'' ప్రసిద్ధమైన సేవాధారిగా అయ్యేందుకు విధి ''
ఈ రోజు బాప్దాదా ఏకరసంగా వెలుగుతున్న తన దీపాల
దీపమాలను(చూస్తున్నారు), వెలుగుతున్న ప్రతి దీపము అచలంగా, నిర్విఘ్నంగా తమ
జ్యోతి ద్వారా విశ్వానికి ప్రకాశాన్ని ఎలా ఇస్తూ ఉందో చూస్తున్నారు. ఈ దీపాల
ప్రకాశము ఆత్మలను మేల్కొలిపే ప్రకాశము. విశ్వంలోని సర్వ ఆత్మల ముందు ఉన్న
అజ్ఞానం ఆవరణను తొలగించేందుకు తాము మేల్కొని ఇతరులను మేల్కొలుపుతున్నారో
చూస్తున్నారు. అంధకారం కారణంగా అనేక ఎదురుదెబ్బలు తినేవారు, మేల్కొన్న (వెలుగుతున్న)
దీపాలైన మీ వైపు చూస్తున్నారు. అంధకారంలో భ్రమించే ఇలాంటి ఆత్మలకు ఇంటింట్లో
దీపాలు వెలిగే విధంగా జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వండి.(కరెంటు పోయింది) ఇప్పుడు కూడా
చూడండి. అంధకారం బాగుందా? ప్రకాశం మంచిగా అనిపిస్తుంది కదా! కావున ఈ తండ్రితో
సంబంధం జోడించండి. సంబంధం జోడించే జ్ఞానం ఇతరులకు ఇవ్వండి.
డబల్ విదేశీయులందరూ రిఫ్రెష్అవ్వడం అనగా శక్తిశాలిగా, లైట్ హౌస్ గా, మైట్ హౌస్
గా అయ్యి, జ్ఞానవంతులుగా అయ్యి, శక్తిశాలిగా అయ్యి, విజయులుగా అయ్యి మళ్ళీ
వచ్చేందుకు మీ సేవా స్థానాలకు వెళ్తున్నారు. మళ్ళీ వచ్చేందుకు వెళ్ళడం అనగా
సఫలతా స్వరూపం యొక్క పాత్రను అభినయించి ఒకరి నుండి అనేకులుగా అయ్యి రావడము. తమ
పరివారంలోని అనేక ఆత్మలను తండ్రి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్తున్నారు. ఎలాగైతే
హద్దులో యుద్ధం చేసే బాహుబలం గల యోధులు, సైన్సు బలం కలిగిన యోధులు, సర్వ
శస్త్రాలతో అలంకరించుకొని యుద్ధమైదానంలోకి విజయం అనే మెడల్ తీసుకొచ్చేందుకు
వెళ్తారో, అలా మీరందరూ ఆత్మిక యుద్ధ వీరులు, సేవ అనే మైదానంలోకి విజయ జెండా
ఎగురవేసేందుకు వెళ్తున్నారు కావున ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ లభించాయో
పరిశీలించుకోండి. విశేషతలు లేక టైటిల్స్ఏవైతే ఇచ్చారో వాటిలో ఎన్ని
మెడల్స్(పతకాలు) ధారణ చేశారు! విశేషమైన మెడల్స్ లిస్ట్ తీశారు కదా! ఆ
లిస్ట్(జాబితా) ఎదురుగా ఉంచుకొని ఈ మెడల్స్అన్నీ మాకు ప్రాప్తించాయో అని
స్వయాన్ని పరిశిలించుకోండి. ఇప్పుడైతే చాలా తక్కువ మందే తీసుకున్నారు. తక్కువలో
తక్కువ 108 అయినా ఉండాలి కదా. మీ మెడల్స్అన్నీ చూసి నషాలో ఉండండి. ఎన్ని
మెడల్స్(పతకాల)తో అలంకరించుకున్నారు. వెళ్ళడం అనగా విశేష కార్యం చేసి సదా
క్రొత్త క్రొత్త మెడల్స్ తీసుకుంటూ వెళ్ళడం. ఎలాంటి కార్యము అయితే అలాంటి పతకం
లభిస్తుంది. కావున ఈ సంవత్సరం సేవకు నిమిత్తంగా అయిన పిల్లలందరూ ఈ లక్ష్యం
ఉంచుకోండి. ఎలాంటి నూతనమైన విశేష కార్యము చేయాలంటే అది ఇప్పటి వరకు డ్రామాలో
దాగి ఉండాలి, డ్రామాలో నిశ్చితమై ఉండాలి. అటువంటి కార్యాన్ని ప్రత్యక్షం
చెయ్యండి. లౌకికంలో కూడా ఏదైనా విశేష కార్యము చేసినప్పుడు సుప్రసిద్ధులవుతారు
కదా. నలువైపులా విశేషతతో పాటు విశేష ఆత్మ యొక్క పేరు కూడా ఉంటుంది. నేను ఇలాంటి
విశేష కార్యము చెయ్యాలని ప్రతి ఒక్కరు భావించాలి. విజయ పతకం తీసుకోవాలి.
