సుఖము, శాంతి మరియు ఆనందానికి ఆధారము - పవిత్రత"
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న సర్వ పవిత్రమైన
మరియు సంతోషమయమైన పిల్లలను చూస్తున్నారు. ఇంత పెద్ద సంఘటిత రూపములో ఇటువంటి
పవిత్రత మరియు సంతోషము రెండు విశేషతలు కలవారి యొక్క ఇంత పెద్ద సభ లేక, ఇంత
పెద్ద సంఘటన ఈ మొత్తం డ్రామా అంతటిలోనూ ఎప్పుడూ ఉండజాలదు. ఈ రోజుల్లో ఎవరికైనా
హైనెస్ లేక హోలీనెస్ అన్న టైటిల్ ను ఇస్తున్నా కానీ ప్రత్యక్ష ప్రమాణములో
చూసినట్లయితే ఆ పవిత్రత, మహానత కనిపించదు. ఇంత మహాన్ పవిత్ర ఆత్మల యొక్క సంఘటన
ఎక్కడ ఉండగలదు అని బాప్ దాదా గమనిస్తున్నారు. కేవలం కర్మ ద్వారానే కాదు, మనస్సు,
వాణి, కర్మ -మూడింటి ద్వారా పవిత్రముగా అవ్వవలసిందేనని ప్రతి ఒక్కరిలోనూ ఈ దృఢ
సంకల్పము ఉంది. కావున ఈ విధముగా అవ్వాలి అన్న శ్రేష్ఠమైన దృఢ సంకల్పము ఇంకెక్కడా
ఉండజాలదు. అదీ అవినాశిగా మరియు ఇంత సహజముగా ఉండజాలరు మరియు మీరందరూ పవిత్రతను
ధారణ చేయడం ఎంత సహజమైనదిగా భావిస్తారు! ఎందుకంటే, బాప్ దాదా ద్వారా జ్ఞానము
లభించింది మరియు జ్ఞానము యొక్క శక్తి ద్వారా ఆత్మనైన నాయొక్క అనాది మరియు ఆది
స్వరూపము పవిత్రతతో కూడుకున్నది అని తెలుసుకున్నారు. ఆది, అనాది స్వరూపము యొక్క
స్మృతి వచ్చేసాక, ఈ స్మృతి సమర్ధముగా చేసి సహజముగా అనుభవం చేయిస్తోంది. మా
వాస్తవిక స్వరూపము పవిత్రతతో కూడుకున్నది అని తెలుసుకున్నారు. ఈ సాంగత్య
దోషముయొక్క స్వరూపము అపవిత్రమైనది, కావున వాస్తవికమైన దానిని ధారణ చేయడం
సహజమైపోయింది కదా!
స్వధర్మము, స్వదేశము, స్వయం యొక్క తండ్రి మరియు స్వ
స్వరూపము, స్వకర్మ అన్నింటి యొక్క జ్ఞానము లభించింది. కావున జ్ఞానము యొక్క శక్తి
ద్వారా కష్టమైనది కూడా అతి సహజమైపోతుంది. ఏ విషయమునైతే ఈ రోజుల్లోని మహాన్
ఆత్మలుగా పిలువబడే వారు కూడా అసంభవముగా భావిస్తారో, సహజత్వానికి విరుద్ధముగా
భావిస్తారో అటువంటి అసంభవమైన దానిని కూడా పవిత్ర ఆత్మలైన మీరు ఎంత సహజముగా
అనుభవం చేసుకున్నారు! పవిత్రతను ధారణ చేయడం సహజమా లేక కష్టమా? పవిత్రత మా
స్వస్వరూపము అని మొత్తం విశ్వం ముందు మీరు ఛాలెంజ్ చేయగలరు. పవిత్రతా శక్తి
కారణముగా ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగానే ఉంటాయి,
పవిత్రత పునాది వంటిది. పవిత్రతను తల్లి అని అంటారు మరియు సుఖశాంతులు తన పిల్లలు.
