16.06.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఒకే చదువు ద్వారా నెంబర్ వారీ పూజ్య పదవి పొందే రహస్యం.

సృష్టికి ఆధారమూర్తులు, విశ్వపరివర్తక ఆత్మలతో బాప్ దాదా ఉచ్చరించిన మహావాక్యాలు -
ఈ రోజు బాప్ దాదా ప్రతి ఆత్మ పురుషార్థం చేసే కర్మ యొక్క గతి మరియు పురుషార్ధం అనుసారంగా రాజ్యపదవి లేదా పూజ్యపదవి యొక్క గతి ఏదైతే ఉందో అది అతి రమణీయకమైనది మరియు గుహ్యమైనది అది చూస్తున్నారు. ఎలా అయితే పురుషార్థంలో నెంబర్ వారీగా ఉన్నారో అలాగే పదవిలో మరియు పూజ్య పదవిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఎవరైతే నెంబర్ వన్ శ్రేష్ట పురుషార్థీలు ఉంటారో వారి రాజ్యపదవి మరియు పూజ్యపదవి కూడా అతి శ్రేష్టమైనది మరియు దానిలో గుహ్య రహస్యం ఇమిడి ఉంది. పూజ్యులుగా అయితే అందరు అవుతారు. సృష్టిలో పురుషార్థీ ఆత్మలందరు పరమపూజ్యులే. అష్టరత్నాలైనా లేదా 108 మాలలోని వారైనా లేదా 16 వేల మాలలో వారైనా లేదా 9 లక్షల ప్రజా పదవి పొందే వారైనా కానీ అందరు ఏదోక రూపంలో పూజ్యులుగా తప్పకుండా అవుతారు. ఇప్పటి వరకు కూడా లెక్కలేనన్ని సాలిగ్రామాలను తయారుచేసి పూజ చేస్తున్నారు. కానీ అనేక సాలిగ్రామాల రూపంలో జరిగే పూజకు మరియు ఇష్ట దేవతల మందిరాలలో జరిగే పూజకు ఎంత తేడా ఉంటుంది! ఇదైతే తెలుసు కదా? సాలిగ్రామ రూపంలో అనేకులకు పూజ జరుగుతుంది మరియు అష్టదేవతల రూపంలో విశేషమైన కొద్ది మంది ఆత్మలకే జరుగుతుంది. 16 వేల మాలను కూడా అప్పుడప్పుడు స్మరణ చేస్తారు, 108 మాలను అయితే అనేకసార్లు స్మరణ చేస్తారు మరియు అష్టరత్నాలను లేదా అష్టదేవతలను లేదా దేవీలను బాబా సమానంగా సదా తమ హృదయంలో స్మృతి ఉంచుకుంటారు. ఇంత తేడా ఎందుకు వచ్చింది? బాప్ దాదా అయితే పిల్లలందరికీ ఒకే చదువు, ఒకే లక్ష్యం - మానవులనుండి దేవతగా లేదా విజయీరత్నంగా అయ్యేటువంటి లక్ష్యం ఇస్తున్నారు అయినప్పటికీ పూజలో ఇంత తేడా ఎందుకు? కొంతమందికి డబుల్ పూజ అంటే సాలిగ్రామాల రూపంలో కూడా మరియు దేవీ దేవతల రూపంలో కూడా జరుగుతుంది. కొంతమందికి కేవలం సాలిగ్రామ రూపంలో, మాలలో మణుల రూపంలో పూజ జరగుతుంది. దీనికి కూడా రహస్యం ఏమిటి? ముఖ్య కారణమేమిటంటే ఆత్మాభిమానిగా అయ్యే లక్ష్యం లేదా ఆత్మిక స్వరూపంలో స్థితులయ్యే పురుషార్ధం, ప్రతి బ్రాహ్మణాత్మ జన్మతోనే చేస్తున్నారు. ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్ధం చేయకుండా బ్రాహ్మణులు ఎవరు ఉండరు కానీ నిరంతరం ఆత్మాభిమాని, దీని ద్వారా కర్మేంద్రియాలపై విజయీ అవ్వటం ద్వారా ప్రతి కర్మేంద్రియం సతో ప్రధానంగా, స్వచ్ఛంగా అవుతుంది. ఈ సబ్జక్టులో అంటే దేహం యొక్క పాత సంస్కారాలు, సంబంధంతో సమర్పణ మరజీవగా అవ్వాలి, ఈ పురుషార్థంలో నెంబర్ తయారవుతుంది. ఏ పురుషార్థీ కర్మేంద్రియాలపై విజయీగా అంటే కర్మేంద్రియజీత్ అవుతారో, కొంతమంది కళ్ళు యొక్క మోసంలో, నోటి ద్వారా అనేక రసాలు పొందే మోసంలో ఇలా ఏదోక కర్మేంద్రియం యొక్క మోసంలోకి వచ్చేస్తున్నారు అంటే సంపూర్ణ నిర్వికారి, సర్వ ఇంద్రియాలజీత్ అవ్వటం లేదు. దీని కారణంగా ఇలా కర్మేంద్రియాలపై ఓడిపోయే బలహీన పురుషార్థులు ఉన్నతోన్నతమైన బాబా పిల్లలుగా అయిన కారణంగా, ఉన్నతోన్నతమైన బాబా సాంగత్యంలో ఉన్న కారణంగా, చదువు మరియు పాలనలో ఉన్న కారణంగా, విశ్వంలో శ్రేష్ట ఆత్మలుగా ఉన్న కారణంగా ఆత్మ అంటే సాలిగ్రామ రూపంలో పూజింపబడుతున్నారు. కానీ సర్వ కర్మేంద్రియజీత్ అవ్వని కారణంగా సాకార రూపంలో దేవీ మరియు దేవత రూపంలో పూజ జరగటంలేదు. సంపూర్ణ పవిత్రంగా అవ్వని కారణంగా, సంపూర్ణ నిర్వికారి, మహిమా యోగ్య దేవీ, దేవతా రూపం యొక్క పూజ జరగటంలేదు. సదా బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారిగా అవ్వని కారణంగా లేదా సదా హృదయంలో ఒకే మనస్సుని తీసుకునే బాబా స్మృతి లేదా సదా మనస్సులో మనోభిరాముని స్మృతి ఉండటం లేదు. అందువలనే భక్తాత్మలు కూడా అష్టదేవి రూపంలో మనస్సులో ఇముడ్చుకోవటం లేదు, నిరంతర స్మృతి లేకపోతే సదాకాలిక మందిరం రూపంలో స్మృతిచిహ్నం కూడా ఉండదు అంటే తేడా వచ్చేసింది కదా! సింగిల్ పూజ మరియు డబుల్ పూజలో ఎంత తేడా వస్తుంది! ప్రజల యొక్క పూజ రూపం మరియు రాజ్యపదవి పొందే వారి యొక్క పూజా రూపంలో కూడా తేడా ఉంటుంది.

విశేషమైన దేవతలకు ప్రతి కర్మకు పూజ జరుగుతుంది మరియు కొంతమంది దేవతలకు రోజు పూజ జరుగుతుంది కానీ ప్రతి కర్మకు జరుగదు, కొంతమందికి అప్పుడప్పుడు విశేషమైన నిశ్చితమైన రోజులలో జరుగుతుంది, దీనికి కూడా రహస్యం ఉంది. స్వయానికి స్వయం అడగండి మేము ఏవిధమైన పూజ్యులుగా అవుతాము? అని. ఒకవేళ ఏ సబ్జక్టులో అయినా విజయీగా అవ్వకపోతే, ఎలా అయితే ఖండితమూర్తులకు పూజ జరుగదు కదా! సాధారణ రాయిగా భావిస్తారు, ఏ విలువ ఉండదు అలాగే ఒకవేళ ఏదైనా సబక్టులో సంపూర్ణ విజయీగా కాకపోతే పరమపూజ్యులుగా కాలేరు. పూజ్యులుగా అవుతారు మరియు మహిమాయోగ్యులుగా అవుతారు. మహిమా యోగ్యులుగా ఎందుకు అవుతారు? ఎందుకంటే బాబా యొక్క పిల్లలుగా అయిన కారణంగా బాబాతో పాటు పాత్ర అభినయిస్తున్న కారణంగా లేదా శక్తిననుసరించి స్మృతిలో ఉంటున్న కారణంగా అవుతారు.

