ప్రతి బ్రాహ్మణాత్మ గురించి బాప్ దాదాకి ఉన్న
శ్రేష్ట కామనలు.
భవిష్య అదృష్టాన్ని తయారు చేసేటందుకు నిమిత్తమైన
మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలతో అవ్యక్త బాప్ దాదా అన్నారు -
అదృష్టవంతులు మరియు శ్రేష్టాత్మల కళ్యాణార్ధం
నిమిత్తమైనవారు, బాప్ దాదాతో పాటు సదా సహయోగిగా ఉండే పాత్ర అభినయించే
ఆత్మలందరిని చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. బాబా స్నేహం లేదా సంలగ్నతలో
ఉండే స్నేహి ఆత్మలు బాబా కలయిక యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో ఉండటం చూసి బాబా కూడా
పిల్లలకు స్నేహం మరియు ఉల్లాసానికి బదులు ఇస్తున్నారు.
బాప్ దాదాకి తెలుసు - పిల్లలందరిలో స్నేహం, సహయోగం
యొక్క భావన మరియు బాబా సమానంగా అవ్వాలనే శ్రేష్ట సంకల్పం కూడా ఉంది. బాప్ దాదా
పిల్లలను స్వయం కంటే సర్వ శ్రేష్ట కిరీటధారులుగా, సింహాసనాధికారులుగా, పరంధామంలో
మెరిసే సితారగా మరియు విశ్వంలో సర్వాత్మల మనస్సులకి తోడుగా, విశ్వాత్మల కంటే సదా
పూర్వీకులు మరియు పూజ్యులుగా ఇలా శ్రేష్టంగా చూడాలనుకుంటున్నారు. పిల్లలను
శ్రేష్టంగా చూసి బాబాకి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి బ్రాహ్మణాత్మ
ఉన్నతోన్నతమైన తండ్రితో పాటు ఉన్నతోన్నతంగా ఉండాలి. పేరు ఎలాగైతే ఉన్నతమైనదో
అదేవిధంగా కర్మ కూడా ఉన్నతంగా ఉండాలి. విశ్వంలో అందరి కంటే ఉన్నత గౌరవం ఎలాగైతే
ఉందో అదేవిధంగా స్వమానం మరియు గౌరవం సదా స్థిరంగా ఉండాలి - ప్రతి బ్రాహ్మణాత్మ
పట్ల బాప్ దాదాకి ఉన్న శ్రేష్ట కామన ఇదే.
పిల్లలు ఏమి చేయాలి? బాప్ దాదా ద్వారా జ్ఞానం, గుణాలు,
శక్తుల యొక్క అలంకరణ లభించింది, ఆ అలంకారాన్ని ధరించాలి. మీ జడచిత్రాలు సదా
అలంకరించబడి ఉంటాయి. అదేవిధంగా చైతన్య రూపంలో కూడా సదా అలంకరించబడి, బాప్ దాదా
యొక్క హృదయ సింహాసనాధికారిగా, అతీంద్రియ సుఖంలో ఊగుతూ సదా ఫరిస్తా రూపం యొక్క
నషాలో ఉండాలి. బాబాకి బదులు ఇవ్వటం వస్తుందా? మనస్సు యొక్క కోరిక మరియు చేసే
కర్మ సమానంగా ఉండాలి. అనుకుంటున్నాం కానీ చేయటం లేదు అని అనకూడదు. మీ యొక్క
అధికారాలలో సర్వ శ్రేష్ట అధికారం ఏది? సాకారి కర్మేంద్రియాలు మరియు వెనువెంట
సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలను, యధార్ధ రీతిలో నడిపించే అధికారం.
ఇటువంటి అధికారాన్ని ధారణ చేశారా? మాస్టర్ సర్వశక్తివంతులు అయ్యి మీ
కర్మేంద్రియాలను నడిపిస్తున్నారా లేక బ్రాహ్మణ పరివారంలోని సహయోగి కార్యకర్తలు.
అంటే సహాయకారి ఆత్మలపై అధికారాన్ని చూపిస్తున్నారా? బ్రాహ్మణాత్మల సంపర్కంలో
స్నేహం మరియు సహయోగం యొక్క భావన ఉండాలి కానీ అధికారం చెలాయించకూడదు.
కర్మేంద్రియాలపై మరియు సూక్ష్మ శక్తులపై అధికారం చూపించాలి. నా స్వభావం లేదా
సంస్కారం ఇంతే అని వాటికి ఎప్పుడు ఆధీనం కాకూడదు. ఇవి సర్వశక్తివంతుల మాటలు కావు
స్వయంపై అధికారం చెలాయించనివారు అధికారాన్ని దుర్వినయోగపరుస్తారు. కనుక
అధికారాన్ని దుర్వినియోగ పరచకండి.
