04.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


వర్తమాన రాజ్యాధికారియే భవిష్య రాజ్యాధికారి.

విదేశీ సోదరీసోదరులతో అవ్యక్త బాప్ దాదా యొక్క సంభాషణ.

అందరు మిమ్మల్ని మీరు డబుల్ రాజ్యాధికారిగా భావిస్తున్నారా? వర్తమానంలో కూడా రాజ్యాధికారి మరియు భవిష్యత్తులో కూడా రాజ్యాధికారి. వర్తమానం అనేది భవిష్యత్తుకి దర్పణం. వర్తమాన స్థితి అనే దర్పణం ద్వారా మీ భవిష్యత్తుని స్పష్టంగా చూసుకోవచ్చు. వర్తమానంలో మరియు భవిష్యత్తులో రాజ్యాధికారి అయ్యేటందుకు సదా పరిశీలించుకోండి - నాలో పరిపాలనాశక్తి ఎంత ఉంది, మొదట సూక్ష్మశక్తులపై అంటే విశేష కార్యకర్తలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఎంతవరకు మీ అధికారం ఉంది, సంకల్పశక్తిపై, బుద్ధిపై మరియు సంస్కారాలపై ఎంత అధికారం వచ్చింది? విశేషమైన ఈ మూడు శక్తులు రాజ్యాధికారిగా చేయటంలో సహయోగి అంటే రాజ్యకార్య వ్యవహారాలను నడిపించే ముఖ్య సహయోగి కార్యకర్తలు. ఒకవేళ ఈ ముగ్గురు కార్యకర్తలు ఆత్మ అంటే రాజ్యాధికారి రాజు యొక్క సైగ అనుసారంగా నడిస్తే ఆ రాజ్యం యదార్ధరీతిగా నడుస్తుంది. బాబా కూడా ముగ్గురు మూర్తుల ద్వారా కార్యం చేయించవలసి ఉంటుంది. అందువలన త్రిమూర్తి అనే విశేషమైన మహిమ మరియు పూజ జరుగుతుంది. త్రిమూర్తి శివ అంటారు. ఒకే బాబాకి విశేష ముగ్గురు కార్యకర్తలు, వారి ద్వారా విశ్వం కార్యం చేయిస్తున్నారు. అలాగే ఆత్మ అయిన మీరు కూడా రచయిత మరియు ఈ మూడు విశేషశక్తులు అనగా త్రిమూర్తి శక్తులు మీ విశేషమైన కార్యకర్తలు. మీరు కూడా ఈ మూడు రచనలకు రచయితలు. కనుక ఈ త్రిమూర్తి రచన మీ ఆధీనంలో ఉన్నాయా అని పరిశీలన చేసుకోండి.

మనస్సు అంటే ఉత్పత్తి చేసేది అంటే సంకల్పాలను రచించేది. బుద్ధి అంటే నిర్ణయించేది అంటే పాలనా కార్యం చేసేది. సంస్కారం అంటే మంచి మరియు చెడుని పరివర్తన చేసేది. ఎలా అయితే బ్రహ్మ ఆదిదేవుడో అదేవిధంగా మనస్సు అంటే సంకల్పశక్తి - ఆదిశక్తి, ఆదిశక్తి యదార్థంగా ఉంటే ఇతర సహయోగి కార్యకర్తలు కూడా యదార్ధంగా కార్యం చేస్తాయి. మొదట ఇది పరిశీలన చేసుకోండి - రాజునైన నా యొక్క ఆది కార్యకర్త సదా సమీప సాథీగా సైగ ప్రమాణంగా నడుస్తుందా? ఎందుకంటే మాయా శత్రువు కూడా మొదట ఈ ఆదిశక్తినే విప్లవదారునిగా అంటే ట్రేటర్ గా చేస్తుంది మరియు రాజ్యాధికారం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందువలన ఆదిశక్తిని సదా మీ అధికారం యొక్క శక్తి ఆధారంగా సహయోగిగా, విశేష కార్యకర్తగా చేసుకుని నడిపించండి. స్వయంగా రాజు ఏ కార్యం చేయడు, చేయిస్తాడు, కార్యవ్యవహారాలు చేసేవారు వేరుగా ఉంటారు. ఒకవేళ రాజ్యవ్యవహారాలు నడిపించేవారు మంచిగా లేకపోతే రాజ్యం అలజడి అయిపోతుంది. అలాగే ఆత్మ కూడా చేయించేది, మరియు ఈ విశేషమైన త్రిమూర్తి శక్తులు చేసేవి. మొదట వీటిపై అధికారశక్తి ఉంటే వాటి ఆధారంగా ఈ సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరైన మార్గంలో నడుస్తాయి. కర్మేంద్రియాలను నడిపించేవి కూడా విశేషంగా ఈ మూడు శక్తులే. ఇప్పుడు ఈ పరిపాలనశక్తి ఎంత వరకు వచ్చిందో పరిశీలన చేసుకోండి.

