక్తి స్వరూపం యొక్క అనుభవం అవుతుంది, కానీ
సదా ఉండటం లేదు అని దీనికి కారణం ఏమిటి? అంటే తప్పకుండా ఒకే తోడుని
తీసుకోవడానికి బదులు ఏదోక హద్దు తోడుని ఆధారంగా తీసుకున్నట్లే. ఆధారమే
చలిస్తుంది కనుక స్వయం కూడా చలిస్తున్నారు అంటే అలజడిలోకి వస్తున్నారు. కనుక మీ
ఆధారాన్ని పరిశీలించుకోండి, పరిశీలించుకోవటం వస్తుందా? పరిశీలన చేసుకునేటందుకు
దివ్య అంటే సమర్థబుద్ధి కావాలి. లేకపోతే కనుక బుద్దివంతులైన ఆత్మల సహయోగంతో
స్వయాన్ని పరిశీలన చేయించుకోండి. బాప్ దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మతోనే
దివ్య సమర్ధ బుద్ధి మరియు దివ్యనేత్రం బ్రాహ్మణ జన్మ యొక్క వరదాన రూపంలో ఇచ్చారు.
బ్రాహ్మణ జన్మ యొక్క పుట్టినరోజు యొక్క బహుమతి బాబా ద్వారా ప్రతి ఒక్కరికి
లభించింది. మీ పుట్టినరోజు బహుమతిని సంభాళించుకోవటం వస్తుందా? ఒకవేళ సదా ఈ
బహుమతిని యదార్ధ రీతిలో ఉపయోగిస్తూ సదా కమలపుష్ప సమానంగా ఉండండి. అంటే సదా
కమలపుష్ప సమాన స్థితి యొక్క ఆసనంపై స్థితులవ్వండి. ఏమి పరిశీలన చేసుకోవాలో
అర్ధమైందా! సర్వ కర్మేంద్రియాలు ఎంత వరకు కమలంగా అయ్యాయి? ఇలా కమలం సమానంగా
అయ్యేవారు సదా ఆకర్షణలకు అతీతంగా అంటే సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా
ఉండలేకపోతున్నారు అంటే ఎక్కడోక్కడ ఆకర్షితం అయిపోతున్నారు. కనుక హర్షితంగా
ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఈ అన్ని విషయాలకు బుద్ధి ద్వారా అతీతం అయిపోండి.
చెప్పటం మరియు చేయటం ఒకటే చేయండి. ప్రతిజ్ఞ చేసేవారిగా కాదు, నిలుపుకునేవారిగా
అవ్వండి.
సదా సర్వ సంబంధాలతో ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు ఇలా
సదా స్వయాన్ని ఆధారమూర్తిగా భావించేవారికి, సమయం యొక్క ఆధారానికి అతీతంగా
స్వయాన్ని సమర్ధంగా, తెలివిగా నడిపించుకునే సమర్ధ ఆత్మలకు, బంధనముక్త ఆత్మలకు,
సదా యోగయుక్త ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.