బాప్ దాదా ఈ మిలనమేళాలో పిల్లలందరి యొక్క ఉత్సాహ
ఉల్లాసాలను కూడా చూశారు, శ్రేష్ట భావనను చూశారు, విశ్వ కళ్యాణ కామనను కూడా
చూశారు, వెనువెంట బాబా సమానంగా అవ్వాలనే శ్రేష్ట కోరికను కూడా చూశారు. కానీ ఈ
విషయాలన్నింటిని సంకల్పం మరియు మాట వరకే చూశారు. ప్రత్యక్షంలో సదా లక్ష్యం
అనుసరించి లక్షణాలు స్వయానికి లేదా సర్వులకి కనిపించాలి. ఈ సమానతలో తేడాను
చూశారు. ఎక్కేకళలో సమానత యొక్క కళ అవసరం. సంకల్పం ఉంది కానీ సంకల్పం యొక్క
సంపూర్ణ స్థితి - ధృడ సంకల్పం. సంకల్పం ఉంది కానీ ధృడత కావాలి. స్వదర్శనం వలన
మాయకు సదాకాలికంగా వీడ్కోలు లభిస్తుంది కానీ స్వదర్శనం మరియు పరదర్శనం రెండు
చుట్టు తిరుగుతున్నాయి. పరదర్శనం మాయను ఆహ్వానిస్తుంది. స్వదర్శనం మాయకు శపధం
చేస్తుంది. పరదర్శనం యొక్క లీలల అల కూడా బాగా కనిపిస్తుంది. బేహద్ డ్రామా యొక్క
ప్రతి పాత్రలో త్రికాలదర్శి అవ్వాలనే లక్ష్యాన్ని కూడా చూశారు కానీ వ్యర్ధ
విషయాల యొక్క త్రికాలదర్శిగా కూడా బాగా అవుతున్నారు. మొదట్లో కూడా ఇలా జరిగింది,
ఇప్పుడు కూడా అంతే, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది... ఇలా త్రికాలదర్శి అవుతున్నారు.
నవ్వు వచ్చే విషయం మరొకటి ఏమిటంటే ఆ విషయం భక్తిలో కూడా మిమ్మల్ని అనుకరించారు.
అది ఏ విషయం? కల్పిత కథలు అల్లేశారు. గణేశుడు, హనుమంతుడు నిజంగా ఉన్నారా ఏమిటి?
కానీ కథ ఎంత బావుంటుంది! అదేవిధంగా చిన్న విషయానికి భావాన్ని మార్చేసి కల్పిత
భావంతో కథ అంతా తయారుచేసేస్తారు. అవి వినడానికి మరియు వినిపించడానికి చాలా
ఆసక్తితో సమయం ఇచ్చి మరీ వింటారు లేదా వినిపిస్తారు. ఇటువంటి అలను కూడా చూశారు.
శ్రేష్ట పదవి పొందేటందుకు లేదా సర్వులకు స్నేహి
అయ్యేటందుకు బాప్ దాదా సదా ఇచ్చే శిక్షణ ఏమిటంటే స్వయాన్ని పరివర్తన చేసుకోండి
కానీ స్వయాన్ని మార్చుకోవడానికి బదులు పరిస్థితులను లేదా ఇతరాత్మలను మార్చడానికి
చూస్తున్నారు. వీరు మారితే నేను సరిగ్గా ఉంటాను, పరిస్థితి మారితే నేను
పరివర్తన అవుతాను, సౌకర్యాలు లభిస్తే పరివర్తన అవుతాను. సహయోగం లేదా సహాయం
లభిస్తే అవుతాను అని అంటున్నారు. దీని ఫలితం ఏమి వస్తుంది? ఎవరు దేని ఆధారంగా
పరివర్తన అవుతారో వారి జన్మజన్మల ప్రాలబ్దం కూడా ఏదోక ఆధారంగానే ఉంటుంది. ఏ
విషయంలో ఎంతమందిని ఆధారంగా తీసుకున్నారో ఆ వాటాలన్నీ వారి సంపాదన నుండి
పంచబడతాయి. స్వయం యొక్క ఖాతా జమ అవ్వదు. అందువలన జమ అయ్యింది అనే శక్తి మరియు
సంతోషం నుండి వంచితంగా ఉంటారు. కనుక సదా స్వయం పరివర్తన అవ్వాలి అనే లక్ష్యం
పెట్టుకోండి. నేను విశ్వానికి ఆధారమూర్తిని అని భావించండి. బాబా యొక్క ఆధారం
తప్ప అల్పకాలిక ఆధారాలన్నీ సమయానికి వదిలేస్తాయి. వినాశి చంచల ఆధారం మిమ్మల్ని
కూడా సదా ఏదోక అలజడిలోకి తీసుకువస్తూ ఉంటుంది. ఒకటి సమాప్తి అయితే రెండవది
జన్మిస్తుంది. దీనిలోనే ఇతర శక్తులన్నీ వ్యర్ధం అయిపోతాయి. మరో విషయం ఏమిటంటే
నడుస్తూ నడుస్తూ సోమరితనం కారణంగా బలహీన మాటలు మాటిమాటికీ మాట్లాడుతున్నారు.
