BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us


 

2014 డిసెంబర్ 27

             పరమాత్మునితో ఒక వారసత్వ పిల్లవాని యొక్క ఆత్మిక సంభాషణ.

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను పరమాత్ముని పరివారం యొక్క వారసత్వ పిల్లవాడిని. నేను స్వయం పరమాత్ముని నుండి వారసత్వాన్ని ప్రాప్తించుకుంటున్నాను.

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

బాబా! నన్ను స్నేహభరితమైన ఈశ్వరీయ బ్రాహ్మణ పరివారం యొక్క సంభంద-సంపర్కాలలోకి తీసుకు వచ్చినందుకు ధన్యవాధములు. బాబా..  మీరు నాకు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వలేదు, నన్ను మీ పిల్లవానిగా చేసుకొని ఒక మహాన్ ఆత్మగా తాయారు చేసారు. మీతో తల్లి, తండ్రి మరియు పిల్లవాని యొక్క సంభందం జోడించడంతో, నాకు మొత్తం ఈశ్వరీయ పరివారంతో ఒక ఆత్మిక మరియు సోదరీ-సోదర సంభందం జోడించబడింది.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

ఎప్పుడైనా నీవు స్వప్నంలోనైన ఊహించావా, నీవు నాకు వారసుడిగా అవుతానని? నా సంపూర్ణ సంపత్తికి నీవు అధికారిగా తయారయ్యావు. నేను  పిల్లవాడివైన నీకు తల్లి-తండ్రి మరియు పిల్లవాని యొక్క సంభందాన్ని అనుభవం చేయించడానికి మరియు నీకు వారసత్వాన్ని ఇవ్వడానికి సృష్టిపై అవతరించాను. నీకు భాగ్యం, ఈశ్వరీయ పరివారంతో జోడించబడడం ద్వారా ప్రాప్తించింది. దుఖ ప్రపంచాన్ని విడిచిపెట్టి సుఖమయ ప్రపంచంలోకి నీవు వెళుతున్నావు. సర్వోన్నతమైన ఈశ్వరీయ మర్యాదలను పాలన చేసి మర్యాదా-పురుషోత్తముడిగా తయారవుతున్నావు.         

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

స్నేహ సాగరునితో మరియు స్నేహ సంపన్న నది యొక్క మేళా జరుగుతుంది కావున, నది కూడా బాబా సమానంగా మాస్టర్ స్నేహ సాగరునిగా తయారవుతుంది. నీవు మాస్టర్ స్నేహ సాగరుని, సర్వుల స్నేహ పూరితమైన పాలనా అనే పవిత్రమైన ధారంతో బంధించబడివున్నావు మరియు సర్వ ఆత్మల యొక్క మనోకామలను పూర్ణం చేస్తున్నావు. నీవు అందరికి, 'మా వాడు' అనే ఆత్మిక భావన అనుభవం చేస్తున్నావు మరియు అందరిని బాబా యొక్క హృదయ సింహాసనం వైపు తీసుకు వస్తున్నావు అక్కడ వారి యొక్క పాలన మరియు ఉన్నతి జరుగుతుంది.

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.