20.06.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సదా సహజయోగిగా అయ్యే సాధనం - మహాదానిగా అవ్వటం.

సదా ప్రతి సంకల్పంతో సేవ చేసేవారు, ఉదారచిత్త్ సదా సర్వఖజానాల మహాదాని ఆత్మలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

బ్రాహ్మణాత్మలందరు స్వయాన్ని సహజయోగి లేదా నిరంతర యోగి యొక్క శ్రేష్ట స్థితిలో స్థితులయ్యే పురుషార్ధంలో ఉన్నారు. అందరి లక్ష్యమైతే సహజయోగి అవ్వాలి అని. కానీ స్వయం యొక్క బలహీనతల కారణంగా అప్పుడప్పుడు సహజంగా అనుభవం చేసుకుంటున్నారు మరియు అప్పుడప్పుడు కష్టంగా అనుభవం చేసుకుంటున్నారు. బలహీనులం అంటూ కష్టంగా చేసేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతి ఒక్క శ్రేష్ట ఆత్మ లేదా బ్రాహ్మణాత్మ, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ, త్రికాలదర్శి, మాస్టర్ జ్ఞానసాగర ఆత్మ ఏ కర్మలో లేదా సంకల్పంలో కష్టం అనుభవం చేసుకోదు.సహయోగితో పాటు అటువంటి శ్రేష్ట ఆత్మ స్వతహాయోగిగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి శ్రేష్టాత్మ కొరకు బాబా మరియు సేవ - ఇదే ప్రపంచం. బాబా యొక్క స్మృతి మరియు సేవ బ్రాహ్మణజన్మ యొక్క సంస్కారం. బాబా మరియు సేవ తప్ప ప్రపంచంలో ఇక ఏదీ కనిపించదు. సంస్కారంలో ఇక ఏ సంకల్పం ఉత్పన్నం అవ్వదు. ఏ మానవుని యొక్క బుద్ధి అయినా ప్రపంచంలో సంబంధం మరియు ప్రాప్తి వైపే వెళ్తుంది. బ్రాహ్మణాత్మలకు సర్వ సంబంధాలకు ఆధారం, సర్వ ప్రాప్తులకు ఆధారం ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు. కనుక స్వతహా యోగిగా అవ్వటం కష్టమా లేక సహజమా? ఎక్కడ సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడికి బుద్ధి అనుకోనప్పటికీ వెళ్తుంది. కనుక స్వతహాయోగిగా అయ్యారు కదా? ఒకవేళ సహజయోగిగా, స్వతహాయోగిగా లేరు అంటే తప్పకుండా బాబాతో సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తులు పొందలేనట్లే. స్వతహాయోగిగా అయ్యారు కదా? ఒకవేళ సహజయోగిగా మరియు స్వతహాయోగిగా లేరు అంటే తప్పకుండా బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభవం లేనట్లే. సర్వ సంబంధాలతో బాబాని మీ వారిగా చేసుకోవటం లేదు. సర్వ ప్రాప్తులకు ఆధారం - ఒక బాబా. ఈ అనుభవాన్ని మీ సొంతం చేసుకోలేదు.

