2014
డిసెంబర్
23
ప్రకృతి పతితో ఒక సౌభాగ్యశాలి ఆత్మ యొక్క ఆత్మిక
సంభాషణ
స్మృతికి రావలసిన మొదటి విషయము
నేను నా
కళ్ళు
తెరిచిన మొదటి
క్షణం,
నేను
ఒక
ఆత్మ అని భావిస్తాను.
నేను మధురమైన ఇంటి నుంచి,
ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి
వచ్చాను.
నేను
ఎవరు?
నేను ఎంతటి భాగ్యవాన్ ఆత్మను అంటే సత్య యుగంలో
నన్ను ప్రకృతి సహజంగానే నిద్ర లేపుతుంది కాని సంగమ
యుగంలో ప్రకృతి రచయిత,
ప్రకృతి పతి,
మధురాతి మధురమైన బాబా స్వయంగా వచ్చి నన్ను నిద్ర
లేపుతున్నారు.
నేను ఎవరికి
చెందుతాను?
బాబా తో ఆత్మ
యొక్క సంభాషణ:
మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..
బాబా.. "నా ప్రియమైన మరియు మధురమైన పిల్లవాడా"
అనే మీ యొక్క మధురమైన వాణి సంగీతంలా నా చెవులలో
వినిపిస్తుంది..బాబా మీ యొక్క ఈ మధుర వాక్యాలు
స్వర్గంలో చేసే దివ్యమైన సంభాషణ కంటే ఉన్నతమైనవి.
సంగమ యుగంలో ఈ బ్రాహ్మణ జీవితాన్ని పొంది నేను
ఎంతో భాగ్యశాలి ఆత్మగా అనుభూతి పొందుతున్నాను.
అత్మతో బాబా యొక్క సంభాషణ:
మధురమైన పిల్లవాడా..లేచి
నాతో కుర్చో...
ఇది సంగమ యుగం యొక్క అతి అమూల్యమైన సమయము. ఇప్పుడు
మీరు స్వయాన్ని, శ్రేష్ట సంస్కారాలు మరియు
ప్రాప్తులతో నింపుకొని ప్రత్యక్ష ఫలాన్ని పొందే
సమయము. సత్య యుగం యొక్క ఫలాలు ఎంతో సతో ప్రధానంగా,
శుద్దముగా,రుచికరంగా మరియు రసవంతంగా ఉంటాయి. కాని
సంగమ యుగంలో ప్రకృతి పతి స్వయంగా వచ్చి పిల్లలైన
మీకు ఆత్మిక ఫలాల యొక్క రసాన్ని ఇస్తున్నారు.
దానితో పాటు బాబా పిల్లలకు స్వర్వ సంబంధాల మధురతను
కూడా అనుభవం చేయిస్తారు.
ప్రేరణ
పొందుట:
నా
మనస్సులో
భౌతిక
అలోచలను
తీసివేసి..
మనస్సును
శాంతి
సాగరుడైన..
బాబా
మీద
ఏకాగ్రం
చేస్తాను...
బాబా
నుంచి
సేవ
కొరకు
పవిత్రమైన,
ప్రేరణ
కలిగించే
సంకల్పాలను
పొందుతున్నాను.
బాబా
నుంచి
వరదానములను
పొందుట:
సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ
చేస్తున్నాను..
బాబా యొక్క ప్రియమైన,
పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా
బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.
చాలా సేవ చేస్తూ జ్ఞాపకంలో బలహీనంగా ఉన్నా,
లేక జ్ఞాపకంలో బాగుండి సేవలో బలహీనంగా ఉన్నా
పురుషార్ధంలో తీవ్రవేగం వుండదు.
ఈ గుహ్యమైన రహస్యాన్ని నీవు
అర్థం చేసుకున్నావు
.
అందువలన నీ జ్ఞాపకం మరియు సేవ యొక్క రెక్కలు
శక్తిశాలిగా అయిపోయాయి.
ఈ
రెక్కల ద్వారా విశ్వంయొక్క గగనతలం లో ఎగురుతూ నీవు
ప్రేమ,
పవిత్రత మరియు జ్ఞానం యొక్క ఉన్నతిని
ప్రాప్తించుకుంటున్నావు.
బేహద్
సూక్ష సేవ
(చివరి
15
నిమిషాలు..)
నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి
ఇస్తున్నాను.
నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని,
ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి
రూపములో ఇస్తున్నాను...
నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి
వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.
నిద్రకు
ఉపక్రమించే
ముందు:
నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను.
నేను మానసికంగా కాని,
భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని
పరిశీలించు కుంటున్నాను.
నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా?
అని చెక్ చేసుకుంటున్నాను.
ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను.
ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు
లోను కాలేదు కదా?
నేను చేసిన కర్మలను చార్ట్ లో రాసి
30
నిమిషాల
యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని
తొలగిస్తున్నాను.
నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో
నిద్రిస్తాను.