ఎలా అయితే డబుల్ విదేశీయులో అలాగే డబుల్ పరిపాలకులేనా? ప్రతి ఒక్కరి రాజ్యకార్యవ్యవహారం అంటే స్వరాజ్యం మంచిగా నడుస్తుందా? సత్యయుగంలో ఒకే రాజ్యం, ఒకే ధర్మం అని మహిమ చేస్తారు కదా! అదేవిధంగా ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యం అంటే స్వయం అనగా మీ ఆజ్ఞ ప్రకారం అన్నీ నడవాలి. ఒకే ధర్మం అంటే అందరికీ ఒకే ధారణ ఉండాలి - సదా శ్రేష్టాచారి ఎక్కేకళలో నడవాలి. మనస్సు తన మన్మతంపై నడవటం, బుద్ధి నిర్ణయశక్తిని అలజడి చేయటం, కల్తీ చేయటం, సంస్కారం ఆత్మను కూడా నాట్యం చేయించేదిగా ఉంటే దానిని ఒకే ధర్మం, ఒకే రాజ్యం అని అనరు. కనుక మీ రాజ్య పరిస్థితి ఏమిటి? త్రిమూర్తి శక్తులు సరిగ్గా ఉన్నాయా? అప్పుడప్పుడు సంస్కారం కోతినాట్యం చేయటం లేదు కదా? కోతి ఏం చేస్తుంది, పైకి, క్రిందికి గెంతులేస్తుంది కదా! అలాగే సంస్కారం కూడా ఇప్పుడిప్పుడే ఎక్కేకళ మరియు ఇప్పుడిప్పుడే పడిపోయే కళ ఇలా ఉంటే ఇదే కోతినాట్యం. ఇలా సంస్కారం నాట్యం చేయటం లేదు కదా? అన్నీ అదుపులో ఉన్నాయి కదా, బుద్ది అప్పుడప్పుడు కల్తీ చేయటంలేదు కదా? ఈరోజుల్లో కల్తీ ఎక్కువగా ఉంది కదా, అలాగే బుద్ధి కల్తీ చేయటం లేదు కదా! ఇప్పుడిప్పుడే యదార్ధం, ఇప్పుడిప్పుడే కల్తీ ఇలా లేదు కదా?