కావున ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగానే లభిస్తాయి. కావున
మీరు సంతోషముగానూ ఉన్నారు. మీరు ఎప్పుడూ ఉదాసీనులుగా అవ్వజాలరు. మీరు సదా
సంతోషముగా ఉండేవారే. ఎక్కడైతే పవిత్రముగా ఉంటారో అక్కడ ఆనందముగా కూడా తప్పకుండా
ఉంటారు. పవిత్ర ఆత్మలకు గుర్తు - వారు సదా సంతోషముగా ఉంటారు. ఎంతమంది
నిశ్చయబుద్ధి, పావన ఆత్మలుగా కూర్చున్నారు అని బాప్ దాదా గమనిస్తున్నారు.
ప్రపంచంలోనివారు సుఖశాంతుల వెనుక పడుతున్నారు. కానీ సుఖశాంతులకు పునాది
పవిత్రతయే. ఆ పునాదిని గూర్చి తెలియదు. కావున పవిత్రత యొక్క పునాది దృఢముగా లేని
కారణముగా అల్పకాలికముగా సుఖము లేక శాంతి ప్రాప్తమవుతున్నా, కాసేపు లభిస్తూ, మరి
కాసేపు లభించకుండా ఉంటుంది. సదాకాలికమైన సుఖశాంతుల ప్రాప్తి పవిత్రత లేకుండా
అసంభవమే. మీరంతా పునాదిని మీదిగా చేసుకున్నారు. కావున సుఖశాంతుల కొరకు పరుగులు
తీయవలసిన అవసరం ఏర్పడదు. సుఖశాంతులు పవిత్ర ఆత్మల వద్దకు స్వతహాగానే వస్తాయి.
ఏవిధముగా పిల్లలు తల్లివద్దకు స్వతహాగానే వెళతారో, ఎంత దూరం చేసినా వారు తల్లి
వద్దకు తప్పకుండా వెళతారు. కావున సుఖశాంతులకు పవిత్రతయే తల్లి వంటిది. ఎక్కడైతే
పవిత్రత ఉంటుందో అక్కడకు సుఖము, శాంతి స్వతహాగానే వస్తాయి. మరి మీరు ఏవిధముగా
అయ్యారు? నిశ్చింత మహారాజులుగా అయ్యారు! ఈ పాత ప్రపంచపు మహారాజులుగా కాదు, దుఃఖ
రహితపురపు మహారాజులుగా అయ్యారు. ఈ బ్రాహ్మణ పరివారము దుఃఖరహితపురము అనగా సుఖము
యొక్క ప్రపంచము. కావున ఈ సుఖ ప్రపంచపు నిశ్చింత మహారాజులుగా అయిపోయారు. మీరు
హిజ్ హోలీనెస్ కూడా కదా! కిరీటము కూడా ఉంది, సింహాసనము కూడా ఉంది. ఇంకేమి లోటు
ఉంది? ఇది ఎంత గొప్ప కిరీటము! ప్రకాశ కిరీటము పవిత్రతకు గుర్తు. మీరు బాప్
దాదాల హృదయసింహాసనాధికారులుగా అయ్యారు. కావున నిశ్చింత మహారాజుల కిరీటము కూడా
అతీతముగా మరియు సింహాసనము కూడా అతీతముగా ఉంది. అలాగే రాజ్యమూ అతీతముగా ఉంది.
రాజులు కూడా అతీతముగా ఉన్నారు.
ఈనాటి మనుష్య ఆత్మలు ఇంతగా పరుగులు తీయడం చూసి బాప్
దాదాకు కూడా పిల్లలపై దయ కలుగుతుంది. వారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ప్రయత్నము
అనగా బాగా పరిగెడుతూ ఉంటారు. శ్రమ కూడా బాగా పడుతూ ఉంటారు కానీ ప్రాప్తి ఏమిటి?
సుఖమూ ఉంటుంది అలాగే సుఖముతో పాటు ఏదో ఒక దుఃఖము కూడా లభించి ఉంటుంది. ఇంకేమి
లేకపోయినా అల్పకాలిక సుఖముతో పాటు చింత మరియు భయము - ఈ రెండూ అయితే ఉండనే ఉంటాయి.
