24.12.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' ఈశ్వరీయ స్నేహం యొక్క మహాత్యము ''

ఈ రోజు స్నేహసాగరుడు తన స్నేహీ ఛాత్రకులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. అనేక జన్మల నుండి సత్యమైన ఈ అవినాశీ ఈశ్వరీయ స్నేహం కొరకు దప్పిక గొని ఉన్నారు. జన్మ-జన్మల నుండి దాహముతో ఉన్న ఛాత్రక ఆత్మలకు ఇప్పుడు సత్యమైన స్నేహం, అవినాశీ స్నేహం అనుభవం అవుతూ ఉంది. భక్త ఆత్మలుగా అయిన కారణంగా పిల్లలైన మీరందరూ స్నేహానికి భికార్లుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి భికార్ల నుండి స్నేహసాగరుని వారసత్వానికి అధికారిగా చేస్తున్నారు. అనుభవం ఆధారంతో అందరి హృదయాల నుండి ''ఈశ్వరీయ స్నేహము మా జన్మ సిద్ధ అధికారము'' అనే ఈ శబ్ధము స్వత:గానే వెలువడ్తూ ఉంది. కావున భికార్ల నుండి అధికారులుగా అయ్యారు. విశ్వంలో ప్రతి ఆత్మకు జీవితంలో అవసరమైనది స్నేహమే. స్నేహము లేకుంటే జీవితం నీరసంగా అనుభవమవుతుంది. స్నేహం ఎంత ఉన్నతమైనదంటే ఈ రోజుల్లో సాధారణ మానవులు స్నేహాన్నే భగవంతునిగా అంగీకరిస్తున్నారు. ప్రేమయే పరమాత్మ లేక పరమాత్మ అంటేనే ప్రేమ అని అంటున్నారు. కనుక భగవంతుడిని ఎంత ఉన్నతంగా అంగీకరిస్తారో స్నేహం కూడా అంత ఉన్నతమైనది. అందువలన భగవంతుడిని స్నేహం లేక ప్రేమ అని అంటారు. ఇలా ఎందుకు అంటారో అనుభవం లేదు. అయినా పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైకి వచ్చినప్పుడు పిల్లలందరికి ప్రత్యక్ష జీవితంలో సాకార రూపం ద్వారా స్నేహాన్ని ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు. అనుభవం లేనప్పుడు కూడా స్నేహమే పరమాత్మ అని భావించేవారు. కనుక పరమాత్మ తండ్రి ఇచ్చిన మొదటి బహుమతి స్నేహము. స్నేహమే మీ అందరికి బ్రాహ్మణ జన్మనిచ్చింది. స్నేహ పాలనయే మీ అందరినీ ఈశ్వరీయ సేవకు యోగ్యంగా చేసింది. స్నేహమే సహజ యోగిగా, కర్మ యోగిగా, స్వత: యోగిగా చేసింది. స్నేహము హద్దు త్యాగాన్ని భాగ్యంగా అనుభవం చేయించింది. త్యాగము కాదు భాగ్యమని అనుభవం చేయించింది. ఈ అనుభవం చేయించింది సత్యమైన స్నేహమే కదా! ఈ స్నేహము ఆధారంతోనే