09.03.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


''పరివర్తనను అవినాశిగా చేసుకోండి''

బాప్దాదా ఛాత్ర (వర్షపు నీటి కోసం ఎదురుచూసే ఒక రకమైన పక్షి) పిల్లలందరినీ చూస్తున్నారు. వినాలి, కలుసుకోవాలి, తయారవ్వాలి అనే పట్టుదల అందరికీ ఉంది. వినడంలో నంబర్వన్ ఛాత్రకులుగా ఉన్నారు. కలుసుకోవడంలో నంబరు ఉంది. తయారవ్వడము మరియు సమానంగా అవ్వడంలో యథా శక్తిగా ఉన్నారు. కాని శ్రేష్ఠ ఆత్మలైన బ్రాహ్మణాత్మలందరు తప్పకుండా మూడింటిలోనూ ఛాత్రకులుగా ఉన్నారు. నంబర్వన్ ఛాత్రకులు మాస్టర్ మురళీధరులుగా ఉన్నవారు తండ్రి సమానం మాస్టర్ సర్వశక్తివంతులుగా సదా మరియు సహజంగా అయిపోతారు. వినడము అనగా మురళీధరులుగా అవ్వడం. కలుసుకోవడము అనగా సాంగత్య రంగులో వారి సమానంగా శక్తులు మరియు గుణాలలో రంగరింపబడడం. తయారవ్వడం అనగా సంకల్పాల అడుగు పైన, మాటల అడుగు పైన, కర్మల అడుగు పైన అడుగు ఉంచుతూ సాక్షాత్తు బాబా సమానంగా అవ్వడం. పిల్లల సంకల్పము, తండ్రి సంకల్పము సమానంగా అనుభవమవ్వాలి. మాటలో, కర్మలో పిల్లలు తండ్రి సమానంగా అనుభవమవ్వాలి. దీనినే సమానంగా అవ్వడం లేక నంబర్వన్ ఛాత్రకులుగా అవ్వడం అని అంటారు. ముగ్గురిలో నేనెవరిని అని పరిశీలించుకోండి. పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలతో నిండిన సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. చాలా మంచి సంకల్పాలు ధైర్యముతో మరియు దృఢత్వముతో చేస్తారు. సంకల్ప రూపీ బీజము శక్తిశాలిగా ఉంది. కాని ధారణ అనే ధరణి, జ్ఞానమనే గంగా జలము మరియు స్మృతి అనే సూర్యరశ్మి అనండి వేడి(ఉష్ణము) అనండి, పదే పదే స్వయాన్ని చూసుకోవడమనే అటెన్షన్లో అక్కడక్కడ నిర్లక్ష్యంగా అయిపోతున్నారు. మూడింటిలో ఒక్క విషయంలోనైనా లోపమున్నందున సంకల్ప రూపీ బీజము సదా ఫలమును ఇవ్వడం లేదు. కొద్ది సమయము కొరకు ఒక సీజను, రెండు సీజన్లు ఫలాలను ఇస్తుంది కాని సదా ఫలమును ఇవ్వదు. అప్పుడు బీజమేమో శక్తిశాలిగా ఉంది, ప్రతిజ్ఞ అయితే పక్కాగా చేశాను, స్పష్టంగా కూడా అయ్యింది కాని మళ్లీ ఏమయ్యిందో తెలియదని ఆలోచిస్తారు. 6 నెలలు అయితే చాలా ఉత్సాహం ఉన్నింది తర్వాత మళ్లీ నడుస్తూ - నడుస్తూ ఏమయ్యిందో తెలియదు. దీని కొరకు ఇంతకు ముందు వినిపించిన మూడు విషయాల పై సదా అటెన్షన్ఉండాలి.

