యోగం యొక్క శక్తిశాలి స్థితి ఎలా తయారవుతుంది.
సదా బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారి,
నమ్మకదారి, సదా స్వయాన్ని అభ్యాసంలో బిజీగా ఉంచుకునే సంపూర్ణ జ్ఞానం మరియు యోగం
యొక్క ప్రతి విశేషతను జీవితంలో తీసుకువచ్చే ఆత్మలతో బాప్ దాదా ఉచ్చరించిన
మహావాక్యాలు -
ఆత్మిక కలయిక జరుపుకునేటందుకు వరదాన భూమికి వచ్చారు.
ఆత్మిక కలయిక మాటలకు అతీతమైన స్థితిలో స్థితులవ్వటం ద్వారా అవుతుందా లేక
మాటలలోకి రావటం వలన అవుతుందా? మాటలకు అతీతమైన స్థితి ప్రియంగా అనిపిస్తుందా లేక
మాటలలోకి వచ్చే స్థితి ప్రియంగా అనిపిస్తుందా? మాటలకు అతీతమైన స్థితి
శక్తిశాలిగా మరియు సర్వుల సేవకి నిమిత్తంగా అనుభవం అవుతుందా లేక వాణీ ద్వారా
సేవ చేయటం ద్వారా స్థితి శక్తిశాలిగా అనుభవం అవుతుందా? బేహద్ సేవ వాణీకి
అతీతమైన స్థితి ద్వారా అవుతుందా లేక వాణీ ద్వారా జరుగుతుందా? అంతిమ సంపూర్ణ
స్థితి దీనిలో సంపన్న మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ స్థితి
ప్రత్యక్షంలో ఉంటుంది. ఇటువంటి సంపూర్ణ స్థితి వాణీకి అతీతంగా అవ్వటం ద్వారా
అవుతుందా లేదా వాణీలోకి రావటం ద్వారా అవుతుందా? సర్వాత్మల పట్ల విశ్వకళ్యాణకారి,
మహాదాని, వరదాని, సర్వుల సర్వ కామనలను పూర్తి చేసే స్థితి వాణీకి అతీతంగా అవ్వటం
ద్వారా జరుగుతుందా లేదా వాణీలోకి రావటం ద్వారా వస్తుందా? రెండింటి యొక్క అనుభవం,
రెండు స్థితుల గురించి తెలిసినవారే కదా? రెండింటిలో దేనిలో ఎక్కువ సమయం
స్థితులవుతున్నారు? ఏ స్థితి సహజంగా అనుభవం అవుతుంది? ఇలా ఎవరెడిగా ఉన్నారా?
సెకనులో ఏ స్థితిలో స్థితులయ్యే సలహా లభిస్తే ఆ సమయంలో స్వయాన్ని ఆ స్థితిలో
స్థితులు చేసుకోగలుగుతున్నారా లేక స్థితులవ్వటంలో సమయం పోతుందా? ఎందుకంటే
సంపన్నంగా అయ్యే సమయం సమీపంగా వస్తుంది. కనుక సమాయానికి ముందే స్వయంలో ఈ
విశేషతను అనుభవం చేసుకుంటున్నారా? అంతిమ సమయంలో ఫుల్ స్టాప్(బిందువు)పెట్టే
సర్వశ్రేష్ట సాధనం ఇదే - ఏ సలహా లభిస్తే దాని ప్రమాణంగా, ఆ ఘడియలో ఆ స్థితిలో
స్థితులవ్వాలి. ఈ సాధన యొక్క అభ్యాసాన్ని అనుభవంలోకి తీసుకువస్తున్నారా? అభ్యాసం
ఉందా? బాప్ దాదా అభ్యాసమైతే చాలా సమయం నుండి నేర్పించారు మరియు నేర్పిస్తూ
ఉన్నారు, కానీ ఈ అభ్యాసంలో స్వయాన్ని సంపన్నంగా ఎంత వరకు భావిస్తున్నారు?
ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క అంతిమంలో స్వయాన్ని ఇలా ఎవరెడిగా చేసుకోవాలి, తయారేనా?
లేక సమయాన్ని చూస్తూ స్వయం అభ్యాసం చేయటంలో మరింత సోమరిగా అయిపోతున్నారా?
వినాశనం ఎప్పుడు అవుతుంది? అని ఈ విషయం గురించి ఆలోచిస్తూ పురుషార్థంలో సంపన్నం
అవ్వటానికి బదులు వ్యర్థచింతన లేదా వ్యర్దసంకల్పాల యొక్క బలహీనతలో విశ్రాంతికి
ఇష్టమైనవారిగా అయిపోయారా?
