డబుల్ విదేశీ పిల్లలతో బాప్దాదా ఆత్మిక సంభాషణ
:-
డబుల్ విదేశీ పిల్లలనగా అనగా సదా స్వ దేశమైన స్వీట్
హోమ్ ను(మధురమైన ఇంటిని) అనుభవం చేసేవారు. సదా నేను నా స్వదేశమైన స్వీట్ హోమ్
నివాసిని, పరాయి దేశంలో, పరాయి రాజ్యంలో స్వరాజ్యము అనగా ఆత్మిక రాజ్యాన్ని,
సుఖప్రదమైన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు గుప్త రూపంలో ప్రకృతిని ఆధారంగా
తీసుకొని, పాత్రను అభినయించేందుకు వచ్చాను. స్వదేశీయులమే కాని పరాయి దేశంలో
పాత్రను అభినయిస్తున్నాము. ఇది ప్రాకృతిక(పంచ తత్వాల) దేశము. స్వదేశము అనగా
ఆత్మల దేశము. ఇప్పుడు ప్రకృతికి, మాయకు వశమై ఉన్నాము. మాయా రాజ్యముగా ఉంది కనుక
పరాయి దేశముగా అయిపోయింది. ఇదే ప్రకృతి, మీరు మాయాజీతులుగా అయితే మీకు
సుఖమునిచ్చే సేవాధారిగా అవుతుంది. మాయాజీతులుగా, ప్రకృతిజీతులుగా అవ్వడం వలన మీ
సుఖప్రదమైన రాజ్యంగా, సతోప్రధానమైన రాజ్యంగా, బంగారు ప్రపంచంగా అయిపోతుంది. ఇది
స్పష్టంగా స్మృతిలోకి వస్తోంది కదా! కేవలం ఒక్క సెకండులో శరీరాన్ని మార్చుకోవాలి.
పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించాలి. ఎంత సమయం పడ్తుంది? ఫరిస్తాల
నుండి దేవతలుగా అయ్యేందుకు కేవలం శరీరాన్ని మార్చుకునేంత సమయం పడ్తుంది. స్వీట్
హోమ్ ద్వారా వస్తారు కానీ అంతిమంలో ఫరిస్తాల నుండి దేవతలుగా అవ్వనే అవుతాము అనే
స్మృతియే ఉంటుంది. దేవతల శరీరము, దేవతల జీవితము, దేవతల ప్రపంచము, సతోప్రధాన
ప్రకృతి గల సమయము స్మృతిలో ఉంటుందా? అనేకసార్లు రాజ్య పాలన చేసినందున,
అనేకసార్లు దేవతా జీవితాన్ని గడిపినందున నిండిన సంస్కారము ఉత్పన్నమవుతోందా?
ఎందుకంటే ఎంతవరకు కాబోయే దేవతలైన మీ సంస్కారాలు ఉత్పన్నమవ్వవో, అంతవరకు సాకార
రూపంలో బంగారు ప్రపంచము ఎలా ప్రత్యక్షమవుతుంది? మీలో ఉత్పన్నమయ్యే సంకల్పాల
ద్వారా దైవీ సృష్టి ఈ భూమి పైన ప్రత్యక్షమవుతుంది. సంకల్పం స్వతహాగా
ఇమర్జ్అవుతోందా లేక ఇప్పుడింకా చాలా సమయం ఉందని భావిస్తున్నారా? దేవతా శరీరము
దేవాత్మలైన మిమ్ములను ఆహ్వానిస్తోంది. మీ దేవతా శరీరము కనిపిస్తోందా? ఎప్పుడు
ధారణ చేస్తారు? మనసు పాత శరీరముతో అయితే తగుల్కొని లేదు కదా! పాత టైట్
వస్త్రాన్ని ధరించి లేరు కదా! ఇప్పుడింకా పాత శరీరం, పాత వస్త్రము ధరించి
ఉన్నారు. వాటిని సమయానికి సెకండులో వదలలేరు. నిర్బంధనులు అనగా లూజ్ డ్రెస్
ధరించినవారు. కనుక డబల్ విదేశీయులకు లూజ్ డ్రెస్ ఇష్టమా, టైట్ డ్రెస్ ఇష్టమా?
టైట్ డ్రెస్ ఇష్టం లేదు కదా! బంధనాలేవీ లేదు కదా.