రెండవ విషయం - చిన్న విషయంలో త్వరగా భయపడ్తారు. భయానికి కారణమేమంటే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తారు. ఉండేది చీమంత చిన్నదే కాని దానిని ఏనుగంత పెద్దదిగా చేస్తారు అందువలన బ్యాలెన్స్ఉండదు. బ్యాలెన్స్ లేని కారణంగా జీవితమంటే భారమనిపిస్తుంది. నషాలో పూర్తి పైకెక్కిపోతారు లేక చిన్న గులకరాయి కూడా క్రింద కూర్చోబెడ్తుంది. నాలెడ్జ్ ఫుల్(జ్ఞాన స్వరూపులు)గా అయ్యి సెకండులో దానిని తొలగించేందుకు బదులు గులకరాయి వచ్చింది, ఆగిపోయాము, క్రిందకు వచ్చేశాము, ఇది జరిగింది.... అని దీని గురించి ఆలోచించడం మొదలుపెడ్తారు. రోగము వచ్చేసింది, జ్వరం లేక నెప్పి వచ్చేసింది అని ఒకవేళ ఇదే ఆలోచిస్తూ, ఇదే అంటూ ఉంటే స్థితి ఎలా ఉంటుంది? అలాంటి చిన్న చిన్న విషయాలేవైతే వస్తాయో వాటిని నిర్మూలించండి, తొలగించండి, పైకి ఎగరండి. అయిపోయింది, వచ్చేసింది.... ఇటువంటి సంకల్పాలతో బలహీనంగా అవ్వకండి. మందు తీసుకోండిి, ఆరోగ్యంగా అవ్వండి. అప్పుడప్పుడు బాప్దాదా పిల్లల ముఖాన్ని చూసి ఇప్పుడిప్పుడే ఎలా ఉండేవారు, ఇప్పుడిప్పుడే ఎలా అయిపోయారు! వీరు వారేనా లేక వేరేవారా! అని ఆలోచిస్తారు. తొందరలో క్రిందికి పైకి అవ్వడం వలన ఏమవుతుంది? తల బరువెక్కిపోతుంది. స్థూలంలో కూడా ఇప్పుడే పైకి, ఇప్పుడే క్రిందికి వచ్చినట్లయితే తల తిరగడం అనుభవమవుతుంది కదా! కనుక ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకోండి. మా అలవాటే ఇలా ఉందని అనుకోకండి. దేశం కారణంగా లేక వాయుమండలం కారణంగా లేక జన్మ సంస్కారము కారణంగా, నేచర్(స్వభావం) కారణంగా ఇలా జరుగుతూనే ఉంటుంది - ఇటువంటి నమ్మకాలు బలహీనంగా చేసేస్తాయి. జన్మ మారింది కావున సంస్కారాన్ని కూడా మార్చుకోండి. విశ్వ పరివర్తకులుగా అయినప్పుడు స్వ పరివర్తకులుగా ముందే అయ్యారు కదా! తమ ఆది-అనాది, స్వభావ-సంస్కారాలను తెలుసుకోండి. అసలైన సంస్కారాలు అవే. ఇవి నకిలీ సంస్కారాలు. నా సంస్కారము, నా స్వభావము - ఇది మాయకు వశీభూతులయ్యే నేచర్. ఇది మీ శ్రేష్ఠ ఆత్మల ఆది, అనాది నేచర్ కాదు. కనుక ఈ విషయాల పైన మళ్లీ అటెన్షన్ఇప్పిస్తున్నారు, రివైజ్ చేయిస్తున్నారు. ఈ పరివర్తనను అవినాశిగా చేసుకోండి.

