వ్యర్థం చేయకండి మరియు బరువుని తగ్గించుకోండి.
సర్వ ఖజానాలను మహాదాని అయ్యి దానం చేసేటువంటి, తమ
శక్తుల యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉండేటువంటి విశ్వకళ్యాణకారి ఆత్మలతో బాప్ దాదా
మాట్లాడుతున్నారు -
ధ్వనికి అతీతంగా స్వయం యొక్క నిరాకారి స్థితి మరియు
ఆకారి స్థితి, ఎక్కడ సైగల యొక్క భాష ఎక్కువగా ఉంటుందో అక్కడ అంటే ఈ రెండు
స్థితులలో సాకార సృష్టిలో వలె మాటలు ఉండవు - ఇలా ధ్వనికి అతీతమైన స్థితి మంచిగా
అనిపిస్తుందా? నోటి ద్వారా వినటం మరియు వినిపించటం దీని కంటే ఉన్నతమైనది మీ
వృత్తి ద్వారా,లేదా దృష్టి ద్వారా లేదా తరంగాల ద్వారా, మీ అనుభవాల యొక్క ప్రభావం
ద్వారా ఏ ఆత్మకి అయినా సేవ చేయటం అంటే వినిపించటం లేదా పరిచయం ఇవ్వటం, సంబంధం
జోడింపచేయటం. వీటి యొక్క అనుభవీలేనా? ఎలా అయితే మాటల ద్వారా సంబంధం
జోడింపచేయటంలో అనుభవీలో అలాగే మాటల ద్వారా సలహా లభించింది - ఆ ఆత్మలకు వృత్తి,
దృష్టి, శ్రేష్ట అనుభవాల ప్రభావం ద్వారా సేవ చేయండి అని అంటే చేయగలరా లేదా కేవలం
మాటల ద్వారానే చేయగలరా? ఎలా అయితే మాటల ద్వారా ఆత్మలను బాబాతో సంబంధం
జోడింపచేయడానికి నెంబర్ వారీగా నిమిత్తంగా అవుతున్నారో అలాగే మీ సూక్ష్మ స్థితి
లేదా మాస్టర్ సర్వశక్తివాన్ లేదా మాస్టర్ జ్ఞానసూర్య స్థితి ద్వారా ఆత్మలకు
స్వయం యొక్క స్థితి లేదా బాబా సంబంధం యొక్క అనుభవాన్ని, శక్తిశాలి వాతావరణాన్ని,
తరంగాలను, స్వయం యొక్క శక్తి స్వరూపం యొక్క సంపర్కం ద్వారా వారికి అనుభవం
చేయిస్తున్నారా? ఎందుకంటే ఎలా అయితే సమయం సమీపంగా వస్తుందో అలాగే పాండవసేన
ప్రత్యక్షం అయ్యే ప్రభావం గుప్త రూపంలో వ్యాపిస్తూ ఉంటుంది. సేవా రూపురేఖ
సమయానుసారం మరియు సేవననుసరించి తప్పకుండా పరివర్తన అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో
వైజ్ఞానికులు కూడా ప్రతి వస్తువుని క్వాంటిటీ ( సంఖ్యకు) బదులు క్వాలిటీ (లక్షణాలు)
లోకి తీసుకువస్తున్నారు. ఎలాంటి చిన్న రూపం తయారుచేస్తున్నారంటే రూపం చిన్నదైనా
కానీ చాలా శక్తి నిండి ఉంటుంది. తియ్యదనం యొక్క విస్తారాన్ని పంచధారగా
తయారుచేస్తారు. విస్తారాన్ని సారంలోకి తీసుకువస్తున్నారు. అదేవిధంగా పాండవసేన
అంటే శాంతి శక్తి కలిగిన శ్రేష్టాత్మలు కూడా ఒక గంట యొక్క ఉపన్యాసం ద్వారా
ఎవరికైనా పరిచయం ఇవ్వగలుగుతున్నారు. కానీ ఒక సెకను యొక్క శక్తిశాలి దృష్టి
ద్వారా, శక్తిశాలి స్థితి ద్వారా, కళ్యాణ భావన ద్వారా, ఆత్మికభావం ద్వారా స్మృతి
ఇప్పిస్తున్నారా లేదా అపరోక్షంగా సాక్షాత్కారం చేయిస్తున్నారా? ఇప్పుడు ఈ
అభ్యాసం అవసరం. దీని కొరకు రెండు విషయాల యొక్క అవసరం ఉంది. వీటి ద్వారా శ్రేష్ట
సేవకు నిమిత్తంగా అవుతారు. విశేషంగా ఏ రెండు విషయాలపై ధ్యాస ఇప్పిస్తున్నారు అవి
ఏమిటో తెలుసా?
