'' అందరికంటే మొదటి శ్రేష్ఠమైన పరమాత్మ రచన -
బ్రాహ్మణులు ''
ఈ రోజు రచయిత అయిన తండ్రి తన రచనను, అందులో కూడా మొదటి
రచన అయిన బ్రాహ్మణ ఆత్మలను చూస్తున్నారు. అందరికంటే మొదటి శ్రేష్ఠ రచన శ్రేష్ఠ
బ్రాహ్మణ ఆత్మలైన మీరు. అందువలన మీరు మొత్తం రచన అంతటికంటే ప్రియమైనవారు.
బ్రాహ్మణాత్మలు బ్రహ్మ ద్వారా రచింపబడిన ఉన్నతోన్నతమైన ముఖవంశావళి మహాన్ఆత్మలు.
దేవతల కంటే బ్రాహ్మణులు శ్రేష్ఠమైనవారని మహిమ చేయబడింది. బ్రాహ్మణులే ఫరిస్తాల
నుండి దేవతలుగా అవుతారు. కానీ బ్రాహ్మణ జీవితము, ఆదిపిత ద్వారా లభించిన సంగమయుగీ
ఆది జీవితము. ఆది సంగమ వాసులు జ్ఞాన స్వరూపులు, త్రికాలదర్శి, త్రినేత్రి
బ్రాహ్మణ ఆత్మలు. సాకార స్వరూపంలో సాకార సృష్టి పై ఆత్మ మరియు పరమాత్మల కలయిక,
సర్వ సంబంధాల ప్రేమ యొక్క అనుభవం, పరమాత్మ అవినాశీ ఖజానాలకు అధికారులు. ''బ్రహ్మాబాబా
ద్వారా శివతండ్రిని మేము చూశాము, మేము పొందాము'' అని సాకార స్వరూపంతో పాడిన పాట
బ్రాహ్మణులదే. ఇది దేవతల జీవితంలోని పాట కాదు. సాకార సృష్టి పై ఈ సాకార నేత్రాల
ద్వారా ఇరువురు తండ్రులను చూడడం, వారితో పాటు తినడం, తాగడం, నడవడం, మాట్లాడడం,
వినడం, ప్రతి చరిత్రను అనుభవం చెయ్యడం, విచిత్రుడిని చిత్రంలో చూడడం ఈ శ్రేష్ఠ
భాగ్యము బ్రాహ్మణ జీవితానికే ఉంది.
బ్రాహ్మణులే - మేము భగవంతుని తండ్రి రూపంలో చూశాము,
తల్లి, స్నేహితుడు, బంధువు, ప్రియుని స్వరూపంలో చూశాము అని అంటారు. ఋషులు,
మునులు తపస్సు చేయువారు. విద్వాంసులు, ఆచార్యులు, శాస్త్రులు(శాస్త్రాలు
చదివినవారు) కేవలం మహిమ పాడుతూనే ఉండిపోయారు. దర్శనం చేసుకోవాలనే అభిలాషలోనే
ఉండిపోయారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు కలుస్తారు..... అని ఎదురుచూస్తూ
జన్మ-జన్మల చక్రంలో తిరుగుతూనే ఉండిపోయారు. కానీ బ్రాహ్మణ ఆత్మలు నశాతో,
నిశ్చయంతో, సంతోషంగా, హృదయపూర్వకంగా మా తండ్రి ఇప్పుడు లభించారు అని చెప్తారు.
వారు తపించేవారు, మీరు మిలనం చేసేవారు. బ్రాహ్మణ జీవితం అనగా సర్వ అవినాశి,
తరగని, స్థిరమైన, అచంచల, సర్వ ప్రాప్తి స్వరూప జీవితము. బ్రాహ్మణ జీవితము ఈ
కల్పవృక్షం పునాది అయిన వేర్లు. బ్రాహ్మణ జీవితము ఆధారము పై వృక్షము వృద్ధి
ప్రాప్తి చేసుకుంటుంది. బ్రాహ్మణ జీవితం యొక్క వేర్ల నుండి వెరైటీ ఆత్మలందరికి
బీజం ద్వారా ముక్తి, జీవన్ముక్తుల ప్రాప్తి అనే నీరు లభిస్తుంది. బ్రాహ్మణ
జీవితము యొక్క ఆధారముతో ఈ కొమ్మలు, రెమ్మలు విస్తారాన్ని పొందుతాయి. కావున
బ్రాహ్మణ ఆత్మలు మొత్తం వెరైటీ వంశావళి అందరికి పూర్వజులు. బ్రాహ్మణ ఆత్మలు
విశ్వంలో సర్వ శ్రేష్ఠమైన కార్యానికి, నిర్మాణానికి ముహూర్తము పెట్టేవారు.