బ్రాహ్మణ పరివారం మధ్యలో విశేష సేవాధారుల లిస్ట్ లో ప్రసిద్ధం అవ్వాలి. ఆత్మిక
నషా ఉండాలి. పేరు యొక్క నషా ఉండరాదు. ఆత్మక సేవ యొక్క నషాలో నిమిత్తంగా మరియు
నిర్మానాల సర్టిఫికెట్ సహితంగా ప్రసిద్ధమవ్వాలి.
ఈ రోజు డబల్ విదేశీయుల గ్రూపు విజయులుగా అయ్యి విజయ స్థలంలోకి వెళ్ళేందుకు
శుభాకాంక్షలు ఇచ్చే పండుగ. ఎవరైనా విజయీ స్థలానికి వెళ్ళినట్లయితే చాలా
అట్టహాసంగా, ఆర్భాటంగా సంతోష భజంత్రీలు, మేళ-తాళాలతో విజయ తిలకం ధరించి
శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతుంది, వీడ్కోలు కాదు. శుభాకాంక్షలు ఎందుకంటే
బాప్దాదాకు మరియు పరివారానికి ఇలాంటి సేవాధారుల విజయం నిశ్చితం అని తెలుసు.
అందువలన శుభాకాంక్షల ఉత్సవం జరుపుతున్నారు. విజయం లభించే ఉంది కదా! కేవలం
నిమిత్తంగా అయ్యి చేస్తారు, పొందుతారు. నిమిత్తంగా ఏ కర్మ చేసినా, అందుకు
నిశ్చితంగా ప్రత్యక్షఫలం లభిస్తుంది. ఈ నిశ్చయం ద్వారా కలిగే ఉల్లాస-ఉత్సాహాలలో
ఇతరులను అధికారులుగా తయారు చేసి తీసుకు వచ్చేందుకు వెళ్తున్నారు. అధికారం యొక్క
తరగని ఖజానాకు మహాదానిగా అయ్యి దాన-పుణ్యాలు చేసేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు
పాండవులు ముందు వస్తారో లేక శక్తులు ముందు వస్తారో చూస్తాము. విశేషమైన క్రొత్త
కార్యము ఎవరు చేస్తే వారికి మెడల్ లభిస్తుంది. ఇలాంటి విశేష సేవకు ఎవరైనా
నిమిత్త ఆత్మలను తయారుచేయండి. సేవాస్థానాలకు వృద్ధిని ప్రాప్తి చేయించండి.
నలువైపులా పేరు వ్యాపింపచేసే ఏదైనా విశేష కార్యము చేసి చూపించండి. ఇలాంటి పెద్ద
గ్రూపును తయారుచేసి బాప్దాదా ముందుకు తీసుకు రండి. ఎలాంటి విశేష సేవ
చేసేవారికైనా విజయ పతకము(మెడల్) లభిస్తుంది. ఇలాంటి విశేష సేవ చేసేవారికి అన్ని
రకాల సహయోగం కూడా లభిస్తుంది. స్వయమే ఎవరో ఒకరు టికెట్ కూడా ఆఫర్చేస్తారు.