విశేషతలు కూడా చాలా ఉన్నాయి. స్నేహంలో నంబరువన్ గా ఉన్నారు. సేవ చేయాలనే ఉత్సాహంలో నంబరువన్ గా ఉన్నారు. స్థూలంలో దూరంగా ఉంటున్నా సమీపంగా ఉన్నారు. క్యాచింగ్ పవర్(గ్రహించే శక్తి) కూడా చాలా బాగుంది. అనుభూతి చేసే శక్తి కూడా చాలా తీవ్రంగా ఉంది. సంతోషాల ఊయలలో కూడా ఊగుతున్నారు. వాహ్ బాబా, వాహ్ పరివారము, వాహ్ డ్రామా అనే పాటను బాగా పాడ్తారు. దృఢత అనే విశేషత కూడా బాగుంది. గుర్తించే బుద్ధి కూడా చురుకుగా ఉంది. తండ్రి మరియు పరివారానికి అపురూపమైన పిల్లలుగా(చాలా కాలం తర్వాత కలిసిన గారాబు పిల్లలుగా) కూడా ఉన్నారు. మధువనానికి అలంకారముగా ఉన్నారు అంతేకాక మంచి శోభగా కూడా ఉన్నారు. వెరైటీ కొమ్మలన్నీ కలిసి ఒక చందన వృక్షముగా అయ్యే మంచి ఉదాహరణగా కూడా ఉన్నారు. ఎన్ని విశేషతలు ఉన్నాయి! విశేషతలు చాలా ఉన్నాయి అయితే ఒక్క బలహీనత ఉంది కనుక ఒక్కదానిని తొలగించుకోవడమైతే చాలా సులభమే కదా? సమస్యలు సమాప్తమైపోయాయి కదా! అర్థమయిందా!

ఏ విధంగా స్వచ్ఛతతో వినిపిస్తారో అలాగే హృదయ పూర్వకమైన స్వచ్ఛతతో తొలగించడంలో కూడా నంబర్వన్ గా ఉండాలి. విశేషతల మాలను తయారు చేసినట్లయితే చాలా పెద్దదిగా అయిపోతుంది. అయినా బాప్దాదా అభినందనలను తెలుపుతున్నారు. ఇది 99 శాతము పరివర్తన చేసుకున్నారు. మిగిలిన ఒక శాతం కూడా పరివర్తన అయ్యే ఉంది. అర్థమయిందా! ఎంత మంచివారు! ఇప్పుడిప్పుడే మారిపోయి కాదు అనకుండా అలాగే అంటారు. ఇది కూడా విశేషత కదా! చాలా మంచి జవాబు ఇస్తారు. వీరిని శక్తిశాలిగా, విజయులుగా ఉన్నారా? అని అడుగుతారు. అందుకు ఇప్పటి నుండే ఉన్నామని అంటారు. ఇది కూడా తీవ్రమైన పరివర్తన శక్తి అయ్యింది కదా! కేవలం చీమతో, ఎలుకతో భయపడే సంస్కారముంది. మహావీరులుగా అయ్యి చీమను కాలి క్రింద ఉంచండి మరియు ఎలుకను వాహనంగా చేసుకోండి. గణేశునిగా అయిపోండి. ఇప్పటి నుండే విఘ్నవినాశకులు అనగా గణేశునిగా అయ్యి ఎలుక పైన స్వారీ చేయడం మొదలు పెట్టండి. ఎలుకతో భయపడకండి. ఎలుక శక్తులను కొరికేస్తుంది. సహనశక్తిని సమాప్తం చేసేస్తుంది. సరళతను సమాప్తం చేసేస్తుంది. స్నేహాన్ని సమాప్తం చేసేస్తుంది. కొరుకుతుంది కదా! చీమ నేరుగా మస్తకంలోకి వెళ్ళిపోతుంది. టెన్షన్లో మూర్ఛితులుగా చేసేస్తుంది. ఆ సమయంలో వ్యాకులపరుస్తుంది కదా! మంచిది.

సదా మహావీరులుగా అయ్యి శక్తిశాలి స్థితిలో స్థితులయ్యే వారికి ప్రతి సంకల్పము, మాటలు మరియు కర్మలు ప్రతి అడుగు పైన అడుగును ఉంచి తండ్రి తోడు తోడుగా నడిచే సత్యమైన జీవన సహచరులకు, సదా తమ విశేషతలను ఎదురుగా ఉంచుకొని బలహీనతలకు సదా కొరకు వీడ్కోలు ఇచ్చేవారికి, సంకల్ప రూపీ బీజమును సదా ఫలదాయకంగా చేసేవారికి, ప్రతి సమయం అనంతమైన ప్రత్యక్ష ఫలమును తినేవారికి, సర్వ ప్రాప్తుల ఊయలలో ఊగేవారికి అలాంటి సదా సమర్థలైన ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఫ్రాన్సు గ్రూపుతో :-