కావున ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ విశ్రాంతి ఉండజాలదు. ఎక్కడైతే భయము ఉంటుందో
అక్కడ శాంతి ఉండజాలదు. కావున సుఖముతో పాటు ఈ దుఃఖము మరియు అశాంతికి కారణాలైతే
ఉండనే ఉన్నాయి మరియు మీ అందరికీ దుఃఖమునకు కారణాలు మరియు నివారణలు లభించేసాయి.
ఇప్పుడు మీరు సమస్యలకు సమాధానము తెలిపే సమాధానస్వరూపులుగా అయిపోయారు కదా!
సమస్యలు మీతో ఆడుకునేందుకు వచ్చే బొమ్మల్లా వస్తూ ఉంటాయి. ఆట ఆడేందుకు వస్తాయే
కానీ భయపెట్టేందుకు కాదు. మీరు వ్యాకులత చెందరు కదా! ఎక్కడైతే సర్వశక్తుల యొక్క
ఖజానా జన్మసిద్ధ అధికారముగా అయిపోయిందో అప్పుడిక లోటు ఏముంది? అందరూ నిండుగా
ఉన్నారు కదా! మాస్టర్ సర్వశక్తివంతుల ముందు సమస్యలు ఏమీ ఉండవు. ఏనుగు కాలి
కిందకు చీమ వస్తే అదేమైనా కనిపిస్తుందా? కావున ఈ సమస్యలు కూడా మహారధులైన మీ
ముందు చీమ సమానమే. వీటిని ఆటగా భావించడం ద్వారా సంతోషము ఉంటుంది. ఎంత పెద్ద
విషయమైనా చిన్నదిగా అయిపోతుంది. ఈనాటి పిల్లలతో ఏ ఆటలను ఆడిస్తారు? బుద్ధికి
సంబంధించిన ఆటలను ఆడిస్తారు కదా! మీరు పిల్లలకు లెక్కలు చేయమని చెబితే
విసిగిపోతారు. కానీ వాటిని ఆటరూపములో నేర్పిస్తే ఆ లెక్కలను సంతోషముగా
చేసేస్తారు. కావున మీ అందరి కొరకు కూడా ఈ సమస్యలు చీమల వంటివే కదా! ఎక్కడైతే
పవిత్రత, సుఖశాంతుల యొక్క శక్తి ఉంటుందో అక్కడ స్వప్నములో కూడా దు:ఖము, అశాంతి
యొక్క అల రాజాలదు. శక్తిశాలి ఆత్మల ముందు ఈ దు:ఖము మరియు అశాంతి ముందుకు
వచ్చేందుకు కూడా ధైర్యమును ఉంచజాలవు. పవిత్ర ఆత్మలు చాలా హర్షితంగా ఉంటారు.
దీనిని సదా సృతిలో ఉంచుకోండి. అనకరకాలైన చిక్కులనుండి, భ్రమించడం నుండి, దు:ఖము,
అశాంతి యొక్క వలల నుండి బయటపడి వచ్చారు, ఎందుకంటే కేవలం ఒక్క దు:ఖము మాత్రమే
రాదు. ఆ ఒక్క దుఃఖము కూడా తన వంశావళితో పాటు వస్తుంది. కావున ఆ వల నుండి బయటపడి
వచ్చారు. ఈ విధముగా మిమ్మల్ని అటువంటి భాగ్యవంతులుగా భావిస్తున్నారు కదా!
