ఈ రోజు విశ్వ రచయిత తమ శ్రేష్ఠ రచనను లేక రచనలోని
పూర్వజ ఆత్మలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న పూర్వజ, పూజ్య ఆత్మలు బాప్దాదా
ఎదురుగా ఉన్నారు. పూర్వజ ఆత్మల ఆధారంగా విశ్వములోని సర్వాత్మలకు శాంతి మరియు
శక్తి లభిస్తోంది, ఇక్కడ కూడా లభిస్తుంది. అనేక ఆత్మలు పూర్వజ, పూజ్య ఆత్మలను
శాంతిదేవా, శక్తిదేవా అంటూ స్మృతి చేస్తున్నారు. ఇటువంటి సమయంలో శాంతిదేవ ఆత్మలు,
మాస్టర్ శాంతి సాగరులు, మాస్టర్ శాంతి సూర్యులు తమ శాంతి కిరణాలను, శాంతి అలలను
దాత పిల్లలైన శాంతి దేవతలుగా అయ్యి సర్వులకు శాంతిని ఇస్తున్నారు. ఈ విశేష సేవను
చేసే అభ్యాసకులుగా అయ్యారా లేక ఇతర భిన్న భిన్న రకాల సేవలలో చాలా జిజీగా అయిపోయి,
ఈ విశేష సేవ చేసేందుకు తీరిక మరియు అభ్యాసము తక్కువ అవుతోందా? ఎటువంటి సమయమో
అటువంటి సేవా స్వరూపాన్ని ధారణ చేయగలరా? ఒకవేళ ఎవరైనా నీటి కొరకు దాహముతో
ఉన్నప్పుడు మీరు వారికి మంచి భోజనాన్ని ఇచ్చినట్లయితే సంతుష్టులవుతారా? అలాగే
వర్తమాన సమయంలో శాంతి మరియు శక్తుల అవసరముంది. మనసా శక్తి ద్వారా ఆత్మలకు
మనశ్శాంతిని అనుభవం చేయించగలరా? వాచా ద్వారా చెవుల వరకు శబ్ధాన్ని పంపించగలరు.
కానీ వాచాతో పాటు మనసా శక్తి ద్వారా మనసు వరకు పంపించగలరు. మనసుతో చేసే శబ్ధము
మనసు వరకు చేరుకుంటుంది. కేవలం నోటి శబ్ధము చెవుల వరకు మరియు నోటి వరకే
ఉండిపోతుంది. వాచా ద్వారా కేవలం వర్ణించే శక్తి మాత్రమే ప్రాప్తిస్తుంది. మనసు
ద్వారా మనన శక్తి, మగ్న స్వరూప శక్తి రెండూ ప్రాప్తిస్తాయి. వారు వినేవారిగా,
వీరు తయారయ్యేవారిగా అవుతారు. ఇరువురిలో అంతరము ఏర్పడ్తుంది. కావున సదా సేవలో
వాచా మరియు మనసా రెండూ జత జతలో ఉండాలి.
వర్తమాన సమయంలో విశేషంగా భారతవాసులలో ఏ పరిస్థితిని
చూశారు? ఇప్పుడు శ్మశాన వైరాగ్య వృత్తిలో ఉన్నారు. ఇటువంటి శ్మశాన వైరాగ్య
వృత్తి గలవారికి అనంతమైన వైరాగ్య వృత్తిని కలిగించేందుకు స్వయం అనంతమైన వైరాగ్య
వృత్తి గలవారిగా అవ్వండి. కాసేపు రాగము, మరికాసేపు వైరాగ్యము రెండింటిలో
నడుస్తున్నామా లేక సదా అనంతమైన వైరాగులుగా అయ్యామా? అని మిమ్ములను మీరు
పరిశీలించుకోండి. అనంతమైన వైరాగులు అనగా దేహమనే ఇంటిలో ఉంటున్నా దేహమనే ఇల్లు
లేనివారు(మరిచినవారు). దేహము కూడా తండ్రిదే కానీ నాది కాదు. దేహ భావము నుండి
ఇంత అతీతంగా ఉండాలి. అనంతమైన వైరాగ్యము గలవారు ఎప్పుడూ సంస్కారాలు, స్వభావాలు,
సాధనాలు వేటికీ వశీభూతులవ్వరు. అతీతంగా అయ్యి, యజమానులుగా అయ్యి, సాధనాల ద్వారా
సిద్ధి స్వరూపులుగా అవుతారు. సాధనను విధిగా చేసుకుంటారు. విధి ద్వారా స్వ
ఉన్నతిలో వృద్ధిని సిద్ధిగా పొందుతారు. సేవ ద్వారా వృద్ధిలో సిద్ధిని పొందుతారు.