అందరూ చాలాసార్లు కలిశారు, ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారు. ఎందుకంటే కల్పక్రితము కలిశారు కనుక ఇప్పుడు కూడా కలుస్తున్నారు. కల్పక్రితపు ఆత్మలు మళ్లీ తమ హక్కును తీసుకునేందుకు చేరుకున్నారా? కొత్తగా అనిపించడం లేదు కదా! మేము చాలాసార్లు కలిశామని గుర్తించిన స్మృతి వస్తోంది కదా! గుర్తించిన ఇల్లు అని అనిపిస్తోంది కదా! తమ వారెవరైనా కలిసినప్పుడు సంతోషం కలుగుతుంది. తమ వారిని చూసి సంతోషము కలుగుతుంది. ఆ సంబంధం ఏదైతే ఉండేదో, అది స్వార్థ సంబంధం, అసలైనది కాదని ఇప్పుడు అర్థము చేసుకున్నారు. తమ పరివారంలోకి, తమ స్వీట్ హోమ్ లోకి చేరుకున్నారు. బాప్దాదా కూడా భలే విచ్చేశారని అంటూ స్వాగతం చేస్తున్నారు.

దృఢత సఫలతను తీసుకొస్తుంది. ఎక్కడైతే ఇది అవుతుందా, అవ్వదా అనే సంకల్పం వస్తుందో అక్కడ సఫలత లభించదు. ఎక్కడైతే దృఢత ఉందో, అక్కడ సఫలత అయ్యే ఉంది. ఎప్పుడూ సేవలో నిరుత్సాహంగా పడకండి. ఎందుకంటే అవినాశి తండ్రి యొక్క అవినాశీ కార్యము. సఫలత కూడా అవినాశిగా తప్పకుండా అవుతుంది. సేవకు ఫలితము వెలువడకపోవడమనేది జరగదు. కొన్ని అదే సమయంలో వెలువడ్తాయి. కొన్ని కొద్ది సమయము తర్వాత వెలువడ్తాయి. కావున ఎప్పుడూ ఈ సంకల్పాన్ని కూడా చేయకండి. సదా సేవ జరగవలసిందే అని భావించండి.

జపాన్ గ్రూపుతో :-

తండ్రి ద్వారా సర్వ ఖజానాలు లభిస్తున్నాయా? సంపన్న ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? ఈ ఖజానాలు ఒక్క జన్మకు కాదు, 21 జన్మల వరకు నడుస్తూ ఉంటాయి. ఈనాటి ప్రపంచంలో ఎంత ధనవంతులుగా ఉన్నా, మీ వద్ద ఏవైతే ఖజానాలు ఉన్నాయో అవి ఇంకెవ్వరి వద్దా లేవు. కావున వాస్తవంగా సత్యమైన వి.ఐ.పి లు ఎవరు? మీరే కదా! అక్కడ పొజిషన్(హోదా) అయితే ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని మీ ఈశ్వరీయ హోదాను ఎవ్వరూ లాక్కోలేరు. మీరు తండ్రి ఇంటికి అలంకారమైన పిల్లలు. ఎలాగైతే ఇంటిని పుష్పాలతో అలంకరిస్తారో, అలా మీరు తండ్రి ఇంటికి అలంకారము. కనుక సదా స్వయాన్ని నేను తండ్రికి అలంకారమును అని భావించి, శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉండండి. ఎప్పుడూ బలహీనమైన విషయాలను గుర్తు చేసుకోకండి. గతించిన విషయాలను గుర్తు చేసుకోవడం వలన ఇంకా బలహీనత వచ్చేస్తుంది. గతించిన దానిని గురించి ఆలోచించినట్లయితే ఏడుపు వచ్చేస్తుంది. కనుక పాస్ట్(గతము) అనగా ఫినిష్(సమాప్తము). తండ్రి స్మృతి శక్తిశాలి ఆత్మగా తయారు చేస్తుంది. శక్తిశాలి ఆత్మకు శ్రమ కూడా ప్రేమలోకి మారిపోతుంది. ఎంతగా జ్ఞాన ఖజానాను ఇతరులకు ఇస్తారో, అంతగా వృద్ధి అవుతుంది. ధైర్యము మరియు ఉల్లాసము ద్వారా సదా ఉన్నతిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉండండి. మంచిది.