కారణాన్ని నివారణ చేసుకుంటే మాయ సమాప్తి అయిపోతుంది:-

విదేశంలో మాయ వస్తుందా? విదేశీయుల దగ్గరికి మాయ రాకూడదు, ఎందుకంటే విదేశంలో వర్తమాన సమయంలో కొద్ది సమయంలోనే ఉన్నతంగా కూడా ఎక్కుతారు మరియు క్రిందికి కూడా పడిపోతారు. కొద్ది సమయంలోనే అన్ని అనుభవాలు చేసుకుని పూర్తి చేసేసుకున్నారు. ఏ పదార్థాన్ని అయినా బాగా తినేస్తే మనస్సు నిండిపోతుంది కదా! అలాగే విదేశంలో కూడా అన్ని రకాలుగా పూర్తి ఫోర్స్ గా ఉంటారు, కనుక విదేశీ ఆత్మలు ఇప్పుడు వాటితో అలసిపోయారు. బాగా అలసిపోయిన వారికి విశ్రాంతి లభిస్తే పడుకోగానే పూర్తిగా నిద్రపోతారు కదా, గాఢంగా నిద్రపోతారు. అలాగే విదేశీయులకు మాయ కొద్ది సమయంలోనే చాలా అనుభవం చేయించేసింది. ఇక ఇప్పుడేమి చేయాలి? క్రొత్త వస్తువు కోసం వెతికేవారు, ఇప్పుడు అది దొరికేసింది. ఇక మరలా మాయ ఎందుకు వస్తుంది? రాకూడదు కదా అయినా కానీ ఎందుకు వస్తుంది? (మాయ యొక్క పాత ఖాతాదారులు) మాయకు కూడా ఇప్పుడు కొత్త ఖాతాదారులు దొరికితే పాతవారిని స్వతహాగానే వదిలేస్తుంది. పరిపాలనాశక్తి ఉన్నవారి దగ్గరికి మాయ రాలేదు. ఎక్కడైతే కార్యకర్తలు తెలివిగా ఉంటారో, ధ్యాసతో ఉంటారో అక్కడికి మాయకు వచ్చే ధైర్యం ఉండదు. పరిపాలనాశక్తి ఎంత వరకు ఉందో పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఆ శక్తి లేకపోతే దానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని నివారణా రూపంలోకి మార్చుకోండి. కారణం సమాప్తి అవ్వటమంటే మాయ సమాప్తి అయిపోవటం. మాయ యొక్క ముఖ్య స్వరూపం - కారణ రూపంలో వస్తుంది. కారణాన్ని నివారణ చేసుకుంటే మాయ సదాకాలికంగా సమాప్తి అయిపోతుంది.

ఈరోజు కలుసుకునేటందుకు వచ్చాను. మురళీలైతే చాలా విన్నారు. కానీ ఇప్పుడు ఎటువంటి మురళీధరులుగా కావాలంటే మాయ ఆ మురళీకి బలిహారం అయిపోవాలి. ఈ విధమైన మురళీధరులు కదా లేక స్టూలమైన మురళీ పాట పాడేవారా? అది చాలా బాగా వాయిస్తారు ఇప్పుడు దీనిలో కూడా మురళీధురులుగా అవ్వండి. మాయని బలిహారం చేసుకునే మురళి మ్రోగించాలి. ఈ వాయిద్యం కూడా వాయించగలరు కదా? వాయిద్యాలు వాయించాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఏ సమయంలో వాయిద్యాలు వాయిస్తారో ఆ సమయంలో ఇది కూడా ఆలోచించండి - మాయాజీతులుగా అయ్యే రహస్యం యొక్క వాయిద్యం కూడా వస్తుందా? అని ఈ రహస్యం యొక్క వాయిద్యాన్ని సదా మ్రోగిస్తూ ఉంటే మాయ సదాకాలికంగా బలిహారం అయిపోతుంది. ఈ వాయిద్యం వాయించటం వస్తుందా? విదేశీయులు కూడా కోటానుకోట్ల భాగ్యవంతులు. దూరం నుండి వస్తారు కానీ అవకాశం కూడా కోటానుకోట్లు లభిస్తుంది. దేశంలో ఉండేవారు సంవత్సరంలో ఎంత తీసుకుంటారో అంత కంటే ఎక్కువ విదేశీయులు కొద్ది సమయంలో తీసుకుంటారు. విశేష పాలన లభిస్తూ ఉంది.