ఆధారము నిమిత్తంగా ఉంటుంది కానీ దానికి అధీనమవ్వరు. ఆధారానికి అధీనంగా అవ్వడం
అనగా వశీభుతులుగా అవ్వడం. మశీభూతమంటే ఎలాగైతే భూత ఆత్మ పరవశులుగా, వ్యాకులంగా
చేస్తుందో, అలాగే ఏదైనా సాధనము లేక సంస్కారము లేక స్వభావము లేక సంపర్కానికి
వశీభూతులుగా అయితే మీరు వ్యాకుల చిత్తులుగా మరియు పరవశులుగా అయిపోతారు. అనంతమైన
వైరాగులు సదా, 'చేయించేవారు చేయిస్తున్నారు' అనే ఆనందంలో మగ్నమై రమించే యోగుల
కంటే ఉన్నతంగా ఎగిరే యోగులుగా అవుతారు. హద్దులోని వైరాగులు హఠయోగ విధుల ద్వారా
ధరణి, అగ్ని, జలము, మొదలైన వాటి పై ఆసనధారులుగా అయ్యి చూపించి దానిని యోగములో
సిద్ధి స్వరూపంగా భావిస్తారు. అది అల్పకాలిక హఠయోగ విధి ద్వారా కలిగే సిద్ధి.
అలాగే అనంతమైన వైరాగ్య వృత్తి గలవారు ఈ విధి ద్వారా దేహ భావము అనే ధరణి పై మాయ
కలిగించే భిన్న-భిన్న వికారాలనే అగ్ని పై భిన్న భిన్న రకాల సాధనాల ద్వారా
సాంగత్య ప్రవాహములోకి రావడం నుండి అతీతంగా అయిపోతారు. ఎలాగైతే నీటి ప్రవాహము
తనదిగా చేసుకొని, తనవైపుకు లాగేసుకుంటుందో అలా ఏ విధమైన అల్పకాలిక ప్రవాహాలు తమ
వైపుకు ఆకర్షించరాదు. అటువంటి నీటి ప్రవాహానికి కూడా పైన(అతీతంగా) ఉన్నవారిని
ఎగిరే యోగులని అంటారు. ఈ సిద్ధులన్నీ అనంతమైన(బేహద్) వైరాగ్య విధి ద్వారా
లభిస్తాయి.
అనంతమైన వైరాగులు అనగా ప్రతి సంకల్పము, వాక్కు మరియు
సేవలో అనంతమైన వృత్తి, స్మృతి, భావన మరియు కామన ఉండాలి. ప్రతి సంకల్పము అనంతమైన
సేవలో సమర్పితమై ఉండాలి. ప్రతి వాక్కులో నిస్వార్థ భావన ఉండాలి. ప్రతి కర్మలో
చేయించేవారు చేయిస్తున్నారు అన్న ఈ వైబ్రేషన్లు(ప్రకంపనలు) అందరికీ అనుభవమవ్వాలి.
అటువంటి వారినే అనంతమైన వైరాగులు అని అంటారు. అనంతమైన వైరాగులు అనగా 'నాది'
అనేది అంతమైపోవాలి, 'బాబాది' అనేది వచ్చేయాలి. ఎలాగైతే నిరంతరము జపాన్ని
జపిస్తూనే ఉంటారో, అలా నిరంతర స్మృతి స్వరూపులుగా ఉండాలి. ప్రతి సంకల్పములో,
ప్రతి శ్వాసలో బేహద్(అనంతము) ఉండాలి అంతేకాక బాబా ఇమిడిపోయి ఉండాలి. కావున
హద్దులోని వైరాగ్య(శ్మశాన వైరాగ్య) ఆత్మలకు వర్తమాన సమయంలో శాంతి మరియు
శక్తిదేవులుగా అయ్యి అనంతమైన వైరాగులుగా చేయండి.
కావున వర్తమాన సమయానుసారంగా పిల్లల రిజల్టు ఎలా ఉందో
ఆ టి.వి.ని బాప్‌దాదా చూశారు. కానీ పిల్లలు టి.వి.లో ఇందిరాగాంధీని చూశారు.