పూజకు రహస్యమేమిటంటే - 1.పవిత్రత కారణంగా పూజ జరుగుతుంది, 2. శ్రేష్ట ఆత్మలకు సర్వశక్తివంతుడైన బాబా ద్వారా ఏ శక్తులైతే ధారణ చేసారో ఆ శక్తులకు కూడా రకరకాల రూపాలతో స్మృతిచిహ్న రూపంలో పూజ జరుగుతుంది. ఎలా అయితే ఏ ఆత్మలైతే విద్య అంటే జ్ఞాన ధారణ చేసేటువంటి శక్తిని సంపూర్ణ రూపంతో ధారణ చేస్తారో జ్ఞానం అంటే నాలెడ్జ్ శక్తికి స్మృతిచిహ్నంగా సరస్వతి రూపంలో పూజ జరుగుతుంది. సంహారం చేసే శక్తికి స్మృతిచిహ్నంగా దుర్గ రూపంలో, జ్ఞానధనాన్ని ఇచ్చేటువంటి మహాదాని, సర్వఖజానాల ధనాన్ని ఇచ్చేవారికి లక్ష్మి రూపంలో పూజ జరుగుతుంది. ప్రతి విఘ్నంపై విజయం పొందిన దానికి గుర్తుగా విఘ్నవినాశకుని రూపంలో పూజ జరుగుతుంది. మాయాజీత్ అంటే మాయ యొక్క విరాళరూపాన్ని కూడా సహజం మరియు సరళంగా చేసుకున్న శక్తికి మహావీర్ రూపంలో పూజ జరుగుతుంది. శ్రేష్ట ఆత్మల యొక్క ప్రతి శక్తికి మరియు శ్రేష్ట కర్మకు కూడా పూజ జరుగుతుంది, శక్తులకు దేవీ, దేవతల రూపంలో పూజను చూపించారు. ఎవరికైతే ప్రతి శ్రేష్టకర్మకు మరియు శక్తులకు పూజ జరుగుతుందో వారినే పరమపూజ్యులు అని అంటారు. కనుక సదా స్వయాన్ని సంపూర్ణంగా చేసుకోండి. ఖండితమూర్తినా లేక పూజ్యమూర్తినా? అని పరిశీలన చేసుకోండి. సంపూర్ణ నిర్వికారి, 16 కళా సంపూర్ణులు అనే మహిమ ఉంది. కేవలం నిర్వికారిగా అయ్యారా లేక సంపూర్ణ నిర్వికారి అయ్యారా? అఖండ యోగం ఉందా లేక ఖండితం అవుతుందా? అచంచలంగా ఉన్నారా, అలజడిలో ఉన్నారా? బాబా ఏమి కోరుకుంటున్నారు? ప్రతి ఆత్మ బాబా సమానంగా సంపూర్ణంగా అవ్వాలి అని మరియు పిల్లలు కూడా కోరుకుంటున్నారు కానీ కొద్దిమందే చేస్తున్నారు. అందువలనే నెంబర్ తయారవుతుంది. మంచిది, చాలా విన్నారు. వినటం మరియు చేయటం - దీనిని సమానంగా చేసుకోండి. ఏమి చేయాలో అర్థమైందా!

ఇలా పరమపూజ్యులకు, సదా ఒకే బాబాను తోడుగా ఉంచుకునేవారికి, ప్రతి అడుగు శ్రేష్టమతం ఆధారంగా నడిచేవారికి, ఇలా సృష్టికి ఆధారమూర్తి, విశ్వపరివర్తక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.