BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2015
జనవరి 2

ఆత్మిక దీపంతో, దీపపు పురుగు యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఒక అవినశీ దీపపు పురుగును. నేను కేవలం ఆత్మిక దీపంను మాత్రమే చూస్తాను మరియు మాట్లాడుతాను.  నా స్మృతిలో కేవలం ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు (నన్ బట్ వన్).

నేను ఎవరికి చెందుతాను?

బాబాతో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

బాబా... మీరు అవినాశీ దీపం. నేను అవినాశీ దీపపు పురుగును. మీ మీద నాకు అవినాశీ ప్రేమ ఉంది.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

ఈ రోజు ఆత్మిక దీపం, అవినశీ స్నేహాన్ని తీసుకొని, దీపపు పురుగులైన మీతో మిళనం జరపడానికి సభకు వచ్చారు. ఎవరైతే ఈ స్నేహాన్ని గుర్తించి భాద్యతను తీసుకుంటారో, వారికి సర్వ ప్రాప్తులు స్వతః ప్రాప్తిస్తాయి. ఈ ఆత్మిక ప్రేమను అనుభవం చేసుకోవడం ద్వారా, స్నేహ  సంభందాన్ని నిర్వహించే భాద్యత సహజంగా తయారౌవుతుంది.         

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

మొత్తం కల్పంలో ఇలాంటి అమూల్యమైన రోజులు, మళ్లీ రావనే విషయం నీకు  అర్థమైంది. ఈ సంగమ యుగం యొక్క గోల్డెన్ ఛాన్స్ తీసుకొని, నీవు బాబా ద్వారా లభించిన అన్ని ఖజానాలను, ప్రతి సెకండ్ కార్యంలో వినియోగించాలి. దీని ద్వారా నీవు సమర్థవంతుడిగా, సదా విజయీగా తాయారు ఆవుతావు.       

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.