సంశయం లేదు, చాలా గొప్పగా మాట్లాడాం అనుకుంటున్నారు. అదే సత్యత, స్వచ్చత అనుకుని
మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారు? నేను అలజడి అయి ఉన్నాను, నేను ఏదొకటి
చేసి చూపిస్తాను అంటున్నారు. ఏం చేసి చూపిస్తారు? అలజడా? లేక మిమ్మల్ని మీరు
ఏదైనా చేసుకుని చూపిస్తారా? డిస్ సర్వీస్ అయిపోతుంది. చూస్కోండి, నేను బలహీనంగా
ఉన్నాను, సంస్కారానికి వశం అయ్యి ఉన్నాను, మారలేను, మీరు ఈ సౌకర్యాలు
కల్పించవలసిందే... ఇలాంటి మాటలు చాలా సహజంగా మాట్లాడేస్తున్నారు. పరాక్రమం
చూపిస్తున్నట్లు, అదుపు చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా చాలా మాటలు
అంటున్నారు. బాప్ దాదాకి అయితే దయ వస్తుంది. ఇటువంటి బలహీన ఆత్మలు సంకల్పం
తర్వాత వాణిలోకి కూడా తీసుకువస్తారు. తర్వాత కర్మ వరకు కూడా తీసుకువస్తారు.
దీనిలో అకళ్యాణం ఎవరికి? దీని వలన బాబాకి అకళ్యాణం అనుకుంటున్నారు లేదా సేవకి
అకళ్యాణం అనుకుంటున్నారు కానీ ఇటువంటి విషయాలను సంస్కారంగా చేసుకునేవారు తమ
అకళ్యాణానికి తామే నిమిత్తమవుతారు. డ్రామానుసారం విశ్వ సేవాకార్యం నిశ్చితంగా
సఫలం అయ్యే ఉంది, దీనిని ఎవరు కదల్చలేరు.
ఒక కర్మకి కోటానుకోట్ల రెట్లు ఫలం ఇచ్చేటందుకు బాప్
దాదా నిమిత్తమై ఉన్నారు. పిల్లలను సేవార్థం నిమిత్తం చేస్తారు. చేస్తే
కోటానుకోట్లు పొందుతారు. పిల్లల భాగ్యాన్ని తయారు చేసేటందుకే నిమిత్తంగా
చేశారంతే. కానీ ఎవరు కదిపినా ఈ కార్యం కదలదు. కల్పకల్పాలుగా నిశ్చితం అయిపోయిన
విధి, విజయం లభించవలసిందే. అందువలన ఇటువంటి బలహీన భాషను పరివర్తన చేస్కోండి.
బాబా కళ్యాణకారి సమయం మరియు విశ్వకళ్యాణ కార్యానికి సమర్థులై స్వయం యొక్క
భవిష్యత్తుని తయారుచేస్కోండి.
బాబాకి తెలుసు, శ్రమ కూడా చాలా చేస్తున్నారు. త్యాగం
కూడా చేశారు, చాలా సహిస్తున్నారు కూడా. కానీ ఎవరితో స్నేహం ఉంటుందో వారి యొక్క
చిన్న లోపాన్ని కూడా చూడలేరు. సదా శ్రేష్టంగా చేయాలనే శుభ భావన ఉంటుంది.
అందువలన ఇవన్నీ చూస్తూ, వింటూ కూడా సంపన్నంగా తయారు చేసేటందుకు సైగ చేస్తున్నాను.
ప్రతి అడుగులో పిల్లలకు బాప్ దాదా సదా సహయోగిగా ఉంటారు మరియు అంతిమం వరకు కూడా
ఉంటారు. బాబాకి ఎవరిపై అసహ్యం ఉండదు. అపకారి గురించి కూడా సదా శుభమే ఆలోచిస్తారు,
అందువలన సదా సహయోగాన్ని తీసుకుంటూ నడవండి. అమృతవేళ యొక్క గొప్పతనాన్ని
తెలుసుకుని బాబా ద్వారా వరదానం తీసుకుంటూ ఉండండి. సీజన్ సమాప్తి అయ్యిందంటే
సహయోగం సమాప్తి అయినట్లు కాదు. ప్రతి బిడ్డతో సర్వ సంబంధాలతో, సర్వ స్వరూపాలతో
బాప్ దాదా యొక్క హస్తం మరియు తోడు సదా వెంట ఉంటాయి. డ్రామానుసారం ఇప్పుడు మీకు
సమయం లభించింది, ఇది మీ అదృష్టంగా భావించి సమయం యొక్క లాభాన్ని పొందండి. వినాశన
గడియారానికి ముల్లు మీరే. మీరు సంపన్నం అవ్వటం అంటే సమయం సంపన్నం అవ్వటం.
అందువలన సదా స్వచింతన కలిగి స్వదర్శనచక్రధారి అవ్వండి. మంచిది.
ఈవిధంగా భవిష్య అదృష్టాన్ని తయారుచేయడానికి నిమితమైన
ఆత్మలకు, స్వయం ద్వారా రేపటి చిత్రాన్ని చూపించేవారికి, సదా బాబాకి బదులు
ఇచ్చేవారికి, మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.