2014
డిసెంబర్ 14
వరదానిదాత తో యోగ్యమైన పిల్లవాని యొక్క సంభాషణ
స్మృతికి రావలసిన మొదటి
విషయము
నేను నా కళ్ళు తెరిచిన మొదటి
క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన
ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు
ఇవ్వడానికి వచ్చాను.
నేను ఎవరు?
నేను ధైర్యము మరియు ఉత్సాహము కలిగిన యోగ్యమైన
పిల్లవాడిని. ఈ సమయము లో బాబా ఏవైతే శక్తులను
ఇస్తున్నారో, వాటిని పొందడానికి నేను యోగ్యమైన
వాడిని. బాబా పై నాకున్న అమితమైన ప్రేమ నన్ను
యోగ్యుడిగా తయారు చేస్తుంది.
నేను ఎవరికి
చెందుతాను?
బాబా తో ఆత్మ యొక్క
సంభాషణ:
మధురమైన బాబా గుడ్ మోర్నింగ్... బాబా.. మీరు నా
వారు. నేను మీకు చెందినవాడను. నాకు మీ మీద ఉన్న
ప్రేమ మరియు మిమ్మల్ని నేను పూర్తిగా అంగీకరించడం
వలన, మీ ద్వారా లభించే వరదానాలకు నేను యోగ్యముగా
తయారు అవుతున్నాను. మీ ద్వారా ఈ వరదానాలను తీసుకుని
నా యొక్క బలహీనతలను సమాప్తం చేస్తున్నాను.
అత్మతో బాబా యొక్క
సంభాషణ:
మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో... బ్రాహ్మణ
ఆత్మవైన నీ కోసం బాబా అమృత వేళ సమయాన్ని
ప్రత్యేకంగా కేటాయించారు. నీకు ఏది కావలంటే అది ఈ
సమయం లో పొందవచ్చు. ఈ సమయంలో నేను నీ యొక్క సేవలో
వున్న విశేషతలను మరియు గుణాలను చూస్తాను. నీ
లక్షణాలు,గుణాలు మరియు సేవ అవినాషిగా అవడానికి,
నీకు విశేషమైన వరదానాలను ఇస్తాను. అందుకే ఈ
సమయాన్ని విశేషంగా నీ కోసం కేటాయించాను. నా ద్వారా
వరదానాలను పొందడానికి నీవు మొదటి అవకాశాన్ని
పొందావు.
ప్రేరణ పొందుట:
నా మనస్సు లో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును
శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను...
బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే
సంకల్పాలను పొందుతున్నాను.
బాబా నుంచి
వరదానములను పొందుట:
సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ
చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన
మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా నేను వరదానాలను
పొందుతున్నాను.
కేవలం బాబాను నీ ప్రపంచంగా చేసుకోవడం వలన, నీవు
అకర్షణ అనే బంగారు సంకెళ్ళను తెంచివేశావు మరియు
కోరిక అంటే తెలియని వాడిగా అయ్యావు. బాబా యొక్క
ప్రపంచంలో నీ యొక్క అన్ని కామనలు, అవసరాలు మరియు
కలలు తీర్చబడుతాయి. కేవలం 'నాది’ ని ‘బాబాది’ గా
పరివర్తన చేయడం ద్వారా నీవు సంతుష్ట మణిగా మరియు
సంతోష స్వరూపంగా తయారవుతావు.
బేహద్ సూక్ష సేవ (చివరి
15 నిమిషాలు..)
నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ఈ ప్రపంచానికి
ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి
తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో
బహుమతి రూపము లో ఇస్తున్నాను... నా ఫరిస్తా స్వరూపం
లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ
వరదానాన్ని ఇస్తున్నాను.
నిద్రకు ఉపక్రమించే
ముందు:
నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను.
నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం
కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను
ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్
చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి
చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ
ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను
చార్ట్ లో రాసి 30 నిమిషాల యోగం ద్వారా ఆ కర్మల
యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన
మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.