BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us


 

2014 డిసెంబర్ 10

భోళానాధుడైన తండ్రితో ఆత్మిక గులబి యొక్క ఆత్మిక సంభాషణ.

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఆత్మను... నేను సౌందర్యము, రూపం, సువాసన మరియు రంగు కలిగిన ఆత్మిక గులాబిని... బాబా నన్ను విశేషమైన ప్రేమ మరియు శక్తితో నా యొక్క పోషణ చేస్తున్నారు.        

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్.. భోళానాధుడైన బాబా నేను మీవాడను... మీ వరదానాల ఖజానాల ద్వారా నాకు వరదానాలను ఇస్తున్నారు.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో... అమృత వేళ సమయం పగలు రాత్రికి మధ్య ఉండే ఆత్మిక సమయము. ఈ సమయంలో భోళానాధుడైన తండ్రితో భుద్ధియోగం జోడించి ఏది కావలంటే అది ప్రాప్తించుకునే సమయము. ఈ సమయములో భోళనాధుడైన తండ్రి ద్వారా ఎలాంటి కష్టం లేకుండా హద్దులేని వరదానాలను పొందవచ్చు. ఈ సమయంలో ఉన్నతమైన సంతోషాన్ని మరియు ప్రాప్తులను అనుభూతి చేసుకోవాలి.         

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  నేను వరదానాలను పొందుతున్నాను.

నీవు శాంతి స్వరూప మరియు నిశ్చింత ఆత్మవు. ఈ స్మృతి యొక్క ప్రకాశం నీలో  ఎల్లప్పుడు  వెలుగుతూ ఉంటుంది. ఈ ప్రకాశం, మోహమనే అంధకారాన్ని సమాప్తం చేసి, బాబా హృదయం యొక్క మధురతను మరియు సౌంధర్యాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఈ ప్రకాశం ద్వారా నీకు ఎగరడానికి రెక్కలు లభిస్తున్నాయి, వీటి ద్వారా నీవు మొత్తం ప్రపంచాన్ని ఎగిరేకళలోకి తీసుకురావడనికి సహయం చేస్తున్నావు.       

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపం లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.