ఈరోజు ఆస్ట్రేలియా వారు కూర్చున్నారు. ఆస్ట్రేలియా
వారి తపస్సు మరియు మహాదాని విశేషతను బాప్ దాదా సదా వర్ణన చేస్తూ ఉంటారు. సదా
సేవా లగనము యొక్క తపస్సు అనేక ఆత్మలకు మరియు తపస్వీమూర్తులైన మీకు ఫలమును
ఇస్తోంది. ధరణి అనుసారముగా విధి మరియు వృద్ధి రెండింటినీ చూసి బాప్ దాదా ఎక్స్
ట్రాగా సంతోషిస్తున్నారు. ఆస్ట్రేలియా వారు ఎక్స్ ట్రా ఆర్డినరీ, సేవ విషయంలో
త్యాగము యొక్క భావన అందరిలో త్వరగా వచ్చేస్తుంది. కావుననే ఇన్ని సెంటర్లు
తెరువబడ్డాయి. ఏవిధముగా మనకు భాగ్యము లభించిందో అలా ఇతరుల భాగ్యమును కూడా
తయారుచేయాలి. దృఢ సంకల్పమును చేయడం తపస్సు కావున త్యాగము మరియు తపస్సు యొక్క
విధి ద్వారా వృద్ధిని పొందుతున్నారు. సేవాభావము అనేక హద్దులోని భావాలను సమాప్తము
చేసేస్తుంది. ఇదే త్యాగము మరియు తపస్సు సఫలతకు ఆధారముగా అయ్యింది. అర్ధమయ్యిందా!
ఇదే సంఘటిత శక్తి. ఒకరు చెబితే ఇంకొకరు చేయడం జరగాలి. అంతే కానీ ఒకరు చెబితే
మరొకరు ఇది జరుగజాలదు అని అనడం కాదు.. ఇలా అనడంలో సంఘటన పాడైపోతుంది. ఒకరు
చెబితే మరొకరు ఉత్సాహముతో సహయోగిగా అయి ప్రాక్టికల్‌లోకి తీసుకురావడం సంఘటిత
శక్తి, పాండవుల్లో కూడా సంఘటన ఉంది. ఎప్పుడూ నీవు. నేను అనేది ఉండకూడదు. బాబా,
బాబా అని అంటూ ఉన్నట్లయితే అన్ని విషయాలూ సమాప్తమైపోతాయి. నీవు, నేను, నాది,
నీది అన్న విషయములోనే ఘర్షణ జరుగుతుంది. బాబాను ముందు ఉంచినట్లయితే ఎటువంటి
సమస్యా రాజాలదు మరియు సదా నిర్విఘ్నముగా ఉండే అత్యలు తీవ్ర పురుషార్ధము ద్వారా
ఎగిరే కళను అనుభవం చేసుకుంటూ ఉంటారు. చాలాకాలపు నిర్విఘ్న స్థితి, దృఢమైన స్థితి
ఉంటుంది. ఎవరైతే పదే, పదే విఘ్నాలకు వశమైపోతారో వారి పునాదులు కచ్చాగా ఉంటాయి
మరియు చాలాకాలంగా నిర్విఘ్నముగా ఉండే ఆత్మల పునాది దృఢముగా ఉన్న కారణముగా స్వయమూ
శక్తిశాలిగా ఉంటారు మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా తయారుచేస్తారు. ఏదైనా
వస్తువు పగిలిపోయి మళ్ళీ దానిని జోడించినప్పుడు అది బలహీనముగా అయిపోతుంది.
బహుకాలపు శక్తిశాలి ఆత్మ, నిర్విఘ్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నముగా అయి పాస్
విత్ హానర్ గా అయిపోతుంది లేక మొదటి శ్రేణిలోకి వచ్చేస్తుంది. బహుకాలపు నిర్విఘ
స్థితిని తప్పకుండా అనుభవం చేసుకోవాలి అన్న లక్ష్యమును సదా ఉంచండి. విఘ్నము
వచ్చి నా మళ్ళీ పోయింది కదా, నష్టమేముంది అని భావించకండి. పదే, పదే విఘ్నములు
రావడం మరియు వాటిని చెరిపేయడములో సమయము వ్యర్థమవుతుంది, శక్తి వ్యర్ధమవుతుంది.
ఆ సమయమును మరియు శక్తిని సేవలో వినియోగించినట్లయితే ఒకటికి కోటానురెట్లుగా జమ
అయిపోతుంది. కావున బహుకాలపు నిర్విఘ్న ఆత్మలు విఘ్నవికాశక రూపములో పూజింపబడతారు.