సమయానుసారంగా లోక జ్ఞానము కొరకు చూశారు. సమాచారము కొరకు చూశారు. ఫర్వాలేదు. కానీ
ఏమి జరిగింది? ఏమి జరుగుతుంది? - ఈ రూపములో చూడకండి. జ్ఞాన స్వరూపులుగా అయ్యి
ప్రతి దృశ్యాన్ని కల్ప పూర్వపు స్మృతితో చూడండి. కావున బాప్‌దాదా పిల్లలలో ఏమి
చూశారు? పిల్లల దృశ్యము కూడా రమణీకంగా ఉంది. మూడు రకాల పిల్లలను చూశారు. 1.
మొదటివారు - నడుస్తూ నడుస్తూ నిర్లక్ష్యమనే నిద్రలో నిద్రిస్తున్న ఆత్మలు. ఏదైనా
పెద్ద శబ్ధము వినబడితే లేక ఎవరైనా కుదిపితే నిదురిస్తున్నవారు మేల్కొంటారు. కానీ
ఏమి జరిగింది అన్న ఈ సంకల్పంతో కొంతసేపు మేల్కొంటారు, తర్వాత మళ్లీ నెమ్మది
నెమ్మదిగా అదే నిర్లక్ష్యపు నిద్రలోకి జారిపోతారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి
అనే ఈ దుప్పటి కప్పుకొని నిద్రపోతారు. ఇప్పుడైతే రిహార్సల్స్ జరుగుతున్నాయి.
ఫైనల్ ఇకముందు జరుగుతుంది అని అనుకుంటూ ఇంకా ముఖము వరకు దుప్పటిని
కప్పేసుకుంటారు. 2. రెండవవారు - బద్ధకపు నిద్రలో నిద్రించేవారు. ఇదంతా
జరగాల్సిందే, అదే జరిగింది. పురుషార్థమైతే చేస్తూనే ఉన్నాము. ఇకముందు కూడా
చేస్తూనే ఉంటాము. సంగమ యుగములో పురుషార్థమునైతే చేయాల్సిందే కదా! ఇప్పుడు కొంత
చేశాము, ఇకముందు మరికొంత చేస్తాము. వీరు మేల్కొని ఇతరులను చూస్తూ ఉంటారు. ఏ
విధంగా కొందరు దుప్పటిలో నుండి ముఖము బయట పెట్టి నిద్రిస్తున్న పక్కవారిని
చూస్తూ ఉంటారు కదా! ఎవరైతే ప్రసిద్ధులుగా ఉన్నారో వారు కూడా ఇంతే వేగంలో
నడుస్తున్నారు. మేము కూడా అలాగే నడుస్తున్నామని అనుకుంటారు. ఇంకా ఇతరుల
బలహీనతలను చూసి తండ్రిని అనుసరించేందుకు బదులు సోదరీ సోదరులను అనుసరిస్తున్నారు
అంతేకాక వారి బలహీనతలను కూడా అనుసరిస్తూ ఉంటారు. ఇటువంటి సంకల్పాలను చేసేవారు
అనగా బద్ధకం అనే నిదురలో నిదురించేవారు కూడా తప్పకుండా మేల్కోవాలి. ఉల్లాస -
ఉత్సాహాల ఆధారంతో బద్ధకం అనే నిదురను చాలామంది త్యాగం కూడా చేశారు. స్వఉన్నతి
మరియు సేవా ఉన్నతిలో ముందడుగు కూడా వేశారు. అలజడి కదిలించింది, ముందుకు వెళ్లారు.
కానీ సోమరితనపు సంస్కారాలకు మధ్య-మధ్యలో తమ వైపుకు ఆకర్షిస్తూనే ఉంటాయి. అయినా
అలజడి వారిని కదిలించింది, ముందుకు తీసుకెళ్లింది. 3. మూడవవారు - అలజడిని చూసి
అచలంగా ఉండేవారు. సేవ చేయాలనే శ్రేష్ఠ సంకల్పముతో సేవ కొరకు రకరకాల ప్లాన్లు
ఆలోచిస్తారు, చేస్తారు. మొత్తం విశ్వానికంతా శాంతి మరియు శక్తుల సహాయాన్ని
అందించే, సాహసమును ఉంచే, ఇతరులకు కూడా ధైర్యమునిచ్చే పిల్లలను కూడా చూశారు. కానీ
శ్మశాన ఉల్లాస-ఉత్సాహాలు లేక శ్మశానపు తీవ్ర పురుషార్థము లేక బలహీనతల ద్వారా
వైరాగ్య వృత్తి అనే అలలలో నడవకండి. సదా పరిస్థితులను స్వస్థితి శక్తితో
పరివర్తన చేసే విశ్వ పరివర్తకులమనే స్మృతిలో ఉండండి. పరిస్థితి, స్థితిని
ముందుకు తీసుకెళ్లడం లేక వాయుమండలము మాస్టర్ సర్వశక్తివంతులను నడిపించడం,
మనుష్య ఆత్మల శ్మశాన వైరాగ్యము అల్పకాలము కొరకు అనంతమైన వైరాగులుగా తయారు చేయడం,
ఇది పూర్వజ ఆత్మలు చేసే పని కాదు. సమయము రచన, అది మాస్టర్ రచయితను ముందుకు
తీసుకెళ్లడమనేది మాస్టర్ రచయితల బలహీనతయే. మీ శ్రేష్ఠ సంకల్పాలు సమయాన్ని
పరివర్తన చేస్తాయి. సమయం మీ విశ్వపరివర్తక ఆత్మలకు సహయోగి. అర్థమయ్యిందా!