ఒకటి నలువైపుల ఈ ధ్యాస ఇప్పిస్తున్నారు, ఏ వస్తువు
వ్యర్థం చేయకండి మరియు రెండవ విషయం బరువుని తగ్గించుకోండి. ప్రజలైతే శరీరం
యొక్క బరువు తగ్గించుకునేటందుకు చెప్తారు, కానీ బాప్ దాదా ఆత్మపై ఏదైతే బరువు
ఉందో ఆ బరువు కారణంగా ఉన్నత స్థితిని అనుభవం చేసుకోలేకపోతున్నారో ఆ బరువుని
తగ్గించుకోండి. ఒకటి వ్యర్థం చేయకండి మరియు రెండవది బరువు తగ్గించుకోండి. ఈ
రెండు విషయాలపై విశేషమైన ధ్యాస ఉండాలి. స్వయం యొక్క శక్తులు మరియు సమయాన్ని
వ్యర్థం చేయటం ద్వారా జమ అవ్వదు మరియు జమ అవ్వని కారణంగా ఏదైతే సంతోషం మరియు
శక్తిశాలి స్థితి అనుభవం అవ్వాలో అది అనుభవం చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నారు.
శ్రేష్టాత్మలైన మీకు విశ్వకళ్యాణకారి కార్యం ఉంది. కనుక దానిననుసరించి సమయం
మరియు శక్తులు కేవలం స్వయం పట్ల కాదు కానీ అనేకాత్మల సేవ కొరకు స్టాక్ జమ
చేసుకోవాలి. ఒకవేళ వ్యర్ధం అవుతూ ఉంటే స్వయాన్ని నిండుగా అనుభవం చేసుకోలేరు. ఎలా
అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా పొదుపు యొక్క స్కీమ్ తయారుచేస్తున్నారు కదా!
అలాగే స్వయం పట్ల సమయం మరియు శక్తుల యొక్క పొదుపు యొక్క లక్ష్యం పెట్టుకుని జమ
చేసుకోండి. ఎందుకంటే విశ్వం యొక్క సర్వాత్మలు శ్రేష్ట ఆత్మలైన మీ పరివారం. ఎంత
పెద్ద పరివారమో అంత పొదుపు యొక్క ఆలోచన పెట్టుకుంటారు.
మీ వంటి పెద్ద పరివారం ఇంకెవరికైనా ఉంటుందా? ఆ
ఆత్మలందరిని ఎదురుగా పెట్టుకుని స్వయాన్ని బేహద్ సేవకు నిమిత్తంగా భావించి మీ
సమయాన్ని మరియు శక్తులను కార్యంలో ఉపయోగిస్తున్నారా? మాస్టర్ రచయిత యొక్క
స్మృతిలో ఉంటున్నారా లేదా స్వయం పట్లే సంపాదించుకోవటం మరియు తినటం లేదా కొంచెం
సంపాదించుకోవటం, కొంచెం పోగొట్టుకోవటం ఇలా సోమరితనంగా నడుస్తున్నారా? స్వయం
సర్వ ఖజానాల యొక్క బడ్జెట్ తయారుచేసుకోండి. ఇంత పెద్ద బాధ్యతా కార్యాన్ని
తీసుకునే ఆత్మలు ఒకవేళ జమ లేకపోతే కార్యం ఎలా సఫలం అవుతుంది! డ్రామానుసారం
అవ్వవలసిందే ఇది జ్ఞానం యొక్క విషయం. కానీ డ్రామాలో నేను కూడా నిమిత్తంగా అయ్యి
సేవ ద్వారా శ్రేష్టప్రాప్తి పొందాలి అనే లక్ష్యం పెట్టుకుని ప్రతి ఖజానా యొక్క
బడ్జెట్ తయారుచేసుకోండి. ఈ బడ్జెట్లో ఏ లక్ష్యం పెట్టుకోవాలి? సూక్తి జ్ఞాపకం
ఉందా? తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం. ప్రతి ఖజానా ఎంత వరకు జమ అయ్యింది? అనేది
పరిశీలన చేసుకోండి. ఆ జమాఖాతా ద్వారా బేహద్ ఆత్మల సేవ జరుగుతుంది. ప్రతి
సబ్జక్టుని పరిశీలన చేసుకోండి, ప్రతి సబ్జక్టు ద్వారా బేహద్ సేవకు నిమిత్తంగా
అవ్వండి లేక కేవలం జ్ఞానం ద్వారా చేస్తున్నారా, ధారణ ద్వారా చేయటం లేదా? పూర్తి
పాస్ అవ్వాలంటే పూర్తి సబ్జక్స్ ద్వారా సేవకు నిమిత్తంగా అవ్వాలి. ఒకవేళ ఒక
సబ్జక్టులో అయినా లోపం వస్తే పూర్తి పాస్ అవ్వలేరు కానీ పాస్ అవుతారు. ఒకటి పాస్
విత్ ఆనర్ (గౌరవయుక్తంగా పాస్ అవ్వటం) మరియు రెండవ స్థితి పాస్ అవ్వటం. ఎవరైతే
కేవలం పాస్ అవుతారో పాస్ విత్ ఆనర్‌గా అవ్వరో ఆ పాస్ విత్ ఆనర్ యొక్క తేడాలో
ధర్మరాజు శిక్షలను దాటవలసి వస్తుంది. అంటే కొద్దిగా శిక్షలను అనుభవం చేసుకుంటారు.
