BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us


 

2014 డిసెంబర్ 26

కల్ప వృక్షం యొక్క చైతన్య బీజ రూపునితో హర్షిత ఆత్మ యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను అన్ని సంతోషాల ఖజానాలు లభించిన ఆత్మను. బాబా నేను ఏదైతే పొందాలనుకున్నానో దాన్ని పొందాను. మీ తోడు పొంది, ఆత్మనైన నేను సంతోషంతో నాట్యం చేస్తూ, పరమానందం యొక్క అనుభవాన్ని చేసుకుంటున్నాను.

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

నాకు మీతో ఒక మంగళ మేళ జరుపుకుంటున్న అనుభూతిని  పొందుతున్నాను. బాబా.. సర్వ సంభందాల మంగళ మిళనం, నేను మీతో మాత్రమే జరుపుకుంటాను. మంగళ మిళనం నా యొక్క జన్మ సిద్ధాదికరము. అధికారం నాకు సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతిని కలుగ చేయిస్తున్నాయి.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

ఉదయం మొదలైన దగ్గర నుంచి, సంతోషం మరియు ఆనందం యొక్క ఖజనాలను ఉపయోగించుకో. విచార సాగర మంతనం చేసి, స్వయం తో ఆనంద పూర్వకంగా మాట్లాడు. ఉదయం కళ్ళు తెరుస్తూనే, మనస్సులో విశ్వ రచయిత,బహుమతులు ఇచ్చే దాత వరదాతను ప్రత్యక్షం చెయ్యి. పిల్లలు రండి మరియు కల్ప వృక్షం యొక్క బీజంతో మిళనం జరుపుకోండి. బీజమునైన నాలో మొత్తం కల్ప వృక్షం యొక్క సారం ఇమిడి ఉంది

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

నీ ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిని స్విచ్-ఆన్ చేసుకోవడం ద్వారా, ఒక్క సెకండ్ లో, అజ్ఞాన అంధకారాన్ని దూరం అవుతుంది. స్విచ్-ఆన్ చేసే కళ నిన్ను శక్తిశాలిగా తాయారు చేస్తుంది. శక్తిశాలి స్వరూపం ద్వారా నీవు మొత్తం సృష్టి రచనకు వరదాతగా అవుతున్నావు.

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.