సమయాన్ని చూసి లేక సమయం కదిలించడం వల్ల ముందుకు వెళ్లేవారిగా అవ్వకండి. కానీ
స్వయం ముందుకు వెళ్తూ సమయాన్ని సమీపంగా తీసుకు రండి. ఇప్పుడేం జరుగుతుంది? అన్న
ప్రశ్న కూడా చాలా మందికి ఉత్పన్నమయ్యింది. కానీ ప్రశ్నను ఫుల్‌స్టాప్ రూపంలో
పరివర్తన చేయండి. అనగా స్వయాన్ని అన్ని సబ్జెక్టులలో నిండుగా చేసుకోండి. ఇదే
ఫుల్‌స్టాప్. ఇటువంటి సమయంలో ఏం జరుగుతుంది? అనే ప్రశ్న ఉత్పన్నమవ్వరాదు. కాని
ఏం చేయాలి? ఇటువంటి సమయంలో నా కర్తవ్యము ఏమిటి? అని ఆలోచించి ఆ సేవలో
నిమగ్నమైపోండి. ఎలాగైతే మంటలను ఆర్పేవారు మంటలను ఆర్పడంలోనే నిమగ్నమైపోతారో,
ఇదెలా జరిగిందని ప్రశ్నించకుండా ఎలా తమ సేవలో నిమగ్నమైపోతారో, అలాగే మీరు
ఆత్మిక సేవలో నిమగ్నమైపోడం ఆత్మిక సేవాధారులైన మీ కర్తవ్యము. ప్రపంచములోని
వారికి కూడా ఆ అతీత స్థితి (న్యారాపన్) అనుభవమవ్వాలి. అర్థమయ్యిందా? అయినా
సమయానుసారంగా అయితే వచ్చి చేరుకున్నారు కదా! పరిస్థితి ఏ విధంగా ఉన్నా డ్రామాలో
మిలన మేళానైతే జరుపుకున్నారు. వచ్చి చేరుకోవడం వల్ల ఇంకా అదృష్టవంతులుగా
అయిపోయారు కదా! మేము వచ్చి చేరుకున్నాము, ఇది మా భాగ్యములో ఉంది అని
సంతోషిస్తున్నారు కదా! భలే వచ్చారు, పిల్లలైన మీరందరూ మధువనానికి శోభ.
మధువనానికి అలంకారమైన మీరు మధువనానికి వచ్చి చేరుకున్నారు. మధువనం వారు కేవలం
బాబాయే కాదు, పిల్లలు కూడా మధువనం వారే. మంచిది.
నలువైపుల నుండి సంకల్పము ద్వారా, స్నేహము ద్వారా,
ఆకారీ రూపము ద్వారా వచ్చి చేరుకున్న పిల్లలకు బాప్‌దాదా సదా అచల భవ, బేహద్
వైరాగి, సదా ఎగిరే యోగి భవ అన్న వారసత్వాన్ని మరియు వరదానాన్ని ఇస్తున్నారు. సదా
నిరంతర స్మృతి స్వరూపులకు, నిర్లక్ష్యము మరియు సోమరితనమనే నిదురను జయించినవారికి,
సదా బేహద్ స్మృతి స్వరూపులైన ఇటువంటి పూర్వజ మరియు పూజ్య ఆత్మలకు బాప్‌దాదా
ప్రియ స్మృతులు మరియు నమస్తే.
దాదీజీ మరియు జగదీశ్ భాయి విదేశీ యాత్రా సమాచారాన్ని
వినిపించి ప్రియ స్మృతులు తెలిపారు.