నిర్వికారిగా అవ్వటమే వైర్‌లెస్:-

అందరి దృష్టి విదేశీయులైన మీపై విశేషంగా ఉంటుంది. విశేష పాలనా రూపంగా, ప్రత్యక్షఫల రూపంలో విశేషంగా చూపించాలి. ఎలా అయితే స్థాపన ఆదిలో విశేష పాలన లభించిందో అలాగే ఇప్పుడు కూడా మీకు విశేషపాలన లభిస్తుంది. మొదట్లో పాలన పొందినవారు ఆ పాలనకు బదులుగా సేవాస్థాపన చేసారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సేవని సమాప్తి చేస్తారు మరియు సంపూర్ణత లేదా ప్రత్యక్షత యొక్క పేరుని పైకి తీసుకువస్తారు. సమాప్తి యొక్క తేదీని విదేశీయులే నిర్ణయించవలసి ఉంది. మొదటి పాలన ఆత్మలు స్థాపన యొక్క తేదీని నిర్ణయించారు మరియు మీరు సమాప్తి యొక్క తేదీని నిర్ణయించవలసి ఉంటుంది. ఇప్పుడు అందరు మీ కోసం ఎదురుచూస్తున్నారు. వినాశనం ఎప్పుడవుతుందని బాప్ దాదాని అడుగుతూ ఉంటారు. అప్పుడు విదేశీయులను అడగండి అని చెప్తాను. దేశంలో ఉండే ఆత్మలు స్థాపన యొక్క బాధ్యత తీసుకున్నారు, కనుక విదేశీయులు కూడా ఏదోక బాధ్యత తీసుకుంటారు కదా! విదేశం వినాశి మరియు భారతదేశం అవినాశి, కనుక భారతవాసీయులు స్థాపన చేసారు మరియు విదేశీయులు వినాశన కార్యానికి విశేషంగా నిమిత్తమవుతారు. భారతవాసీ పిల్లలు యజ్ఞస్థాపనలో అన్ని ఆహుతి చేసి స్థాపన చేసారు, యజ్ఞాన్ని రచించారు మరియు మీరు అంతిమ ఆహుతి చేసి సమాప్తి చేయండి. అప్పుడు జయజయకారాలు వస్తాయి. ఇప్పుడు త్వరగా అంతిమ ఆహుతి చేయండి. అందరు కలిసి ఒకే సంకల్పాన్ని స్వాహా చేస్తే సమాప్తి అయిపోతుంది. దీని తారీఖు ఎప్పుడు చెప్తారు? 80వ సంవత్సరంలో చేస్తారా లేదా 81లో చేస్తారా? ఈ తారీఖు చెప్పాలి. ( మరలా ఒకసారి మధువనానికి రావాలని ఉంది) వినాశనం ప్రారంభం అయిపోతే సదాకాలికంగా వచ్చేస్తారు. అందువలన ఇక్కడ పెద్ద హాల్ తయారుచేస్తున్నారు. కేవలం మీ వైర్లెస్ సెట్ ని బాగా ఉంచుకోవాలి. ఇక్కడ వైర్ లెస్ ఏమిటంటే - నిర్వికారిగా అవ్వటమే వైర్లెస్. అప్పుడు ఆ వైర్లెస్ ద్వారా మీకు ధ్వని చేరుతుంది, మీరు వచ్చేయండి అని. ఒకవేళ వైర్ లెస్ సెట్ అయ్యి లేకపోతే ధ్వని కూడా చేరదు. సలహాని అందుకోలేరు. స్థూల సాధనాల ద్వారా పిలుపు అందదు, నిర్వికారి బుద్ధియే ఈ అంతిమ సలహాని గ్రహించగలదు. అందువలన త్వరగా చేసేస్తే త్వరగా సమయం కూడా వచ్చేస్తుంది. మొదట శక్తిశాలి మైక్ తయారుచేయండి. ఈ మైక్ ద్వారా ధ్వని భారతదేశం వరకు చేరుకోవాలి. ఎలా అయితే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక రోజు ముందే ప్రసార సాధనాలన్నీ బంద్ చేసేస్తారు, తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అలాగే మొదట మైక్ ద్వారా ధ్వని వ్యాపింపచేయండి, తర్వాత అది కూడా సమాప్తి అయిపోయిన తర్వాత ఫలితం ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఎడ్వర్‌టేజ్ మెంట్ మైక్ ఎంత వరకు తయారుచేస్తారు? మొదట ధ్వని వ్యాపిస్తుంది ఆ తర్వాత పూర్తి శాంతి, ధ్వని వ్యాపింపచేసే పాత్ర కూడా సమాప్తి అయిపోతుంది, ఆ తర్వాత పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు మొదటి స్థితి నడుస్తుంది కదా, మొదటి స్థితిలో సమయం పడుతుంది కానీ రెండవ స్థితిలో సమయం పట్టదు. మంచిది.