ఈరోజుల్లో పిల్లల యొక్క వేగాన్ని చూస్తూ బాప్ దాదా
నవ్వుకుంటూ ఉంటారు. సర్వ ఆత్మలకు మాటి మాటికి యోగిగా అవ్వండి, జ్ఞాని అవ్వండి
అని సందేశం ఇస్తూ ఉంటారు కదా! మరి ఈ సందేశం ఇచ్చే మీరు స్వయానికి ఈ సందేశం
ఇచ్చుకుంటున్నారా? ఎక్కువమంది ఆత్మలు విశేష సబ్జక్టు అయిన స్మృతియాత్ర లేదా
యోగీభవ అనే స్థితిలో బలహీనంగా కనిపిస్తున్నారు. మాటి మాటికి ఒకే ఫిర్యాదు బాప్
దాదా లేదా నిమిత్తంగా అయిన ఆత్మల ముందు చేస్తున్నారు. యోగం ఎందుకు కుదరటం లేదు?
నిరంతర యోగం ఎందుకు ఉండటంలేదు? యోగం యొక్క శక్తిశాలి స్థితిని ఏవిధంగా
తయారుచేసుకోవాలి? అనేక సార్లు, అనేక రకాలైన యుక్తులు లభిస్తున్నప్పటికీ మాటి
మాటికి ఇవే ఫిర్యాదులు బాబాకి చెప్తున్నారు. దీని ద్వారా ఏమి
అర్ధమౌతుంది?సర్వశక్తివంతుని పిల్లలుగా అయ్యి శక్తిహీన ఆత్మలుగా ఉన్నట్లు కదా?
ఎవరైతే స్వయాన్ని అదుపులో పెట్టుకోలేరో వారు విశ్వరాజ్యం యొక్క రాజ్యాన్ని
ఏవిధంగా అదుపు చేస్తారు? కారణం ఏమిటి? యోగమైతే నేర్చుకున్నారు కానీ యోగయుక్తంగా
ఉండేటువంటి యుక్తులను ప్రయోగం చేయటం రావటం లేదు. యోగం చేస్తున్నారు కానీ
ప్రయోగంలోకి తీసుకువచ్చే ధ్యాస పెట్టుకోవటంలేదు.
వర్తమాన సమయంలో విశేషంగా ఒక అల కనిపిస్తుంది. ఏ
విషయమైనా ఎదురుగా వస్తే బాబా ద్వారా లభించిన ఎదుర్కునే శక్తిని స్వయం
ప్రయోగించటం లేదు. కానీ బాబా ఎదురుగా పెడుతున్నారు మీరు వెంట తీసుకువెళ్ళాలి,
మాకు శక్తిని ఇవ్వండి, సహాయం చేయటం నీ పని, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు,
కొద్దిగా ఆశీర్వాదాలు ఇవ్వండి, మీరు సాగరుడు కదా మాకు కొద్దిగా బిందువు ఇవ్వండి
అంటూ స్వయం ఎదుర్కునే శక్తి యొక్క ధైర్యాన్ని వదిలేస్తున్నారు మరియు
ధైర్యహీనులుగా అయిన కారణంగా సహాయం నుండి కూడా వంచితులుగా అయిపోతున్నారు.