అవ్యక్త మహావాక్యములు

ఇచ్చా మాత్రమ్అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా) అవ్వండి -

బ్రాహ్మణుల అంతిమ స్వరూపము లేక స్థితి ఇచ్ఛా మాత్రమ్అవిద్య అని వర్ణించబడింది. ఎప్పుడైతే అటువంటి స్థితి తయారవుతుందో అప్పుడు జయ జయ ధ్వనులు మరియు హాహాకారాలు జరుగుతాయి. దీని కొరకు సంతృప్తి చెందిన ఆత్మలుగా అవ్వండి. ఎంతగా సంతృప్తి చెందిన ఆత్మలుగా అవుతారో అంత ఇచ్ఛా మాత్రమ్అవిద్యగా అవుతారు. ఏ విధంగా బాప్దాదా కర్మ యొక్క కోరికను ఉంచుకోరో, ప్రతి మాట మరియు కర్మలో సదా తండ్రి స్మృతి ఉన్న కారణంగా ఫలితము కావాలనే కోరిక సంకల్ప మాత్రంలో కూడా ఉండదు. ఇలా తండ్రిని అనుసరించండి. అపరిపక్వ ఫలము గురించిన కోరికను ఉంచుకోకండి. ఫలితము కావాలనే కోరిక సూక్ష్మంగా ఉండినా, అది చేశారు, తిన్నారు అన్నట్లవుతుంది. అప్పుడు ఫలస్వరూపము ఎలా కనిపిస్తుంది! కనుక ఫలము కావాలనే కోరికను వదిలి ఇచ్ఛా మాత్రమ్అవిద్యగా అవ్వండి.

ఎలాగైతే దు:ఖాల జాబితా అపారంగా ఉందో, అలా ఫలము కావాలనే కోరికలు లేక అందుకు బదులు తీసుకోవాలనే సూక్ష్మ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రకరకాలుగా ఉంటాయి. నిష్కామ వృత్తి ఉండదు. పురుషార్థానికి లభించే ప్రాలబ్ధము గురించిన జ్ఞానము ఉన్నప్పటికీ అందులో అటాచ్మెంట్(మోహము) ఉంటుంది. ఎవరైనా మహిమ చేశారు మరియు దాని వైపు మీ విశేష ధ్యాస వెళ్ళినట్లయితే అది కూడా సూక్ష్మ ఫలమును స్వీకరించడమే. ఒక శ్రేష్ఠ కర్మ చేసినందుకు నూరు రెట్లు సంపన్న ఫలము మీ ఎదురుగా వస్తుంది. కాని మీరు అల్పకాలిక ఫలము కావాలనే కోరిక నుండి ఇచ్ఛా మాత్రమ్అవిద్యగా అవ్వండి. కోరిక(ఇచ్ఛ) మంచి(అచ్ఛా) కర్మను సమాప్తం చేసేస్తుంది. కోరిక స్వచ్ఛతను సమాప్తం చేసేస్తుంది, అంతేకాక స్వచ్ఛతకు బదులు చింతించే వారిగా తయారు చేస్తుంది. కనుక కోరికను గురించి తెలియని వారిగా ఉండండి.