ఎలాంటి తుఫానునైనా ఈశ్వరీయ తోఫాగా(కానుకగా) అనుభవం చేస్తారు. స్నేహం ఆధారంతో కష్టాన్ని అతి సహజంగా అనుభవం చేస్తారు. ఈ ఈశ్వరీయ స్నేహమే అనేక సంబంధాలలో తగులుకున్న హృదయాన్ని, అనేక ముక్కలైన హృదయాన్ని ఒక్కరితో జోడించింది. ఇప్పుడు ఒక్కటే హృదయం, ఒక్కడే మనోభిరాముడు. ఇప్పుడు మీ హృదయం ముక్కలుగా లేదు. స్నేహము తండ్రి సమానంగా చేసేసింది. స్నేహమే సదా తోడుగా ఉన్న అనుభవం చేసిన కారణంగా సదా సమర్థంగా తయారు చేసింది. స్నేహమే యుగాన్ని పరివర్తన చేసింది. కలియుగానికి చెందిన వారి నుండి సంగమ యుగానికి చెందిన వారిగా చేసింది. స్నేహమే దు:ఖము, బాధల ప్రపంచాన్ని సుఖ, సంతోషాల ప్రపంచంలోకి పరివర్తన చేసింది. ఈ ఈశ్వరీయ స్నేహానికి ఇంత మహత్వం ఉంది. ఎవరైతే మహత్వాన్ని తెలుసుకుంటారో వారు మహాన్ గా అవుతారు. ఇలా మహాన్ అయ్యారు కదా! అన్నిటికంటే సహజ పురుషార్థం కూడా ఇదే. స్నేహంలో సదా ఇమిడిపోయి ఉండండి. లవలీన ఆత్మకు ఎప్పుడూ స్వప్నంలో కూడా మాయ ప్రభావం పడజాలదు ఎందుకంటే లవలీన స్థితి మాయాప్రూఫ్ స్థితి. కావున స్నేహంలో ఉండడం సులభం కదా. స్నేహం అందరినీ మధువన నివాసులుగా చేసింది. స్నేహం కారణంగానే చేరుకున్నారు కదా! బాప్దాదా కూడా పిల్లలందరికీ ''సదా స్నేహీ భవ'' అనే వరదానాన్ని ఇస్తున్నారు. స్నేహము, ఏది కోరుకుంటే దానిని ప్రాప్తి చేసుకోగలిగే ఇంద్రజాలము. సత్యమైన స్నేహంతో, హృదయపూర్వక స్నేహంతో కోరుకోవాలి, స్వార్థ స్నేహంతో కాదు. సమయానికి స్నేహీలుగా అయ్యేవారు కాదు. ఏదైనా అవసరమొచ్చిన సమయంలో మధురమైన బాబా! ప్రియమైన బాబా! అంటూ స్నేహాన్ని నిభాయించేవారిగా కాదు. సదా ఈ స్నేహంలో ఇమిడిపోయి ఉండాలి. ఇటువంటి వారికి బాప్దాదా సదా ఛత్రఛాయగా ఉంటారు. సమయము వచ్చినప్పుడు స్మృతి చేసేవారికి లేక ఏదైనా ఆశించి స్మృతి చేసేవారికి కూడా యథా శక్తి, యథా స్నేహం ప్రతిఫలంగా సహయోగం లభిస్తుంది. కానీ యథా శక్తి ద్వారా సంపన్న స్వరూప సఫలత లభించదు. కనుక సదా స్నేహం ద్వారా సర్వ ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసేందుకు సత్యమైన హృదయపూర్వక స్నేహీలుగా అవ్వండి. అర్థమయ్యిందా!

