BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2014
జనవరి 7

బేహద్ తండ్రితో బేహద్ పిల్లవాని యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఎల్లప్పుడూ బేహద్ లో ఉండే ఆత్మను. నేను సంపూర్ణ విశ్వ కళ్యాణం యొక్క బెహాద్ భాద్యతను తీసుకున్నాను. బేహద్ భాద్యతను తీసుకుని, నేను ఉన్నతమైన స్థితిని పొందుతాను.        

నేను ఎవరికి చెందుతాను?

బాబాతో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

ఎప్పుడైతే 'నేను గృహస్తుడను' మరియు 'నాకు సంభాదీకులు ఉన్నారు' అనే సంకల్పాలు చేస్తానో, అప్పుడు మాయా మోహంలో చిక్కుకుంటాను. కానీ నా యొక్క స్మృతిని పరివర్తన చేసుకొని, బంధనాలను తెంచివేస్తున్నాను. 'నేను సేవ యొక్క మైదానంలో నిలబడి ఉన్నాను' మరియు 'నేను మొత్తం విశ్వ కళ్యాణం చేయాలి' అనే స్మృతిని మాత్రమే ఉంచుకుంటాను

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

నీ యొక్క అలౌకిక భాద్యతను ఎల్లప్పుడూ గుర్తుంచుకో. ఒక వేళ నీ సమయం మరియు సంకల్పాలు, హద్దు భాద్యతలను నిర్వహించడానికి మాత్రమే ఉపయోగిస్తే, నీ అలోకిక భాద్యతలపై ధ్యాస ఉంచలేవు. హద్దులో ఉండడటం వలన ఆత్మల కళ్యాణం చేయడానికి బదులుగా, ఇంకా వారిని డిస్టర్బ్ చేస్తావు. నీవు అలౌకిక కార్యం చేయకపోవడం చూసి ఆత్మలు అలౌకిక తండ్రి నుండి దూరమవుతారు. అప్పుడు హద్దు భాద్యతలు భారంగా అనుభవం అవుతాయి.

 ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

సంతోషం యొక్క విషయాలు మరియు  ఈశ్వరీయ సంకల్పాల యొక్క స్టాక్ ద్వారా, నీవు వ్యర్ధ విషయాలు మరియు వ్యర్ధ కర్మల స్టాక్ ను సమాప్తం చేస్తావు కారణంగా, నీ అత్మికత వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది మరియు ఆత్మలకు, పరమాత్మ యొక్క కరంట్ అనుభవం చేయిస్తుంది.       

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. ఈ రోజు నేను మానసికంగా కాని, భౌతికంగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? ఈ రోజు  నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.