బ్రాహ్మణ ఆత్మలే అశ్వమేధ రాజస్వ యజ్ఞము, జ్ఞాన యజ్ఞాన్ని రచించే శ్రేష్ఠమైన
ఆత్మలు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఆత్మ యొక్క 84 జన్మల జాతకం తెలిసినవారు. ప్రతి
ఆత్మ యొక్క శ్రేష్ఠ భాగ్యరేఖను విధాత ద్వారా శ్రేష్ఠంగా తయారు చేసేవారు.
బ్రాహ్మణ ఆత్మలు ముక్తి-జీవన్ముక్తుల మహాన్ యాత్ర చేయించేందుకు నిమిత్తమైనవారు.
బ్రాహ్మణ ఆత్మలు సర్వాత్మలకు సామూహికంగా తండ్రితో నిశ్చితార్థము చేయించేవారు.
పరమాత్మ చేతిలో చెయ్యి వేయించే కంకణం కట్టించేవారు. బ్రాహ్మణ ఆత్మలు,
జన్మ-జన్మల కొరకు సదా పవిత్రత యొక్క బంధనం కట్టేవారు. అమర కథ చెప్పి అమరులుగా
చేసేవారు. అర్థమయ్యిందా! ఎంత మహాన్ఆత్మలో, ఎంత బాధ్యత గల ఆత్మలో తెలిసిందా. మీరు
పూర్వజులు. పూర్వజులు ఎలా ఉంటారో వారి వంశావళి అలా తయారవుతుంది. సాధారణమైనవారు
కాదు. పరివారానికి బాధ్యులము లేక ఏదైనా సేవాస్థానానికి బాధ్యులము అని హద్దుకు
మాత్రమే బాధ్యులు కారు. విశ్వంలోని ఆత్మలకు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. బేహద్
బాధ్యత ప్రతి బ్రాహ్మణ ఆత్మ పై ఉంది. బేహద్ బాధ్యత నిభాయించకుంటే తమ లౌకిక
ప్రవృత్తిలో, అలౌకిక ప్రవృత్తిలో అప్పుడప్పుడు ఎగిరే కళ, అప్పుడప్పుడు
ఉన్నతమయ్యే కళ, అప్పుడప్పుడు నడిచేకళ, అప్పుడప్పుడు ఆగిపోయే కళ ఈ నటనలోనే (కళాబాజీలోనే)
సమయం వినియోగిస్తారు. అటువంటివారు బ్రాహ్మణులు కారు, క్షత్రియ ఆత్మలు.
పురుషార్థం యొక్క అద్భుతంతో ఇది చేస్తాము, ఇలా చేస్తాము, చేస్తాము అనే బాణాలు
సంధిస్తూ(ఎక్కుపెట్తూ) ఉంటారు. ఎక్కుపెట్టడానికి, బాణం గమ్యానికి చేరుకోవడానికి
తేడా ఉంది. గురి పెట్తూ ఉండిపోతారు. బ్రాహ్మణ ఆత్మలు గమ్యాన్ని ఎక్కుపెట్టరు.
సదా గమ్యంలోనే స్థితమై ఉంటారు. సంపూర్ణ గమ్యం సదా బుద్ధిలో ఉండనే ఉంటుంది.
సెకండ్ సంకల్పంతో విజయులుగా అవుతారు. బాప్దాదా బ్రాహ్మణ పిల్లలు మరియు క్షత్రియ
పిల్లలు ఇరువురి ఆటను చూస్తూ ఉంటారు. బ్రాహ్మణులది విజయం పొందే ఆట, క్షత్రియులది
సదా అంబులపొది(బాణాలు పెట్టే పొడవుగా ఉండే పెట్టె) భారాన్ని మోసే ఆట. ప్రతి సమయం
పురుషార్థం అనే విల్లు(బాణం) ఉండనే ఉంటుంది. ఒక సమస్యను సమాధాన పరుస్తూనే ఇంకొక
సమస్య నిలబడ్తుంది. బ్రాహ్మణులు సమాధాన స్వరూపులు. క్షత్రియులు పదే పదే సమస్యను
సమాధాన పరుచుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు. ఉదాహరణానికి సాకార రూపంలో ఒక నవ్వు
వచ్చే కథ వినిపించేవారు కదా! క్షత్రియులు ఏం చేస్తారంటే దీనికి కథ కూడా ఉంది కదా.
