BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2014 డిసెంబర్ 16

భోళానాధునితో అనుభవీ ఆత్మయొక్క సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను అనుభవీ ఆత్మను. అమృత వేళ కేవలం ఒక్క సెకండ్ కలయిక ద్వారా , ఈ రోజంతటికి కావలసిన అనుభూతులను మరియు ప్రాప్తులను పొందుతున్నాను. నేను ఒక్క భోళానాధుడితో మాత్రమే సంభందం వుంచుతాను.         

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్.. భోళానాధుడైన మీరు నా యొక్క తండ్రి. నేను నా ఆత్మను అన్ని భాగ్యముల యొక్క అనుభూతులతో నింపుతున్నాను. నేను సంపూర్ణమైన శాంతిని అనుభవం చేసుకుంటున్నాను. మీకు నా మీద ఉన్న ప్రేమను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. దీనిని నా ఆత్మ లో భద్రపరుస్తున్నాను. నా అనాది పవిత్ర స్వరూపాన్ని స్మృతి కి తెచ్చుకుని, ఆ స్మృతిని ధ్రుడంగా చేసుకుంటున్నాను.    

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో... నేను నీ కోసమే ఉన్నాను...నన్ను ఉపయోగించుకో.. నాకు ప్రియంగా తయారుకావలి. నాతో కూర్చో, నాతో ఆటలాడు. నీకు ఏది కావలనిపిస్తే అది చేయి. నీవేవైతే అనుభూతులు మరియు ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నావో అవన్ని నా దగ్గర వున్నాయి. సర్వ ఖజానాలు మరియు భోళానాధుడు తో మిలనం అమృత వేళ సమయం లో చాల సులభంగా పొందవచ్చు. అన్ని గుణాలు మరియు శక్తుల యొక్క ఘనులు నీ కోసం తెరిచేవుంటాయి.         

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  నేను వరదానాలను పొందుతున్నాను.

నీవు కర్మ యోగివి. నీ యొక్క ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం మరియు కర్మ అత్మికమైనవి. నీవు ప్రతి శ్వాసను బాబాకు, ప్రతి అడుగును సత్యతకు, ప్రతి కర్మను జీయ దానం మరియు కరుణకు సమర్పణ చేసావు. అందువలన సంతుష్టత నీ హృదయానికి రాజు మరియు నీ సాంగత్యంలోకి ఎవరు వచ్చిన వారికి సంతుష్టత అనే బహుమతి ఇస్తున్నావు.            

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపం లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.