BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2014 డిసెంబర్ 12

సుప్రీం మాగ్నెట్ తో శుద్ధమైన మరియు స్వచ్ఛమైన ఆత్మ యొక్క ఒక సంభాషణ

అవగాహన కు రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఒక శుద్ధమైన మరియు స్వచ్ఛమైన ఆత్మ. నేను అమృత వేల కూర్చున్న వెంటనే, సుప్రీం మాగ్నెట్ వైపు ఒక లాగబడిన అనుభూతి ని పొందుతున్నాను. నేను పొందాలనుకున్న స్వర్వ ప్రాప్తులు నా మధురమైన బాబా, సుప్రీం మాగ్నెట్ ద్వారా పొందాను. ప్రాప్తులు అందరి ని బాబా వైపు ఆకర్షించే ఒక అయస్కాంతంలా మారాయి.

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా...గుడ్ మోర్నింగ్...నేను మీకు చెందిన వాడను.. నేను ఎవరిని చూసిన... నేను కేవలం మీతో నా యొక్క అనుభూతుల గురించే అలోచిస్తాను. నేను మీ ద్వార సర్వ ప్రాప్తులు పొందాను.

అత్మతో బాబా సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో... ప్రాప్తులు నిన్ను మేగ్నెట్ గా మార్చుతాయి.నీ ప్రాప్తుల ద్వారా రాళ్ళను పారసంగా చేయవచ్చు...మరియు ఎడరిలో నీరు తీయవచ్చు... అక్కడ పచ్చగా చేయవచ్చు... ఇవన్ని బ్రాహ్మణ జన్మ తీసుకున్న తరువాత  ఇప్పటివరకు పొందినవి. నీ అనాది పవిత్ర స్వరూపాన్ని గుర్తుంచుకో.అప్పుడు నువ్వు అత్మిక మేగ్నెట్ గా అయ్యి ప్రపంచంలోని ఆత్మలను బాబా వైపు ఆకర్షితం చేయగలవు.

ప్రేరణ పొందుట:

నా మనస్సు లో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఎకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానమును పొందుట:

సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన ద్రుష్టి ద్వారా  నేను వరదానాలను పొందుతున్నాను.

బాప్ దాదా యొక్క హృదయ సింహాసనం లభించినందుకు పరమానందాన్ని పొందావు . అనందాన్ని, పొషణను...అందరికి పంచాలి. హృదయం లో 'వాహ్ నా భాగ్యము వాహ్' అనే పాట పాడుతు వుండాలి..మరియు ప్రతి రోజును నిచ్చింతగా గడపాలి..        

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతా గా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపం లో భూ ప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి వరదానాన్ని ఇస్తున్నాను.

విశ్రాంతి తీసుకోవడానికి  ముందు:  

నేను అందరితో గౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను.. ఒక వేల అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను... ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్ లో వుంచి 30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తీసివేస్తున్నాను... నేను శుధ్ధమైన హృదయంతో నిద్రిస్తాను.