బాప్దాదా మధువన ఇంటికి శృంగారమైన పిల్లలందరికి విశేషంగా స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి పుత్రుడు తండ్రి ఇంటికి విశేషమైన అలంకారము. ఈ మధువన బేహద్ఇంటికి పిల్లలే అందము, స్వయాన్ని ఇలా భావిస్తున్నారు కదా! ప్రపంచంలోని వారు క్రిస్ట్మస్ జరుపుకునేందుకు ఎక్కడెక్కడికో వెళ్తారు. ఈ విశేష విదేశీ లేక భారత్ పిల్లలు గొప్ప రోజును గొప్పకంటే గొప్ప తండ్రితో, గొప్ప మనసుతో జరుపుకునేందుకు మధురమైన ఇంటికి చేరుకున్నారు.

ఈ గొప్పరోజు(క్రిస్ట్మస్) విశేషించి తండ్రి మరియు దాదా ఇరువురి స్మృతిచిహ్నానికి గుర్తు. ఒకరు దాత రూపంతో శివబాబాకు గుర్తు మరియు వృద్ధ స్వరూపము బ్రహ్మబాబాకు గుర్తు. ఎప్పుడూ యువ రూపాన్ని చూపించరు. క్రిస్టమస్ ఫాదర్ను ఎప్పుడూ వృద్ధునిగానే చూపిస్తారు మరియు రెండు రంగులు కూడా తప్పకుండా చూపిస్తారు - తెలుపు మరియు ఎరుపు. ఇది తండ్రి(బాప్) మరియు దాదా ఇరువురికి గుర్తు. బాప్దాదా చిన్న పిల్లలను వారి కోరిక అనుసరించి వాటితో సంపన్నంగా చేస్తారు. చిన్న చిన్న పిల్లలు చాలా స్నేహంతో ఈ విశేష రోజున తమ మనసుకు ఇష్టమైన వస్తువులను క్రిష్టమస్ ఫాదర్ను(తాతను) అడుగుతారు లేక సంకల్పం చేస్తారు, అది తప్పకుండా పూర్తవుతుందని నిశ్చయం ఉంచుకుంటారు. కావున ఈ స్మృతి చిహ్నము కూడా పిల్లలైన మీదే. పాత శూద్ర జీవితంలో ఎంత వృద్ధులు అయినా బ్రాహ్మణ జీవితంలో చిన్న పిల్లలే. చిన్న పిల్లలందరూ ఏ శ్రేష్ఠమైన కోరిక కోరుకున్నా అది పూర్తవుతుంది కదా! అందువలన ఈ స్మృతికి గుర్తు అంతిమ ధర్మం వారిలో కూడా నడుస్తూ వస్తోంది. మీ అందరికి ఈ సంగమయుగం అనే బహుమతుల రోజు. కావున బాప్దాదా అన్నిటికంటే పెద్ద కానుక స్వరాజ్యము మరియు స్వర్గ రాజ్యమును ఇస్తారు. దీనిలో ప్రాప్తించని వస్తువు ఏదీ ఉండదు. సర్వ ప్రాప్తి స్వరూపులుగా అవుతారు. కావున గొప్పరోజును జరుపుకునేవారు గొప్ప మనసు గలవారు. విశ్వానికి ఇచ్చేవారు కనుక పెద్ద మనసు గలవారే అవుతారు కదా! కావున అందరికి సంగమయుగీ గొప్ప రోజున గొప్ప మనసుతో గొప్ప కంటే గొప్పగా బాప్దాదా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారు 12 గంటల తర్వాత జరుపుకుంటారు. మీ నెంబర్అందరికంటే ముందు ఉంది కదా! కావున మొదట మీరు జరుపుకుంటున్నారు. తర్వాత ప్రపంచంలోనివారు జరుపుకుంటారు. విశేష రూపంలో డబల్ విదేశీయులు ఈ రోజు చాలా ఉత్సాహ-ఉల్లాసాలతో స్మృతి బహుమతిని తండ్రికి స్థూల, సూక్ష్మ రూపంతో ఇస్తున్నారు. బాప్దాదా కూడా డబల్ విదేశీ పిల్లలందరికి స్నేహ కానుకకు బదులుగా పదమా రెట్లు సదా స్నేహీగా, తోడుగా ఉంటారు. సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి లవలీన స్థితిని అనుభవం చేస్తారు. ఇలాంటి వరదానంతో నిండిన స్మృతి మరియు అమర ప్రేమను బదులుగా బహుమతినిస్తున్నారు. సదా పాడుతూ మరియు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. సదా నోరు మధురంగా ఉంటుంది. అలాగే స్నేహీ భారతదేశంలోని పిల్లలకు కూడా విశేష సహజయోగి స్వతహాయోగిగా అయ్యే వరదానపు ప్రియస్మృతులు ఇస్తున్నారు.