మీ అంతకు మీరు సదా తయారుగా ఉన్నారా! సమయాన్ని వదిలి
పెట్టండి, సమయాన్ని లెక్క పెట్టకండి. ఇప్పుడు ఇది జరగాలి, అది జరగాలి........,
అది సమయానికి తెలుసు, తండ్రికి తెలుసు. సేవకు తెలుసు, తండ్రికి తెలుసు. మీ సేవతో
మీరు సంతుష్టంగా ఉన్నారా? విశ్వ సేవను ప్రక్కన పెట్టండి, స్వయాన్ని చూసుకోండి.
స్వ స్థితిలో, స్వయం యొక్క స్వతంత్ర రాజ్యంలో, స్వయంతో సంతుష్టంగా ఉన్నారా?
స్వంత రాజధానిని సరిగ్గా నడిపించగలరా? ఈ కర్మచారులందరూ, మంత్రులు, మహామంత్రి,
అందరూ మీ అధికారంలో ఉన్నారా? ఎక్కడా అధీనత లేదు కదా! ఎప్పుడూ మీ మంత్రి,
మహామంత్రి మోసం చేయడం లేదు కదా! ఎక్కడా లోలోపల గుప్తంగా మీ కర్మచారులే మాయకు
సహచరులుగా అయితే అయిపోవడం లేదు కదా! స్వ రాజ్యంలో రాజులైన మీ రూలింగ్ పవర్(పాలనా
శక్తి) కంట్రోలింగ్ పవర్(అదుపు చేసే శక్తి) యథార్ధ రూపంలో కార్యం చేస్తున్నాయా?
శుభ సంకల్పంతో నడవాలని ఆర్డర్ఇచ్చినప్పుడు వ్యర్థ సంకల్పాలు నడవడం లేదు కదా!
సహనశీలతా గుణాన్ని ఆజ్ఞాపిస్తే ఆందోళన పరచే అవగుణాలు రావడం లేదు కదా. ఓ
స్వరాజ్యాధికారులారా! అన్ని శక్తులు, అన్ని గుణాలు మీ ఆజ్ఞానుసారం ఉన్నాయా? మీ
రాజ్యానికి సహచరులు ఇవే కదా. కావున అన్నీ ఆర్డరులో ఉన్నాయా? ఎలాగైతే రాజులు
ఆర్డర్చేసినప్పుడు అందరూ సెకనులో జీ హుజూర్(అలాగేనండి) అని సలామ్చేస్తారో, అలా
మీ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ఉన్నాయా? ఇందులో ఎవర్రెడీగా ఉన్నారా?
స్వయంలోని బలహీనతలు, స్వంత బంధనాలు మోసం చేయవు కదా!
ఈ రోజు బాప్దాదా స్వరాజ్య అధికారులను వారి స్వరాజ్యం
గురించిన స్థితి-గతులను అడుగుతున్నారు. అందరూ రాజులే కదా? ప్రజలుగా కారు కదా!
దేనికైనా అధీనులు అనగా ప్రజలు. అధికారులు అనగా రాజులు. కావున మీరందరూ ఎవరు?
రాజులు. రాజయోగులా లేక ప్రజాయోగులా? అందరి రాజుల దర్బారు జరుగుతోంది కదా?
సత్యయుగ రాజ్యసభలో అయితే మర్చిపోతారు. మనం అప్పటి సంగమయుగ వాసులమని ఒకరినొకరు
గుర్తించలేరు. ఇపుడు త్రికాలదర్శీలుగా అయ్యి ఒకరినొకరు తెలుసుకుంటారు,
చూసుకుంటారు. ఇప్పటి ఈ రాజ్య దర్బారు సత్యయుగము కన్నా శ్రేష్ఠమైనది. ఇటువంటి
రాజ్య దర్బారు కేవలం సంగమ యుగంలోనే జరుగుతుంది. కావున అందరి రాజ్యాల స్థితి
గతులు బాగున్నాయా? బాగుందని బిగ్గరగా చెప్పలేదు!
