BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2014 డిసెంబర్ 09
సర్వ ఖజానాలతో సంపన్నమైన తండ్రితో సర్వ అధికారీ ఆత్మ యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము
నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను. నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.
నేను ఎవరు?
నేను బాబా యొక్క సర్వ ఖజానాలకు అధికారీ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. బాప్ దాదా తో మిలనం చేసుకొని సర్వ అధికారాలను ప్రాప్తించుకుంటున్నాను.
నేను ఎవరికి చెందుతాను?
బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:
మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్.. నేను మీ వాడను. మీ ఖజానాలు నా కోసం ఎల్లప్పుడు తెరిచే ఉంటాయి. మీరు నాకు బేహద్ ఖజానాలు ఇస్తున్నారు.
అత్మతో బాబా యొక్క సంభాషణ:
మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో... బాబా యొక్క సర్వ ఖజానాలు నీ కోసమే. బాబా నిన్ను విశ్వ రాజ్యాధికారిగా చేయడానికి వచ్చారు. రాజైతే కొద్ది సమయం కొరకు సింహాసనం మీద కూర్చుంటారు కాని నీకు బేహద్ రాజ్య సింహాసనం పొందే గోల్డెన్ చాన్స్ లభించింది. నీకు ఈ గోల్డెన్ స్టేజ్ ద్వారా భవిష్యత్ బంగారు ప్రపంచంలో శ్రేష్ట పదవిని పొందవచ్చు.
ప్రేరణ పొందుట:
నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.
బాబా నుంచి వరదానములను పొందుట:
సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా నేను వరదానాలను పొందుతున్నాను.
నీవు బాబాను నిరంతరం నీ యొక్క మధురమైన తోడుగా చేసుకున్నావు. అందుకే నీవు బాబా యొక్క శరణు పొందావు. నీవు శక్తిశాలి రెక్కలతో ఎగురుతూ పరిస్తితులు దాటివేసే సహజ పురుషార్దివి.
బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)
నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో బహుమతి రూపము లో ఇస్తున్నాను... నా ఫరిస్తా స్వరూపం లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.
నిద్రకు ఉపక్రమించే ముందు:
నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్ లో రాసి 30 నిమిషాల యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.