అందరికి సందేశాన్ని ఇచ్చి అనుభవం చేయించారు.
స్నేహాన్ని, సంబంధాన్ని పెంచారు. ఇప్పుడు వారు అధికారాన్ని తీసుకునేందుకు
ముందుకు వస్తారు. ప్రతి అడుగులో అనేక ఆత్మలకు కళ్యాణము జరిగే పాత్ర నిశ్చితమై
ఉంది. ఈ నిశ్చయంతో అందరి హృదయాలకు ఉల్లాస - ఉత్సాహాలను ఇప్పించారు. చాలా మంచి
సేవ చేసి స్నేహభరిత పాత్రను అభినయించారు. బాప్‌దాదా చేయించేవారు అంతేకాక
సాక్షిగా ఉండి చూసేవారు కూడా. చేయించారు మరియు చూశారు కూడా. పిల్లల ఉల్లాస-
ఉత్సాహాలను, ధైర్యాన్ని చూసి బాప్‌దాదాకు ఎంతో గర్వంగా ఉంది. ఇకముందు కూడా ఇంకా
శబ్ధం ఎంతో వ్యాపిస్తుంది. ఎటువంటి శబ్ధం వ్యాపిస్తుందంటే కుంభకర్ణులు కళ్ళు
తెరిచి ఏమి జరిగిందని చూస్తారు. అనేకమంది భాగ్యము మారిపోతుంది. ధరణిని తయారుచేసి
వచ్చారు. బీజాన్ని నాటి వచ్చారు. ఇప్పుడు త్వరగా బీజానికి ఫలము కూడా
వెలువడ్తుంది. ప్రత్యక్షతా ఫలము తప్పకుండా వెలువడ్తుంది. సమయం సమీపంగా వస్తోంది.
ఇప్పుడైతే మీరందరూ వెళ్లారు కానీ ఏ సేవనైతే చేసి వచ్చారో ఆ సేవకు ఫలస్వరూపంగా
వారే స్వయం పరుగులు తీస్తూ వస్తారు. ఎలాగైతే అయస్కాంతము దూరం నుండే
ఆకర్షిస్తుందో అలాగే ఎవరో ఆకర్షిస్తున్నట్లుగా అనుభవం చేస్తారు. ఆదిలో ఎలాగైతే
అనేక ఆత్మలకు ఎవరో ఆకర్షిస్తున్నట్లుగా ఆత్మిక ఆకర్షణ కలిగేదో, ఎక్కడకు వెళ్ళాలి
అని ఆలోచించేవారో అలా వీరు కూడా ఆకర్షింపబడి వస్తారు. ఆత్మిక ఆకర్షణ
పెరుగుతోందని అనుభవం చేసుకున్నారు కదా! అది పెరుగుతూ పెరుగుతూ ఆకర్షించబడి
ఎగురుతూ వచ్చి చేరుకుంటారు. ఆ దృశ్యము ఇప్పుడు జరగనున్నది. ఇప్పుడిక ఇదే మిగిలి
ఉంది. ఇప్పుడు సందేశ వాహకులు వెళ్తున్నారు కానీ వారంతకు వారే సత్య తీర్థానికి
వచ్చి చేరుకోవాలి - ఇది అంతిమ దృశ్యము. దీని కొరకు ఇప్పుడు ధరణి తయారైపోయింది.
బీజము కూడా పడిపోయింది. ఇప్పుడిక ఫలము తప్పకుండా వెలువడ్తుంది. మంచిది. రెండు
వైపులకు వెళ్ళారు. బాప్‌దాదా వద్దకు అందరి ధైర్యము, ఉల్లాసము, ఉత్సాహము
చేరుకుంటాయి. మెజారిటి వారికి సేవ చేయాలనే ఉత్సాహ-ఉల్లాసాలు ఉన్న కారణంగా
మాయాజీతులుగా అవ్వడంలో కూడా సహజంగానే ముందుకు వెళ్తున్నారు. తీరిక ఉన్నట్లయితే
మాయతో యుద్ధము కూడా జరుగుతుంది. కానీ కేవలం డ్యూటీగా కాక హృదయ పూర్వకంగా సేవలో
బిజీగా ఉంటే, అటువంటివారు సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. కావున బాప్‌దాదా
పిల్లల ఉత్సాహ-ఉల్లాసాలను చూసి సంతోషిస్తున్నారు. అక్కడ సాధనాలు కూడా సహజంగా
ఉన్నాయి. వారికి సహజంగానే లభిస్తాయి కూడా. లక్ష్యమూ ఉంది, కృషీ ఉంది, అలాగే
సాధనాలు కూడా సహజంగా లభించాయి. ఈ మూడు విషయాల కారణంగా రేసులో ముందు నెంబరు
తీసుకున్నారు. బాగుంది కానీ దేశంవారు కూడా తక్కువేమీ కాదు. అందరూ తమ తమ ఉల్లాస
ఉత్సాహాల ఆధారం పై ముందుకు వెళ్తున్నారు. పేరు అయితే దేశం నుండే వెలువడ్తుంది.