బాప్దాదాకు కూడా ఈ రాజ్య సభ ప్రియమనిపిస్తుంది. అయినా
రోజూ చెక్ చేయండి. ప్రతిరోజు మీ రాజ్య దర్బారును జరిపి చూసుకోండి. ఒకవేళ ఏ
కర్మచారులైనా కొద్దిగా అయినా నిర్లక్ష్యంగా అయినట్లయితే ఏం చేస్తారు? వారిని
వదిలేస్తారా? మీరందరూ యజ్ఞ ప్రారంభంలోని చరిత్ర విన్నారు కదా! ఒకవేళ ఎవరైనా
చిన్నపిల్లలు అల్లరి చేసినప్పుడు వారికి ఏ శిక్ష వేసేవారు? వారికి భోజనం
పెట్టకపోవడం, త్రాడుతో కట్టివేయడం చేసేవారు. ఇదైతే సాధారణ విషయం. కాని వారిని
ఏకాంతంలో చాలా గంటలు కూర్చోబెట్టే శిక్ష వేసేవారు. పిల్లలు కదా, పిల్లలైతే
కూర్చోలేరు. కావున ఒకే స్థానంలో కదలకుండా 4-5 గంటలు కూర్చోవడం వారికెంత పెద్ద
శిక్ష! కనుక అలాంటి రాయల్ శిక్షలు విధించేవారు. అయితే ఇక్కడ కూడా ఏవైనా
కర్మేంద్రియాలు అలా - ఇలా చేసినట్లయితే అంతర్ముఖతా భట్టీలో వాటిని
కూర్చోబెట్టండి. బాహ్యముఖతలోకి రానే రాకూడదు. అదే వాటికి శిక్ష. ఒకవేళ బయటికి
వస్తే మళ్లీ లోపలికి పంపండి. పిల్లలు కూడా అలా చేస్తారు కదా! పిల్లలను
కూర్చోబెట్తారు, మళ్లీ అలా చేస్తే మళ్లీ కూర్చోపెడ్తారు. కనుక అలా చేస్తూ చేస్తూ
బాహ్యముఖత నుండి అంతర్ముఖత అలవాటు అయిపోతుంది. ఎలాగైతే చిన్న పిల్లలకు అలవాటు
చేయిస్తారు కదా! అలా కూర్చోండి, స్మృతి చేసుకోండి. వారు ఆసనంలో కూర్చోరు. మళ్లీ
మళ్లీ మీరు వేయించి కూర్చోబెటండి. వాళ్ళు కాళ్లు ఎంతగా కదిలించినా, వారితో
కదలకుండా కూర్చో అని అంటారు అలాగే అంతర్ముఖత భట్టీలో దృఢ సంకల్పంతో బాగా బంధించి
కూర్చోబెట్టండి. మామూలు తాళ్లు కాదు, దృఢ సంకల్పమనే త్రాడుతో బంధించి అంతర్ముఖను
అభ్యాసము చేసే భట్టీలో కూర్చోబెట్టండి. మీకు మీరే శిక్షించుకోండి. ఇతరులు
శిక్షిస్తే ఏమవుతుంది? ఒకవేళ మీ కర్మచారులు సరిగ్గా లేవు, వీటిని శిక్షించండి
అని ఇతరులు చెప్తే ఏం చేస్తారు? వీరెందుకు చెప్తున్నారని కొంచెం కోపం వస్తుంది
కదా! కాని మీకు మీరే శిక్షించుకుంటే సదాకాలం గుర్తుంటుంది. ఇతరులు చెప్పడం వలన
సదాకాలం గుర్తుండదు. ఇతరుల సూచనలను కూడా సొంతముగా చేసుకోనంతవరకు సదాకాలం ఉండదు.
అర్థమయిందా!
రాజులు ఎలా ఉన్నారు? రాజ్య దర్బారు బాగా అనిపిస్తోంది
కదా! అందరూ పెద్ద రాజులే కదా! చిన్న రాజులు కాదు, పెద్ద రాజులు. మంచిది. ఈ రోజు
బ్రహ్మబాబా విశేషంగా డబల్విదేశీయులను చూసి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. దానిని
మళ్లీ వినిపిస్తాము. మంచిది.
సదా మాయాజీతులు, ప్రకృతిజీత్, రాజ్యాధికారి ఆత్మలకు,
గుణాలు మరియు సర్వ శక్తుల ఖజానాలను తమ అధికారంతో కార్యంలో ఉపయోగించే వారికి, సదా
స్వరాజ్యం ద్వారా సర్వ కర్మచారులను సదా స్నేహీ సాథీలుగా చేసుకునేవారికి, సదా
నిర్బంధనులు ఎవర్రెడీగా ఉండేవారికి, సంతుష్ట ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు
మరియు నమస్తే.