పాస్ విత్ ఆనర్ అయ్యే ఆత్మలు ఇతరాత్మలను కూడా పాస్ చేయిస్తారు కనుక ప్రతి
సబ్జక్టులో పూర్తిగా పాస్ అవ్వాలి. ప్రతి ఖజానా యొక్క బడ్జెట్ వేసుకోండి మరియు
బడ్జెట్ తయారుచేసుకోండి అంటే వ్యర్థం చేయకండి. ప్రతి సెకను, ప్రతి సంకల్పం
స్వయాన్ని శక్తిశాలిగా చేసుకునేటందుకు లేదా సర్వాత్మల సేవ కొరకు ఉపయోగించండి.
రెండవ విషయం బరువుని తగ్గించుకోండి. ఒకటి వెనుకటి
జన్మలలో ఉండిపోయిన కర్మల ఖాతా యొక్క బరువుని సమాప్తి చేసుకోవటంలో నిమగ్నమై
ఉంటున్నారు. కానీ ఈ బరువు పెద్ద విషయమేమీ కాదు. బ్రాహ్మణులుగా అయ్యి,
బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా పిలవబడుతూ, విశ్వకళ్యాణకారి లేదా
విశ్వసేవాధారిగా పిలవబడుతూ, ఒకవేళ ఏదైనా వికర్మ లేదా వికల్పాలు చేసినట్లయితే ఆ
భారం ఈ భారం కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీ సంస్కారాలకు వశమై,
స్వభావానికి వశమై, జ్ఞానబుద్ధి యొక్క అభిమానానికి వశమై, పేరు మరియు గౌరవం యొక్క
స్వార్థానికి వశమై, స్వయం కొరకు సాధనాల ప్రాప్తికి వశమై, సోమరితనానికి మరియు
బద్ధకానికి వశమై ఇలా ఇప్పటి వరకు ఎన్ని రకాలైన భారాలు తయారు చేసుకున్నారు? సదా
ఇది ధ్యాసలో ఉంచుకోండి - జ్ఞానీ ఆత్మగా పిలవబడుతూ లేదా సేవాదారిగా పిలవబడుతూ
సేవ జరగడానికి బదులు డిస్ సర్వీస్ జరిగే విధమైన కర్మ లేదా తరంగాలు వ్యాపింప
చేయడానికి నిమిత్తం కాకూడదు, ఎందుకంటే సేవ చేస్తున్నారు కానీ ఒకసారి చేసిన డిస్
సర్వీస్ పది సార్లు చేసిన సేవను సమాప్తి చేసేస్తుంది. ఎలా అయితే రబ్బరు ద్వారా
అంతా చెరిగిపోతుందో అలాగే ఒకసారి చేసిన డిస్ సర్వీస్ పది సార్లు చేసిన సేవను
సమాప్తి చేసేస్తుంది. వారు మేము చాలా సేవ చేస్తున్నాము అని అనుకుంటారు కానీ ఖాతా
ఖాళీ అయిపోతున్న కారణంగా గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. కానీ అభిమానానికి వశమై
బయటికి గొప్పలు చెప్పుకునేవారిగా అయిపోతారు, వారి గుర్తులు ఏమి ఉంటాయి? ఒకటి,
స్మృతిలో శక్తి మరియు ప్రాప్తి అనుభవం అవ్వదు, లోపల సంతుష్టత ఉండదు. ప్రతి సమయం
ఏదోక పరిస్థితి లేదా వ్యక్తి లేదా ప్రకృతి యొక్క వైభవం స్థితిని అలజడిలోకి
తీసుకువచ్చేటందుకు లేదా సంతోషం, శక్తిని సమాప్తి చేసేటందుకు నిమిత్తం అవుతాయి.