పిల్లలందరికి దాత మరియు విధాత అయిన బాప్దాదా అవినాశి స్నేహ సంపన్న సదా సమర్ధ స్వరూపంతో సహజంగా అనుభవం చేసుకునే ప్రియస్మృతులు ఇస్తున్నారు. అందరికి ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో :-

1. సదా స్వయాన్ని ఈ పాత ప్రపంచం ఆకర్షణతో అతీతంగా, తండ్రికి ప్రియంగా అనుభవం చేస్తున్నారా? ఎంత అతీతంగా ఉంటారో అంత స్వత:గానే ప్రియంగా ఉంటారు. అతీతంగా లేకపోతే ప్రియంగా కూడా ఉండరు. కావున అతీతంగా ఉన్నారు, ప్రియంగా కూడా ఉన్నారు లేక ఎక్కడో ఒకచోట తగుల్పాటు ఉందా? ఎవ్వరితోనూ తగుల్పాటు(లగావ్) లేకపోతే బుద్ధి ఒక్క తండ్రి వైపుకు స్వతహాగానే వెళ్తుంది, ఇంకొక వైపుకు వెళ్లలేదు. సహజయోగి మరియు నిరంతరయోగి స్థితి అనుభవం అవుతుంది. ఇప్పుడు సహజయోగిగా అవ్వకుంటే ఎప్పుడు అవుతారు? ఇంత సహజ ప్రాప్తి ఉంది. సత్యయుగంలో కూడా ఇప్పటి ప్రాప్తికే ఫలం లభిస్తుంది. కావున ఇప్పుడు సహజయోగీ మరియు సదా రాజ్యభాగ్యానికి అధికారి సహజయోగి పిల్లలు సదా తండ్రికి సమానంగా సమీపంగా ఉన్నారు. కావున స్వయాన్ని తండ్రికి సమీపంగా తోడుగా ఉండే అనుభవం చేస్తున్నారా? ఎవరు జతలో ఉంటారో వారికి తండ్రి తోడు(సహాయము) సదా ఉంటుంది. జతలో ఉండకపోతే సహారా (సహాయము) కూడా లభించజాలదు. తండ్రి తోడు లభించినట్లయితే ఏ విఘ్నమూ రాజాలదు. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి తోడు ఉంటుందో మాయ స్వయమే దూరంగా వెళ్లిపోతుంది. శక్తి కలిగినవారి ముందు బలహీనులు ఏం చేస్తారు? దూరం అవుతారు కదా! అలాగే మాయ కూడా దూరమైపోతుంది, ఎదురించదు. కావున అందరూ మాయాజీతులుగా ఉన్నారు కదా? రకరకాలుగా కొత్త కొత్త రూపంలో మాయ వస్తుంది. కానీ జ్ఞానవంతులైన ఆత్మలు మాయతో భయపడరు. వారు మాయ రూపాలన్నీ తెలుసుకుంటారు అంతేకాక తెలుసుకున్న తర్వాత దూరంగా ఉంటారు. ఎప్పుడైతే మాయాజీతులుగా అవుతారో అప్పుడు ఎవ్వరూ కదిలించలేరు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా మీరు మాత్రం కదలకండి.

అమృతవేళ నుండి రాత్రి వరకు తండ్రి మరియు సేవ తప్ప ఏ లగ్నమూ(ఆకర్షణా) ఉండరాదు. తండ్రి లభించారు, సేవాధారిగా అయ్యారు ఎందుకంటే ఏది లభించిందో దానిని ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఒకటి ఇవ్వండి, పదమాలు పొందండి. మేము అన్ని భండారాలకు యజమానులము, సంపన్న భండారాలుగా ఉన్నాము. ఎవరినైతే ప్రపంచం వెతుకుతూ ఉందో వారికి పిల్లలుగా అయ్యాము. దు:ఖ ప్రపంచముతో దూరంగా అయ్యాము. సుఖప్రదమైన ప్రపంచంలోకి చేరుకున్నాము. సదా సుఖసాగరంలో ఓలలాడుతూ అందరినీ సుఖ ఖజానాతో సంపన్నంగా చెయ్యండి. మంచిది.