ఉదాహరణానికి తండ్రిని(బ్రహ్మ) చూశారు - స్వంత సమయాన్ని కూడా సేవలో ఇచ్చేశారు. స్వయం నిరహంకారిగా అయ్యి పిల్లలకు గౌరవమిచ్చారు. ముందు పిల్లలు అని అన్నారు. పేరు పిల్లలది, పని బాబాది. కార్యానికి లభించే పేరు ప్రతిష్ఠల ప్రాప్తిని త్యాగం చేశాడు. పిల్లలను యజమానిగా ఉంచారు, స్వయాన్ని సేవాధారిగా భావించారు. యజమానత్వ గౌరవం కూడా ఇచ్చేశారు. కీర్తిని కూడా ఇచ్చేశారు. పేరు కూడా ఇచ్చేశారు. ఎప్పుడూ తమ పేరును ఉంచుకోలేదు. నా పిల్లలు అని అన్నారు. కనుక ఎలాగైతే తండ్రి పేరును, గౌరవాన్ని, కీర్తిని అన్నిటినీ త్యాగం చేశారో, అలా తండ్రిని అనుసరించండి. మీరు ఏదైనా సేవను ఇప్పుడిప్పుడే చేసి, ఇప్పుడిప్పుడే దాని ఫలము తీసుకున్నారంటే కొద్దిగా కూడా జమ అవ్వదు, సంపాదించారు, తినేశారు. వారిలో విల్ పవర్(సంకల్ప శక్తి) ఉండదు. వారు లోపల బలహీనంగా ఉంటారు, శక్తిశాలిగా ఉండరు, ఖాళీ-ఖాళీగా ఉండిపోతారు. ఎప్పుడైతే ఈ విషయం సమాప్తమైపోతుందో అప్పుడు నిరాకారి, నిహంకారి మరియు నిర్వికారి స్థితి స్వతహాగా తయారవుతుంది. పిల్లలైన మీరు ఎంతగా ప్రతి కోరిక నుండి అతీతంగా ఉంటారో అంతగా మీ ప్రతి కోరిక సహజంగా పూర్తి అవుతూ ఉంటుంది. సౌకర్యాలను అడగకండి. దాతగా అయ్యి ఇవ్వండి. ఏదైనా సేవ పట్ల లేక స్వయం పట్ల సాల్వేషన్ఆధారంగా స్వ ఉన్నతి లేక సేవలో అల్పకాలిక సఫలత ప్రాప్తి అవుతుంది కాని ఈ రోజు మహాన్(గొప్పవారి)గా అవుతారు, రేపు మహానత కోసం దాహార్తి ఆత్మగా అయిపోతారు. సదా ప్రాప్తి కావాలనే కోరికలో ఉంటారు.

ఎప్పుడూ న్యాయమును అడిగేవారిగా అవ్వకండి. కావాలని అడిగేవారు ఎటువంటివారైనా స్వయాన్ని తృప్త ఆత్మగా అనుభవం చెయ్యలేరు. మహాదానులు, భికారుల నుండి ఒక నయా పైసను తీసుకునే కోరికను ఉంచుకోజాలరు. వీరు మారాలి లేక వీరు చెయ్యాలి లేక వీరు ఏదైనా కొంచెం సహయోగమివ్వాలి, అడుగు ముందుకు వేయించాలి - ఇటువంటి సంకల్పము లేక సహయోగము కావాలనే భావన పరవశంగా శక్తిహీనమైన, భికారి ఆత్మల నుండి ఎలా ఉంచుకోగలరు! ఒకవేళ ఎవరైనా మీ సహయోగి సోదరుడు లేక సోదరి, పరివారంలోని ఆత్మలు, తెలివి తక్కువగా లేక చిన్న పిల్లల మాదిరిగా అల్పకాలిక వస్తువులను సదాకాలిక ప్రాప్తిగా భావించి అల్పకాలిక గౌరవం, కీర్తి, పేరు లేక అల్పకాలిక ప్రాప్తుల కోరికను ఉంచుకున్నట్లయితే ఇతరులకు గౌరవాన్ని ఇచ్చి స్వయం నిరహంకారులుగా అవ్వాలి, ఇలా ఇవ్వడమే సదాకాలం కొరకు తీసుకోవడం. ఎవరి నుండైనా ఏదైనా సాల్వేషన్ తీసుకున్న తర్వాత మళ్లీ సాల్వేషన్ఇవ్వాలని సంకల్పంలో కూడా ఉండరాదు. ఈ అల్పకాలిక కోరికల నుండి బెగ్గర్(లేనివారి)గా అవ్వండి. ఎప్పటి వరకు ఎవరిలోనైనా, అంశమాత్రము ఏ రసమైనా కనిపిస్తుందో, అసార ప్రపంచము అనుభవమవ్వదో, వీరంతా మరణించే ఉన్నారని బుద్ధిలో రాదో అప్పటి వరకు వారి నుండి ఏదైనా ప్రాప్తి కావాలనే కోరిక కలుగుతుంది. కాని సదా ఒక్కరి అభిరుచితో ఉండేవారు ఏకరస స్థితి వారిగా అయిపోతారు. వారికి మృతుల నుండి ఏ విధమైన ప్రాప్తుల కోరిక ఉండజాలదు. ఏ వినాశి రసము తమ వైపు ఆకర్షించలేదు.