ఎలుకను తీస్తే పిల్లి వస్తుంది, ఈ రోజు ధనానికి సంబంధించిన సమస్య, రేపు మనసుకు
సంబంధించిన సమస్య, ఎల్లుండి శరీర సంబంధమైన సమస్య లేక సంబంధ-సంపర్కంలోని వారి
సమస్య. ఇలా కష్టపడ్తూనే ఉంటారు. సదా ఏదో ఒక కంప్లైంట్(ఫిర్యాదు) తప్పకుండా
ఉంటుంది. సమస్య స్వయంది కావచ్చు, ఇతరులది కావచ్చు. బాప్దాదా ఇలా ప్రతి సమయంలో
ఏదో ఒక శ్రమ(కష్టము)లోనే నిమగ్నమై ఉండే పిల్లలను చూసి దయ, కృప చూపించే రూపంతో
దయ కూడా చూపిస్తారు.
సంగమయుగ బ్రాహ్మణ జీవితం హృదయాభిరాముని హృదయం పై
విశ్రాంతి తీసుకునే సమయము. హృదయం పై విశ్రాంతిగా ఉండండి. బ్రహ్మాభోజనం తినండి,
జ్ఞానామృతం తాగండి. శక్తిశాలి సేవ చేయండి, విశ్రాంతిగా సంతోషంతో హృదయ సింహాసనం
పై ఆనందంగా ఉండండి. ఎందుకు కలవరపడ్తారు? హే రాం అని అనరు. ఓ బాబా లేక ఓ దాదీ,
దీదీ అని అంటారు కదా. ఓ బాబా, ఓ దాదీ, దీదీ కొంచెం వినండి, ఏదైనా చేయండి అని
అనడమే కలవర పడడం. ఇది విశ్రాంతిగా ఉండే యుగము. ఆత్మిక సంతోషాలు జరుపుకోండి.
ఆత్మిక సంతోషాలలో ఈ మనోహరమైన రోజులు గడపండి. వినాశి సంతోషాలు జరుపుకోకండి,
పాడుకోండి, నాట్యం చెయ్యండి, వాడిపోకండి. పరమాత్మతో సంతోషాల సమయం ఇప్పుడు
కాకుంటే ఎప్పుడు జరుపుకుంటారు? ఆత్మిక గౌరవంలో కూర్చోండి. ఎందుకు వ్యాకులపడ్తారు?
తండ్రికి ఆశ్చర్యమనిపిస్తుంది. చిన్న చీమ, బుద్ధి వరకు వెళ్లిపోతుంది. బుద్ధి
యోగాన్ని విచలితం చేసేస్తుంది. ఉదాహరణానికి స్థూల శరీరానికి కూడా చీమ కుడితే
శరీరం కదిలి, విచలితం అవుతుంది కదా! అలాగే బుద్ధిని కూడా విచలితం చేసేస్తుంది.
చీమ, ఏనుగు చెవిలోకి వెళ్లినట్లయితే ఏనుగును మూర్ఛపోయేలా చేస్తుంది కదా. అలా
బ్రాహ్మణ ఆత్మ మూర్ఛపోయి క్షత్రియ ఆత్మగా అవుతుంది. ఏ ఆట ఆడ్తారో అర్థమయిందా!
క్షత్రియులుగా అవ్వకండి. మళ్లీ రాజధాని కూడా త్రేతా యుగానిది లభిస్తుంది.
సత్యయుగీ దేవతలు తిని తాగి ఏది మిగిలించి ఉంటారో అది క్షత్రియులకు త్రేతా యుగంలో
లభిస్తుంది. కర్మల పొలంలో మొదటి పంట(పూర్ణ స్వరూపంలో) బ్రాహ్మణుల నుండి దేవతలుగా
అయ్యేవారికి లభిస్తుంది. రెండవ పంట క్షత్రియులకు లభిస్తుంది. పొలంలోని మొదటి
పంట రుచి, రెండవ పంట రుచి ఎలా ఉంటుందో తెలుసు కదా! మంచిది.
మహారాష్ట్ర మరియు యు.పి. జోన్ వారు ఉన్నారు.