ఆస్ట్రేలియా గ్రూపుతో :- సదా స్మృతి మరియు సేవల
బ్యాలెన్స్ఉంచేవారు, బాప్దాదా మరియు సర్వ ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు తీసుకునే
ఆత్మలు కదా! సదా పురుషార్థము జత జతలో ఆశీర్వాదాలను తీసుకుంటూ ముందుకు వెళ్తూ
ఉండడమే బ్రాహ్మణ జీవితపు విశేషత. బ్రాహ్మణ జీవితంలో ఈ ఆశీర్వాదాలు ఒక లిఫ్ట్వలె
పని చేస్తాయి. దీని ద్వారా ఎగిరేకళను అనుభవం చేస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా
నివాసులతో బాప్దాదాకు విశేష స్నేహముంది. ఎందుకు? ఎందుకంటే ఒకరు అనేకమందిని
తీసుకొని వచ్చే ధైర్యం మరియు ఉల్లాసంలో సదా ఉంటారు. ఈ విశేషత తండ్రికి కూడా చాలా
ప్రియమైనది. ఎందుకంటే ఎక్కువలో ఎక్కువ ఆత్మలను వారసత్వానికి అధికారులుగా తయారు
చేయడం తండ్రి కర్తవ్యం కూడా. కావున తండ్రిని అనుసరించే పిల్లలు విశేషంగా
ప్రియమవుతారు కదా! రావడంతోనే మంచి ఉత్సాహంగా ఉంటారు. ఇది ఆస్ట్రేలియా ధరణికి
వరదానము లభించినట్లే. ఒకరు అనేమందికి నిమిత్తంగా అవుతారు. బాప్దాదా అయితే ప్రతి
పుత్రుని గుణాల మాలను స్మరిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా విశేషతలు కూడా చాలా ఉన్నాయి.
కానీ ఆస్ట్రేలియా వారంటే మాయకు కూడా కొంచెం ప్రేమ ఎక్కువే. ఎవరైతే తండ్రికి
ప్రియంగా ఉంటారో, వారు మాయకు కూడా ప్రియంగా అవుతారు. ఎంతో మంచి మంచి పిల్లలు
కూడా కొద్ది సమయం కోసమైనా గాని మాయవారిగా అయితే అయిపోయారు కదా! మీరందరూ అలా
కచ్చాగా(అపరిపక్వంగా) అయితే లేరు కదా! ఏ చక్రంలోనూ వచ్చేవారు కాదు కదా!
బాప్దాదాకు ఇప్పుడు కూడా ఆ పిల్లలు గుర్తున్నారు. కేవలం ఏమవుతుందంటే, ఏ
విషయాన్నైనా పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా ఎందుకు మరియు ఏమిటి అనే
ప్రశ్నలలోకి వచ్చేస్తారు. అప్పుడు మాయ వచ్చే ద్వారము తెరుచుకుంటుంది. మీరు మాయ
వచ్చే ద్వారాన్ని గురించి తెలుసుకున్నారు కదా! కనుక ఎందుకు, ఏమిటిలోకి వెళ్లకండి
మరియు మాయకు వచ్చే ఛాన్సు ఇవ్వకండి. సదా డబల్లాక్వేయబడి ఉండాలి. స్మృతి మరియు
సేవయే డబల్లాక్. కేవలం సేవ ఒక్కటే అయితే అది సింగిల్లాక్. అలాగే సేవ లేకుండా
కేవలం స్మృతి కూడా సింగిల్లాక్. రెండిటి బ్యాలెన్స్ఉండడమే డబల్లాక్. బాప్దాదా
టి.వి.లో మీ ఫొటో వెలువడుతోంది. తర్వాత ఈ ఫొటోలో మీరున్నారు అని బాప్దాదా
చూపిస్తారు. మంచిది, అయినా సంఖ్యలో ధైర్యంతో, నిశ్చయంతో మంచి నెంబరు
తీసుకున్నారు. తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు కనుక మాయ నుండి రక్షించుకునే
యుక్తిని వినిపించారు. అచ్ఛా! ఓం శాంతి.