బ్రాహ్మణ జీవితం యొక్క విశేష ఆధారం - ధైర్యం. ఎలా అయితే శ్వాస లేకపోతే జీవితం
లేదో అలాగే ధైర్యం లేకపోతే బ్రాహ్మణులు కాదు. బాబా యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే
ధైర్యం ఉన్న పిల్లలకే బాబా సహాయం చేస్తారు, కేవలం సహాయం చేసే తండ్రి కాదు. ఈ
రోజుల్లో బాబాపై వదిలేస్తున్నారు మరియు స్వయం సోమరిగా అయిపోతున్నారు. ఇప్పుడు
ఏమి చేయాలి? విశేష బలహీనత ఇదే. ప్రతి శక్తి లేదా ప్రతి జ్ఞానం యొక్క యుక్తిని
వింటూ, లభిస్తున్నప్పటికీ స్వయం పట్ల ఉపయోగించటం లేదు అంటే అభ్యాసంలోకి
తీసుకురావటం లేదు. కేవలం వర్ణన చేసే వరకు ఉంటున్నారు కానీ అంతర్ముఖి అయ్యి ప్రతి
శక్తిని ధారణ చేసే అభ్యాసంలోకి వెళ్ళండి. ఎలా అయితే ఏదైనా కొత్త ఆవిష్కరణ చేసే
వ్యక్తి రాత్రి, పగలు ఆ ఆవిష్కరణ యొక్క సంలగ్నతలో నిమగ్నమై ఉంటారో అలాగే ప్రతి
శక్తి యొక్క అభ్యాసంలో నిమగ్నమై ఉండాలి. సహనశక్తి లేదా ఎదుర్కునేశక్తి అని
దేనిని అంటారు? సహనశక్తి ద్వారా ఏమి ప్రాప్తి లభిస్తుంది? సహనశక్తిని ఏ సమయంలో
ఉపయోగించాలి? సహనశక్తి లేకపోవటం వలన ఏ రకమైన విఘ్నాలకు వశీభూతం అవుతారు? ఒకవేళ
ఏదైనా మాయా రూపం క్రోధం రూపంలో ఎదుర్కుంటే ఏ రూపంలో విజయీగా అవుతారు? ఏయే
పరిస్థితుల రూపంలో మాయ సహనశక్తి యొక్క పేపర్ తీసుకుంటుంది? ముందుగానే
విస్తారాన్ని బుద్ధి ద్వారా ఎదురుగా తెచ్చుకోండి. నిజమైన పరిక్షా హాల్ లోకి
వెళ్ళేముందు స్వయానికి మాస్టర్‌గా అయ్యి స్వయం పేపర్ తీసుకోండి. అప్పుడిక
నిజమైన పరిక్షలో ఎప్పుడు ఫైయిల్ అవ్వరు. ఇలా ఒక్కొక్క శక్తి యొక్క విస్తారమనే
అభ్యాసంలోకి వెళ్ళండి. అభ్యాసం తక్కువగా చేస్తున్నారు. వ్యాసులుగా అందరు అయ్యారు,
కానీ అభ్యాసం చేయటం లేదు. ఇలా స్వయాన్ని బిజీగా ఉంచుకోవటం రావటం లేదు. అందువలన
మాయ మిమ్మల్ని బిజీ చేసేస్తుంది. ఒకవేళ సదా అభ్యాసంలో బిజీగా ఉంటే
వ్యర్దసంకల్పాల యొక్క ఫిర్యాదు కూడా సమాప్తి అయిపోతుంది. వెనువెంట వీరు
అభ్యాసంలో ఉన్న ప్రభావం మీ ముఖం ద్వారా కనిపిస్తుంది. ఏమి కనిపిస్తుంది?
అంతర్ముఖి సదా హర్షితముఖిగా కనిపిస్తారు. ఎందుకంటే మాయని ఎదుర్కోవటం సమాప్తి
అయిపోతుంది. అనుభవాలను పెంచుకుంటూ నడవటం ద్వారా మాటి మాటికి ఒకే ఫిర్యాదు చేయటం
నుండి విడిపించబడతారు. ఎలా అయితే సర్వశక్తుల యొక్క అభ్యాసం కొరకు వినిపించారో
అలాగే స్వయం యోగీఆత్మగా పిలిపించుకుంటున్నారు. కానీ యోగం యొక్క పరిభాష ఏదైతే
ఇతరులకు వినిపిస్తున్నారు అది స్వయం అభ్యాసం చేస్తున్నారా?
యోగం యొక్క ముఖ్య విశేషతలు - సహజయోగం, కర్మయోగం,
రాజయోగం, నిరంతరయోగం, పరమాత్మ యోగం అని ఏదైతే వర్ణన చేస్తున్నారో ఆ అన్ని
విషయాలు స్వయం అభ్యాసంలోకి తీసుకువచ్చారా? సహజయోగం అని ఎందుకు అంటారు? దాని
యొక్క స్పష్టీకరణ మంచిగా తెలుసుకుంటున్నారా లేదా అభ్యాసంలోకి కూడా తీసుకువచ్చారా?
ఒకవేళ కేవలం జ్ఞానసాగరులుగా అవ్వటమే కాదు, అభ్యాసంలోకి తీసుకురండి మరియు సర్వ
విశేషతల యొక్క అభ్యాసం చేయాలి, అప్పుడే సంపూర్ణయోగిగా అవుతారు. సహజయోగం యొక్క
అభ్యాసం ఉంది కానీ రాజయోగం యొక్క అభ్యాసం లేకపోతే పూర్తి పాస్ అవ్వలేరు.