మహారాష్ట్ర విశేషత ఏమంట, మహారాష్ట్ర అనే పేరు ఎలా ఉందో అలాంటి మహాన్ఆత్మల
పుష్పగుచ్ఛము బాప్దాదాకు కానుకగా ఇస్తారు. మహారాష్ట్ర రాజధాని సుందరంగా,
సంపన్నంగా ఉంది. కావున మహారాష్ట్ర వారు ఇలాంటి సంపన్న ప్రసిద్ధ ఆత్మలను
సంపర్కంలోకి తీసుకురావాలి. అందువలన మహాన్ఆత్మలను తయారుచేసి సుందరమైన
పుష్పగుచ్ఛాన్ని తండ్రి ఎదురుగా తీసుకురండి అని చెప్పాను. ఇప్పుడు అంతిమ సమయంలో
ఈ సంపద గలవారి పాత్ర కూడా ఉంది. సంబంధంలో కాదు, సంపర్కంలో పాత్ర ఉంది.
అర్థమయిందా!
యు.పి.లో దేశ-విదేశాలలో ప్రసిద్ధమైన ప్రపంచములో
అద్భుతమైన(వండర్ఆఫ్ది వరల్డ్) తాజ్మహల్ఉంది కదా! ఎలాగైతే యు.పి.లో ప్రపంచ
ప్రసిద్ధి గాంచిన అద్భుత వస్తువు ఉందో అలా యు.పి వారు సేవలో అద్భుతమైన
ప్రత్యక్ష ఫలం చూపించాలి. వీరు చాలా అద్భుతమైన పని చేశారని దేశ-విదేశాలలో గల
బ్రాహ్మణ ప్రపంచంలో ప్రసిద్ధమవ్వాలి. ప్రపంచమే అద్భుతం చెందేలాగా అద్భుతమైన
కార్యము చేయాలి. గీతాపాఠశాలలు ఉన్నాయి, సెంటర్లు ఉన్నాయి. ఇది అద్భుతం కాదు.
ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యనిది చేసి చూపించినప్పుడు అద్భుతం అని అంటారు.
అర్థమయ్యిందా! విదేశీయులు కూడా ఇప్పుడు ప్రతి సీజన్లో ప్రత్యక్షంగా ఉంటున్నారు.
విదేశీయులు విదేశ సాధనాల ద్వారా విశ్వంలో ఇరువురు తండ్రులను ప్రత్యక్షం చేస్తారు.
ప్రత్యక్షం అనగా ఈ కళ్ళతో చూడగలగడం. కావున ఇలాంటి తండ్రిని విశ్వం ముందు
ప్రత్యక్షం చెయ్యాలి. విదేశీయులు ఏమి చెయ్యాలో అర్థమయిందా! మంచిది. రేపు మొత్తం
ఊరేగింపు అంతా వెళ్లిపోతుంది. చివర్లో హెలికాప్టర్ దిగే రోజు కూడా వస్తుంది.
అన్ని సాధనాలు మీ కొరకే తయారవుతూ ఉన్నాయి. సత్యయుగంలో విమానాల లైన్(వరసగా)
ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జీపులు మరియు బస్సులు లైనుగా పెట్టబడి ఉన్నాయి.
చివరకు విమానాల లైను కూడా ఏర్పడ్తుంది. అందరూ భయపడి పారిపోతారు, అన్నీ మీకు
ఇచ్చేసి వెళ్లిపోతారు. వారు భయపడ్తారు, మీరు ఎగురుతారు. మీకు చనిపోతామనే భయం
లేదు. ముందే చనిపోయారు. పాకిస్థాన్లో స్యాంపుల్ చూశారు కదా! అన్ని తాళంచెవులు
ఇచ్చేసి వెళ్లిపోయారు. కావున అన్ని తాళంచెవులు మీకు లభించనున్నాయి. కేవలం
సంభాళించండి. మంచిది.
సదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలన్నిటినీ జీవితంలోకి
తీసుకొచ్చేవారు, సదా హృదయాభిరాముడైన తండ్రి హృదయ సింహాసనం పై ఆత్మిక సంతోషం,
ఆత్మిక విశ్రాంతి తీసుకునే వారు, స్థూల విశ్రాంతి తీసుకోకండి, సదా సంగమయుగం
యొక్క శ్రేష్ఠ గౌరవంలో ఉండేవారు, కష్టం నుండి ప్రేమ జీవితంలో లవలీనమై ఉండేవారు
- ఇటువంటి శ్రేష్ఠమైన బ్రాహ్మణులకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.