ఎంచుకోబడిన అవ్యక్త వాక్యాలు

బ్రాహ్మణ జీవితంలో సభ్యత అనే సంస్కృతిని (కల్చర్) తమదిగా చేసుకోండి

బ్రాహ్మణ పరివారంలో మొదటి నంబర్ సంస్కృతి(కల్చర్) సభ్యత. కావున ప్రతి ఒక్కరి ముఖంలో, నడవడికలో ఈ బ్రాహ్మణ సంస్కృతి ప్రత్యక్షమవ్వాలి. ప్రతి బ్రాహ్మణుడు చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి. ఎవరు ఎలా ఉన్నా మీరు మీ స్వభావాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఇప్పుడు తమ జీవితంలో క్రొత్త సభ్యత యొక్క సంస్కారాన్ని చూపించండి. తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి. కోరుకోకపోయినా క్రోధం లేక విసుగు వచ్చినట్లయితే హృదయపూర్వకంగా ''మధురమైన బాబా'' అన్నట్లయితే అదనపు సహాయం లభిస్తుంది. లోపలి నుండి శుభ భావం మరియు ప్రేమ భావం ఉత్పన్నం చేసినట్లయితే మహాశత్రువైన క్రోధం పై విజయం ప్రాప్తి చేసుకుంటారు.

చాలామంది పిల్లలు ఈ రోజులలో ఒక విశేష భాషను ఉపయోగిస్తారు మేము అసత్యాన్ని చూడలేము, అసత్యం వినలేము. అందువలన అసత్యాన్ని చూస్తూనే, అబద్ధం వింటూనే లోపలి నుండి ఆవేశం(క్రోధం) వస్తుంది అని అంటారు. కానీ ఒకవేళ అది అసత్యం అయితే మరియు మీరు అసత్యాన్ని చూస్తూ ఆవేశంలోకి వస్తూ ఉంటే, ఆ ఆవేశం కూడా అసత్యమే కదా! అసత్యతను సమాప్తి చేసేందుకు స్వయంలో సత్యతా శక్తిని ధారణ చెయ్యండి. సత్యతకు గుర్తు - సభ్యత. మీరు సత్యమైనవారైతే, సత్యతా శక్తి మీలో ఉంటే సభ్యతను ఎప్పుడూ విడవకండి. సత్యతను నిరూపించండి కానీ సభ్యతా పూర్వకంగా ఋజువు చెయ్యండి. సభ్యతను వదిలి అసభ్యతతో సత్యతను ఋజువు చేయాలనుకుంటే ఆ సత్యం ఋజువు కాదు. అసభ్యతకు గుర్తు మొండితనం మరియు సభ్యతకు గుర్తు నిర్మాణత. సత్యతను ఋజువు చేసేవారు ఎల్లప్పుడూ స్వయం నిర్మాణంగా ఉంటూ సభ్యతాపూర్వకంగా వ్యవహారం చేస్తారు. ఆవేశంలోకి వచ్చి ఎవరైనా సత్యాన్ని ఋజువు చేసినట్లయితే అందులో తప్పకుండా ఏదో కొంత అసత్యం ఇమిడి ఉంటుంది. చాలామంది పిల్లల భాష 'నేను పూర్తిగా సత్యంగా మాట్లాడ్తాను, నూరు శాతం సత్యమే మాట్లాడ్తాను' అని అంటారు. కానీ సత్యాన్ని ఋజువు చెయ్యవలసిన అవసరం లేదు. సత్యం దాగబడని సూర్యుని వంటిది. ఎన్ని గోడలు మీ ముందుకు వచ్చినా సత్యతా ప్రకాశం ఎప్పుడూ దాగబడదు. సభ్యతా పూర్వక మాటలు సభ్యతా పూర్వక నడవడికలోనే సఫలత ఉంటుంది.