అందువలన ప్రతి యోగం యొక్క, విశేషత యొక్క, ప్రతి శక్తి యొక్క, ప్రతి జ్ఞానం
యొక్క ముఖ్య పాయింట్స్ యొక్క అభ్యాసం చేయండి. ఈ లోపం ఉన్న కారణంగానే చాలా మంది
బలహీనంగా అయిపోతున్నారు. ఈ అభ్యాసం యొక్క లోపం ఉన్న కారణంగానే బలహీన ఆత్మగా
అయిపోతున్నారు. అభ్యాసి ఆత్మ, సంలగ్నతలో నిమగ్నమై ఉండే ఆత్మ ఎదురుగా ఏ రకమైన
విఘ్నం ఎదుర్కోదు.సంలగ్నత యొక్క అగ్నితో దూరం నుండే భస్మం అయిపోతుంది. ఎలా అయితే
మీరు మోడల్ తయారుచేస్తారు కదా! శక్తిస్వరూపం యొక్క శక్తి ద్వారా మీ పంచవికారాలు
భస్మం అవుతున్నట్లు, పారిపోతున్నట్లుగా చూసిస్తారు కదా! ఈ మోడల్ ఎవరిది? ఇప్పుడు
ఏం చేస్తారు? ప్రతి విషయం యొక్క ప్రయోగం యొక్క విధిలో నిమగ్నమవ్వండి. అభ్యాసం
యొక్క ప్రయోగశాలలో కూర్చుని ఉంటే ఒకే బాబా యొక్క తోడు మరియు మాయ యొక్క అనేక
రకాలైన విఘ్నాల నుండి తొలగిపోతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు
జ్ఞానసాగరంలో, గుణ సాగరంలో, శక్తి యొక్క సాగరంలో పై. పై అలలలో తేలియాడుతున్నారు.
అందువలన అల్పకాలిక రిఫ్రెష్ మెంట్ అనుభవం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సాగరుని
లోతులకి వెళ్ళండి, అప్పుడు అనేక రకాలైన విచిత్ర అనుభవాలు చేసుకుని రత్నాలను
పొందుతారు. స్వయం కూడా సమర్థంగా అవ్వండి, ఇప్పుడు ఇక ఈ ఫిర్యాదలు వ్రాయకూడదు.
బాబాకి నవ్వు వస్తుంది. చిన్న, చిన్న విషయాలు మరియు అవే, అవే విషయాలు
వ్రాస్తున్నారు, వినాశి వైద్యుని యొక్క పని కూడా బాబాపై పెడుతున్నారు, రచన మీది,
కర్మబంధన మీరు తయారుచేసుకుంటున్నారు, మరలా దానిని తెంచే బాధ్యత బాబాపై
పెడుతున్నారు. బాబా యొక్క బాధ్యత యుక్తి చెప్పటమా లేదా స్వయమే చేయటమా? బాబా
చెప్పటానికి నిమిత్తంగా ఉన్నారా లేదా చేయటానికి కూడా నిమిత్తంగా ఉన్నారా?
తుంటరిగా అయిపోతున్నారు కదా! తుంటరి పిల్లలు అన్నీ బాబాపైనే వదిలేస్తారు, లౌకిక
పిల్లలు మాట వినిటంలేదు మీరు వారిని సరి చేయండి అని అంటారు. బాబా అయితే మంచిగా
చేసే పద్ధతి వినిపిస్తున్నారు. చేస్తే పొందుతారు. బాబాని విశ్వసేవాధారిగా
భావించి అన్నీ బాబాపై వదిలేస్తున్నారు. అందువలన ఏదైతే సలహా లభిస్తుందో దానిపై
ధ్యాస పెట్టి ప్రత్యక్షంలోకి తీసుకురండి. అప్పుడు అన్ని విఘ్నాల నుండి ముక్తి
అయిపోతారు. అర్ధమైందా! మంచిది.
సదా బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారులకు,
ఒక బాబా తప్ప మరెవ్వరులేరు అనే ఈ పాఠాన్ని పాలన చేసేవారికి, సదా స్వయాన్ని
అభ్యాసంలో బిజీగా ఉంచుకునే వారికి, సంపూర్ణ జ్ఞానం మరియు యోగం యొక్క ప్రతి
విశేషతలను జీవితంలోకి తీసుకువచ్చేవారికి ఇలా విశేషాత్మలకు బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు నమస్తే.