ఇప్పుడు సహజయోగిగా అయ్యేటందుకు ఏ ప్రయత్నం చేస్తారు? సహజయోగిగా అవ్వాలనుకుంటున్నారు కదా? కనుక సదా సహజయోగి అంటే సదా సహయోగి, సదా సహజయోగిగా అయ్యే సాధనం - సదా స్వయాన్ని సంకల్పం ద్వారా, వాణి ద్వారా మరియు ప్రతి కార్యం ద్వారా విశ్వం యొక్క సర్వాత్మల పట్ల సేవాధారిగా భావించి సేవలోనే అన్నింటిని ఉపయోగించండి. ఏవైతే బ్రాహ్మణ జీవితం యొక్క ఖజానాలు, బాబా ద్వారా లభించిన సర్వఖజానాలను ఆత్మల సేవ పట్ల ఉపయోగించండి. బాబా ద్వారా ఏవైతే శక్తుల యొక్క ఖజానా, గుణాల ఖజానా, జ్ఞానం యొక్క ఖజానా మరియు శ్రేష్ట సమయం యొక్క సంపాదన యొక్క ఖజానా లభించిందో అది సేవలో ఉపయోగించండి అంటే సహయోగి అవ్వండి. మీ వృత్తి ద్వారా వాయుమండలాన్ని శ్రేష్టంగా తయారుచేసే సహయోగం ఇవ్వండి. స్మృతి ద్వారా సర్వులను మాస్టర్ సమర్ధ, శక్తివాన్ స్వరూపం యొక్క స్మృతి ఇప్పించండి. వాణీ ద్వారా ఆత్మలకు స్వదర్శనచక్రధారి, మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యే సహయోగం, కర్మ ద్వారా సదా కమలపుష్ప సమానంగా లేదా కర్మయోగిగా అయ్యే సందేశం ప్రతి కర్మ ద్వారా ఇవ్వండి. శ్రేష్ట బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభూతి ద్వారా సర్వాత్మలకు సర్వ సంబంధాల యొక్క అనుభవం చేయించే సహయోగం ఇవ్వండి. మీ ఆత్మిక సంపర్కం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటూ శ్రేష్ట సమయం యొక్క సూచన ఇచ్చేటువంటి లేదా సమయానుసారం వర్తమాన సంగమ సమయం యొక్క ఒక సెకను అనేక జన్మల ప్రాప్తికి నిమిత్తంగా అయ్యి ఉంది, ఒక అడుగులో కోట్ల సంపాదన నిండి ఉంది. ఇలా సమయం యొక్క ఖజానా గురించి తెలుసుకుంటూ, ఇతరులకు కూడా సమయానికి ప్రాప్తి పొందే పరిచయం ఇవ్వండి. ప్రతి విషయం ద్వారా సహయోగిగా అయితే సహజయోగిగా అయిపోతారు.

సహయోగిగా అవ్వటం వస్తుంది కదా? ఎవరైతే స్వయం ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సహయోగిగా అవుతారు. సంపన్న ఆత్మకు అనేకాత్మలకు మహాదాని అయ్యే సంకల్పం స్వతహాగా వస్తుంది. మహాదానిగా అవ్వటం అంటే సహయోగిగా అవ్వటం మరియు సహజయోగిగా అవ్వటం. మహాదానీలు సర్వ ఖజానాలు స్వయం పట్ల తక్కువగా ఉపయోగిస్తారు. సేవ పట్ల ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అనేకాత్మలకు మహాదాని అయ్యి ఇవ్వటమే తీసుకోవటం. సర్వుల కళ్యాణకారి అవ్వటమే స్వయం కళ్యాణకారిగా అవ్వటం. ధనం ఇవ్వటం అంటే ఒకటికి వంద రెట్లు జమ అవుతుంది. వర్తమాన సమయంలో స్వయం పట్ల చిన్న,చిన్న విషయాలలో లేదా చీమలా వచ్చే విఘ్నాలలో మీ సర్వ ఖజానాలను స్వయం పట్ల ఉపయోగించుకునే సమయం కాదు. బేహద్ సేవాధారిగా అవ్వండి. అప్పుడు స్వయం యొక్క సేవ స్వతహాగా జరుగుతుంది. విశాలహృదయంతో విశాలంగా అయ్యి ప్రాప్తుల ఖజానాలను పంచి పెడుతూ వెళ్ళండి. ఉదారచిత్తులుగా అవ్వటం ద్వారా స్వయం యొక్క ఉద్దరణ సహజంగా జరుగుతుంది. విఘ్నాలను తొలగించుకోవటంలో సమయం ఉపయోగించుకోవడానికి బదులు సేవా సంలగ్నతలో సమయం ఉపయోగించండి. ప్రతి సంకల్పం, శ్వాసలో సేవే నిండి ఉండాలి, ఇలా మహాదానిగా అవ్వండి. సేవా సంలగ్నతకు ఫలంగా విఘ్నాలు సహజంగానే వినాశనం అయిపోతాయి. ఎందుకంటే వర్తమానం ప్రత్యక్షఫలం పొందే సమయం. ఇప్పుడిప్పుడే సేవకు ఫలంగా స్వయంలో సంతోషం మరియు శక్తిని అనుభవం చేసుకుంటారు. కానీ సత్యమైన మనస్సుతో సేవ చేయాలి. సత్యమైన మనస్సుకి యజమాని రాజీ అయిపోతారు.