అనేక రకాల కామనలు మాయను ఎదుర్కోవడంలో విఘ్నాలు వేస్తాయి. ఎప్పుడైతే నా పేరు ఉండాలి, నేను ఇలా అన్నాను, నా సలహా ఎందుకు తీసుకోలేదు, నాకు ఎందుకు విలువ ఇవ్వలేదు? అనే కోరికను ఉంచుకుంటారో అప్పుడు సేవలో విఘ్నాలు వస్తాయి. కనుక గౌరవము కావాలనే కోరికను వదిలి, స్వమానంలో స్థితులైనప్పుడు, గౌరవం నీడ సమానంగా మీ వెనుకే వస్తుంది.

చాలామంది పిల్లలు చాలా మంచి పురుషార్థులుగా ఉన్నారు. కాని పురుషార్థము చేస్తూ చేస్తూ అక్కడక్కడ పురుషార్థం బాగా చేసిన తర్వాత ప్రాలబ్ధాన్ని ఇక్కడే అనుభవించాలనే కోరిక ఉంచుకుంటారు. ఈ కోరిక జమ అవ్వడాన్ని తగ్గించేస్తుంది. కనుక ప్రాలబ్ధము కావాలనే కోరికను సమాప్తం చేసి కేవలం మంచి పురుషార్థము చేయండి. ఇచ్ఛా (కోరికకు) బదులు అచ్ఛా (మంచి) అన్న శబ్ధమును గుర్తుంచుకోండి.

భక్తులకు సర్వ ప్రాప్తులను చేయించేందుకు ఆధారము - ఇచ్ఛా మాత్రమ్అవిద్యా స్థితి. స్వయం ఇచ్ఛా మాత్రమ్అవిద్యాగా అయినప్పుడే ఇతర ఆత్మల అన్ని కోరికలను పూర్తి చేయగలరు. మీ గురించి ఏ కోరికను ఉంచుకోకండి. కాని ఇతర ఆత్మల కోరికలను పూర్తి చేయాలని అనుకున్నట్లయితే స్వయం స్వతహాగానే సంపన్నమైపోతారు. ఇప్పుడు విశ్వంలోని ఆత్మల అనేక రకాల కోరికలు అనగా కామనలను పూర్తి చేసే దృఢ సంకల్పాన్ని ధారణ చేయండి. ఇతరుల కోరికలను పూర్తి చేయడం ఆనగా స్వయాన్ని ఇచ్ఛా మాత్రమ్అవిద్యాగా తయారు చేసుకోవడం. ఎలాగైతే ఇవ్వడము అనగా తీసుకోవడమో, అలా ఇతరుల కోరికలను పూర్తి చేయడం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవడం. సదా మేము అందరి మనోకామనలను పూర్తి చేసే మూర్తిగా అవ్వాలనే లక్ష్యాన్ని ఉంచుకోండి. మంచిది.