ఏదైనా అసత్యమైన విషయం చూచినా, విన్నా అసత్య వాతావరణాన్ని వ్యాపింపజేయకండి. ఇది పాపకర్మ కదా అని చాలామంది అంటారు. పాపకర్మను చూడలేరు కానీ వాతావరణంలో అసత్యమైన మాటలను వ్యాపింపజేయడం కూడా పాపమే కదా. లౌకిక పరివారంలో కూడా ఏదైనా అటువంటి విషయం చూసినా లేక విన్నా దానిని వ్యాపింపజేయరు. చెవులతో వింటారు, హృదయంలో దాచుకుంటారు. ఏవైనా వ్యర్థ విషయాలను వ్యాపింపజేస్తే అది కూడా పాపం యొక్క అంశమే. ఇలాంటి చిన్న చిన్న పాపాలు ఎగిరేకళ అనుభవాన్ని సమాప్తి చేసేస్తాయి. అందువలన ఈ కర్మల గుహ్యగతిని అర్థం చేసుకొని సభ్యతాపూర్వకంగా వ్యవహారం చెయ్యండి. బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా చాలా రాయల్ పిల్లలు. మీ ముఖం మరియు నడవడిక రెండూ సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయించాలి. వాస్తవానికి రాయల్ఆత్మలను సభ్యత గల దేవీలని అంటారు. వారు మాట్లాడటం, చూడడం, నడవడం, తినడం-త్రాగడం, లేవడం, కూర్చోవడం ప్రతి కర్మలో సభ్యత, సత్యత స్వత:గానే కనిపిస్తుంది. నేను సత్యతను ఋజువు చేస్తున్నాను కానీ సభ్యత లేకుండా కాదు, ఇది రైటు కాదు. చాలామంది పిల్లలు కోపం రావడం లేదు కానీ ఎవరైనా అబద్ధం మాట్లాడితే క్రోధం వస్తుందని అంటారు. వారు అబద్ధం మాట్లాడారు, మీరు క్రోధంతో మాట్లాడారు. ఇరువురిలో రైటు ఎవరు? చాలామంది మేము కోపంతో మాట్లాడడం లేదు అని చతురంగా అంటారు. మా మాటే అలా పెద్దగా ఉంటుంది, మాటనే ఇలా తీవ్రంగా ఉంటుంది అని అంటారు. కానీ సైన్సు సాధనాలతో ధ్వనిని తక్కువ మరియు ఎక్కువగా చేయగలిగితే సైలెన్స్ శక్తితో తమ మాటల శబ్ధాన్ని ఎక్కువ లేక తక్కువగా చెయ్యలేరా? ఎలాగైతే క్రోధం అజ్ఞాన శక్తి అయ్యిందో అలా జ్ఞానశక్తి శాంతి మరియు సహనశక్తి. కావున అజ్ఞాన శక్తి అయిన క్రోధమును చాలా బాగా సంస్కారంగా తయారు చేసుకున్నారు అంతేకాక ఉపయోగిస్తూ కూడా ఉన్నారు మళ్లీ క్షమాపణ కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞాన విషయాన్ని సంస్కార రూపంగా చేసుకుంటే సభ్యత వస్తూ ఉంటుంది.

బహుశా కొంతమంది కోపం వికారం కాదు, ఒక ఆయుధము, వికారం కాదు అని భావిస్తారు. కానీ క్రోధము, జ్ఞానీ ఆత్మ కొరకు మహాశత్రువు. ఎందుకంటే క్రోధం అనేక ఆత్మల సంబంధ-సంపర్కంలోకి వచ్చినప్పుడు ప్రసిద్ధమవుతుంది(ప్రకటమవుతుంది). క్రోధమును చూసి తండ్రి పేరుకు చాలా గ్లాని జరుగుతుంది. చెప్పేవారు కూడా, 'చూశారా జ్ఞానీ ఆత్మ పిల్లలను' అని అంటారు. అందువలన దీని అంశమాత్రంను కూడా సమాప్తి చెయ్యండి. చాలా చాలా సభ్యతా పూర్వకంగా వ్యవహారం చెయ్యండి.