మొట్టమొదట మీరందరూ సేవకు వెళ్తున్నప్పుడు సేవ చేసి ఫస్ట్ క్లాస్లో ప్రయాణం
చేసేవారు. కాని ఇప్పుడు టికెట్అయితే తీసుకుంటున్నారు అయితే సెకండ్, థర్డ్(రెండు,
మూడు) క్లాసులలో వెళ్తున్నారు. ఇలాంటి ఏదో ఒక కంపెనీకి సేవ చెయ్యండి. అన్నీ
జరిగిపోతాయి. సేవాధారులకు సాధనాలు కూడా లభిస్తాయి. అర్థమయ్యిందా! అందరూ
సంతుష్టంగా అయ్యి, విజయులుగా అయ్యి వెళ్తున్నారు కదా! ఏ విధమైన బలహీనతను తమ
వెంట తీసుకు వెళ్ళడం లేదు కదా! బలహీనతలను స్వాహా చేసి శక్తిశాలీ ఆత్మలుగా అయ్యి
వెళ్తున్నారు కదా! ఏ బలహీనతా మిగిలి లేదు కదా! ఏదైనా మిగిలి ఉన్నట్లయితే
విశేషంగా సమయం ఇచ్చి సమాప్తి చేసుకొని వెళ్ళండి. మంచిది.
సదా అచలంగా వెలుగుతూ ఉన్న దీపాలుగా సదా ప్రకాశం ద్వారా అంధకారాన్ని తొలగించేవారు,
ప్రతి సమయం సేవ యొక్క విశేషతతో విశేష పాత్రను అభినయించేవారు, తండ్రి ద్వారా
ప్రాప్తించిన మెడల్స్ ను ధారణ చేసేవారు, సదా విజయం నిశ్చితం అని భావించి
నిశ్చయంలో ఉండేవారు, అవినాశీ విజయ తిలకధారులకు, సదా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా
సంతుష్టంగా ఉన్న ఆత్మలకు అందరికి బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
జగదీష్ భాయితో :-
బాప్దాదా సాకార పాలనలో పాలింపబడిన రత్నాలకు చాలా విలువ ఉంటుంది. లౌకిక పద్ధతిలో
కూడా వృక్షంలో పండిన ఫలాలకు ఎంతో అందంగా ఉంటాయి. అలాగే అనుభవీ ఆత్మలైన మీ
అందరినీ అందరూ ఎంతో ప్రేమతో చూస్తారు. మొదటి మిలనంలోనే వరదానం పొందారు కదా!
పాలన అనగా వృద్ధియే వరదానాలతో నిండి ఉంది కదా! అందువలన సదా పాలన యొక్క అనుభవంతో
అనేకమంది ఆత్మల పాలన చేస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రేరేపిస్తూ ఉంటారు.
సాగరుని భిన్న-భిన్న సంబంధాల అలలలో, అనుభవాల అలలలో నిమిత్తంగా అయ్యారు. పొదుపు
చేసే సమయంలో నిమిత్తంగా ఉన్నందున సేవ యొక్క ఫలం సదా శ్రేష్ఠంగా ఉంది. సమయ
ప్రమాణంగా సహయోగిగా అయ్యారు, అందువలన వరదానం లభించింది. మంచిది.