బయటికి ఎంత సుందరంగా కనిపిస్తారంటే చాలా మంది ఆత్మలు వీరిని పరిశీలించని కారణంగా
చాలా సంతోషవంతులుగా మరియు పురుషార్ధిగా అనుకుంటారు. కానీ లోపల అలజడిలో రంధ్రంతో
ఉంటారు. పేరు, గౌరవం యొక్క ఖాతా పూర్తిగా ఉంటుంది కానీ ఖజానాల ఖాతా, అనుభూతుల
ఖాతా ఖాళీగా ఉంటుంది అంటే నామమాత్రంగా ఉంటుంది. ఇంకా ఏమి గుర్తులు ఉంటాయి?
అటువంటి ఆత్మ స్వయం యొక్క విఘ్నాలకు వశమైపోయిన కారణంగా సేవాకార్యంలో కూడా
విఘ్నరూపంగా అవుతుంది. పేరైతే విఘ్నవినాశకులు కానీ విఘ్నరూపంగా అవుతారు. అటువంటి
ఆత్మలకు సమయానుసారం భారంతో బరువు పెరిగిపోయిన కారణంగా అనేక రకాలైన మానసిక
వ్యర్థ చింతన లేదా మానసిక అశాంతి ఇలా అనేక రోగాలు వస్తాయి. రెండవ విషయం బరువుగా
ఉన్న కారణంగా పురుషార్ధం యొక్క వేగం తీవ్రం అవ్వదు. హైజంప్ విషయం వదిలేయండి
కనీసం పరుగు కూడా పెట్టలేరు. ఇది చేస్తాము, ఇది చేస్తాము అని ప్లాన్ అయితే
తయారుచేస్తారు కానీ సఫలం అవ్వదు. మూడవ గుహ్యమైన విషయం ఏమిటంటే అలా బరువుతో ఉన్న
ఆత్మలు విఘ్నరూపంగా లేదా డిస్ సర్వీస్ కి నిమిత్తమైన ఆత్మలు బాబాకి అర్పణ చేసిన
తమ తనువు, మనస్సు మరియు ఈశ్వరీయ సేవార్థం లభించిన ధనాన్ని స్వయం యొక్క విఘ్నాలలో
వ్యర్ధం చేస్తారు అంటే సఫలత పొందలేరు, వాటిని వ్యర్థం చేసినందుకు కూడా భారం
పెరుగుతుంది. అందువలన పాపాల గుహ్యగతిని కూడా మంచిగా తెలుసుకోండి. ఇప్పుడు ఏమి
చేయాలి? వ్యర్థం చేయకండి మరియు బరువుని తగ్గించుకోండి. ధర్మరాజుపురికి వెళ్ళే
ముందు స్వయానికి స్వయం ధర్మరాజుగా అవ్వండి. మీ పూర్తి లెక్కల ఖాతాను తెరవండి
మరియు పాపం మరియు పుణ్యం యొక్క ఖాతాను పరిశీలన చేసుకోండి. ఏమి జమ చేసుకోవాలి అని
విశేషంగా స్వయం కొరకు ప్లాన్ తయారుచేసుకోండి, పాపఖాతాను భస్మం చేసుకోండి.
పుణ్యఖాతాను పెంచుకోండి. బాప్ దాదా పిల్లల ఖాతాను చూస్తూ సంపన్నంగా అయిపోవాలి
అని అనుకుంటున్నారు. (వర్షం వస్తుంది) ప్రకృతి కూడా పాఠం చదివిస్తుంది. ఎలా
అయితే ప్రకృతి తన సీజన్ లేదా సమయానుసారం తీవ్రగతితో కార్యం చేస్తుందో అలాగే
బ్రాహ్మణులు ఇప్పుడు సంపాదనను జమ చేసుకునే సీజన్. సీజన్ అనుసరించి తీవ్రవేగంతో
జమ చేసుకోండి.
సదా ఫరిస్తాగా, లైట్ లెస్ అంటే ప్రకాశరూపంగా, ప్రతి
సెకను మరియు సంకల్పంలో కూడా వెనుకటి బరువుని భస్మం చేసుకుంటూ భవిష్యత్తుకి జమ
చేసుకునేవారికి, సదా విశ్వసేవాధారి స్వరూపంలో స్థితులై ఉండే ఆత్మలకు, సర్వ
ఖజానాల మహాదాని అయ్యి దానం చేసేవారికి, శక్తుల ఖజానాలతో సంపన్నంగా అయ్యి శక్తుల
ద్వారా వరదానిగా అయ్యేవారికి, దయాహృదయులకు, సదా విశ్వకళ్యాణకారి ఆత్మలకు బాప్
దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.