BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2015
జనవరి 13

విశ్వ కళ్యాణకారి తండ్రి తో బేహద్ సేవధారి యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఒక బేహద్ సేవధారిని. నేను ప్రపంచానికి జ్ఞానం యొక్క వెలుగును మరియు సర్వ శక్తుల యొక్క బలాన్ని ఇస్తున్నాను.        

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

నేను నా దైర్యం యొక్క పాదాలను చాలా జాగ్రత్తగా కార్యంలో ఉపయోగిస్తున్నాను, దీని వలన మాయ యొక్క పరచాయ నా  దగ్గరకు కూడా రాదు. పురుషార్ధంతో నేను జ్ఞాన రత్నాల అనుభవం చాలా సులభంగా చేసుకుంటున్నాను మరియు సర్వ శక్తులకు నేను అధికారిగా  అవుతున్నాను.  

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

నీవు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆత్మిక స్తితిలో ఉండు. బేహద్ సేవాధారిగా అయ్యి విశ్వ ఆత్మలకు సహయోగం మరియు శుభ భావన యొక్క తరంగాలు వ్యాపింపచేయి. నీవు విశ్వా కళ్యాణకారి తండ్రి యొక్క సంతానం అనే విషయాన్ని గుర్తుంచుకో. అందువలన నీవు దివ్య గుణాల స్వరూపంగా తాయారు కావాలి. గిఫ్ట్ మొత్తం ప్రపంచానికి ఇవ్వు.         

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

నీవు ఒక సంపూర్ణ యోగువి, నీవు ఆపదల దృశ్యాలను కూడా మనోరంజంన రూపంలో చూస్తావు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో 'వాహ్ వాహ్' యొక్క పాటను పడుతూ ఉంటావు. దుఖం తరువాత సుఖం యొక్క రోజులు వస్తున్నాయనే విషయం నీకు తెలుసు.       

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. ఈ రోజు నేను మానసికంగా కాని, భౌతికంగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? ఈ రోజు  నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.