కాన్ఫరెన్స్ పట్ల :-
అందరూ కలిసి ఉత్సాహ-ఉల్లాసాలతో ఏదైనా కార్యం చేస్తున్నట్లయితే అందులో సఫలత
సహజంగానే ఉంటుంది. అందరి ఉత్సాహంతో కార్యం జరుగుతూ ఉంది కదా! సఫలత తప్పకుండా
ఉంటుంది. అందరినీ కలిపించడం ఇది కూడా ఒక శ్రేష్ఠత్వానికి గుర్తు. అందరూ
కలిసినట్లయితే ఇతర ఆత్మలు కూడా మిలనం చేసేందుకు సమీపంగా వస్తాయి. మానసిక సంకల్పం
కలపడం అనగా అనేక ఆత్మల మిలనం జరపడం. ఇదే లక్ష్యాన్ని చూస్తూ చేస్తున్నారు,
ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. మంచిది. విదేశీయులందరూ బాగున్నారా? సంతుష్టంగా
ఉన్నారా? ఇప్పుడు అందరూ పెద్దగా అయ్యారు. సంభాళించే వారిగా అయిపోయారు. మొదట చాలా
చిన్నగా ఉండేవారు. అల్లరి వేషాలు వేసేవారు. ఇప్పుడు ఇతరులను సంభాళించేవారిగా
అయ్యారు. మమ్ములను ఎవరైనా సంభాళించాలి అనేది లేదు. ఇప్పుడు శ్రమ తీసుకునేవారిగా
కాదు, శ్రమ ఇచ్చేవారు(చేసేవారు) ఫిర్యాదులు చేసేవారిగా కాదు, సంపూర్ణంగా
అయ్యేవారు. ఇప్పుడు కూడా ఏ ఫిర్యాదూ లేదు, తర్వాత కూడా ఉండదు. ఇలా ఉన్నారు కదా!
సదా సంతోషం కలిగించే సమాచారం ఇవ్వండి. ఇంకా ఎవరైతే రాలేదో వారిని కూడా
మాయాజీతులుగా తయారు చెయ్యండి. తర్వాత ఎక్కువ పొడవైన ఉత్తరాలు వ్రాయాల్సిన అవసరం
లేదు. కేవలం ఓ.కె. అని వ్రాయండి చాలు. మంచి మంచి మాటలు భలే వ్రాయండి కానీ
తక్కువగా(షార్టుగా) వ్రాయండి, మంచిది.
టీచర్లతో :-
బాప్దాదాకు టీచర్ల పై విశేష ప్రేమ ఉంది. ఎందుకంటే సమానమైనవారు. తండ్రి టీచర్,
మీరు మాస్టర్ టీచర్లు సమానంగా ఉన్నవారు ప్రియంగానే అనిపిస్తారు. చాలా మంచిగా
ఉత్సాహ- ఉల్లాసాలతో సేవలో ముందుకు వెళ్తున్నారు. అందరూ చక్రవర్తులుగా ఉన్నారు.
చక్రం తిరుగుతూ అనేక ఆత్మల సంబంధంలోకి వచ్చారు. అనేక ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే
కార్యము చేస్తున్నారు. బాప్దాదా సంతోషంగా ఉన్నారు. బాప్దాదా మా పట్ల సంతోషంగా
ఉన్నారని అనిపిస్తుంది కదా! ఇప్పుడింకా కొంచెం ఎక్కువగా సంతోషపెట్టాలని
భావిస్తున్నారా! సంతోషంగా ఉన్నారు, ఇంకా ఎక్కువగా సంతోషపెట్టాలి. బాగా శ్రమ
చేస్తున్నారు. ప్రేమతో శ్రమ చేస్తున్నారు. అందువలన కష్టంగా అనిపించదు. బాప్దాదా
సేవాధారీ పిల్లలనకు ఎల్లప్పుడూ శిరోకిరీటాలని అంటారు. మీరు సర్వ
శ్రేష్ఠులు(కిరీటాలు). బాప్దాదా పిల్లల ఉత్సాహ-ఉల్లాసాలను పెంచే సహయోగం ఇస్తారు.
ఒక్క అడుగు పిల్లలది, పదమాల అడుగులు తండ్రివి. ఎక్కడ ధైర్యం ఉంటుందో, అక్కడ
స్వత:గానే ఉల్లాసం ప్రాప్తి అవుతుంది. ధైర్యముంటే తండ్రి సహాయం ఉంటుంది,
అందువలన మీరు నిశ్చింత చక్రవర్తులు సేవ చేస్తూ వెళ్ళండి. సఫలత లభిస్తూ ఉంటుంది.
మంచిది.