విఘ్న వినాశకులు అన్న టైటిల్ పూజ్య ఆత్మలది. నేను విఘ్నవినాశక పూజ్య ఆత్మను
అన్న స్మృతి ద్వారా సదా నిర్విఘ్నముగా అయి ఎగిరే కళ ద్వారా మున్ముందుకు
ఎగిరిపోతూ ఉండండి మరియు అందరినీ ఎగిరిస్తూ ఉండండి. అర్ధమయ్యిందా? మీ విఘ్నాలనైతే
వినాశనం చేసుకున్నారు. కానీ ఇక ఇతరుల కొరకు కూడా అవ్వాలి. మీకు నిమిత్త ఆత్మకూడా
ప్రారంభం నుండి చివరి వరకు ఎటువంటి విఘ్నములోకి రాని ఆత్మ లభించింది (డాక్టర్
నిర్మల) సదా అతీతముగా మరియు ప్రియముగా ఉంది. కాస్త స్ట్రిక్ట్ గా ఉంటుంది. అది
కూడా అవసరమే. ఇటువంటి స్ట్రిక్ట్ టీచర్ లభించకపోతే అంతటి వృద్ధి జరుగజాలదు. ఇది
ఎంతో అవసరం కూడా. ఏవిధముగా అనారోగ్యమును నయం చేసేందుకు చేదు మందు అవసరమో, అలాగే
డ్రామా అనుసారముగా నిమిత్త ఆత్మల సాంగత్యము కూడా అంటుతుంది కదా! మరియు ఏవిధముగా
తాను స్వయం రావడంతోటే సేవకొరకు నిమిత్తముగా అయ్యిందో, అదే విధముగా ఆస్ట్రేలియాలో
జ్ఞానములోకి రావడంతోనే సెంటర్లు తెరిచే సేవలో నిమగ్నమైపోతారు. ఈ త్యాగభావన
యొక్క వైబ్రేషన్ మొత్తం ఆస్ట్రేలియా మరియు సంపర్కములోని స్థానాలేవైతే ఉన్నాయో
వాటన్నింటిలోనూ అదేరూపముగా వృద్ధి జరుగుతోంది. ఎవరిలోనైతే తపస్సు మరియు త్యాగము
ఉంటుందో వారే శ్రేష్ఠ ఆత్మలు. అందరూ తీవ్ర పురుషార్థులే, కానీ పురుషార్థులుగా
ఉంటూ కూడా విశేషతలు తమ ప్రభావమును తప్పకుండా చూపుతాయి. అందరూ ఇప్పుడు సంపన్నముగా
అవుతున్నారు కదా! సంపన్నముగా అయిపోయారు అన్న సర్దిఫికెట్ ఎవ్వరికీ లభించలేదు.
సంపన్నతకు సమీపముగా చేరుకున్నారు. ఇందులో నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు చాలా
సమీపముగా చేరుకున్నారు. మరికొందరు నెంబర్ వారీగా ముందూ, వెనుకా ఉన్నారు.
ఆస్ట్రేలియావారు అదృష్టవంతులు. త్యాగము యొక్క బీజము భాగ్యమును
ప్రాప్తింపజేస్తోంది. శక్తి సైన్యము కూడా బాప్ దాదాకు అతి ప్రియము. ఎందుకంటే
వారు ధైర్యము గలవారు. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో అక్కడ బాప్ దాదాల సహాయము సదా
తోడుగా ఉంటుంది. మీరు సదా సంతుష్టముగా ఉండేవారే కదా! సంతుష్టత సఫలతకు ఆధారము.
మీరందరూ సంతుష్ట ఆత్మలు, కావున సఫలత మీ జన్మసిద్ధ అధికారము, అర్ధమయ్యిందా?
కావున ఆస్ట్రేలియావారు అతి సమీపులు మరియు అతి ప్రియమైనవారు. కావున ఎక్స్ ట్రా
ప్రేమ ఉంది, అచ్చా!