కొంతమంది పిల్లలు మేము సేవ అయితే చేస్తున్నాము కానీ ఫలం లభించటం లేదు అని అంటున్నారు అంటే సఫలత లభించటం లేదు అని అంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే సేవ అనేది రెండు రకాలుగా చేస్తున్నారు. ఒకటి మనస్సుతో చేస్తున్నారు, రెండవది పై పైకి చూపించడానికి చేస్తున్నారు. అంటే పేరు పొందాలనే అల్పకాలిక కోరికతో చేస్తున్నారు. ఇలా బీజమే అల్పకాలికమైతే అలాంటి బీజం యొక్క అల్పకాలిక ఫలంగా పేరున్నవారిగా అవ్వాలనుకుంటుంటే సఫలతా ఫలం ఎలా లభిస్తుంది? పేరు కావాలనే భావనకు ఫలంగా పేరు మరియు గౌరవ రూపంలో అయితే లభిస్తుంది. పైపైకి చూపించాలనే భావంతో సంకల్పంతో బీజం వేస్తున్న కారణంగా సర్వుల ఎదురుగా పైపైకి కనిపించే ఫలమే వస్తుంది. సర్వుల నోటి నుండి సేవ చాలా మంచిగా చేస్తున్నారు అని అల్పకాలికంగా మహిమ అనే ఫలం లభిస్తుంది. ఇలా అల్పకాలిక మహిమ యొక్క ఫలం లభించింది అంటే పచ్చి ఫలాన్ని తినేసినట్లు. మరి అప్పుడు సంపూర్ణఫలం యొక్క ప్రాప్తి అంటే మగ్గిన ఫలం యొక్క ప్రాప్తి ఎలా లభిస్తుంది? ఫలితం ఏమి వస్తుంది? పచ్చి ఫలాన్ని తినేసిన కారణంగా లేదా అల్పకాలిక కోరిక పూర్తి అయిపోయిన కారణంగా సదా శక్తిశాలిగా అవ్వటంలేదు. అధికారిగా అవ్వటం లేదు మరియు సేవ చేస్తూ కూడా బలహీనంగా అయిన కారణంగా, స్వయంతో సదా సంతుష్టంగా ఉండరు, సర్వులను సంతుష్టం చేయలేరు. సదా ఇంత చేస్తున్నప్పటికీ ఎందుకు లభించటంలేదు? వీరు ఇలా చేస్తున్నారు, వారు ఎందుకు అలా చేస్తున్నారు? అలా అవ్వకూడదు, ఇలా అవ్వాలి. ఇలా ఈ ప్రశ్నలలోనే ఉంటారు. అందువలన సేవాధారిగా కూడా మనస్సుతో అవ్వండి. సత్యమైన మనస్సుతో సేవాధారిగా అయ్యేవారి విశేష లక్ష్యం ఏమి ఉంటుంది? బలహీన ఆత్మను శక్తిశాలిగా చేసేటువంటి, ఎటువంటి అవగుణాలు కలిగిన ఆత్మ అయినా, బీద ఆత్మ అయినా కానీ సదా బాబా ద్వారా లభించిన గుణాల దానం ద్వారా గుణాల ఖజానాతో బీదవారిని షావుకారులుగా చేసేటువంటి, శ్రేష్ట సంకల్పం లేదా శుభభావన పెట్టుకుంటారు. ఇలా సత్యమైన మనస్సు కలిగిన సేవాధారులు సదా ఆత్మలో ప్రత్యక్షఫలం ద్వారా సఫలతామూర్తిగా అనుభవం చేసుకుంటారు. ఇలా సదా సహయోగిగా అయితే సహయోగానికి ఫలంగా సహజయోగం ప్రాప్తిస్తుంది. సదా సహయోగి అవ్వటం ద్వారా సదా బిజీగా ఉంటారు. సంకల్పంలో కూడా బిజీగా ఉంటే స్వయంతో లేదా బాబాతో ఏవైతే వ్యర్ధం యొక్క ఫిర్యాదులు చేస్తున్నారో అవన్నీ సహజంగా సమాప్తి అయిపోతాయి.

సదా ప్రతి సంకల్పంతో సేవ చేసేవారికి, అల్పకాలిక ఫలాన్ని త్యాగం చేసేవారికి, సదా సఫలతామూర్తులుగా అయ్యేవారికి, ప్రతి ఆత్మ యొక్క ఉద్దరణకు నిమిత్తంగా అయ్యేవారికి, ఉదారచిత్త్ ఆత్మలకు, సదా బాబా మరియు సేవలో నిమగ్నమై ఉండే సమీప ఆత్మలకు, సదా సర్వ ఖజానాల యొక్క మహాదాని ఆత్మలకు, ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.