2014
డిసెంబర్
20
బాప్ దాదా
తో
ఒక విశేష ఆత్మ యొక్క ఆత్మిక సంభాషణ
స్మృతికి రావలసిన మొదటి విషయము
నేను
నా
కళ్ళు
తెరిచిన మొదటి
క్షణం,
నేను
ఒక
ఆత్మ అని భావిస్తాను:
నేను మధురమైన ఇంటి నుంచి,
ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి
వచ్చాను.
నేను
ఎవరు?
నేను ఒక విశేష ఆత్మను.
నేను బాబావాడిగా అవడం వలన...
బాబా దృష్టిలో నేను చాల విశేష ఆత్మను.
నేను ఎవరికి
చెందుతాను?
బాబా తో ఆత్మ
యొక్క సంభాషణ:
మధురమైన బాబా..
గుడ్ మోర్నింగ్..
సూక్ష్మవతనంలో
నేను మీ ఎదురుగా కూర్చున్నాను.
మీ యొక్క ప్రేమ మరియు విశేషంగా నాపై చూపే జాగ్రత్త,
నాకు మీవైపు సహజంగా లాగబడిన అనుభూతి కలుగుతుంది.
మీరు విశేషమైన సంకల్పాల ద్వారా ఇచ్చే సూక్ష్మ
శక్తిని,
నేను
అనుభూతి చేసుకుంటున్నాను.
అత్మతో
బాబా యొక్క సంభాషణ:
మధురమైన పిల్లవాడా..లేచి
నాతో కుర్చో...
నీవు మధురమైన మరియు విశేషమైన ఆత్మవు...
నీవు నా వాడివి మరియు నేను నీకు చెందినవాడిని.
"బాబా
వాడిని"
అనే స్మృతి,
నిన్ను అనేక వరదానములతో,
శక్తులతో నింపుతుంది. బాప్
దాదా నోటి ద్వారా వరదానములు ఇవ్వనవసరం లేదు.
బాప్ దాదా
యొక్క
ప్రియమైన సంకల్పాలు,
కళ్యాణం యొక్క అనుభూతిని కల్గిస్తున్నాయి.
ఈ ప్రేమ అనే సూక్ష్మసంకల్పాల ద్వారా
నీ యొక్క పాలనా చేస్తున్నాను.
నేను సూక్ష్మవతనంలో కూర్చొని,
విశేష ఆత్మవైన నీకు విశేషమైన పోషణ చేస్తున్నాను.
ప్రేరణ
పొందుట:
నా
మనస్సులో
భౌతిక
అలోచలను
తీసివేసి..
మనస్సును
శాంతి
సాగరుడైన..
బాబా
మీద
ఏకాగ్రం
చేస్తాను...
బాబా
నుంచి
సేవ
కొరకు
పవిత్రమైన,
ప్రేరణ
కలిగించే
సంకల్పాలను
పొందుతున్నాను.
బాబా
నుంచి
వరదానములను
పొందుట:
సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ
చేస్తున్నాను..
బాబా యొక్క ప్రియమైన,
పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా నేను
వరదానాలను పొందుతున్నాను.
బాప్ దాదా పై నీకు ఉన్న ప్రేమ వలన,
నీ రెక్కలు చాలా శక్తివంతంగా తయారయ్యాయి.
ఈ ప్రేమ అనే రెక్కలు నిన్ను,
ఈ భౌతిక ప్రపంచం నుంచి మరియు మాయ యొక్క నీడ
నుంచి సెకండ్ లో దూరంగా తీసుకువెళుతున్నాయి.
అవి నిన్ను నిశ్చింత స్థితికి తీసుకువెళుతున్నాయి.
అప్పుడు పురుషార్ధం మనోరంజనంగా,
విజయం అధికారంగా అవుతుంది.
బేహద్ సూక్ష సేవ
(చివరి
15
నిమిషాలు..)
నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈప్రపంచానికి
ఇస్తున్నాను.
నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం
ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో
ఇస్తున్నాను...
నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి
వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.
నిద్రకు ఉపక్రమించే ముందు:
నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను.
నేను మానసికంగా కాని,
భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని
పరిశీలించు కుంటున్నాను.
నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా?
అని చెక్ చేసుకుంటున్నాను.
ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను.
ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు
లోను కాలేదు కదా?
నేను చేసిన కర్మలను చార్ట్ లో రాసి
30
నిమిషాల
యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని
తొలగిస్తున్నాను.
నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో
నిద్రిస్తాను.