విదేశాల సఫలత కూడా దేశం నుండే వెలువడ్తుంది. ఈ మంచి స్మృతి వారికి ఉంటుంది.
అంతేకాక మేము పేరు ప్రసిద్ధం చేయాలి, ఇది మా కర్తవ్యము అని భావిస్తారు. విదేశాల
ధ్వనితో భారతదేశాన్ని మేల్కొల్పాలి అన్న ఈ లక్ష్యము పక్కాగా ఉంది, అది
నిర్వర్తిస్తున్నారు కూడా. తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు విదేశాల వరకే శబ్ధము
వ్యాపించింది. విదేశాల నుండి దేశము వరకు చేరుకోవాలి, అది ఎగురుతూ - ఎగురుతూ
వస్తోంది. ఇప్పుడు ఎగురుతోంది, ప్రయాణిస్తోంది. ఎగురుతూ - ఎగురుతూ ఇక్కడకు వచ్చి
చేరుకుంటుంది. ఇప్పుడు విదేశాలలో బాగా వ్యాపిస్తోంది. కానీ విదేశాల నుండి
దేశంలోకి వచ్చి చేరుకోవాలి. ఇది కూడా జరగాల్సిందే. మంచిది. ఏ పాత్రనైతే
అభినయించారో అది మంచిగా అభినయించారు. సదా ముందుకు వెళ్లేందుకు సహయోగము మరియు
వరదానము ఉన్నాయి. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర ఉంది. ఎంత ఆనుభవీలుగా అవుతూ ఉంటారో
అంత ఇంకా అనుభవాల ఆధారంతో ముందుకు వెళ్తూ ఉంటారు. చేయించేవారు ఏది ఎవరి ద్వారా
చేయించారో అది డ్రామానుసారం బాబా బాగా చేయించారు. నిమిత్త భావం సేవను చేయిస్తూ
ఉంటుంది. కావున సేవ చేయించారు. నిమిత్తంగా అయ్యారు, జమ అయ్యింది మరియు ఇక ముందు
కూడా జమ అవుతూ ఉంటుంది. మంచిది.
పార్టీలతో :- సదా మిలన మేళాలో ఉండేవారు కదా! ఈ మిలన
మేళా అవినాశీ మిలన మేళాను అనుభవం చేయిస్తుంది. ఎక్కడ ఉన్నా మీరు మేళాలోనే ఉంటారు.
మేళా నుండి దూరమవ్వరు. మేళా అనగా మిలనము. కావున సదా మిలన మేళా జరుగుతూనే ఉంటుంది.
సదా మేళాలో ఉండే భాగ్యవంతులెవరు ఉంటారు? మేళాలైతే జరుగుతాయి మరియు
సమాప్తమైపోతాయి. కానీ సదా మేళాలో ఎవ్వరూ ఉండరు. భాగ్యశాలి ఆత్మలైన మీరే సదా
మేళాలో ఉంటారు. సదా మిలన మేళాలో ఉంటారు. మేళాలో ఏమి జరుగుతుంది? కలుసుకోవడం
మరియు ఊగడం. ఊగడం కూడా జరుగుతుంది కదా! కావున మీరు సదా ప్రాప్తులనే ఊయలలో
ఊగేవారు. ఒక్క ఊయలే కాదు, అనేక ప్రాప్తుల అనేక ఊయలలో ఊగారు. కాసేపు ఆ ఊయలలో,
కాసేపు ఈ ఊయలలో ఊగుతూ ఉంటారు. కానీ మేళాలో ఉంటారు కదా. సదా సుఖమయ మరియు సర్వ
ప్రాప్తులను అనుభవం చేయించే ఊయలలు ఉన్నాయి. మీరు ఇటువంటి కోట్లాది మందిలో కొద్ది
మంది భాగ్యశాలి ఆత్మలు. ముందు మహిమ వినేవారు, ఇప్పుడు మహాన్‌గా అయిపోయారు.